blogspot hit counter

Monday, December 20, 2010

దిష్టి తీయడం ఎలా?

8 comments
ఈ మధ్య బొత్తిగా అసైన్సు వైపు వెళ్ళడం లేదు కదా, సరదాగా ఒక టపా, ఎక్కడో నేస్తంగారు నన్ను తల్చుకున్నారట అందుకే ఇది.
దిష్టి అంటే పరుల దృష్టి వలన వచ్చే దోషమట, అదేదో బాలయ్య సినిమాలో తొడగొట్టి రైలుని వెనక్కి పంపినట్టు, ఇది సాధ్యమేనా? ఎవరో చూడగానే పిల్లలకి ఆరోగ్యం చెడిపోతుందా? నరుడు దృష్టి తగిలితే... నల్లరాయి అయినా బద్దలైపోతుందట, నిజమేనా? సరే నిజమనే అనుకుందాం, అంత శక్తి ఉత్పత్తి చేయగలదా మన కన్ను? సరే మరింత Larger and Wider Platform కి పోదాము, చేతబడులు మనుషులని చంపగలవా? అలానే అవేవో క్రియలు కూడా?

అసైన్సు:: అసలు మనిషిని చంపడానికి ఎంత శక్తి కావాలి? ఇదేదో శక్తి కేంద్రాల సంగతి కాబట్టి మనం కుడా అదే తీసుకుంటే పోలా? లీతల్ డోస్ 9×102 J, మరి ఇంత శక్తి మన శరీరం తయారు చెయ్యగలదా?
సైన్సు :: శుబ్బరంగా, E / m = c2 = (299,792,458 m/s)2 = 89,875,517,873,681,764 J/kg (≈9.0 × 1016 joules per kilogram) ఒక గ్రాములో ఉన్న శక్తి హిరోషిమా మీద వేసిన బాంబు కన్నా ఎక్కువ అట, ఇంకేమి, కంటి చూపుతో చంపడం సాధ్యమే. ఇంతకంటే ప్రూఫ్‌లేమి కావాలి?

అసైన్సు:: సరేనయ్యా నేను మా ఊరిలో స్మశానంలో చేతబడి చేస్తానయ్యా, నా శత్రువు అడ్రస్సు, లేదా ఫలానా వ్యక్తిమీదకి ప్రయోగిస్తున్నాను అని ఆ శక్తికి చెప్పడం ఎలా?
సైన్సు ::  దానికి వెంట్రుకలో, గోళ్ళో కావాలి?

అసైన్సు:: ఐతే నువ్వు ఎవో మంత్రాలు చదివో, ఇంకేదో చేసో సృష్టించిన శక్తి, ఆ వెంట్రుకలో, గోళ్ళో పట్టుకోని వెళ్ళి, D.N.A టెస్ట్లు చేసుకొని ఆ మనిషిని పట్టుకుంటుందా?


సైన్సు ::  మనిషి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి చంపగలదు చేతబడి సరిగ్గా చేస్తే

అసైన్సు:: పవర్ఫుల్ స్నైఫర్ తుపాకీలే ఒక మనిషిని కచ్చితంగా చంపగలగాలి అంటే ఆ మనిషి 1కి.మీ. లోపే ఉండాలి, కానీ ఈ చేతబడి ఎవర్ని ఐనా, ఏ దేశాంలో దాక్కున్నా వెతికి మరీ చంపుతుంది అంట, ఐతే దానికి ఎంత శక్తి కావాలి? అధమం 1% రీకాయిల్ వేసుకున్నా, ఆ చేసినోడి బాడీ పార్ట్లు ఏ ముక్క ఎక్కడ పడిండో వెతుక్కోవడానికి నెల పైనే పడుతుందేమో. Law of conservation of Mass/ Energy ప్రకారం, అసలు ఆ మనిషి మిగిలి ఉంటాడా ఆవిరి ఐపోతాడా?

సైన్సు :: సరేనయ్య, ఎదో ఒకటి చేసి, చచ్చో బ్రతికో, లీతల్ డోస్ తయారు చేస్తాను, టార్గెట్ మనిషి అడ్రస్సు లాటిట్యూడు, లాంగిట్యూడు కూడా మాప్ మీద పెట్టి ఉన్నది, అప్పుడేమి చేస్తావు?
అసైన్సు:: రేడియేషన్, అదీ ఇంత శక్తిగలది అట్టా దేశం మీదకి వదిలితే ఎవదో ఒకడ్నే ఎట్టా చంపుద్ది, మధ్యలొ వచ్చిన ప్రతిదాన్నీ బూడిద చేసి కానీ వదలదే, సర్వ నాశనం తప్ప, ఒక్క మనిషినే ఎట్టా చంపుద్దయ్యా?


దిష్టి కుడా ఇంతే కదా మరి, అదీ సున్నితమైన కన్ను రాళ్ళని బద్దలు కొట్టే శక్తిని తయారు చేయగలదా? చేసే క్రమంలో కంటికి ఏ చిన్న అపాయం కుడా జరగదా? 1% వేడిని గ్రహించినా, కన్ను మాడి మసైపోతుంది.

సో, మీకు ఎవరిదో దిష్టి తగిలింది అనుకుంటే, ఎమ్మటే వాడి కళ్ళు మాడిపోయాయేమో చూడండి, అప్పుడు దిష్టి తీసుకోండి, పనిలో పనిగా ఆడ్ని పట్టుకోండి, వేల కోట్లు ఇచ్చి మరీ కొనుక్కు పోతారు ఆ మనిషిని, అలా ఎట్టా చేయగలిగాడో అని.

Wednesday, December 8, 2010

ఫిజిక్స్ - మేథమేటిక్స్ - ఎకనామిక్స్ - 1

23 comments
కళ్ళతో చూసినవి అన్నీ నిజం కాదు, మనం గమనించినవి అన్నీ నిజం అవ్వవు. మనం గమనించినవే నిజం అనుకుంటుంటాం, కానీ ఫార్మల్ ప్రూఫ్ అవసరాన్ని తెలియజేయుటకు కొన్ని టపాలు చూద్దాం.

ముందుగా అబర్వేషనల్ బయాస్ గురించి చూద్దం, కొన్నాళ్ళ క్రితం అమెరికాలో (T ) బంతిని విసిరితే అది నేలని (L) చేరే మార్గం ఎలా ఉంటుంది క్రింది పటం చూపించి అడిగారు, ఎక్కువ మంది A,B,C,D లలో దేన్ని ఎక్కువ మంది చూపించారో ఊహించండి.


Tuesday, December 7, 2010

అసలు ఎకనామిక్స్ అంటే ఏంటంటే

19 comments
రోజూ మనం పేపర్లలో చూస్తునే ఉంటాం, లేదా రైతుల గురించి వచ్చిన వందలాది సినిమాల్లో వినే ఉంటాము " పెప్సీ తయారు చేసినోడు తన వస్తువు రేట్ నిర్ణయించుకున్నప్పుడు, ఒక రైతు తను పండించిన వస్తువు రేట్ ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నాడు?" వినగానే ఇది నిజమే అనిపిస్తుంది, కానీ నన్ను అడిగితే నా సమాధానం, ప్రతి వస్తు ఉత్పత్తిదారుడు తన వస్తువు రేట్ తానే కట్టుకోలేడు, అలానే, రైతు తన వస్తువు రేట్ తనే కట్టుకున్నే వ్యవస్థ తయారు చేసినా అది కొద్ది రోజులలకే ప్రస్తుత స్థితికే వస్తుంది.

ఇక్కడ నేను పెట్టుబడీ దారి తొత్తుని, అని అనుకుంటారేమో, నాకు తెలిసీ ఏ ఎకనామిస్ట్ తన స్వంత అభిప్రాయాలని రుద్దడానికి ప్రయత్నించడు, ఒక వ్యవస్థ తీరు చూసి అది ఎటు పోతున్నదో మాత్రమే చెప్తాడు, అంటే తప్ప పెట్టుబడీ దారి వ్యవస్థ, శ్రమ దోపిడీ అన్నవి నాకు తెలియవు, అవి ఇక్కడ అప్రస్తుతం, నాకంటూ ఒక అభిప్రాయం లేకుండా నేను నేర్చుకున్నది మాత్రమే ఇక్కడ చెప్తాను, అంతేందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని నాకు మెయిల్ పెడితే, నా జవాబు ఏది తక్కువ ఖర్చుతో ఐపోతుందో, ఏది సులభమో మాత్రమే చెప్తాను, అలానే ఎకనామిక్స్ కుడా, మీరు మార్గం ఎంచుకుంటే అది ఎటు పోతుందో చెప్తుంది తప్ప, అది నీతిగలదో, న్యాయమో, అన్యాయమో అన్నది అత్యంత ప్రాధాన్యత కలిగినది కాదు.

అలానే మన వారికి చాలా అపోహలు ఉంటాయి, ఎలా అంటే మధ్యవర్తులందరూ (రియల్ ఎస్టేట్ ఏజంట్లు, డీలర్స్, డ్రిస్టిబ్యూటర్స్) వీరు వస్తు ఉత్పత్తిలో పాలు పంచుకోరు, వీళ్ళది కేవలం దోపిడీయే అని. అలానే పెట్టుబడి పెట్టినోడు కోటాను కోట్ల లాభాలు సంపాదించి కార్మికుల శ్రమని దోచుకుంటున్నారు అనో రోజు వినేవి ఇవి అన్నీ, కానీ వీరే లేకపొతే ఆర్ధిక వ్యవస్థ చక్రాలు లేని రైలు బండి లాంటిది, ముందుకు వెళ్ళాలి అంటే వీరు కావల్సిందే.

ఇక మన సమాజంలో అనుకునేవి, ఎవరైనా తన ఆస్థి మొత్తం దానం చేసో, పేదలకి పంచాడు అనగానే, లేదా ఫ్యాక్టరీ లాభాన్ని కార్మికులకి పంచాడు అనగానే మనం అతన్ని అభినవ కర్ణుడే అనుకుంటాం, అలా ఊరికి ఒక్కరు ఉన్నా దేశం బాగుపడుతుంది అనుకుంటాను, కానీ దాన్ని ఎకనామిస్ట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఎప్పుడైతే ఇది ఒక లిమిట్ దాటుతుందో దీని వలన జరిగే లాభం (పేదరిక నిర్మూలన) ఏమో కానీ నష్టమే ఎక్కువ (పేదరికం తగ్గదు పెరుగుతుంది).

అలానే స్టాక్ మార్కెట్లు, అసలు ఇదొక మోసం అనుకునే వారే ఎక్కువ, అసలు దీని వలన పేద ప్రజలకి ఏమి లాభం అనని వారు ఎవరు? అలానే స్టాక్ మార్కెట్ పెరిగితే బంగారం రేట్ తగ్గుతుంది అనుకునే వారు తక్కువ కాదు, మనకి తెలిసింది ఈనాడు బిజినెస్ డెస్క్ అందించే వార్తలు, వాటి ప్రాతిపదికన మనం ప్రభుత్వ పాలెసీల గురించి చర్చిస్తుంటాం, మన తర్కానికి అందితే నిజం, లేకపోతే మోసం.

ఇక తర్కానికి వస్తే, ఒకప్పుడు "లాజిక్" అంటే సైన్సు అనే భావన ఉండేది, కానీ అది ఎలా తప్పు అయ్యిందో ఈమాట  పత్రికలో ఉన్నది చూడండి, మన తర్కం కాదు, కావలసినది ఫార్మల్ ప్రూఫ్,  దీని గురించి తదుపరి భాగాలలో వివరిస్తాను.

అలానే మనకి థీరీ అనగానే ఒక మాట అనేస్తాం, థీరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు అని, మరి అవి వేరు వేరు ఐతే అసలు థీరీ ఎందుకో నాకు ఎప్పటికీ అర్ధం కాదు, నా అనుభవంలో ఏదైనా ఎకనామిక్స్ టాపిక్ ఎత్తగానే, మొదట వినేది ఇదే మాట, "అసలు ఒక వస్తువు తయారు చేసినోడు, దాని ఐన ఖర్చుకి ఎంతో కొంత లాభం వేసుకొని అమ్ముతాడు తప్ప, మార్కెట్ రేట్‌కి ఎందుకు అమ్ముతాడు?, ఎదో మీరు థీరీ అంటారు తప్ప అది నిజంగా ఎక్కడా జరగదు, థీరీకి బయట జరిగే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, మీరు అన్నీ ఐడియల్ కేసెస్ మాత్రమే చుస్తారు, నిజ జీవితంలో ఎప్పుడూ అలా జరగదు"

దీని గురించి కుడా వివరణ తరువాతి భాగాల్లో ఇస్తాను, కానీ నేను కోరేది ఒక్కటే, మీకు అర్ధం కాకపొతేనో, మీ నమ్మకానికి వ్యతిరేకంగా ఉంటేనో ఎకనామిక్స్ మొత్తం పెట్టిబడీ దోపిడీదారుల తొత్తు అని అనేసి వెళ్ళిపోండి తప్ప అసలు డిమాండ్, సప్లై కాదు రేట్ నిర్ణయించవలసింది శ్రమ అని మొదలెట్టకండి ప్లీజ్, అలా కావాలి అంటే నాకు తెలిసిన జే.యన్.యు. పిల్లకాయల నెంబర్లు ఇస్తాను వారితో చెర్చించుకోండి (నాకు ఎవరు తెలియరనుకోండి అది వేరే విషయం).

ఇక గణితం - ఎకనామిక్స్, ఇక్కడో చచ్చు పుచ్చు చర్చ ఉన్నది గణితం వలన ఎకనామిక్స్ బ్రష్టుపట్టిపోతున్నది అని, ఇది చెప్పేవాళ్ళకి లెఖ్ఖలు రాక దాన్ని పట్టుకోని అనవసరం అంటారు, దీని గురించి వచ్చే భాగంలో చెప్తాను.

కానీ డైరెక్ట్ గా ఈ మేక్రోనో, మైక్రోనో కాకుండా అసలు ముందుగా ఫార్మల్ ప్రూఫ్, తరువాత కాస్త గణితం, మేక్రో ఆ తరువాత మెల్లగా మైక్రో ఎకనామిక్స్ చుద్దాం.

మొదట్లో కాస్త అర్ధం అవ్వొచ్చు కానీ ఇచ్చిన లెఖ్ఖలు చెయ్యకపొతే మాత్రం తరువాత తరువాత బుఱ్ఱకి ఎక్కదు కాబట్టి, నేర్చుకోవాలి అన్న కోరిక ఉంటే మాత్రం కాస్త లెఖ్ఖలు నేర్చుకోవాల్సిందే..



ముందు పాత టపాలు కొన్ని ఉన్నాయి, ఉత్తినే సరదాగా అవగొట్టాలి, అదీ దీనికోసం మొదలు పెట్టిందే, ఎదో ఒక చిన్న గొడవ వలన కాస్త గందరగోళంలో ఉన్నాను, టపా అస్తవ్యస్తంగా ఉంటే నాకో మెయిలో, కామెంటో కొట్టండి.

Monday, December 6, 2010

రౌడీ, ఇకపై కేరళని అవమానిస్తే చేతులు ముడుచుకోని కుర్చోము ఏమనుకుంటున్నావో

6 comments
ఎవడండీ అసలు ఈ రౌడీ, కమ్యూనిష్ట్లపై తనకి ఎంత ద్వేషం ఉన్నా కేరళ ప్రగతిని తక్కువ చేసి చూపిస్తే మా కమ్యూనిష్టు సోదరులు ఎంత ఫీల్ అవుతారు, అందుకే నేను  దొరికిన క్రొద్ది సమయంలోనే మా కమ్యూనిష్ట్ల గొప్పతనాన్ని చాటదల్చుకున్నాను.

ఎనబైయ్యో దశకం, కమ్యూనిష్ట్ల పరిపాలనో కేరళ 20 శాతంకి పైగా నిరుద్యోగంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సమయం, ఎదో ఒకటి చెయ్యడం కన్నా, ఏదీ చెయ్యకపొతేనే ప్రజలు ఎదో ఒకటి చూసుకుంటారు అని మన ప్రియతమ కమ్యూనిష్ట్లు నిద్దరొతున్న సమయంలో, గల్ఫ్ వెలుగులు కేరళలో ఆశాకిరణాలయ్యి 2000 సంవత్సరం వచ్చే సరికి నిరుద్యోగం 9 శాతానికి పరిమితమయ్యింది..చూశారా ఏదీ చెయ్యకుండా నిద్దరోవడం వలన దేశానికి 40 లక్షల జనాభా తగ్గింది.

గల్ఫ్లో చిన్న తుఫాను వచ్చినా కేరళలో 20% కుటుంబాలకి కంటిమీద కునుకుండదు, మరి అదేగా వారికి తిండి పెడుతున్నది, తాము 10% అభివృద్ది సాధించాము అని చెప్పుకుంటున్న కేరళ లెఖ్ఖల్లో 27% ఆదాయం విదేశీ సొమ్మే, అదే లేకపొతే కేరళలో 40% మంది నిరుపేదలే.

గ్లోబలైజేషన్ని విమర్శిస్తూ గ్లోబలైజేషన్ మీద బ్రతుకుతున్న రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపించుకోవడం ---- (మాటలు లేవు).

ఇక వ్యవసాయ రంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, రోజు రోజుకీ పడిపోతున్న, అసలు ఉన్నాయో లేవో కుడా తెలియని వరి పొలాలని అడుగుదామా? 2.2% నెగెటివ్ గ్రోత్ మెయింటెయిన్ చేస్తున్న ప్రైమరీ సెక్టార్‌ని అడుగుదామా? 77% శాతం ప్రభుత్వ ఆదాయాన్ని "ప్రభుత్వోద్యోగ సంక్షేమానికి" కేటాయించి చిన్న కాలువ త్రవ్వడానికి కుడా విదేశీ ఋణం కోసం అర్రులు చాస్తూ దాదాపు 58 వేల కోట్ల విదేశీ ఋణం తీర్చలేక వడ్డీలు కట్టడానికీ డబ్బుల్లేక మళ్ళీ అప్పులు చేసి వడ్డీలు కడుతున్న రాష్ట్రాన్ని చూడు కమ్యూనిష్టు సిద్దాంతాలు ఎప్పుడో గాలికొదిలేసిన కేరళ ఆర్ధిక వ్యవస్థ నేర్పుతున్న పాఠం చూడు రౌడీ..


ఇక ప్రజా సంక్షేమానికి వస్తే మేము కేటాయంచినది 2000 కోట్లు ఐనా, 4 వేల కోట్లు ప్రపంచ బ్యాంకుకి వడ్డీ కడుతున్నాం అని మరిచిపోకు, అంత వడ్డీ ఎందుకు కడుతున్నామో తెలుసా మా 2.66 లక్షల ప్రభుత్వోద్యోగులకోసం 14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, మరి ఉన్న ఆ రెండు వేల కోట్ల నుంచే మేము ఏది కాజేయ్యాలన్నా, దానిలో ఆ విజయన్నో ఎవడో 300 వందల కోట్లు తినేశాడు, మరి మిగతా రాజకీయనాయకులు ఎలా బ్రతకాలి అధ్యక్షా?

రౌడీ,

గ్లోబలిజేషన్ ఫలాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే కాదు, కూలి పనిచేసుకునే వాడికి కుడా ఎలా ఇప్పించగలిగిందో చూడు మా కేరళ ప్రభుత్వం..

ఇదంతా కేవలం మా చేతగానితనం వలన జరిగింది అనుకుంటున్నావేమో, మేము ఇవన్నీ నిద్రపోయే ముందే, నిద్రమత్తులో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు.

3 కోట్ల ప్రజా సంక్షేమం అంటే మాకు  10 లక్షల ప్రభుత్వోద్యోగుల సంక్షేమం (విశ్రాంత/ప్రస్తుత) మాత్రమే.


అన్ని వ్యవస్థలూ తిరోగమిస్తున్నా, విదేశీ ఋణాన్ని ఆదాయంగా, గ్లోబలైజేషన్ డబ్బులని సొంత డబ్బులుగా భావిస్తూ, 10% అభివృద్దిని సాధిస్తున్న/చూపిస్తున్న మా కేరళ విధానాన్ని చూసి నేర్చుకో ఏమనుకుంటున్నావో..

---

ప్రజాసంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం కేటయించింది 2254 కోట్లు ప్రభుత్వ బడ్జెట్, దానిలో అసలు నిజంగా ఎంత కేటాయించారో, ఎంత ఖర్చు పెట్టారో దేవునికే ఎరుక, కానీ ప్రజలు సొంతగా విరాళాల రూపంలో ప్రజా సంక్షేమంకోసం దీనికి మూడు రెట్లు ఖర్చు పెట్టారని ఒక అంచనా.

The remittances account about 22 per cent of the NSDP. The importance of remittances to Kerala’s economy is evident from a few other comparisons. Remittances were 1.74 times the revenue receipts of the state, 7 times of the transfers to the state from the Central Government and 1.8 times the annual expenditure of the Kerala Government. Remittances were sufficient to wipe out 60 per cent of the Kerala state's debt. The remittances in 2003 were 15 times of the export earnings from cashew and 18 times of those from marine products.

అసలు విషయం మర్చిపోయాను ఈ ఆర్ధిక విదానం వలన అత్యధికంగా నష్టపోయింది కేరళ హిందువులు, కేరళలో ప్రజల ఆదాయం మతాలవారిగా చూస్తే హిందువుల జనాభా సగం ఉన్నా, క్రైస్తవుల, ముస్లీంల ఆదాయం (కలిపి) ఐదు రెట్లు ఎక్కువ, ఇదే మా మైనార్టీ సంక్షేమం. ( హిందువుల ఆదాయం 1 రూ. అనుకుంటే, క్రైస్తవుల ఆదాయం 1.5 రూ., ముస్లీముల ఆదాయం 3.5 రూ.).

ఈడ్చి కొడితే రెండువేల కోట్లు ఖర్చు పెట్టడం లేదు, ఇంక అవినీతి ఏముంటుంది నా బొంద, ఉన్నా అది మహా ఐతే ఓ 500 కోట్లు, అది మన రాజాగారి లక్షా డెబ్బై ఐదు వేలకోట్లలో ఏ మూలకి వస్తుంది?

మీకో నిజం చెప్పనా రౌడీ, గల్ఫ్ నుంచి మాకు వస్తున్న డబ్బులు 30 వేల కోట్లు పెరిగినా మా కేరళ రాష్ట్ర జి.డి.పి. 20 వేల కోట్లే పెరిగింది.. అంటే పైకి గ్రోత్ ఉన్నా, నిజం వెనక్కి వెల్తున్నామనే... కారణం క్రిములు..

ఇక రిఫరెన్సుల సంగతికి వస్తే, ఇండియా స్టాట్ చూసుకోవడమే..

Monday, November 15, 2010

0 comments
ఏదో చెప్తున్నాను అర్ధం పర్ధంలేకుండా, సరే ఆ గొడవ మొత్తం ఈ టపాలోనే ముగించేద్దామని మొదలుపేట్టాను చూద్దాం.

అసలు కూడిక అంటే మనం ఏమి చేస్తున్నాం, అసలు కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణింతాలు, అంగుళం, పిరమిడ్లు, యజ్ఞశాలలు, వాటికలు, వీటిమధ్య ఉన్న లంకెలు ఏమిటి అన్నది కుడా బానే ఉంటుంది కానీ పాపాయి వచ్చి ఎక్కడ తన మార్కు బెజవాడ రౌడీయిజం చూపిస్తాడేమో అని భయంగా ఉన్నది.

సర్లే సోది పక్కన పెడితే, అసలు ప్రశ్న "అ-బ్" = అ+(-బ్)

Wednesday, November 10, 2010

ఏమిటో మరి

20 comments
కొద్దిరోజుల క్రితం, నా చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చాడు, తన కూతురి ఓణీల పండక్కి పిలవడానికి, ఎప్పుడో పదో తరగతి ఫ్రెండ్ ఇరవై ఏళ్ళ తరువాత కలవడం, ఊళ్ళోనే ఉన్నావు రా అంటే వెళ్ళక తప్పింది కాదు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే సాయి బాబా భజన, పిల్లలు సాయి మహిమలు పాడుతున్నారు, బాగున్నది, ఓ మూల కుర్చున్నాను, భజనలో "కలరా తరిమేశావు", అన్న పదం మాత్రం బాగా నచ్చింది,తరువాత భజన ఐపోయింది, పిల్లలు అందరూ ఒక చోట చేరారు, వాళ్ళని పిలిచి Waldemar Haffkine తెలుసా అని అడిగాను, ఊహూ, ఆయన ఎవరో మరి., తరువాత ఈ భజన చేయిస్తున్న స్వామి కుడా నా ప్రక్కకే వచ్చి కుర్చున్నారు, సరే అదేదో ఆయన్నే అడిగేస్తే పోలా అని, కలరా షిర్డీలో ఎప్పుడు వచ్చింది, ఈ మహిమ సంగతి కాస్త వివరించమన్నాను, ఆయన ఈ ఉదంతం అంతా చెప్పాక, కావాలంటే చూసుకోండి దేశంలో కలరా వచ్చి లక్షలు లక్షలు చనిపోతున్న సమయంలో మరి షిర్డిలో రాలేదని ప్రభుత్వ రికార్డ్లు ఉన్నాయి అని చెప్పారు, అదేంటండి ఒక పక్కన షిర్డీ నుంచి కలరా తరిమేశాడు సాయి అంటున్నారు, మళ్ళీ అసలు కలరానే రాలేదు అంటున్నారు అని అడిగితే సమాధానం నిల్లు. కాస్త అటూ ఇటూగా వాల్దెమర్ కలరా వ్యాక్సిన్ కనిపెట్టింది అదే సమయంలో, అదీ మన దేశంలో, 1899-1923 మధ్య దేశం మొత్తం కలరాతో అల్లాడుతుంటే మరి ఈ సాయి భక్తులు, ఆ పిండిని తలా పిడికెడు తీసుకోని ఒక్కో ఊరిలో చల్లితే ఎన్ని ప్రాణాలు నిలబడేవి, మరి అదే సమయంలో యూరొప్లో కలరా రావడానికి అసలు కారణాలు తెలుసుకోని ఒక్కరు కుడా చనిపోకుండా జాగ్రత్త పడ్డారు కదా, మరి మనం చేసింది ఏమీ లేదు, కాకపొతే అది ఒక మనిషికి మహిమలు అద్దడానికి మాత్రం ఉపయోగించుకున్నాము చక్కగా, అసలు దేవుడు అంటే మహిమలు చూపిస్తేనే దేవుళ్ళా? మనకి నిజాలు వొద్దు మహిమలే కావాలా?

కనీసం జాన్ స్నో పేరో, వాల్దెమర్ పేరో ఒక్క సారి తల్చుకున్నా ఆ భజనలో ఆ పిల్లల్లో ఆసక్తి కలిగి ఒక్కడు ఐనా పెద్ద శాస్త్రవేత్త ఐతే దేశానికి ఎంత లాభం? భారత్ సూపర్ పవర్ అనుకోవడం తప్ప అసలు ఎన్ని పేటెంట్లు మనం సాధిస్తున్నాం ప్రతి సంవత్సరం, అది అమెరికా పొందే వాటిల్లో కనీసం 10 శాతం కుడా ఉన్నదా?

ఎంతకీ మనవేదాలు గొప్పవి, అవును గొప్పవే, కానీ మనం వాటిల్లో ఉన్న శాస్త్ర సంభంధమైనవి వదిలేసి, మాయలు, మహిమలు, మంత్రాలు, ఉఛ్ఛాటన క్రియలు, వీర విధ్యలు, పట్టుకోని ఏమి సాధించాం? బర్రేలని తోలుకోవడమా?

మనం సంఫాదించే ప్రతి రూపాయికి పావలా పైనే ఈ హక్కులు వినియోగించినందుకు చెల్లిస్తున్నాం..

అసలు ఆర్య భట్టుడు ఏమి చేశాడో చెప్తున్నామా మనం, మన పుస్తకాల్లో ఉంటున్నాయా? ఎవరో Serge Lang ఆయన పుస్తకంలో వివరంగా ఉన్నాయి తప్ప. టేలర్ సిరీస్ మనకి కొన్ని వందల యేల్ల క్రితమే తెలుసు అని ఎవరికి తెలుసు? కానీ మనం ఏమి చేశాం జ్యోతిష్యం అని పెట్టుకున్నాం, అసలు ఇప్పుడు ఎంతమంది గొప శాస్త్రవేత్తలు ఉన్నారు మనకి, ఏమైనా అంటే గుప్తుల కాలం పేర్లు చెప్తాం, అంతకు కొన్ని వందలమందిని మొన్నీ మధ్య పుట్టిన అమెరికా తయారు చేసింది.. మనకి మాత్రం వేదాలు చాలా గొప్పవి, దానిలో సర్వం ఉన్నాయి, ప్రపంచంలో ఎవడు ఏమి కనిపెట్టినా అది వేదాలలోదే వాళ్ళు కొట్టేసి కనిపెట్టేశారు, మన పూర్వీకులు అబ్బో వేల ఏల్ల క్రితం అవి అన్నీ చేశారు.

ఐన్‌స్టీన్ కనిపెట్టినవి అన్నీ మన వేడాలలో ఉన్నాయి అంట, అవే ఇంగ్లీషులోకి మార్చుకొని తన పేరు రాసుకున్నాడు అంటా, మరి ఐతే మన వేద పండితులు అదే పని ఇంకా ఎందుకు చేయలేకపొతున్నారో, ఐన్‌స్టీన్ ఎప్పుదు వేదాలు చదివాదో, ఎప్పుడు సంస్కృతం నేర్చుకున్నాడో., ఇది ఇంటర్లో మా లెఖ్ఖల మాష్టారు చెప్పారు, ఇప్పుడు నేను అదే రాస్తే నమ్మేవారు ఇంకా ఉన్నారు.

వేదాలు, అప్పటి మనుషుల ఆలోచనలు అనుకోని, వాటిల్లో తప్పులు ఉన్నాయి అని అనుకోము, వాటికి దైవత్వం ఆపాదించాల్సిందే తప్పదా? దాన్ని తప్పు అనకూడదా?

వ్యాధులు భూతాలవలన వస్తాయి అని నమ్మే కాలంలో మరి ప్రజలుకుడా బలులో, జాతరలో చేస్తే తగ్గుతాయి అని అనుకునేవారు, ఇప్పుడూ కుడా జాతర్లు, స్మశానంలో పూజలు చేద్దామా? హస్పిటల్లు మూయించేసి. ఏమిటో మరి..

Saturday, November 6, 2010

ఏమిటో ఈ మాయ

22 comments
పోయిన చలికాలం అనుకుంటా, ప్రపంచికంలో గొప్ప గొప్పోలొస్తున్నారని, ఏడనో దేశంలో పేద్ద పేద్ద కాలేజీల్లో ఎకనామిక్స్ డిగ్రీలు ఎలగబెడుతున్న పిల్లకాయల్ని తోలుకొచ్చారు, తోలుకొచ్చినోళ్ళు ఊరుకోకుండా ఓ గదిలో ఏసి వేసి, ఎవరో పెద్ద పిల్లకాయని పైన కూకో బెట్టి ఎకనామిక్స్లో మేథమేటిక్స్ అవసరమా అనవసరమా అని ఒక టాపిక్ ఇచ్చి కొట్టుకోమన్నారు.. బాగా ఇంగిలిపీసు వచ్చిన పిల్ల, సూపర్ మ్యాన్ టీషర్ట్ వేసుకొచ్చి, అసలు లెక్కలు ఎకనామిక్స్ బ్యూటీని సెడగొట్టేస్తున్నాయి, తలకమాసినోళ్ళు అందరూ కలిసి అనవసరంగా లెఖ్ఖలు ఐనదానికీ కానిదానికీ మాదుంప తెంచేస్తున్నారు, అసలు కీన్స్ దీన్నే
It is a great fault of symbolic pseudo-mathematical methods of formalising a system of economics analysis.

అని అన్నాడు, అసలు ఎకనోమెట్రిక్స్ మోడలింగ్ ఎంత బాగుంటుంది, అసలు దానిమీద పని చేసినందుకే చాలా మందికి నోబుల్ ప్రైజులు వచ్చాయి, లెఖ్ఖలు, నాశనం చేయడానికి తప్ప ఇంక దేనికీ పనికిరావు అని తేల్చింది.

పాపం పైన కుర్సీలో కుర్చున్నాయాన బాగా ఇంప్రెస్ అయ్యి ఏమి ఇవ్వాలో తెలియక, చేతి వాచీ తీసి ఇచ్చాడు, తన ఫేవరెట్ ఎకనామిస్ట్ జాన్ న్యాష్ అని సదరు శాల్తీ చెప్పి, అతనితో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇవ్వమని అర్ధించారు, సాధించారు..

స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్ సరిపోతుందా, ఇంకేమీ అక్కర్లేదా ఎకనామిక్స్లో.

అసలు మేథమేటిక్స్ అంటే ఏమిటి? మేథమేటిక్స్ అంటే ఒక భాష, అది వొద్దు, మాకు సైగలే బాగున్నాయి అంటే వాడ్ని పిచ్చోడే అనుకుంటాను నేను అని గిబ్బ్స్ అన్నాడు గుర్తులేదా అని పాల్ (కె.యె. పాల్ కాదులేండి) చెప్పాడు కదా, వీళ్ళు ఏమిటి మాట రాని మౌనమిది అనే పాట పాడుకుంటున్నారు?

మ్యాప్ లో నాకు ఇంచ్ బై ఇంచ్ దిటేయిల్స్ కావాలి అనేటోడ్ని ఏమంటాం (ఇంచ్ బై ఇంచ్ కావాలి అంటే వెళ్ళి చూడక మ్యాప్ ఎందుకో?)

మేథమేటికల్ మోడల్‌కి, మేథమేటిక్స్కి, ఎకనామిక్స్లో మేథమేటిక్స్కి, బిహెవియరల్ సైన్సెస్లో మేథమేటిక్స్ ఎంప్లాయబిలిటికీ తేడాలు తెలియకుండా మాట్లాడితే వాచీ ఇచ్చేస్తారా?

మరి ఎకనామిక్స్లో కాసెప్ట్స్ ఎలా డెవలప్ అయ్యాయి, ఎన్నో క్లిస్టమైన సమస్యలకి సులువైన పరిష్కారం చూపించే గేం థీరీ ఎందుకువాడుకుంటున్నారు? అదేంటో కీన్స్‌ని ఆ విషయంలో తప్పు అని ప్రువ్ చేసిన నాష్ తనకి ఇష్టం ఐన ఎకనామిస్ట్ ఏల అయ్యాడు?

అసలు ఎకనామెట్రిక్స్ అంటే, మేథమేటికల్లీ ట్రైండ్ స్టాటిస్టిక్స్ అనే పేరు కదా, ఎకనామెట్రిక్స్ కాన్సెప్ట్స్ పృవ్ఫ్స్ లీనియర్ ఆల్జీబ్రలో దొరుకుతాయెందుకో? Jan Tinbergen డైనమిక్ మోడల్ మేథమేటికల్ మోడల్ కాదా? అసలు మోడల్ అంటే ఏమిటి? పైన మేథమేటిక్స్ వలన వచ్చే అవలక్షణాలు ఈ మోడల్లో లేవా?

Understanding the nature and role of mathematical economics is not the same as understanding the connection between mathematics and economics.

Mathematical economics is the employment of mathematics in economics itself. Explaining or justifying mathematical economics often involves essentialist arguments concerning the true nature of economic objects, and the true nature of the economy, as well as arguments suggesting that employing mathematics is appropriate since the underlying “economy” is quantitative in nature. (Debreu on Mathematical economics)

ఇంకొకాయనెవరో ఇలా ఎందుకు సెప్పాడు.
The history of economics involves a history of not only the development of economic knowledge, but the development and changes in images of economic knowledge: what constitutes the economy, what constitutes a good explanation in economics, what constitutes serious empirical work in economics, what is a good model, etc?

ఇవి ఏమీ తెలియకుండా ఆయన పైన ఎలా కుర్సున్నాడు? ఎదేదో వాగేసిన పిల్లకి జాన్ నాష్‌తో ముఖాముఖీ అవకాశం ఎలా వచ్చింది?

ఏమిటో ఈ మాయ, ఓ చల్లని రాజ, ఓ వెన్నెలరాజ, ఏమిటో ఈ మాయ..
----

ఇది శ్రీలంకలో జరిగింది, అక్కడ ఉన్నవారు చెప్పిన దాన్ని బట్టి, నా ఆలోచనలు కలిపి రాసుకున్నాను, ఇంకొంచం వివరంగా రాద్దామనిపించినా ఇలా కానిచ్చేశాను. (ఇది జరిగింది 3-4 ఏళ్ళు క్రితం అనుకుంటాను.)
ఆ అమ్మాయికి నాష్ డిల్లీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా సమయం కేటాయించినా, ఆయన నోరు విప్పి మాట్లాడలేదట, ఈ అమ్మాయి చెప్పినవి కుడా విన్నాడో వినలేదో తెలియదు అని చెప్పింది, కానీ తాను అన్నీ వింటాను అవతలి వాడు ఎదో తెలిసీ తెలియకుండా మాట్లాడుతుంటే జవాబివ్వను అని నాష్ ఎదో ఇంటర్వ్యూలో చెప్పాడని ఎవరో అన్నారు..


If the important lesson from mathematics in the first third of the nineteenth century was
that economics needed to become a deductive science (as geometry was), in the late nineteenth
century the lesson from mathematics was that economics needed to model itself on rational
mechanics. Over the first two thirds of the twentieth century the lesson was that economics was
to become scientific by grounding its models and theories on a modest set of axioms concerning
pure economic agents’ preferences and choices. But beginning nearly at mid-century,
mathematics was re-imagining itself as a discipline that historically had developed by solving
real problems presented to it from other sciences. And in a similar fashion, and partially in
response to that changing image of mathematical knowledge, the notion of a serious economic
science, connected to data-based reasoning, was reshaping the idea of rigorous argumentation in
economics. Econometrics and applied microeconomics were to form the reconstructed core of
economic science much as work in algorithmics and applied mathematics were re-commanding
attention in the mathematics community. “At the Berlin International Congress of
Mathematicians in August 1998, the old opposition between the pure and the applied—still
widely shared in the community—has been formulated in quite different terms: ‘mathematicians
who build models versus those who prove theorems.’ [Mumford, 1998]. But the respect enjoyed
by the former is now definitely as high as that of the latter.” (Dalmedico, 2001, 249) So too in
economics, as the prestige accorded “good work” in applied economics now rivals that accorded
to work in pure theory.

http://econ.duke.edu/~erw/Preprints/Mathematics%20and%20Economics%20%28New%20Palgrave%29.pdf

Wednesday, November 3, 2010

ఉత్తినే సరదాగా..-2

14 comments
గత టపాలో ప్రశ్న అర్ధరహితంగా ఉన్నదా? సరే ఇప్పుడు మరికొంచం వివరంగా.
ఇలా చూద్దాం

(*) a-b = a+b if b< b =" a+c">= 0; where c+b = 0 (pls. see foot note)

(#) a+b = a+b for all a and b.

(@) a+(-b) = a+c where c+b = 0.

*,#,@ మూడూ ఒకటేనా?

ఖచ్చితంగా *,# ఒకటే కాదు ఎందుకంటే

a+(b+c) = (a+b)+c for all a,b,c

a-(b-c) != (a-b)-c

మరి *,@ ఒకటే కాకపొతే వాటి మధ్య ఇలాంటి వైరుధ్యం ఏమైనా దొరుకుతుందా?

ఉత్తినే సరదాగా

---

a-b = a+b; as if now this is contradictory might confuse with a-b = a+|b| if b is negative, but my problem here is I am dealing things in Euclidean way, so these are the confusions faced by Early Mathematicians while dealing with definitions.
Anyway, as if now, the problem here is defining subtraction which is equivalent to addition, as both generate the same in R (real numbers).
Consider scenario, when only Natural numbers were known, so, a-b might be or might not be a Natural number, but what we know at present is in a-b, we need to add both if b is not a positive integer.

Monday, November 1, 2010

ఉత్తినే సరదాగా..

22 comments
a-b; a+(-b)

రెండూ ఒక్కటేనా?

I mean, ''Is subtraction and addition of a positive and a negative element is one and the same?"

Saturday, October 23, 2010

విగ్రహం నుండి వీభూది రావడం సాధ్యమేనా?

43 comments
లా ఆఫ్ కంజర్వేషన్ ఆఫ్ మాస్ మనకి తెలిసిందే, దాని ప్రకారం.
The mass of an isolated system cannot be changed as a result of processes acting inside the system.

కాబట్టి, వీభూది వస్తే అక్కడ ఉన్న ఏదైనా వస్తువు రూపాంతరం చెంది ఉండాలి. (Hard Substance to powder)




వీభూది కుడా ఎక్కువగానే ఉన్నది కొద్ది మొత్తంగా లేదు.

విగ్రహం, ఫొటోలు మాత్రమే దగ్గిర్లో కనిపిస్తున్నాయి (పెట్టిన ఫొటోలలో కనిపించిన విధంగా).
ఫొటో దూరంగా ఉన్నది, అదీ పాలథీన్ కవర్ కనిపిస్తున్నది, కాబట్టి, దాన్ని పరిగణలోకి తీసుకోలేము.

ఇక విగ్రహం లోపల ఉన్న పధార్ధమా అనుకోవడానికి వీభూది రాశి మధ్యలో విగ్రహం ఉండాలి అప్పుడు, వీభూది రాశి ఉన్నదాన్ని బట్టి వీభూది విగ్రహం నుండి వచ్చే అవకాశం లేదు. అందులోనూ అంత వీభూది విగ్రహం నుండి వస్తే, పైన చెప్పుకున్న ఫిజిక్సు సిద్ధాంతం బట్టి, విగ్రహం సిధిలమై ఉండాలి, కానీ విగ్రహాం అలా లేదు కావున, అసైన్సు ప్రకారం, వీభూది విగ్రహం నుండి వచ్చింది అనుకోవడం అపొహ మాత్రమే.

ఇంక మరి అక్కడకి ఎలా వచ్చింది అన్న ప్రశ్నలకి జవాబులు ఆ ఫొటోలను చూసి చెప్పలేను, కావున ఇతర కారణాలను గురించి ఫొటోలను చూసి చెప్పడం కష్టం.

శ్రీనుగారి టపా చాలా లేటుగా చదివాను,(అది వ్రాసినప్పుడు నేను బ్లాగుల్లోనే లేను) అందుకే కొద్దిగా లేటుగా స్పందన.

Thursday, October 21, 2010

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ

1 comments
తిరూని ఒక టపా పెట్టమని అడిగాను పొద్దున, చూస్తే లేదు, క్రింద మలక్ కామెంట్ కనపడింది, ఇది రాద్దామా వద్దా అన్న మీమాంస వీడి రాస్తున్నాను.

నా క్లాస్‌మేట్ ఒకతను ఎప్పుడు చుసినా గుళ్ళు, పట్టుకోని తిరుగుతుండే వాడు, నేను రోజు బస్సు దిగి కాలేజీకి వచ్చే దారిలో ఒక మాదిరి గుడి ఉన్నది ( ఏ దేవుడిదో ,నేను లోపలకి కుడా చూసిన గుర్తులేదు), ఎక్కువగా ఆ గుడి నుంచి బయటకి వస్తుండే వాడు, ఎవరో మహా భక్తుడు అనుకునేవాడ్ని, తరువాత పేరు డేవిడ్ అని తెలిసాక, అదేంటి మీ బెంగాళ్ళో (ఆ రాష్టం వాడు అని ఎలా తెలుసు అని అడగక్కర్లేదు అనుకుంటా:-) ), రివర్స్ కన్వర్షనా అంటే చెప్పుకొచ్చాడు.

ఈ అబ్బాయి పుట్టుకతో హిందువు అంట, తను పుట్టాక, ఊపిరితిత్తులకి ఏదో పెద్ద ఇంఫెక్షన్ వచ్చింది అని, ఈ మిషనరీస్ హాస్పిటల్లో చేర్చారు అంట, కోలుకోవడానికి రెండు నెలలు పైనే పట్టింది అట, గండం గడిచాక, ఇంటికి తిరిగి వచ్చాక ఒక రోజు, ఆ మిషనరీస్ ప్రతినిధి ఇంటికి వచ్చాడు అంట, బిల్లు కట్టమని, లేదా మతం ఐనా మారమని, ఆ బిల్లు కట్టాలి అంటే ఉన్న రెండెకరాలు అమ్మాలి, ఇక గత్యంతరం లేక మతం మారారు, ఈ అబ్బాయికి డేవిడ్ అని పేరు వచ్చింది.

అలాని తనకి మిషనరీస్ అంటే కోపం లేదు ఎందుకంటే, తనకి ప్రాణం పోశారు, హాస్పిటల్లో కుడా తనని చాలా బాగా చూసుకున్నారు అని తన తండ్రి చెప్తుండే వారు అట, తను రెండు మతాలనీ సమానంగా చూస్తాను అని కుడా చెప్పాడు.

ఇది రాశాను అని నన్ను కరుడుగట్టిన హిందుత్వవాది క్రింద జమ కట్టకండి, నాకు తెలిసింది చెప్పాను.

రేపు తిరూ శంకర్ గారి ప్రశ్నకి సమాధానం అసైన్సు పరంగా ఇస్తాడు.

తెలుగు యోగిగారు అలా పారిపోతున్నారేమిటి సారు?

14 comments
జ్యోతిష్యం సూపర్ సైన్సు, లెట్స్ గో బ్యాక్ టూ వేదాస్ అని గట్టిగా నమ్మే మీరు నా సవాలుకి ఇంకా స్పందించలేదు మరి, భయపడ్డారా? దేని వెనుక దాక్కోవాలో తెలియక రామ క్రిష్ణ మిషన్ పుస్తకాలు తిరగేస్తున్నారా?
నిన్ననే సాయి బాబా లోపాలు కుడా ఆయన భక్తులు వాటినే లీలలుగా మార్చి భ్రమ పడతారు, కధలు కధలు కాకుండా నిజాలు నిజాలు చెప్పాలి అని మీరేగా అన్నారు..

మరి సూపర్ సైన్సు ఐతే ఈ చిన్న పరీక్షకే మీరు నిలబడకపొతే ఎట్టా సారు?

సాయిబాబా అదేదో పిండి చల్లి కలరా మహమ్మారిని ప్రాలద్రోలారు అదేదో క్రియ అన్నారే, అట్టనే అదేదో కూసింత లోక కళ్యాణానికి వాడండి అంటే మీరు ఉలకరు పలకరేమి స్వామి? అంటే అది కేవలం మీరు మీ స్వార్దానికే వాడుకుంటారా? మీ పేరుకే వాడుకుంటారా?

ఇవి అన్నీ మీ బోటి జ్ఞానులకి చిటికెలో పనులు కదా, మరి చేసి చూపించి లోక కళ్యాణం సేయరా?

పోనీ కనీసం జ్యోతిష్య విజ్ఞానం ఐనా, ఆ మహత్తు కొద్దిగా మాకు రుచి చూపించండి మహా ప్రభో..

మీరే విన్నవించారుగా, జ్యోతిష్యం స్తాటిస్టిక్స్ అని అది ఎలా డిసైడ్ చేసారు, సర్లేండి ఎలాగోల డిసైడ్ చేసారు, మరి నేను అడిగింది కేవలం 100 ప్రిడిక్షన్స్ మాత్రమే కదా, స్తాటిస్టికల్గా ఐతే ఒక పదివేలో, లక్షో అధమం ఐదు - వేలు ఐనా అడుగుతారు, నేను కేవలం వంద మాత్రమే అడిగాను.

మరి స్పందిస్తారా, లేక ఎదో ఒక కధ చెప్పి దాక్కుంటారా? అదే మీ మాటల్లోనే నిజం చెప్పే ధైర్యం లేక ఎదుటివానిపై దాడి చేస్తారా?

Wednesday, October 20, 2010

తెలుగు యోగిగారు మీకోసం

46 comments
భలే తెలివిగా మీరు వేదాలని చూపించి మీ స్వఛ్ఛత నిరూపించుకుందామనుకుంటున్నారా? మా పోరాటం మీరు చెప్తున్న అబద్దాల పైనే, మీరు చెప్పగానే మేము నమ్మకుండా ప్రశ్నలు అడిగామని ఇప్పుడు వేదాలను అడ్డం పెట్టుకోని మాపై బురద జల్లుడు కాదు...

సరే మీరు చెప్పేవి నిజాలో కాదో బ్లాగు ముఖంగా తేల్చుకుందాం.

ఈ మీమాటలు గుర్తున్నాయా?
Calculative part of Astrology uses Mathematics and Astronomy.
Predictive part uses Logic and Statistics.


1. ఒక వంద ప్రిడిక్షన్స్ అవుననో- కాదనో లేక ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అనో వ్రాయండి.
2. సరే దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నది కదా, ఏది ఆ క్రియల్లో ఏదైన ఒకటి వాడి ఏ రాజకీయ నాయకుడ్నో, లేక ఒక తీవ్రవాదినో, లేక ఒక పెద్ద క్రిమినల్నో మార్చి అతని కుట్రలన్నీ భయటపెట్టి వేలాది అమాయక ప్రజలని కాపాడండి.

పై రెండిట్లో ఏ ఒక్కటైనా సరే..

సవాలును స్వీకరించగలరా?

Friday, October 8, 2010

కామన్వెల్త్ ఆటలు - కొన్ని జ్యోతిష్య అంశాలు

56 comments
అనుకున్నట్టుగానే కామన్వెల్త్ గేమ్స్ ఫలితాలు సగం వచ్చాయి. అన్ని దేశాలనీ సంతృప్తి పరచాలనే ఊహతో పతకాల వాటాలు పంచి తనపై పడ్డ మచ్చని కప్పిపుచ్చుకుందామని మనదేశం ప్రయత్నించింది. ఈ ఫలితాలపై రకరకాల గ్రహాలు, నక్షత్రాల ప్రభావాన్ని ఒక టపా రాసి మరీ నా మనసులోనే దాచుకున్నాను! ఇప్పుడు మీ సౌలభ్యం కోసం దాన్ని ఈ టపాలోనే సంధర్భానుసారంగా ఇచ్చాను.

అభిమానులపై ఈ ఫలితాలవల్ల ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతో అందరికీ వాటాలు పంచి భారత క్రీడాకారులని అసంతృప్తికి గురిచేసింది కమిటీ. అసలు కల్మాడీ అంత కష్టపడి రచించిన వ్యూహాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడమెందుకన్న ప్రశ్నకి జవాబు లేదు :(
(ఆ వ్యూహం నాదంటే నాదని పిల్లకాకులు గోల చేసే సూచనలు గోచరించుచున్నవి)

కనుక దీని వెనక పతకాలొక్కటే కాకుండా పొరుగు క్రీడాకారుల ప్రాణాల యొక్క రక్షణ బాధ్యత కూడా కనిపిస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వం యొక్క గోడ మీది పిల్లి వాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం నడుస్తుందన్న విషయాన్ని కూడా నేను క్లియర్‌గా అనుకున్నాను.

ఇప్పుడెన్ని అంశాలు సరిపోయాయో చూద్దాం.

>>చక్కని గ్రహణ సమయంలో క్రీడలు మొదలయ్యాయి. ద్వాదశాంశలో మిష్టర్ రవిగార్కి త్రయోదశ చతుర్దశ రాశుల్లో రాహుకేతువులు నీల్‌కమల్ చెయిర్స్ వేసుకుని మరీ కూర్చున్నారు. దీనివలన అయా క్రీడలని చక్కగా నిర్వహించడానికి అష్టకష్టాలూ పడి అడ్డమైన దారులూ తొక్కాలని తెలియకనే తెలుస్తున్నది.

నిజమే! నా అనన్యసామాన్య ప్రతిభకో మచ్చుతునక ఈ విషయం అని మీకు కూడా తెలియకనే తెలియట్లా? భారత కీర్తి దిగ్దిగంతాలకీ వ్యాపింపచేయడానికి కల్మాడీ యెన్నెన్ని అడ్డ దారులు తొక్కలేదు? యెన్ని అష్టకష్టాలు పడ్డాడు పాపం! మరి ఆ అపర చాణుక్యుడిని సాంబార్లో ఈగలా తీసేయలేదూ?

>>ఇంకా సెక్యూరిటీ పరంగా విశ్వప్రయత్నం అవసరం అని తెలుస్తోంది.

పైకి చూస్తే ఎంత తేలిగ్గా కనపడినా యెంత లోతైన, ఇరుకైన భావం గోచరిస్తోందో కదా? కానీ దీన్ని అర్థం చేస్కోలేని కొందరు (3 idiots) ఇది సాధారణమే కదా అని వదరుతున్నారు. నేను చెప్పేదొక్కటే: అలా అనడం సరికాదు, బేసీ కాదు. త్వరలోనే మీకు దీని పరిణామాలు కనిపించడం జరుగుతుంది. ఇంతకంటే పూర్తిగా భవిష్యత్తుని 3D లో చూపిస్తే నేనెక్కడుంటానో నాకే తెలీదు.

>>రవి (రవిగారు కాదు, సన్) అధికారులకూ, నాయకులకూ, గర్వానికీ, ప్రతిష్టకూ సూచకుడు. ఆయనకే ఈ సమయానికి గ్రహణం పట్టింది.

ఈ జోస్యం సరిగానే జరిగింది. మరి రవిలాంటి కీర్తిప్రతిష్టలున్న కల్మాడీ చతికిలబడినట్లా కాదా? పైగా ప్రీప్లాన్‌డ్ గా ఉన్నాగానీ పతకాల వాటాలో మనమెందుకు వెనకబడ్డామన్నదానికి సంతృప్తికరమైన సమాధానం లేదు.

ఇక్కడ మరికొన్ని జ్యోతిష్యపరమైన విషయాలు గమనించాలి.

>>వెయిట్ లిఫ్టింగ్ సమయానికి బుధుడు బంగారంలా మెరిసిపోతున్నందున మన బరంపురం రవి కుమార్ డోపింగ్ లేకుండా స్వర్ణ పతకం సాధించాడు.

>>గురుడి వెంట రాహు కేతువులు గన్ తో వెంటపడడం వల్ల గగన్ నారంగ్ స్వర్ణంతో మెరిసాడు.

>>కుజ గురుల మధ్యనున్న ఆస్టరాయిడ్ల శుభదృష్టి వలన రవాణా వ్యవస్థ మెరుగుపడింది.

ఈ రకంగా చూస్తే మా మనోవీధిలో మెరిసిన మెరుపులు చాలా వరకూ సరిగానే మెరిసినట్టు తెలుస్తోంది.

గమనికలు:
  1. ఫోటోషాప్ ట్రయల్ పీరియడ్ ముగిసిన కారణంగా రాశిచక్రాలు గీయుట సాధ్యపడలేదు.
  2. అసలు నీ జాతకం చూసుకోముందు అని దుండగులు కొందరు అడుగుతున్నారు. మీరు గుంటూరొస్తే మీకు నా ఫ్లైయింగ్ కిక్ రుచిచూపిస్తాను. మళ్ళీ మీకా అనుమానాలు జీవితం లో రావు.
  3. పై విశ్లేషణ సంఖ్యా శాస్త్రం తో కూడా చేశాను (నా సొంతమే! సాక్షి తోడు). భలే చమత్కారపూరితంగా వచ్చిందది. వీలు చూసుకుని దానికి టపా కడతాను.

Friday, October 1, 2010

ఒకే కాంతి ఒకే శాంతి

14 comments
ప్రతి ఆలయం పక్కనా ఒక మసీదు ఉండే పద్దతి ఎప్పటికీ మంచిది కాదు. ఇది భవిష్యత్తులో గొడవలకు కారణం అవుతుంది అని ఎన్నోచోట్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి.





Monday, September 27, 2010

ఏది సత్యం? ఏది సత్యాన్వే(వే)షం??

55 comments
నాకు ఈ మధ్యనే కొన్ని నిజాలు తెలిశాయి, ఒకటి తెలంగాణాలో మాత్రమే ఫ్లోరైడ్ భాదితులు ఉన్నారు అని, ఇంకోటి, ఆ ఫ్లోరైడ్ సమస్య తిరడానికి ఒక్క కృష్ణ నదీ జలాలే తాగాలి అని.
నేను తెలంగాణాకి అనుకూలమో, వ్యతిరేకమో పక్కన బెట్టి, అసలు ఫ్లోరైడ్ సమస్య గురించి చూద్దాం.

ఈ ఫ్లోరైడ్ సమస్య నల్గొండ ఒక్క జిల్లాలోనే లేదు, మెదక్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం ఇలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎనిమిది కోట్ల మందికి ఎక్కువగానో, మరి ఎక్కువగానో దీని భాదితులే. పటం చూడండి, ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు మన దేశంలో.



ఇంక రెండో విషయానికి వస్తే, మరి దీనికి విముక్తి?

1. మొదటిది సమతులాహారం, క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వలన, టీ, కాఫీలాంటివి పూర్తిగా మానేయడం ఇలా, ఆహారపూ అలవాట్లతోనే చాలా ధూష్ఫలితాలు నియంత్రించవచ్చు. కానీ,

2. పూర్తిగా నివారించాలి అంటే మాత్రం స్వచ్చమైన నీటిని త్రాగవలసిందే, స్వచ్చమైన నీటితోనే ఆహారం వండుకోవాలి.
సరే, మరి సమతులాహారం మీద నల్గొండలో ప్రజలకి ఎంత అవగాహన కలిగించారో అంటే ఉన్నకొద్ది మంచి ఆహారం తీసుకోవడం మాత్రం చాలా తగ్గిపోతున్నది అని వరల్డ్ బ్యాంక్ వారు పర్యటించినప్పుడు తేలింది.

దీన్ని వదిలేద్దాం, ప్రభుత్వం కన్నా ఎక్కువగా కొంత మంది వ్యక్తులు, సంఘాలు ఈ ఫ్లొరైడ్ సమస్య మీద ఎక్కువ కృషి చేస్తున్నాయి.

వారు ఎల్లారెడ్డిగూడలో (నల్గొండలోకెల్ల అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ నీటిలో కలిగిన గ్రామం) మొత్తం ఇరవై తొమ్మిది శాంపిల్లు సేకరించగా నాలుగు శాంపిల్లలో ఫ్లోరైడ్ శాతం తక్కువగా, సరియైన మోతాదులో ఉన్నది, అంటే ఆ ప్రదేశాల్లో, ఎక్కువ లోతుకీ బోర్లు వేసి నీటిని వాడుకోవచ్చు, కానీ ఆ దిశగా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నించిన ధాఖలాలు లేవు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు అనుకుంటా ఒక బోర్ త్రవ్వి, దానికి నీటి శుద్ది ఫ్లాంట్ అనుసంధానించి ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని అందించే ఏర్పాటు చేశారు, దాన్ని నడిపే భాధ్యత ఎవరూ తీసుకోకపోవడం వలన, దాన్ని నడుపుటకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన, అది కొద్దిరోజులకే మూతబడినది, మరి అక్కడి రాజకీయనాయకులు కూడా పోటీలమీద పోటీలు పడి ట్యాంకర్లలో నీళ్ళు సప్లై చేస్తున్నారు తప్ప,( సం|| మూడు లక్షలకి పైగా సొంత డబ్బు పెట్టుకోని మరీ, అసలు ఆ ఫ్లాంట్ నడపటానికి లక్ష కూడా అవదు) దాని బాగు చేయిద్దామనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎలక్షన్లప్పుడు కృష్ణ జలాలు రాప్పిస్తాం అనే వాగ్ధానాలకి కొదవేలేదు.

ఒక్క నల్గొండ జిల్లాలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సమస్య 164 గ్రామాలలో తీవ్రంగా ఉన్నది, భాదితులు 65 వేలకి దగ్గిరగా ఉన్నారు, అనధికారిక లెక్క ఐతే 885 గ్రామాలు, ఆరు లక్షలమంది పైనే. వీటన్నిటికి త్రాగునీరు కృష్ణ నడినుంచి ఇవ్వాలి అంటే, దాదాపు ఆరువేల కోట్లకి పైన ఖర్చు (ఇది పన్నెండు వేలకి పైనే అవుతుంది అంతా అయ్యేసరికి అని అంచనా) సంవత్సరానికి మూడువందల కోట్ల మెంటెయినెన్సు ఖర్చు. ( గ్రానైట్ రాయి నుంచి ఫ్లోరిన్ నీటిలో కరుగుతున్నది కావున, రాళ్ళకి, నేలకి తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇది ఫలితాలని ఇస్తుంది.)

మరి ఇది తప్ప ఇంకే మార్గమూ లేదా?

పోని అక్కడ ఉన్న నీటిని శుద్ది చేయలేమా? చేయొచ్చు, ఒకటి పెద్ద నీటి శుద్ది ప్లాంటు పెట్టి ప్రతి ఇంటికీ నీరు పంపడం ఈ ప్లాంట్లు ఒక్కోటి కట్టడానికి అయ్యే ఖర్చు పాతిక లక్షలు, అంటే 164 గ్రామలకి కలిపి అయ్యే ఖర్చు మహా ఐతే యాభై కోట్లు, లేదా అనధికార లెఖ్ఖలు తిసుకున్నా 885 గ్రామాలకీ అయ్యేది ఎంత? ఎంతలేదనుకున్నా అయ్యేది ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం దాని మెంటెయినెన్సుకి పదహారు కోట్లు (ఒక్కో ప్లాంట్ కి 1.5 లక్షలు). అంటే అధమం ఐదువేల కోట్ల మిగులు.

లేదా, ప్రతి ఇంటికీ ఇంట్లో పెట్టుకునే ఫ్లాంట్ ఇవ్వడం, ఇది కొంతకాలం బానే నడిచింది, కానీ దీనికి ఫిల్టర్లు వచ్చి 20-50 రు. అవుతాయి, ఇంట్లో పెట్టుకునే ఫ్లాంట్లు ఫ్రీగా ఇచ్చారు సరే, ఈ ఫిల్టర్లు కుడా ఉచితంగా ఇవ్వమని కొందరు, వాటిని కొనుక్కోలేక ఇంకొందరు మూలన పడేశారు.

ఈలోపున పాపం ఎవరో ఒకాయన భగవాన్ అంట (నిజంగానే భగవంతుడు) ఈయన కనిపెట్టిన విషయం వాననీరు ఎంత ఇంకితే అంత ఫ్లోరిడేషన్ తగ్గుతున్నది అని, దానికి ఆయన ప్రతిపాదించింది ఎంత ఎక్కువ వాన నీరు మనం భూమిలోకి పంపగలిగితే అంత తగ్గుతుంది సమస్య తీవ్రత అని. ఆయన సూచించిన కొన్ని పద్దతులు.

1.
నల్గొండలో సగటు వర్షపాతం 772 మి.మి. అంటే ఒక వంద గజాలలో పడే వాన నీటిని సేకరించినచో 64,000 లీటర్ల నీరు పైనే పోగవుతుంది( ౫క్ష౩౦అడుగులు బావిలోకి), అంటే 4 వున్న ఒక కుటుంబానికి రోజుకి మనిషికి సగటున 25-30 లీటర్ల నీరు వాడుకోవచ్చు. దినికి అయ్యే ఖర్చు దాదాపు 30,000 రూపాయలు. నల్గొండలో 60% ఇల్లు ఇందుకు అనుగూణంగా ఉన్నాయి.
మిగిలినవారికోసం గ్రామాల్లో సామూహిక బావులు కట్టించుట ప్రతిదానికీ అయ్యే ఖర్చు 2,00,000 రూపాయలు.
సొంత బావులకి సగం ఖర్చు, సామూహిక బావులకి పూర్తి ఖర్చు ప్రభుత్వం భరించినా, గ్రామం మొత్తానికీ అయ్యే ఖర్చు సగటున 48,00,000 అంటే 164 గ్రామాలకి కలిపి ఒక యాభై కోట్లతో పూర్తి చేయొ (కొన్ని గ్రామాలలో జానాభా పదుల సంఖ్యల్లోనే ఉన్నది కావున మొత్తం మీద పాతిక కోట్లకన్నా తక్కువకే ఐపోతుంది అని తేల్చారు).

అనధికారిక లెక్క ప్రాకారం ఐనా మొత్తం మీద అయ్యేది ఐదు వందల కోట్లే..

2.
మరి తీవ్ర కరవు, పశువుల మేతకి? దీనికి ఇంకో మార్గం వున్నది.
అవే గ్రామ చెరువులను సరిగ్గా ఉంచడం, పాతిక ఎకరాల చెరువు, పదిహేను అడుగుల లోతు కలిగితే దానిలో పట్టే నీరు 95,56,93,572 లీటర్లు, సగటు జనాభా 2,000 వేసుకుంటే అధమం రోజుకి 500 లీటర్ల నీరు లభ్యం అవుతుంది, పైగా దీని వలన భూగర్భ జలాలలో ఫ్లోరిన్ ఘాడత తగ్గుతుంది, పశువులకి కుడా సరైన నీరు దొరుకుతుంది కావున, ప్రజల ఆర్ధిక స్థితి కుడా మెరుగవుతుంది.

మరి దీనికి అయ్యే ఖర్చు ఎంత ఎక్కువలో ఎక్కువగా వేసుకున్నా 1600 కోట్లు, (885గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో కుడా ప్రస్తుతం ఒక్క చెరువు కుడా లేదు అనుకుంటే ప్రతి గ్రామంలో త్రవ్వించడానికి) మరి, ప్రతిగ్రామంలో ఉన్న చెరువులని బాగు చేసుకుని, ఆక్రమణలను తొలగించి బాగు చేసుకుంటే, క్రొద్దిగా ఒక 100 కోట్లకే ఐపోతుంది. (885 గ్రామాలకి కలిపి, 164 గ్రామాలకే ఐతే అసలు 20 కోట్లకే ఐపోతుంది)

మరి వీటిని వదిలేసి ప్రాజా ప్రతినిధులు, మేము ఇన్ని వేలా కోట్లు ఖర్చు పెట్టి కృష్ణ జాలాలు తెప్పిస్తాం అనో, తెలంగాణా వస్తేనే సాధ్యం అనో మభ్య పెట్టడం సత్యాన్వేషణా?

తెలంగాణా పోరాటం మొత్తం పదిహేను ఏళ్ళు అని లెక్కేసుకున్నా, యం.పి. నిధులు 30 కోట్లు, యం. య.ల్యే. నిధులు ఇంకొ (12*15) 180 కోట్లు, అంటే ఈ సమస్య పూర్తిగా నిర్మూలించడానికి ఐదు యేళ్ళ నిధులు చాలునేమో?
మరి ఐతే ప్రాజా ప్రతినిధులు ఏమి చేస్తున్నట్టు అక్కడ? కృష్ణా జలాల తరలింపు కన్నా సులువైన మార్గం ఉందని చెప్పిన నేను సమైఖ్యంధ్ర గూండాని ఎలా అయ్యాను? పాపం ఎవరో ఒకాయన ముప్పై యేళ్ళ నుంచి ఇదే ప్రయత్నం చేస్తున్నారు అంట, మరి ఆయన ప్రత్యమ్నాయ అవకాశాల మీద దృష్టి ఎందుకు కేంద్రీకరించలేదు?

చదువరి said...

ఒక బ్లాగరి చేసిన ఈ మాత్రపు పరిశోధన, పరిశీలనలో కొంతైనా.. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు ఎమ్పీలూ చేసి ఉంటే, బహుశా ఫ్లోరైడు సమస్య కొంతైనా తీరి ఉండేది. (అయితే, ఇప్పుడు ఆంద్రోళ్ళు అంద్రోళ్ళంటూ విషం చిమ్మే అవకాశం ఉండేది కాదనుకోండి.)
ఒక వాస్తవ సమస్యకు వాస్తవికమైన పరిష్కారం ఆలోచించకుండా, బాధ్యులైనవారు తమ బాధ్యతను పక్కవాడిమీదకు నెట్టేసి, తమ మెడల మీంచి కాడి పడేసారు. ఉద్యమంలో దీన్నీ, బాధితుల్నీ ఒక సమిధలా వాడుకున్నారు. అయినదానికీ కానిదానికీ అవతలోణ్ణి ఆడిపోసుకోకుండా తమకు చేతనైనంతలో శ్రమిస్తే సమస్యకు పరిష్కారం దొరికే ఉండేది. - ఈ టపా ద్వారా ఈ సంగతి స్పష్టంగా అర్థమౌతోంది.

పోతే, సమస్య ఎక్కడెక్కువుంది, ఎక్కడ లేదు, ఎంపీలాడ్స్ వాడాలా మరోటి వాడాలా - ఇలాంటివన్నీ సూపర్‍ఫిషియల్! బాధితులకు కావాల్సింది సత్వర పరిష్కారం -ఎలా ఇచ్చారన్నది కాదు. నాయకులకు ఉండాల్సింది చిత్తశుద్ధి -విత్తశుద్ధి కాదు.

--------

ఇప్పటివరకూ జలయజ్ఞం క్రింద కుదుర్చుకున్న ఒప్పందాలా విలువలో తెలంగాణా వాట 54% అంత, అంటే ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన 41050 కోట్లలో 22167 కోట్లు తెలంగాణాకే ఖర్చు పెట్టారంట, మరీ మాకు చుక్క త్రాగునీరు రాలేదు అది మొత్తం ఏమి చేసారు మీ సమైఖ్యంధ్ర గూండాలు అంతే, ఇదిగో ఇక్కడ ఇచ్చారు ఆ లెఖ్ఖలు, ఇంకా అనుమానాలు ఉంటే పొన్నాలని అడగాలి మరి, నన్ను కాదు.

Ref:
1.Bhagavan and Raghu .
2.Vaish and Vaish.
3.Partial Defluoridation of a Commnunity Water Supply By HS Horowitz.
4. Stats/Presentations provided by Nalgonda Collector to WB reps. on their visits.
5. Recollected info from people who visited Nalgonda as part of WB Team.
6.Utility of check dams in dilution of fluoride concentration in ground water Bhagavan SV
7.Prevalence of High Fluoride Concentration in Nellore (P.Jagan Mohan, SVL Narayana Rao, KRS Sambasiva rao)
8.www.irrigation.ap.gov.in

Saturday, September 11, 2010

రవిచంద్రకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

25 comments
అంతర్వాహిని ద్వారా మన అందరికీ సుపరిచుతులైన ఇనగంటి రవిచంద్ర శ్రీకాళహస్తీశ్వరుని సాక్షిగా నిన్న చి.ల.సౌ. నీలిమతో ఏడడుగులువేసి, వివాహ భంధంలో అడుగిడిన సంధర్భంగా అభినందనలు.



దంపతులు నిండు నూరేళ్ళు పవిత్రంగా, అన్యోన్యంగా, ఏ అరమరికలు లేకుండా కలిసిమెలిసి జీవించాలని, అష్టఐశ్వర్యాతో, సుఖ సంపదలతో, పిల్లాపాపలతో వారి ఇల్లు కళకళలాడాలని ఆశిస్తూ..




పెట్టిన రెండో రోజే ఘట్టిదెబ్బ తగిలినా,  ఇలాంటి దెబ్బలనే మెట్లుగా పేర్చుకుంటూ బ్ర.బ్ల.స. ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ..

Thursday, September 9, 2010

గ్రహాలపై భారం వేసి ముసుగుతన్ని పడుకుందాం

117 comments
అసలు పాకిస్తాన్లో వరదలు ఎందుకు వచ్చాయి? ఆ దేశ జనాభాలో దాదాపు ముప్పైశాతం మందికి తీరని ఆవేదనని నష్టాన్ని మిగిల్చిన వరదలు ఎలా వచ్చాయి, ఇది ఎదో గ్రహాల ప్రభావమా? ప్రకృతి శాపమా? మానవ తప్పిదాలు, స్వార్ధం ఎమీ లేవా?

ప్రస్తుత వరదలు, తమ తమ ఆస్థులు కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు పచ్చి స్వార్ధంతో, సామాన్య ప్రజలు కోట్ల మంది మరణించినా మాకేంటి నష్టం అనే స్వార్ధంతో చేసిన ఆక్రమణలు, నది దిగువ ప్రాంతాలలో ఉన్న తమ వేలాది ఎకరాల భూములు నీటమునగకుండా కొట్టిన గండ్లు కారణం, దీని గురించి మాట్లాడే ధైర్యం ఆ దేశంలో ఎవరికీ లేకపొవడానికి రెండు కారణాలు మొదటిది, ఆ గండ్లు కొట్టించినవారిలో సాక్ష్యత్తు దేశ ప్రధాని, అధ్యక్షులు, సైన్యంలో కీలకపదవుల్లో ఉన్నవారు కుడా ఉండటం.

దీనికన్నా ముఖ్యం మైనది, ఇది భారతదేశంలో రక్తపాతం సృష్టితున్న ముష్కరులకి వరదలు అనుకోని వరంగా మారడం, సహాయ కార్యక్రమాల పేరిట జమాత్-ఉద్-దవా (JuD) ప్రపంచ దేశాలలో కోటానుకుకోట్ల విరాళాలు సేకరిస్తున్నది, అవి అంతిమంగా ఎవరికి చేరతాయో తెలియంది కాదు, వరదలను ఒక అవకాశంగా తీసుకొని, తన సైన్యాన్ని, పాకిస్తాన్‌లో మూల మూలకు చొచ్చుకుపోయి ఉన్న తన నెట్వర్క్‌నీ ఉపయోగించుకొని, సహాయ కార్యక్రమాల పేరిట ఈ వరదలన్నీ భారతదేశం నిర్మిస్తున్న డ్యములవలనే అని ఒక అబద్ధాన్ని ప్రజలకి బుఱ్ఱలు తొలిచి మరీ పట్టించి, తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. ఇక మన మీద ఆత్మాహుతి దాడులు పెరగడమే తరువాతి, ఈ పరిణామాల వలన మన డ్యాములకి ఇప్పుడు అత్యంత ప్రమాదాం ఏర్పడుతున్నది. తమ తప్పులు ఎత్తని కారణంగా రాజకీయనాయకులు కూడా దీనిమీద ఏ చర్యలూ తీసుకోలేని పరిస్థితి (రేపు తమ పదవులకే ఎసరు పెడుతుందని తెలిసినా).

వరదల వలన, ఆ ముష్కరుల ప్రచారం వలన, మనం ఇప్పుడు పాకిస్తాన్లో దోషులుగా నిలబడ్డాం, ఇప్పుడు ప్రతి ఆత్మాహుతి దాడి వారికి ఆత్మరక్షణగా, మన సైన్యం చంపే ప్రతి ఉగ్రవాది వారికో ప్రత్యక్ష దైవంగా, ధర్మ రక్షకులుగా చిత్రీకరింపబడుతున్నారు..

ఇంత తీవ్ర పరిస్థితులని తమ జ్యోతిష్యం నిజం అని చెప్పుకోవడానికి, ప్రస్తుత పరిస్థితిని తమకి అనుకూలంగా, కేవలం గ్రహాల ప్రభావం వలన జరిగింది అని ప్రచారం చేసుకోవడం, ఆ ప్రచారాకిని అడ్డం వస్తున్నది అని నిజాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయడం.

ఆ ఉగ్రవాదులకు వీరికీ తేడా ఏమున్నదో మరి? నిజాన్ని దాచి చక్కగా దోచుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి హాయిగా వాడుకోవడం అత్యంత హీనం, దివాళాకోరుతనం.

ప్రతిదీ గ్రహాల మీదకో, నక్షత్రాలమీదకో నెట్టేసి నిజాన్ని తుంగలో తొక్కి పడుకుందాం ఏముంది, రేపు ఎవడో మనల్ని చంపో, ఏ ఆడకూతుర్నో మానభంగం చేసి, అది కేవలం గ్రహాల ప్రభావం అని తప్పించుకునే మార్గం కుడా మనమే కల్పిద్దాం..

రండి నా పోరాటంలో భాగం అవ్వండి, హత్యలు, మానభంగాలు కేవలం గ్రహాల ప్రభావమే, నిందితులని వదిలేసి గ్రహాలని నిందిస్తూ మనం ముసుగుతన్ని పడుకుందాం.

-------------------
అక్కడ తీసెవేసిన నా కామెంట్.

SNKR,

మీకు ఏమైన పిచ్చి పట్టిందా? మానవ తప్పిదాలను, ప్రకృతి ఘోరాలను గ్రహభలం మీద నెట్టేసి, అంతా దైవాధీనం అనుకునే స్థితికి దిగజారారా?
పాకిస్థాన్‌లో వరదలు యెందుకొచ్చాయా? నదీపరివాహ ప్రాంతాలని ఆక్రమించి, నది కరకట్టలను నాశనం చేసి ప్యాలెసులు కట్టుకోని, తరువాత తమ ఏస్టేట్లు మునిగిపోతే ఎలా, కోట్లాది ప్రజలు చస్తే తమకేంటి అని రాజకీయనాయకులు నదులకి గండ్లు కొట్టి సృష్టించిన వరదల్లో మీరు జ్యోతిష్యాన్ని వెతుకుతున్నారు? బాగున్నది, ఇదేదో ప్రతి అవినీతికి కుడా అన్వయించి, మర్డర్లు చేసినవాళ్ళని కుడా వదిలేద్దామా?

భూకంపం ఎక్కువగా వచ్చే ప్రమాధం ఉన్న న్యూజిల్యాండ్‌లో ఎప్పుడూ లేని భూకంపమ? ఏమి మాట్లాడుతున్నారు ఆ ముక్క చెప్పేముందు కనీసం సమాచారం సేకరించారా?

http://en.wikipedia.org/wiki/List_of_earthquakes_in_New_Zealand

ఇదిగో పైలంకె చూడండి, మేజర్ భూకంపాల లిస్ట్,
వాహ్, మానవ ప్రయత్నం మానేసి అన్నీ ఎదో గ్రహం మీదకి నెపం తోసేసి, మనం ముసుగుతన్ని పడుకుందాం.

-------------------

ఆలోచనా తరంగాలలో ఎదో గ్రహప్రభావం వలన పాకిస్తానులో వరదలు వచ్చాయి అని వారు చెప్పిన దానికి నిజం చెప్తూ వ్రాసిన నా కామెంట్ ని తీసేస్తే, తన మోసానికి నిజం అడ్డంకి అని నిజాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తే నిజం దాగుతుందా?

Wednesday, September 1, 2010

దిగజారుడుతనం ఎవరిది?

40 comments
పూరిపాక విరచిత అరికాల్లో ఆవగింజ టపాలో కొందర్కి చాలా హేయమైన వాఖ్యాలు కనపడ్డాయి. అది భారత దేశ రాజ్యాంగాన్ని, భారతదేశ గొప్ప గొప్ప నాయకుడ్ని పేరడి చేసి, చాలా అవమానించారు అని తెగ భాధ పడిపోతున్నారు.

--ఇంతలో సరసాల వర్మ నుంచి ఏదో వీడియో క్లిప్ వచ్చింది. ఓపెన్ చేసి చూసాను. ముందుగా కార్క్సూ, జీంగిల్స్ వీళ్ళ స్పీచులు, తర్వాత లంబోద్గారుల స్పీచులు వీటి తర్వాత "నీ దారి అడ్డదారి పోవోయి తీటసారి.. జయించు కోర్టు కేసు.. " --

ఇది వారికి తీవ్ర అభ్యంతరం కలిగించింది.., వారు ఒక నాయకుడ్ని, భారత రాజ్యాంగాన్ని అవమానించారు అని నిశ్చయించుకున్నారు. పోనీ అది ఆ రచయితని ఆ నాయకుడ్ని దృష్టిలో పెట్టుకొని వ్రాశాడో లేదో ప్రస్తుతానికి పక్కన పెడదాం. కానీ దీనిలో, ఆ టపాలో భారత రాజ్యాంగాన్ని తిడుతూ ఎదో అన్నట్టు నాకు కనపడలేదే? అంటే వాళ్ళ వాదనలో బలం రావడానికి వారే కల్పించుకున్నారా?
లేక ఆ నాయకుడ్ని ఏమైనా అన్నచో అది రాజ్యాంగానికి అన్వయించుకోవచ్చా?
అప్పుడు గాంధీని ఏమైనా అన్నచో అది యావద్భారతావనినే అవమానించినట్ట?
నెహ్రూని ఏమైనా అన్నచో అది పార్లమెంటుని అవమానించినట్టా?
జస్టిస్ బాలక్రిష్ణన్‌ని ఏమైనా అన్నచో అది న్యాయవ్యవస్థని అవమానించినట్టా?
కే.సి.ఆర్.ని ఏమైనా అన్నచో అది తెలంగాణా ప్రజలని అవమానించినట్టా?
కంచి శంకరాచార్యని ఏమైనా అన్నచో అది హిందూ జాతిని అవమానించినట్టా?

ఇంకా నాకు తెలియని విషయం ఏంటి అంటే అది అంబేడ్కర్ లేక రోసా లగ్జెంబర్గా? వేరెవరైనానా? వివరణ తీసుకునే ప్రయత్నం చేశారా? పోనీ తమకి నచ్చలేదు, లేక అపార్దాలకి తావిచ్చేవిధంగా ఉన్నది మార్చమని అడిగారా? లేదు, ఎక్కడ ఎవరి మీద బురద చల్లుదామా అని కాసుకుర్చుంటారు..ఎదో పేరు వాడుకోగానే, ఇంక అది తమ నాయకుడ్ని అవమానించినట్టే.., ఆటోమేటిక్ గా, భారతదేశ రాజ్యాంగాన్నో, ఆ నాయకుడి కులస్తులని అవమానించినట్టే..వీళ్ళకి బురద జల్లటానికి అవకాశం దొరికినట్టే.

దేశ రాజ్యాంగాన్నీ కూడా తమ రొచ్చులో నిర్లజ్జగా వాడుకోవడం బహుశా క్షణికావేశంలో జరిగి ఉండవచ్చని
ఆశిస్తున్నాను.కాని పక్షంలో వీళ్ళకు, ఇలా ఉన్నవీ లేనివీ కల్పించి ఆడుకోవడం అలవాటేలే అని ఊరుకోవాలా?

దేశ నాయకులూ, రాజ్యాంగమూ విమర్శలకు అతీతం కాదు. కానీ ఆ విమర్శలు విషయం మీద జరిగితే ఆహ్వానించవలసిందే. కానీ ఇదేంటి, వీళ్ళు చేసుకునే పనికిమాలిన పనుల కోసం, చెత్త గొడవల కోసం దేశ నాయకులనీ రాజ్యాంగాన్నీ వాడుకోవడం ఎంతవరకూ సబబు?

కే.సి.ఆర్.ని ఇది అనగానే, తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బ తీశారు అని, అంబేడ్కర్ ఈ తప్పు చేశాడు అంటే ఎక్కడ వీళ్ళు దళితులని అవమానించాడు అనో, ఇలా రాజ్యాంగాన్ని అవమానించాడు అనో గొడవేసుకుంటారు అనే భయంతో, వారికి నచ్చిన వారు ఏది చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందేనా?

నిజంగా పురిపాక అవమానించాడో లేదో నాకు తెలియదు కానీ, వీళ్ళు మాత్రం ఇలా తమ అవసరం కోసం వారి వారి పేర్లు, భారత రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజలని ఎవరో అవమానించినట్టు చూపించడానికి వీరు చక్కగా అవమానిస్తున్నారు.

Thursday, August 19, 2010

ఈనాడు చైనా పత్రికా?

11 comments

ఇది ఈరోజు ఈనాడు (ఆన్‌లైన్ ఎడిషన్ లో కనిపించిన)లో ప్రచురించిన పటం.

ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన "న్యాయ పోరాటంలో భారత్ విజయం" లో ఇచ్చిన భారతదేశ పటం చూడగానే ఒళ్ళు మండి పోయింది, ఈ విధంగా మన దేశ సరిహద్దును మార్చటం ఈనాడుకి కొత్తేమీ కాదు పూర్వం భూటాన్ గురించి ప్రచురించినప్పుడు ఈవిధంగానే కాశ్మీర్‌ని పాకిస్తాన్‌తో కలిపేశారు, తరువాత హాకీ ప్రప్రంచకప్ గొడప్పుడు, ఆ తరువతా పోయిన మార్చిలో, మళ్ళీ ఇప్పుడు...ఇప్పుడు కొత్తగా అరుణాచల్‌ప్రదేశ్ ని కుడా చైనా భారతదేశ పటాన్ని ఎలా ప్రచురిస్తుందో, అదే తీసుకొచ్చి వేశారు..
ఇదే విషయం పై సుప్రీం కోర్ట్ పూర్వం ఇలా వివాదాస్పదంగా భారతదేశ సరిహద్దుని ప్రచురించటం క్రిమినల్ చర్యే అని, పత్రికలు ఇలాంటి వాటికి పూనుకోవద్దను సూచిస్తూ ఇదివరకే తీర్పు ఇచ్చింది, కాబట్టి, ఈనాడు సుప్రీం కోర్ట్ ని కుడా ధిక్కరించింది..
ఇప్పటికి చాలా సార్లు ఈనాడుకి ఫోన్(ఈనాడూ సోమాజీగూడ కార్యాలయానికి) చేసి చెప్పినా తన ధోరణి మార్చుకోలేదు. కానీ ఈనాటి ఆ పటం మార్పు ఈనాడుకి పెద్ద శిక్ష పడేవిధంగా లేదు, కావున న్యాయపోరాటానికి ప్రస్తుతం పూనుకోవటం లేదు. పూర్వం క్రిమినల్ కేస్ పెట్టినా అది ఏమయ్యిందో పట్టించుకోలేని విధంగా సమస్యలు చుట్టుముట్టడం వలన ఈనాడును కోర్ట్‌కీడ్చలేకపోయాను. మాళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని పాక్‌లో భాగంగా చూపించే ధైర్యం చేస్తే మాత్రం నేను ఊరుకోను.

Wednesday, August 4, 2010

జ్యోతిష్యంలో సైన్సు...

75 comments
సైన్సు: గ్రహాల ప్రభావం మనుషుల మీద తప్పక ఉంటుంది, అసలు జ్యోతిష్యం పెద్ద సైన్సు, కావాలంటే చూడు పౌర్ణమి రోజు పిచ్చి పెరుగుతుందని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు...

అసైన్సు: నిజమా?? ఏ డాక్టరు? జోతిష్యం వేరు సైన్సు వేరు, గ్రహాలు ఎక్కడ ఉన్నాయో(coordinates) అని చెప్పేది వేరు, గ్రహాలు ఏమి ప్రభావం చూపిస్తాయో వేరు, అన్నీ ఒకటే అని చెప్పటమే పెద్ద చతురు. అసలు మనం తర్కంతో వాదన ఎందుకు, మన లెఖ్ఖలు మనకుంటేను.

న్యూటన్ సిద్దాంతం ప్రకారం ఎదైనా రెండు వస్తువుల మధ్య వుండే ఆకర్షణ F = Gm1m2/ r2 N kg2 m-2 .

ఇప్పుడే పుట్టిన శిశువుని తీసుకుందా, శిశువు ౩కే.జీ. బరువు ఉంటే, ఆ శిశువు పై మన నవ గ్రహాలు చూపించే శక్తి ఎంతో చూద్దాం.

అంకెలలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, గ్రహాల మధ్య దూరం సమానంగా ఉండదు, నేను థియరీ ప్రకారం భూమికి అత్యంత దగ్గిరగా వచ్చినప్పటి దూరాన్ని ప్రామాణికంగా తీసుకున్నాను. ఇప్పుడు కుజ గ్రహాన్నే తిసుకుంటే అది పది లక్షల సంవత్సరాలకి ఒక్క సారి భూమికి అత్యంత దగ్గిరగా(55 లక్షల కిలోమీటర్లు ౨౦౦౩) వస్తుంది, కానీ నేను ఎప్పుడూ 55 లక్షల కిలోమీటర్లు దూరంలొనే ఉన్నట్టు తీసుకున్నాను, దీనివలన ఆ గ్రహ బలం ఎప్పుడూ అత్యంత ఎక్కువగా ఉంటుంది.


గ్రహం శిశువుపై ప్రభావం (న్యూటన్ లలో)

సూర్యుడు 0.011,78

చంద్ర 0.000,099,5

కుజ 0.000,000,042,47

బుధ 0.000,000,011,5

గురు 0.000,000,47

శుక్ర 0.000,000,674,9

శని 0.000,000,079,354,52

ఈ లెఖ్ఖన అత్యంత బలమైనది సూర్యుడు>చంద్ర> శుక్ర> గురు> శని> కుజ> బుధ.
మరి రాహు, కేతువులకి అసలు శక్తి లేదు, ఎందుకంటే వాటికి ద్రవ్యరాసి(మాస్) నున్నా కదా..

సరే పిల్లోడు పుట్టేటప్పుడు, అక్కడ తల్లి, ఇంకో ౩ సహాయకులు ఉన్నారు అనుకుందాం.. వారి సగటు బరువు 60 కేజి. ఐతే, వారి బలం శిశువుపై 0.000,000,048 (సగటు దూరమ్ ౩ అడుగులు అనుకుంటే), అంటే ఇది కుజ, బుధ గ్రహాల కన్నా ఎక్కువ.

అదే శిశువు పుట్టింది పెద్ద హాస్పిటల్‌ల్లో ఐతే, ఆ హాస్పిటల్, దానిలోని మనుషుల ప్రభావం చాలా ఎక్కువ, సరదాకి శిశువు పుట్టిన గది 15x15 అడుగులది ఐతే, దాని ప్రభావం 0.000,000,022 (వెయ్యి కేజిల బరువు ఉంటే) అంటే బుధ గ్రహం కన్నా శక్తివంతమైనది, అదే ఆ హాస్పిటల్, ఆ ఊరిలో ఉన్న చెట్లు, చేమలు, ఇల్లు, ఈగలు, దోమలు అన్నీ పరిగణించి చుస్తే (ఒక కి.మీ. దూరంలో ఉన్న సమస్తం పది లక్షల కే.జీ. ఉంటే) వాటి బలం 0.000,000,200 (దాదాపుగా), అంటే శని కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి..

ఇలా మనం అన్నీ ఒక్కోటిగా పరిగణలోకి తీసుకునే కొద్దీ వాటి ప్రభావం పెరుగుతుంది (భూమి ఆకర్షణ దాదాపు 10 కదా మరి).
అంటే ఎక్కడో వున్న గ్రహాల కన్నా మన చుట్టు ఉన్న పరిసరాల ప్రభావమే మన మీద ఎక్కువ ఉన్నప్పుడు, వీటిని పరిగణలోకి ఎందుకు తీసుకొనరు జాతకంలో?

మనిషి పెరిగే కొద్దీ గ్రహ ప్రభావం కుడా పెరుగుతుంది కదా మరి, అలాంటప్పుడు పుట్టినప్పటి గ్రహ ప్రభావమే ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు?

సరే స్థల ప్రభావం చుస్తే, భూ మధ్య రేఖ దగ్గిర భూమి వ్యాసం (డయామీటర్) 12756కి.మీ. ఐనా సూర్యుని ప్రభావం ఎక్కడో ఇరవయ్యో స్థానం లో మార్పు వస్తున్నది, (నా క్యాలుక్యులేటర్ ఆ పరిధిలో లేదు), మిగతా గ్రహాల సంగతి చెప్పక్కరలేదు. మరి ఐతే ఒకే సమయంలో పుట్టినవారు అందరూ ఒకే విధమైన ప్రభావాన్ని ఎదుర్కోంటారు కదా, మరి తేడాలేల??

సరే మరి ఈ ప్రభావం కాదు, రేడియేషన్ అనుకుందామనుకున్నా అది లెక్కేయ్యటానికి సూపర్ కంప్యుటర్ కావాలి. (సూర్యుని లెక్క ఇదివరకే ఇచ్చాను), ఐనా ఆ గ్రహాల కన్నా ఇంట్లో బల్బే ఎక్కువ రేడియేషన్ వదులుతుంది మన మీద..

భౌతిక ధర్మాలు అన్నీ అందరి మీదా సమానంగానే పనిచేస్తాయి, మరి అలాంటప్పుడు ఒకరికి రాహువు పదవి ఇస్తుంది, ఇంకోరికి రాహువే పెళ్ళి చెస్తాడు, మరి దానివెనుక ఏ భౌతిక సూత్రాలు ఉన్నాయి మరి?
ఒక గ్రహం కడుపుకి అధిపతి, ఇంకో గ్రహం గుండెకి అధిపతి, ఏ వైద్య శాస్త్ర ప్రమాణాల ప్రకారం?

వీటన్నిటికీ సమాధానం సైన్సులో ఐతే లేదు మరి, తర్కం లో ఉన్నదెమో, లేక నమ్మకంలో ఉన్నదెమో, కానీ జ్యోతిష్యం లో సైన్సు సున్నా..

కాబట్టి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, ఇలవేల్పులౌతారు.. అది మాని జాతకం అని కృషిని మరువకండి.

dhurabhimani గారి గోపాళం అండ్ కో ఎక్కాల పుస్తకం సౌజన్యంతో.

తర్కం ప్రయోగించి ఇచ్చే ప్రశ్నలకి జవాబులు నా నుంచి ఆశించకండి..ఎదైనా వెరే లెఖ్ఖలు ఉంటే మాత్రమే చెప్పండి, నేను తర్కబద్దంగా వాదించలేను..

మీకు ఇతర సాంకేతిక వివరాలు కావాలి అనుకుంటే నాకు ఒక ఉత్తరం పడెయ్యగలరు.

Monday, July 26, 2010

మార్తాండ కొన్ని నిజాలు.

123 comments
1. మార్తాండ ఉల్లిపాయల్ని ఏడిపించగలడు.
2. మార్తాండ రీసైకిల్ బిన్‌ని కుడా డిలీట్ చేయగలడు.
3. మార్తాండ వర్షంతో మంచు మనిషిని చేయగలడు.
4. మార్తాండ వైర్‌లెస్స్ ని కుడా తెంపగలడు.
5. మార్తాండ చేపలని కుడా నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేయగలడు.
6. మార్తాండ సాధారణంగా చీకట్ని ఆర్పేస్తాడు, లైట్ వేస్తె థర్మల్ కరెంట్ వాడుకోవాలని.
7. మార్తాండ తన వేలితో గుండు విసిరి ఫ్రెంచ్ విమానాన్ని కూల్చాడు.
8. మార్తాండ చేతి గడియారం వాడడు, తానే సమయాన్ని నిర్దేశిస్తాడు.
9. మార్తాండ న్యూటన్ సూత్రాలని నమ్మడు, కాబట్టి న్యూటన్ లేడు.
10. అమెరికాకి ఇరాక్ లో సామూహిక జన హనన ఆయుధాలు దొరకలేదు, ఎందుకంటే మార్తాండ చిక్కోలంలో ఉంటాడు.
11. థీరీ ఒఫ్ ఎవల్యూషన్ అంతా ఉత్తిదే, మార్తాండ వదిన వాదం అర్ధంకాని జీవులు బతికున్నాయి అంతే.
12. మార్తాండ మృత సముద్రాన్ని చాంపేసాడు.
13. మార్తాండ సున్నా నుంచి అనంతం వరకు లెఖ్ఖెట్టాడు, ఒక్కాసారి కాదు రెండు సార్లు.
14. మార్తాండ రెండు రాళ్ళని ఒకే పక్షితో చంపగలడు.
15. మార్తాండ బ్యాక్టీరియాని తన్ని తరిమేయగలడు.
16. లోకేష్ బైక్ నుంచి కార్ తయారు చేస్తే, మార్తాండ సైకిల్ నుంచి మోటర్ కార్ తయారు చేసాడు.
17. మార్తాండ అద్దంలో చూసుకుంటే అద్దం పగిలిపోతుంది, మార్తాండకి మార్తాండకి మధ్యలోకి అది వస్తుందా, హన్నా
18. మార్తాండ ఒకే బంతికి యువరాజ్ ని 6 సార్లూ బంతితో సహా ఊరి బయటకి కొట్టగలడు.
19. పై చిట్ట చివరి అంకే మార్తాండ, మార్తాండ అంటే యుగాంతం.
20. పూర్వం ఒక పాము మార్తాండని కఱిచి, వారం రోజులు నరకయాతని పడి (అన్న కధలు విని) చచ్చిపోయింది.
21. మార్తాండ హ్యాంకాక్‌నీ 2008 లో గాల్లోకి విసిరాడు, 2 సంవత్సరాల తరువాత నిన్నే తిరిగి భూమ్మీద పడ్డాడు.
22. గ్లోబల్ వార్మింగ్ ఏమీ లేదు, మార్తాండ కధలు చదివి మన బుఱ్ఱలనుంచి వచ్చే వేడి అది.
23. మార్తాండ అమావాస్య రాత్రి చంద్రుడి కాంతితో నిప్పు రాజేయగలడు.
24. మార్తాండ 20. నిముషాల్లో 60 నిముషాల్ని చూడగలడు.
25. మీరు ఎక్కడ ఉన్నా, మార్తాండ మిమ్మల్ని చంపగలడు, మీ కంప్యూటర్లముందు.
26. మార్తాండ పోన్ లేని వారికి కూడా SMS పంపగలడు.
27. మార్తాండకి గుండె పోటు ఎప్పుడూ రాదు, గుండెకి ఎన్ని గుండెలున్నా మార్తాండని పొడవగలిగే ధైర్యమా?
28. మార్తాండ గాలిని పీల్చడు, గాలిని బందిస్తాడు.
29.మార్తాండ రోడ్ దాటేటప్పుడు కార్లు రెండు వైపులా చూసుకుంటాయి.
30. మార్తాండ అన్ని అంశాల్లోనూ ఒలింపిక్స్ బంగారు పతకం సాదించాగలడు.
31. మార్తాండకి మరణం లేదు, మరణించినా 5ని. మళ్ళీ బతకగలడు.
32. చిక్కోలంలో ఏవీ గంతులేయవు, పాకుతాయి అంటే, మార్తాండ ముందు కుప్పి గంతులా.

ఇంత గొప్ప మార్తాండని కలవాలి అంటే, gmail@sahityaavakaram.gen.in కి మైల్ చేసి, సమయం నిర్దేశించుకోగలరు (మీ చావుకి), ఇంకా తొందరగా ఉంటే, మొన్నా ఆత్మహత్య చేసుకున్న ఉతూతి బ్లాగిణి గారి లాగా, ఫోన్ చేయండి.

మరీ అసైన్సు ఐతే బోర్ అని, సరదాగా...
మీరూ తలా నాలుగు చెప్పి పుణ్యం మూటగట్టుకోగలరు.

సోర్సు: http://www.chucknorrisjokes.net/

Monday, July 19, 2010

ఓట్స్ కొన్ని అపోహలు

47 comments
ఓట్స్ ప్రకృతి మనకి ప్రసాదించిన ఆహారం, దాన్ని ఎదో చెడుగా ప్రస్తావించాలి అని నేను ప్రత్నించటం లేదు. కానీ అదే ఒక పెద్ద పరమౌషదం అని అంటే మాత్రం నేను ఒప్పుకోను.

ఓట్స్ పై వున్న కొన్ని అపోహలు, అసైన్సు ఇప్పుడు చూద్దాం. ( మనం ఆహారం కొలిచే విధానం/ వాటి పౌష్టికత గ్రాములు/ గ్రాములు కాకుండా గిద్దెడు/గ్రాములు ఐతెనే సరైనది అని తేలింది కావున అదే వాడుతున్నాను, గ్రాముల ప్రస్తావన ఇప్పుడే తేవొద్దు అని మనవి,ఇప్పుడే. గిద్దెడు బియ్యం, గిద్దెడు కంది పప్పు అని కొలుస్తామే తప్ప 100గ్రాముల బియ్యం తో 100 గ్రాముల కందిపప్పు పోలిక సరైనది కాదు. )

అపోహ(అ): ఓట్స్‌లో పీచు పదార్ధాలు ఎక్కువ.
అసైన్సు (అసై): ఇది పడమటి దేశాలవారికి చెల్లుతుందెమో, సగటు మనిషికి 30-40 గ్రాముల పీచు (ఫైబర్) అవసరం, కానీ అమెరికాలో సగటు మనిషి రోజుకు 4-10 గా. పీచు మాత్రమే తీసుకుంటున్నాడని ఒక సర్వేలో తేలింది, దీన్ని అవకాశంగా తీసుకొని ఓట్స్ ని ఆ దేశంలో బాగా మర్కెటింగ్ చేసుకుంటున్నారు. గిద్దెడు ఓట్స్ లో వుండేడి సుమారు 14.4 గ్రాముల పీచు పదార్ధాలు.
మరి మన రోజువారీ ఆహారంలో వేటిలో ఎంత ఉంటుందో చూద్దామా, గోధుమ రవ్వ ( 25.6), వేరుశనగ( 21), బీన్స్ (చిక్కుడు గింజలు)*(19.1) , శనగలు, కందిపప్పు (16.3) , (13.2 గ్రా), బియ్యం (ముడి 3.5), పెసలు (15.4), మినుములు (15)...
*వీటిని ఎవరైనా రొజూ తీసుకుంటున్నారా తెలియజేయగలరు.

అ: బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ మంచి ఆహారం, ఓట్స్ జీర్ణవ్యవస్ధ సక్రమంగా పనిచేయడానికి సాయపడుతుంది, అంతేగాక రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంచుతుంది.
అసై: ఇది అంతా (నీటిలో కరిగే) పీచు పదార్ధాల మహిమ, ఇవి జీర్ణప్రక్రియ నిదానంగా జరుగుటకు దోహద పడతాయి, దాని వలన ఒకే సారి ఎక్కువ శక్తి రక్తంలోకి ప్రవేశించకుండా, మెల్లగా, తక్కువ మొతాదులో చక్కెర రక్తంలోకి ప్రవేశించేలా చేయటం వలన ఎక్కువ సేపు పొట్ట నిండుగా వున్నట్టు ఉండి ఎక్కువగా ఆకలి వెయ్యదు, చక్కెరా ఒకేసారి రక్తంలోకి విడుదల అవ్వదు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచిది. ఎక్కువ ఆకలి వెయ్యదు కాబట్టి ఆహరం తక్కువ తీసుకునే అవకాశం ఉన్నది, కానీ వ్యాయామం లేకుండా బరువు తగ్గినా కొలెస్టరాల్ తగ్గదు కాబట్టి, ముప్పు పూర్తిగా తొలిగిపోయినట్టు కాదు, వ్యాయామం చాలా అవసరం.

అ: ఓట్స్ లో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది, గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది.
అసై: కొలెస్టరాల్ అసలు శాకాహారంలో ఉండదు, అది మాంసాహారం ద్వారానో, లేక నెయ్యి, వెన్న, ఇతర పాల ఉత్పత్తులలో ఎక్కువగా ఉంటుంది. కొలెస్టరాల్ లో మంచి, చెడు కొలెస్టరాల్లు ఉన్నాయి, నీటిలో కరిగే పీచు పదార్ధాలు చెడు కొలెస్టరాల్ ని తగ్గించి, మంచి కొలెస్టరాల్ని పెంచుతుంది. ( అలా కాదు మంచి కొలెస్టరాల్ కుడా తగ్గుంతుంది అనే వాదన కుడా బలంగా వినిపిస్తున్నది, ఓట్స్ మంచి కొలెస్టరాల్ కి హాని చెయ్యదు అనే వాదన సశాస్త్రీయం కాదు, ఇది ఒక పుకారే).
కొలెస్టరాల్ తగ్గటం వలన గుండెకి రాబొయే ముప్పు తగ్గినట్టే, కానీ అది గుండె జబ్బులని తగ్గించదు.
అసలు వ్యయామం లేకుండా, ఆహారం ద్వారా కొలెస్టరాల్ స్థాయిల్లో చెప్పుకోదగ్గ మార్పు ఉండదట.
భారతీయులకి కొలెస్టరాల్ హానికలిగించే స్థాయిలో ఉండటానికి, గుండె జబ్బులు రావటానికి ఎక్కువగా నెయ్యి, వెన్న, ఎక్కువ వెన్న శాతం కలిగిన పాలు తీసుకోవటం అని ఎనభైల్లో ఒక అమెరికా డాక్టర్ రీసెర్చ్ చేసి చెప్పారు(ఎక్కువమంది శాకాహారులం కాబట్టి), అప్పటికీ, ఇప్పటికీ మాంసాహారం తిసుకోవటంలో చాలా పెద్ద మార్పే వచ్చిన కారణంగా, పూర్వంతో పోల్చుకుంటే నెయ్యి వాడకం చాలా తక్కువ అయ్యింది, కానీ పంచధార వాడకం ఎక్కువ అవటం వలన (పంచధార వాడకానికి రక్తంలో కొలెస్టరాల్ స్థాయి పెరగటానికి సంబంధం ఉన్నది అని తేలింది) ఇప్పుడూ వెన్న, నెయ్యి వలనే అని చెప్పలేము. .

అ: ఓట్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
అసై: ఓట్స్‌(4 మి.గ్రా.) కన్నా ఐరన్ ఎక్కువ ఉన్న పదార్ధాలు, ముడి ఉత్తరాది బియ్యం (9.73)*, దక్షిణాది ముడి బియ్యం (8), బీన్స్ (7.8), పెసలు, మినుములు, ( 6.6), గోధుమలు ( 6.04), మొలకెత్తిన శనగలు(6మి.గ్రా - కానీ ఉడకపెడితే అది 2మి.గ్రా కి పడిపోతుంది), ఇలా చాలా వున్నాయి. ( నేను విటమిన్ ఎన్‌రిచ్చ్‌డ్ ఓట్స్ గురించి చెప్పటం లేదు, ఓట్స్ తవుడు సంగతి కాదు, ఓట్స్ గింజల గురించి, మాత్రమే రాసాను, విటమిన్ ఎన్‌రిచ్చ్‌డ్ లొ ఐతే 10.55, ఓట్స్ తవుడులో 5.1 మిగ్రా ఐరన్ ఉంటుంది, మనం వాడే ఇన్‌స్టంట్ ఓట్స్‌లో 2.11మి.గ్రా. మాత్రమే ).
కూరగాయలను, పండ్లను ఇక్కడ ప్రస్తావించటం లేదు, పోలిక సమజసంగా ఉండదని, 100 గ్రా. పాలకూరలో 16 మి.గ్రా., కరివేపాకులో దాదాపు 60 మి.గ్రా. ఐరన్ ఉంటుంది, (కరివేపాకును మరీ చులకనగా చూడకండి)
* ఈ ఉత్తరాది బియ్యం మరి నేను ఐతే దక్షిణంలో ఎక్కడా చూడలేదు, అందుకే ప్రత్యేకించి ఉత్తరాది అని వాడాను, బియ్యం చూడటానికి మాములుగానే ఉంటుంది, కానీ ఉడికాక పొడుగ్గా, కొంచం ముద్దగా, సన్నగా (కొద్ది మార్పులతో చైనా రకం లా ఉంటుంది)

అ: ఓట్స్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
అసై: (55 మి.గ్రా.) కన్నా క్యాల్షియం ఎక్కువ ఉన్న పదార్ధాలు, పాలు (430 మి.గ్రా.), పనీర్ (509)*, పెరుగు (415), వెన్న తీసీన పాల పెరుగు ( 217), బీన్స్ (191), వేరుశనగ (184) పిజ్జా (63గ్రా. 113మి గ్రా), శనగలు (94), బంగాళ దుంప (88), ఓట్స్ (55).
* పనీర్ కి ఎక్కువ పాలు అవసరం కావున పాల తరువాతి స్థానం ఇచ్చాను- బాలేదా.
పాలకూరలో (245మి.గ్రా) క్యాల్షియం ఉంటుంది.

అ: ఓట్స్ లో క్యాల్షియం, ఐరన్ రెండూ ఎక్కువగా ఉండటం వలన డబుల్ ధమాకా.
అసై: ఇది పెద్ద ఏడుపుగొట్టు కాన్సెప్ట్, అబద్ధం 10 సార్లు చెప్తే అదే నిజమవుతుంది అనట్టు, నాన్ హీం* ఐరన్ని మన శరీరం గ్రహించటమే కష్టం, ఐరన్ని క్యాల్షియం తో కలిపి తిసుకోవటం వలన, ఇంకా చాలా తక్కువ గ్రహిస్తుంది మన శరీరం, అందులోనూ ఐరన్ గ్రహింపటానికి సహాయం చెసే విటమిన్ సి అసలు ఉండదు కాబట్టి, రెండూ కలిసి ఉండటం వలన చాలా ఐరన్ని మన శరీరం గ్రహించలేదు.
* నాన్ హీం మొక్కల నుంచి వచ్చే ఐరన్
కాబట్టి, గోధుమ, వరి అన్ని విధాలా మేలు (వరి లో పీచు తక్కువ కదా అంటారా, అది రాబొయే టపాలో), గోధుమ సరిపడని వారికి ఓట్స్ ఉపయోగకరమే యెందుకంటే అది ముఖ్య ఆహార పంట, అలనే మనకి సజ్జలు, జొన్నలు ఉన్నాయి కదా మరి.(గోధుమ సరిపడకపొతే). కానీ ఓట్స్ రష్యాలో గోధుమ సరిపడని వారికి అమృతమే. (బార్లే ఓట్స్ లాగా తినగలరా?)

మరి బరువు తగ్గాలి అనుకునే వారు, ఓట్స్ ఇచ్చే శక్తిని చూడండి మరి.
ఓట్స్ (404 కి.కెలరీలు), బియ్యం ( 370), గోధుమ (407), వేరుశనగ (525),శనగలు (675), బీన్స్ (295), పెసలు (235).

తరువాత కొత్తగా క్యాన్సర్ తో పోరాడే బీటా గ్లుకన్‌లను పరిగణించలేదు, ఎందుకంటే అవి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి అని ఐతే ఇతమిద్దంగా తేలలేదు, కానీ క్యాన్సర్‌తో పోరాడగలదు అని మాత్రం ఋజువయ్యింది. ఇంకా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరగటం లేదు, అందులోనూ మిగతా గడ్డి పంటల్లో లేకుండా బార్లే, ఓట్స్‌లోనే ఉండటం కుడా సాధ్యపడదు, కానీ వాణిజ్య పరంగా ఐతే మాత్రం ఓట్స్, బార్లే నుంచే తయారు చేస్తున్నారు.
అలాగే నీటిలో కరుగని పీచు, వేరుశనగల్లో ఉండే బిటా గ్లైకో లాంటి పదార్ధాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి, వాటి గురించి తెలుసుకున్న వాటి కన్నా, తెలుసుకోవలసినదే ఎక్కువ అందుకనే వాటి గురించి ప్రస్తావించలేదు.

పైన చెప్పిన లెఖ్ఖలు ఆయా పంటలు పొలం నుంచి వచ్చాక ఎంత తక్కువ మార్పులతో తినటానికి వీలు అవుతుందో ఆ పౌష్టిక విలువని ప్రామాణికంగా తీసుకున్నాను, ఉదాహరణకి పాలిష్ పట్టని బియ్యంలో పిచు 3.5గ్రా. అదే పాలిష్ పట్టాక అది 0-0.6గ్రా. చేరుతుంది, అలా కాకుండా వరి వరిగా లెఖ్ఖ వేసుకుంటే ఇంకా ఎక్కువ ఐరన్, ఎక్కువ పీచు ఉంటుంది, కానీ వడ్లని మనం తినలేము కావున, అవి పరిగణనలోకి తీసుకోలేదు, అలానే మనకి వచ్చే రెడీటు ఈట్ ఓట్స్లో ఉండే చక్కెరని, ఐరన్ని, క్యాల్షియంని తీసుకోలేదు, మరియు, విటమిన్ ఎన్‌రిచ్చ్‌డ్ సంగతీ మాట్లడలేదు.

అమెరికా వారికి బీన్స్ సరిపడకపొతే ఓట్స్ చాలా మంచిదెమో, నాకు అక్కడ విషయాలు పెద్దగా తెలియవు, కానీ మనకి మనం మన ఆహారమే సరిగ్గా తిసుకుంటే సరిపోతుందెమో, ముడి బియ్యంతో అన్నం పొద్దున్నే కష్టం అనిపిస్తే, మొలకెత్తిన పెసలో, వేరుశనగో, శనగలో, ఇవి ఇంకా మంచివి కదా, చక్కగా శనగ కూరతో చపాతీ.. ఇన్ని ఉన్నాయి కదా..

నేను ఇచ్చిన అంకెలు కొద్దిగా కొత్తగా ఉండొచ్చు, దానికి కారణం నేను ఎంచుకున్న పద్దతి, మన పళ్ళెంలోకి వచ్చేసరికి, ఇవి ఎలా ఉంటున్నాయో తరువాతి టపాలో.

Sunday, July 18, 2010

ఓట్స్ కొన్ని నిజాలు

6 comments
నేను ఎదో ఆయుర్వేదమే సరైన వైద్యం, AIDS ని మూలికలు కుడా తగ్గించగలవు అని నమ్మే రకం కాదు.
కానీ కొన్ని సహేతుకమైన కారణాల వలనే నేను భారతదేశంలో ఓట్స్ వాడుకకు వ్యతిరేకం.

ఓట్స్ వాడకం వలన మనకి లాభం కన్నా అన్ని విధాలా నష్టమే అని, పాఠకులను చైతన్య పరచటమే నా ఉద్దేశం తప్ప దీనిపై ఎవరి మీదా వ్యక్తిగత కక్ష లవలేశమంతైననూ లేదు అని మనవి చేసుకుంటున్నాను.
ఒకటే టపా అంతే మరీ పెద్దది ఐపోతుంది అని నాలుగు భాగాలుగా రాద్దామనుకుంటున్నాను.
1. ఓట్స్ కొన్ని అపోహలు
2. ఓట్స్ కన్నా పౌష్టికరమైన మనం రోజువారీ వాడే ఆహార పదార్ధాలు.
3. మన వ్యవసాయం - ఆర్ధిక, పర్యావరణ హాని - పాలకుల మొద్దు నిద్ర
4. ఓట్స్ సాగు -- పర్యావరణ, ఆర్ధిక అంశాలు, రైతులకి, వ్యవసాయానికి, పేదలకి, ఆహార పంటలకు కలిగే కీడు.

ఒక్క ఓట్స్ కే నేను వ్యతిరేకమా అంటే, కాదు, కానీ మిగతా వాణిజ్య పంటలు మన ఆహార భద్రతకు కలిగించే హాని తక్కువ, కానీ ఓట్స్ అలా కాదు, అందుకే నేను ఓట్స్ వ్యతిరేకిని. (భారత దేశంలోనే సుమా, అమెరికాలో కాదు, ఇండోనేషియాలో కాదు, రష్యాలో కుడా కాదు, ఒక్క మన దేశంలోనే).

మొదటి రెండు భాగాలలో ఏది ముందు రాయాలో తెలియటం లేదు, మరి మీ సలహా.

Wednesday, July 14, 2010

సౌర విద్యుత్

27 comments
సైన్సు::1. సోలార్ పానెల్ లోని ఫొటోవోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలెక్ట్రాన్లుగా రూపాంతరణ చేస్తాయి.
2.ఆ వెలుతురుని ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఎలెక్ట్రాన్లుగా మార్చి తద్వారా విద్యుత్ శక్తిగా రూపాంతరణ చేస్తాయి.
అసైన్సు:: ఫొటోవోల్టాయిక్ సెల్ వొల్టేజ్ ని తయారు చేస్తుంది.రేడియేషన్ ఫొటోఎలెట్రిక్ ఎఫెక్ట్ కలిగి వున్న పదార్దాలని తాకినపుడు ఎలెక్ట్రాన్లు అణువుల ఆకర్షక శక్తి నుంచి బయట పాడతాయి. ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఫొటోఎలెట్రిక్ ఎఫెక్ట్ ద్వరా వచ్చిన ఎలక్ట్రాన్లనుంచి వొల్టేజ్ ని బిల్డ్ చేస్తుంది.

సైన్సు::రెండు అణువుల మధ్య రాపిడి జరిగినప్పుడు ఫొటోన్లు వ్యాకోచించి అవి వెలుతురుగా విడుదల అవుతాయి.
అసైన్సు::ప్రోటాన్, ఫోటాన్ రెండు వేరు వేరు ప్రోటాన్లు అణువుల్లో వుంటాయి, ఫోటాన్లు అంటే ఎదైనా విద్యుత్ అయిస్కాంత కిరణాల ప్రాధమిక యూనిట్( Basic), ఏది వెలువడుతుందో మరి అణువుల రాపిడ్లో..
వ్యాకోచించటం అంటే పరిమాణం పెరుగుట, తక్కువ శక్తి స్టేట్ నుంచి ఎక్కువ శక్తి స్టేట్కి వెళ్ళటం; రెండూ పూర్తిగా అసంభంధ విషయాలు.

సైన్సు::సూర్యునిలో హైడ్రోజెన్, ఆక్సీజెన్, హీలియం, నియాన్ లాంటి పదార్థాల అణువులు రాపిడి చెందడం వల్ల సూర్యుని నుంచి వెలుతురు ఎక్కువ వస్తుంది.
అసైన్సు::ఈ అణువులు రాపిడి ఎంటో నాకు తెలియదు మరి, సూర్యుడు, వెలుతురు అంటున్నారు కావున, న్యూక్లియర్ ఫ్యూజన్ అని అనుకుంటున్నాను. న్యూక్లియర్ ఫ్యూజన్ ని తెలుగులోకి అనువదించే అంత పరిజ్ఞానం లేక అలానే ఇస్తున్నాను.
Nuclear fusion is the process by which multiple atomic nuclei join together to form a single heavier nucleus.

సూర్యుని లాంటి చిన్న నక్షత్రాలలో జరిగేది ప్రోటాన్-ప్రోటాన్ చెయిన్ రియాక్షన్, అనగా రెండు హైడ్రోజన్ అణువులు కలిసి ఒక హీలియం అణువు ఏర్పడటమే ఎక్కువగా జరుగుతుంది, మరి ఈ రాపిడి ఎంటో భూత విద్య లాగా వున్నది.
ప్రోటాన్-ప్రోటాన్ చెయిన్ రియాక్షన్ గురించి, దానిలో శక్తి ఎంత వెలువడుతుంది, ఎలా వెలువడుతుంది అనే వివరాల కొఱకు ఇక్కడ చూడగలరు.

సైన్సు::ఎండగా ఉన్న రోజు సూర్యరశ్మి చదరపు మీటర్ భూభాగానికి 1000 వాట్ల విద్యుత్ శక్తిని ఇవ్వగలదు.
అసైన్సు::ఇది చాలా పెద్ద లెఖ్ఖ, ప్రస్తుతం వున్న మొనో, పాలీ క్రిస్టలైన్ సెల్ ఒకటి 1.5 వాట్ పవర్ ని ఉత్పత్తి చేయగలవు, కాబట్టి ఒక 30-40 సెల్స్ కలిపి ఒక మాడ్యూల్ గా తీసుకుంటే అది సుమారుగా 40-60 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలవు అదీ బాగా వెలుతురు ఉనట్టు ఐతేనే. ఒక్కో మాడ్యూల్ అటుఇటుగా అర చదరపు మీటరు ఉంటుంది. ఇది సైన్సు చెప్పిన దానిలో 8-12 శాతమే.
ఇంకో విదంగా చూస్తే, ఒక 1000 చదరపు అడుగుల స్థలం తీసుకుందాం, అనగా సుమారు 95 చదరపు మీటర్లు, మనకి సూర్య శక్తి లభ్యత 4-7 KWh/m2 అంటే 4*95 - 7*95 = 380 - 665KWH* == 1296674BTU - 2269179 BTU, ఇదే వేడిని విద్యుత్ శక్తిగా మర్చాలి అంతే 30 శాతం పైనే శక్తిని ఉపయోగించుకోలేము అనుకుంటే, గంటకి 265.8 KWh -465.2 KWh పైనే అంటే చదరపు మీటర్ కి వచ్చి 3-5 కిలో వాట్/గంటకి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు, అంటే ఒక గంటలొనే 3-5 యూనిట్ల విద్యుత్ శక్తి(957000000W - 1675000000W). ఇది సైన్సు చెప్పిన దానికన్నా (1000W) వేల రెట్లు ఎక్కువ. అదే అమెరికా లొ ఐతే, 1 యూనిట్లని మాత్రమే ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది (సగటు లభ్యత 1500KWh మాత్రమే కావున).

## దగ్గర్లో సున్నాలకి మార్చి (158880 ని 150,000గా) దాదాపుగా వేసినవే, కావున తప్పులు ఉంటాయి మన్నించగలరు.
**ఆంగ్లము వాడిన పదాలకి తెలుగులో సమాన పదాలు తెలిస్తే చెప్పండి, టపా మారుస్తాను, నేనూ నేర్చుకుంటాను.

సైన్సు సోర్సు:http://science.praveencommunications.firm.in/2010/06/solar-panels.html
అసైన్సు సోర్సులు:వికీ
*నా తప్పుని ఎత్తి చూపిన అజ్ఞాతగారికి ధన్యవాదములు. (అనవసరంగా 1000 పెట్టి హెచ్చ వేశాను)

Friday, July 9, 2010

బ్యాక్టీరియా - పచ్చి మాంసం

15 comments
సైన్సు చెప్తున్నదేమనగా
1.వేటాడిన జంతువు యొక్క పచ్చి మాంసాన్ని తినడం సురక్షితం కాదు.
2.జంతువుల మాంసంలో బాక్టీరియా ఉంటుంది. నేల మీద పాకే కుందేలు లాంటి జంతువులలో అది ఎక్కువ ఉంటుంది.
3.బాక్టీరియా 40 నుంచి 140 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వరకు బతకగలదు లేదా పెరగగలదు.
4.బాక్టీరియా కణాలలో కంటే సముద్రపు నీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అసమతలాన్ని సరిచేసుకోవడానికి బాక్టీరియా కణాలు ఓస్మోసిస్ ద్వారా నీరుని విడుదల చేస్తాయి.
5.40 ఫారెన్హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో బాక్టీరియా పెరగడం కష్టం.
6.సషిమి అనే రకం చేపలని చలిలో ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజింగ్ లో ఆ చేపలలో మిగిలి ఉన్న బాక్టీరియా చనిపోతుంది.

అసైన్సు చెబుతున్నదేమనగా
వేటాడిన మాంసం, వేటాడకుండా మాంసం అని కాకుండా పచ్చి,ఉడకపెట్టిన - బ్యాక్టీరియా యొక్క సంభంధం చుద్దాం.
పైన చెప్పిన సదరు సైన్సు పాయింట్స్ పురాణకాలంలో రష్యాలొనో, చైనాలొనో వ్రాసినవి కావు, (http://adventure.howstuffworks.com/survival/wilderness/eating-raw-meat.htm) ఇక్కడి నుంచి కాపీ కొట్టినవి, ఆంగ్లము అర్ధం చేసుకోవటంలో వచ్చిన తిప్పలు.

బ్యాక్టీరియా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కుడా మనుగడ సాగించగలదు, అత్యంత ఘాఢ ఉప్పు క్షేత్రాలలో, 235* వేడిలో, అణుధార్మిక పధార్ధాలలో, భూమి క్రస్ట్‌లోపల, అలానే సమస్థ చెట్టు, చేమ, పక్షి,జంతుజాలంలో కుడా, బ్యాక్టీరియా అనగానే భయపడవలసిన అవసరం లేదు, మనకి హాని చెసే బ్యాక్టీరియానే కాదు మన మనుగడకి ఎంతో అవసరం ఐన బ్యాక్టీరియా కుడా వున్నాయి. వచ్చిన తిప్పలు హాని కారక బ్యాక్టీరియాతొనే.
సాధారణంగా 41- 135*F ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పునరుత్పత్తికి(పునరుత్పత్తి, పెరుగుట ఒక్కటి కాదు, పునరుత్పత్తికి ముందు బ్యాక్టీరియా తమ పరిమాణాన్ని పెంచుంకుంటాయి) ఎంతో అనువైనది, ఇటువంటి ఉష్ణోగ్రతలో తగిన పోషకాలు దొరికినచో బ్యాక్టీరియా 9.8 ని.లలో కుడా తమ సంఖ్యని రెట్టింపు చేసుకోగలదు, ప్రాధమికంగా ఎంత తక్కువ మొత్తంలో బ్యాక్టీరియా వున్నా, ఆ ఉష్ణోగ్రతలో ఆహారాన్ని నిల్వ ఉంచటం వలన అతి కొద్ది సమయంలొనే బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని తీసుకున్న వ్యక్తికి హాని కలిగించే స్తాయికి తమ సంఖ్యని పెంచుకోగలదు.
అలాని 150*F కి ఆహారాన్ని వేడి చేసినచో, ఆ ఆహారం బ్యాక్టీరియారహితం ఐపొతుందా? లేదు, 140*F పైన వేడి బ్యాక్టీరియాని చంపుతుంది, కానీ సమూలంగా నాశనం చేయలేదు. బ్యాక్టీరియా సంఖ్యని లాగ్ లో కొలుస్తారు, ( 10 లక్షలు = 6 లాగ్ లు), వేడి చేయటానికి ముందు 8 లాగ్ ల బ్యాక్టీరియా ఆహారంలో వున్నది అనుకుందాం (10,00,00,000 = 8లాగ్) మనం వేడి చేశాక 4లాగ్ లు మాత్రమే మిగిలి వున్నది అనుకోండి (10,000) అది ఒక మనిషికి హాని కలిగించ గలిగే స్థాయే, పొనీ దీన్నే ఒక 2 గ. సాధారణ గది ఉష్ణోగ్రతలో నిల్వ చేశామనుకోండి, ఉదాహరణకి ఇ.కొలీ బ్యాక్టీరియాని తీసుకుంటే, అది 20ని. తమ సంఖ్యని రెట్టింపు చేసుకోగలదు, అనగ, 130ని. 4 లాగ్ నుంచి 6 లాగ్ లకు తమ సంఖ్యని పెంచుకోగలదు, 6 లాగ్ అంటే, ఇది ఎవరికైనా హాని కలిగించగలిగే స్థాయి.
కావున, వేడి చేసి తినటం వలన మనకి బ్యాక్టీరియా వలన హాని లేదు అన్నది ఆంగ్లము రానివారు సృష్టించిన పుకారు మాత్రమే.
అలానే 40*F కన్న తక్కువ ఉష్ణోగ్రతలో ఆహారం నిల్వ ఉంచటం వలన బ్యాక్టీరియా నాశనమైపోదు, పునరుత్పత్తి ఆగిపోదు బ్యాక్టీరియా పునరుత్పత్తి వేగం మాత్రమే తగ్గుతుంది. పైన చెప్పిన ఉదాహరణ లో, ఆహారాన్ని 40*F కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచితే 130ని. బదులు 260-350ని. పట్టొచ్చు, అంతే తప్ప, సంవత్సరాలు పట్టదు.
సషిమి చేపలను ఫ్రీజ్ చేయటం దానిలో వున్న బ్యాక్టీరియాని చంపటానికి కాదు, రింగ్ వార్మ్ లాంటి ప్యాతోజెన్స్ ని చంపటానికి, ఫ్రీజ్ చేసినంత మాత్రాన బ్యాక్టీరియా చచ్చిపోదు.
అలానే, సీల్ (సముద్రపు కుక్క)ని చంపకముందే దానిలో హానికారక బ్యాక్టీరియా వున్నచో?), వెటాడాకే బ్యాక్టీరియా దానిలోకి వస్తుంది అనుకోవటం భ్రమ, బ్యాక్టీరియా క్యారియార్స్‌కి ఎటువంటి హాని చేయదు, కాని ఆ మాంసం తిన్నాక, ఎంతసేపటిలో తిన్నా ఆ మనిషికి చెటే.
పాకుడు వలన, దేకుడు వలన శరీరంలో బ్యాక్టీరియా సంఖ్య పెరగదు, ధాన్యానికన్నా, గడ్డినే ఆహారంగా తీసునే జంతువులలో ఇ.కొలి బ్యాక్టీరియా సంఖ్య చాలా తక్కువగా వుంటుంది, అంతే తప్ప పాకే కుందేలులో (మరి నేను ఐతే ఎక్కడా చూడలేదు, కొత్త సామెతెమో తాను చూసిన కుందేలు పాకుతుంది అని) గెంతే కుందేలు కన్నా బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ అని చెబుట, పర గ్రహ బెర్నోలీ సూత్రమెమో.(ఇంగిలిపీసు అర్ధం కాలెదెమోలే)
మర్చిపోయాను, బయట ఉప్పగా వున్నది అని, నీరు విడుదల చేసి బ్యాక్టీరియా ఆత్మహత్య చేసుకోదు, ఓస్మాటిక్ ప్రెజర్ వలన నీరు దానంతట అదే బయటకి (అనగా ఉప్పు సాంద్రత ఎక్కువగా వున్న చోటుకి) వెళ్ళిపోతుంది, అంతే తప్ప బ్యాక్టీరియా పర్మిషన్ తీసుకొని ఎమీ వెళ్ళదు.

10 మార్కుల ప్రశ్న.
చలిలో ఫ్రీజ్ చేయుటకు, ఎండలో ఫ్రీజ్ చేయుటకు 10 తేడాలు కామెంటండి.
14 మార్కుల ప్రశ్న
a)పాకుట= దేకుట, మరియు, పాకుట ∝ శరీరంలో బ్యాక్టీరియా పరిమాణం --7 మా
b)పాకుట ( పా) = K*శరీరంలో బ్యాక్టీరియా పరిమాణం శ. [ పా = K*శ)
K = ప్ర.నా ప్రపోర్షనాలిటి కాన్స్‌టెంట్ --7 మా

సైన్సు సోర్సు: http://science.praveencommunications.firm.in/2010/07/blog-post_9804.html
అసైన్సు సోర్సులు కామెంట్లలో

Friday, July 2, 2010

ఈ బల్లులు తమ విషంతో మనుషులని చంపలేవు

26 comments
సైన్సు:కొమోడో డ్రాగన్ అనబడే ఈ రకం బల్లులు ఇండోనేసియన్ దీవులలో కనిపిస్తాయి. వీటి నోటిలో విష గ్రంథులు ఉంటాయి. ఇవి ఒకసారి కరిస్తే మనిషి చనిపోతాడు.

మరి అసైన్సు: కొమొడొ డ్రాగన్ కరిచిన తరువాత కనపడే కొన్ని లక్షణాలని బట్టి, (వాపు, రక్తం గడ్డకట్టకపోవటం, తీవ్రమైన నొప్పి..) కొమొడొ డ్రాగన్లు తను వేటాడే జంతువుకి తెలివి పోగట్టగలిగేంత(చిన్న జంతువులకే) శక్తి గల విషం, కొద్ది మొత్తంలో కలిగి వుంటుంది అని ఒక ఊహ 2005 కొమొడొ డ్రాగన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న వారికి వచ్చింది. 2009లో ఒక కొమొడొ డ్రాగన్ నోటి నుంచి (క్రింది దవడల క్రింద) ఒక (రెండు ఉంటాయి అట) విషం తయారు చేసే గ్రంధిని వేరుచేశారు. కానీ పైన చెప్పిన లక్షణాలు కొమొడొ డ్రాగన్ లాలాజలంలో వున్న బ్యాక్టీరియా మూలంగా అని ఎక్కువమంది నమ్మే వాదన.

కాబట్టి, కొమొడొ డ్రాగన్ వేటాడేటప్పుడు విషప్రయోగం చేస్తుందో చెయ్యదో ప్రక్కన పెడితే వాటి విషానికి మనుషులని, మిగతా పెద్ద జంతువులని చంపేటంతటి శక్తి మాత్రం లేదు అని అందరూ అంగీకరించే విషయమే.
వాటి విషం వలన ఇవి ఒకసారి కరిస్తే మనిషి చనిపోతాడు అనేది అభూత కల్పనే, ఎదో నిద్ర మత్తులో వ్రాసినది.
ఇంక వాటి దాడిలో మరణించిన మనుషుల సంగతికి వస్తే, చాలా పదునుగా, సుమారు 1 ఇంచి పొడవు వుండే వాటి పళ్ళతో చెసే లోతైన గాయాల నుంచి రక్తస్రావం ఆగక, దానికి తోడు షాక్ వలన మాత్రమే సంభవించిన మరణాలు తప్ప విషం వలన కాదు.


సైన్సు సోర్సు:http://science.praveencommunications.firm.in/2010/06/blog-post_28.html

Thursday, July 1, 2010

భూ ప్రపంచంలో వ్యాయామం చేస్తున్న మనిషి ఒక్కడైనా ఉన్నాడా?

23 comments
సైన్సు ప్రకారం మనిషి వ్యాయామం చేస్తే గంటకి 22కి.మీ., అంటే రెండు గంటల్లో 44 కి.మీ పరిగెత్తాలి.
సరే మనం ముందుగా మారథాన్ పోటీని పరిశీలిద్దాం, మారథాన్ పరుగు పందెం 42.195 కి.మి. సాగుతుంది, ఇప్పటి వరకు నమోదైన ప్రపంచ రికార్డు 2గ.3ని.59సె. అనగా దాదాపుగా 124 ని, అంటే వేగం గంటకి 20.417కి.మీ. మరి సైన్సు ప్రకారం వ్యాయామం చేయనట్టే కదా...
మరి ప్రపంచ రికార్డ్ సృష్టించిన వ్యక్తే వ్యాయామం చేయనప్పుడు, మిగతావారు చేస్తారా? ఒక వేళ చేసేటట్టు ఐతే మరి ఈ రికార్డ్ ఎప్పుడో చెరిగిపొయేది కదా. కాబట్టి కామేడ్స్, ఈ భూ ప్రపంచికం మీద వ్యాయామం చేస్తున్న పిల్లకాయ ఒక్కడు లేడు.
మీరు పేరు తెచ్చుకొవాలి అన్నా, గొప్పవారు ఐపోవాలి అన్నా, వ్యాయమం చేయండి, మారథాన్ గెలుచుకోండి, డబ్బుకి డబ్బూ, పేరుకి పేరునూ..

సైన్సు సోర్సు: వ్యాయామం చేసే వ్యక్తి గంటకి 22 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలడు. వ్యాయామం లేకపోతే గంటకి 12 మైళ్ళు (20 కిలో మీటర్లు) కంటే తక్కువ వేగంతో పరిగెత్తగలడు.
@ http://science.praveencommunications.firm.in/2010/06/black-mamba.html

రిఫరెన్స్:http://en.wikipedia.org/wiki/Marathon

Wednesday, June 30, 2010

నమస్కారం

5 comments
ప్రపంచంలో పొడవాటి పాము ఏది? మనిషి వేగం ఎంత? రిజర్వ్ బ్యాంక్ ఎందుకు? జ్యోతిష్యం సైన్సేనా? ఎకనామిక్స్ అంటే ఏంటి? అసలు మనకి డబ్బు ఎందుకు? ఇలా మన మదిని తొలిచే ప్రశ్నలకు సమాధానాల కోసమే ఈ బ్లాగ్ మొదలు పెట్టబడినది.