blogspot hit counter

Thursday, July 1, 2010

భూ ప్రపంచంలో వ్యాయామం చేస్తున్న మనిషి ఒక్కడైనా ఉన్నాడా?

సైన్సు ప్రకారం మనిషి వ్యాయామం చేస్తే గంటకి 22కి.మీ., అంటే రెండు గంటల్లో 44 కి.మీ పరిగెత్తాలి.
సరే మనం ముందుగా మారథాన్ పోటీని పరిశీలిద్దాం, మారథాన్ పరుగు పందెం 42.195 కి.మి. సాగుతుంది, ఇప్పటి వరకు నమోదైన ప్రపంచ రికార్డు 2గ.3ని.59సె. అనగా దాదాపుగా 124 ని, అంటే వేగం గంటకి 20.417కి.మీ. మరి సైన్సు ప్రకారం వ్యాయామం చేయనట్టే కదా...
మరి ప్రపంచ రికార్డ్ సృష్టించిన వ్యక్తే వ్యాయామం చేయనప్పుడు, మిగతావారు చేస్తారా? ఒక వేళ చేసేటట్టు ఐతే మరి ఈ రికార్డ్ ఎప్పుడో చెరిగిపొయేది కదా. కాబట్టి కామేడ్స్, ఈ భూ ప్రపంచికం మీద వ్యాయామం చేస్తున్న పిల్లకాయ ఒక్కడు లేడు.
మీరు పేరు తెచ్చుకొవాలి అన్నా, గొప్పవారు ఐపోవాలి అన్నా, వ్యాయమం చేయండి, మారథాన్ గెలుచుకోండి, డబ్బుకి డబ్బూ, పేరుకి పేరునూ..

సైన్సు సోర్సు: వ్యాయామం చేసే వ్యక్తి గంటకి 22 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలడు. వ్యాయామం లేకపోతే గంటకి 12 మైళ్ళు (20 కిలో మీటర్లు) కంటే తక్కువ వేగంతో పరిగెత్తగలడు.
@ http://science.praveencommunications.firm.in/2010/06/black-mamba.html

రిఫరెన్స్:http://en.wikipedia.org/wiki/Marathon

23 comments:

ఆ.సౌమ్య said...

హ హ భలే లాజిక్కు....సైన్సు కబుర్లకి దీటు గా ఉంది

Anonymous said...

racha..racha... ha ha..

rajku

karthik said...

kevvu

హరే కృష్ణ said...

keka

చిలమకూరు విజయమోహన్ said...

:)

Unknown said...

హహ్హ్హహహహ్హాహ్హాఆ హహ్హహహహ మొన్న నా బ్లాగులో ఈ ప్రవీణ్ శర్మ మీద ఒక చాంతాడంత చర్చని anonymousగా మీరే చేశారేమోనని నాకు డౌటుగా ఉంది..

ఈ పోస్టులో మీ విమర్శతో ఆయన్ని కేకలు పెట్టించేట్టు చేశారు.. ఐనా ఇంత సైంటిఫిక్‌గా ప్రశ్న వేసి.. మీరు అసైన్సు కబుర్లని పేరు పెట్టారేంటండీ.. keep rocking.. :)

bisha bisha said...

Nuvve chesko... maaku avasaram le...

Anonymous said...

"సైన్సు ప్రకారం మనిషి వ్యాయామం చేస్తే గంటకి 22కి.మీ., అంటే రెండు గంటల్లో 44 కి.మీ పరిగెత్తాలి."

ఈ వాక్యం లో నిజం ఎంత? నిజానిజాలు తెలీని విషయాన్నీ బేస్ చేసుకొని ఏం కాంక్లుడే చేస్తారు

తార said...

@హరే కృష్ణ గారు
@చిలమకూరు విజయమోహన్ గారు
@bisha bisha గారు
@శరత్ 'కాలమ్'గారు
మీ కామెంట్లకి ధన్యవాదాలు.
@అజ్ఞాత
కొంపదీసి మీరు మార్తాండ కాదు కదా?

తార said...

@Chandramouli Malleda గారు
అయ్యో ఆ చర్చ సంగతి నాకు తెలియదండి, తెలిస్తే తెర చాటు నుండి కామెంట్లు యెందుకు, నా పేరుతొనే పెడతాను.
అది సైన్సు ఐతే ఇది కాదు కదా, అందుకే అసైన్సు.
మీ కామెంట్ కి ధన్యవాదాలు.

Anonymous said...

హ హ హ... తార గారు భలే అడిగారు. అన్నయ్య ఏం చెపుతాడో చూద్దాం. ప్రతి పోస్టు కీ మీరు రాసిన ఈ రిటార్ట్, లింకు కామెంట్ గా పెట్టండి.

ప్రవీణ్ అభిమాని said...

వ్యాయామం చేసే వ్యక్తి గంటకి 22 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలడు - అంటే 100 మీటర్లు 16.16 సెకండ్లలొ .. ఎం మీరు పరిగెత్తలేరా...
ప్రవీణ్ ఆ వేగం తొ ఎంత దూరం పరిగెత్తాడు అని కానీ, ఎంత సమయం పరిగెత్తాడు అని కానీ రాయలేదు కదా... ఆ వేగం తొ 1 సెకండు పరిగెత్తినా ప్రవీణ్ చెప్పింది కరెక్టేకదా...

(ప్రవీణ్ అభిమాని)

తార said...

@ప్రవీణ్ అభిమాని గారు
వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు, మీరూ, మీ మార్తాండా తల్చుకుంటే, 22కి.మీ, ఏమి ఖర్మ, కాంతి వేగం కన్నా వేగంగా వెళ్ళగలరు.
మీ ఐడితో కామెంట్ పెడితే తప్పు ఎంటో చెప్పేవాడ్ని, కానీ ప్రవీణ్ అభిమాని అనగానే నాకు మీ మానసిక స్థితి మీద అనుమానం వచ్చింది.

సుధ (ప్రవీణ్ అభిమాని) said...

కాంతి కన్నా వేగం గా వెళ్ళే వ్యామోనౌకలు లేవా. అందులొ మనిషి ప్రయాణిస్తే కాంతి కన్నా వేగం గా ప్రయాణించినట్టే

సుధ (ప్రవీణ్ అభిమాని)

చందు said...

ha ha ha hah ha ha ha ha ha ha ha ha ha ha ha ha!!!

durabhimaani said...

ఇరవయ్యేళ్ల కిందట నేను గంటకి 22 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేవాణ్ణి. ఇప్పుడు 2 గంటలు పడుతోంది. రోడ్లు విశాలంగా వేయడం వల్ల గంట ఆలశ్యం అవుతోంది. చైనాలో రోడ్లు ఎర్రమట్టితో వేస్తారు. ఫ్యూడల్ వ్యవస్థలో బూర్జువా రోడ్లు ఉంటాయి. మతి తప్పిన జంతిక వాదం ఇదే చెప్తోంది. నాకంటే నిదానంగా పరిగెత్తే వాన పాములు రెల్లివీధిలో ఉన్నాయి కావాలంటే ఈ విడియో చూడండి.
http://www.youtube.com
సమైక్య గూండాలు బ్రాందీ తాగి రెల్లి వీధిలో నడవడం వల్ల అవి ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. 1790 లో పీకోవ్ ఎర్రెర్రమాన్ ఓ చిత్తు కాగితంలో చెప్పాడు. నేను ఏరుకున్నవాటిలో అది కనిపించింది. ఇప్పుదు మీకు చెబుతున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటె నా లాండ్ లైన్ కు MMS పంపవచ్చు. నేను బిజీగా కంప్యూటర్ బూచోడిలాగా తిరుగుతుంటాను. కొంతమంది మెయిల్ చూసుకుని 10 ఇస్తామంటారు. బూతు బొమ్మలు చూస్తుంటే నేనే 10 కి 20 ఇచ్చి బయటికి పంపుతాను. వాడు ఆ డబ్బుతో వేరే నెట్ సెంటర్లో 2 గంటలు ఎంజయ్ చేస్తాడు. ఆ విష్యం నాకు తెలుసు. గురి తప్పిన చింతకాయ వాదం నేను క్షుణ్ణంగా చదివాను.

సుధ (ప్రవీణ్ అభిమాని) said...

చైనా మన కన్నా అభివృద్ది చెందిన దేశం. అక్కడ రోడ్లు ఎర్రమట్టితొ వెయ్యరు. మన దేశం లొనే ఎర్రమట్టి తొ వేస్తారు. కావాలంటే పల్లెలకు వచ్చి చూడండి.

సుధ (ప్రవీణ్ అభిమాని)

తార said...

సుధ (ప్రవీణ్ అభిమాని) గారు, పోయిన ఆదివారం ఆంధ్రజ్యోతి పుస్తకంలో కరెంటు వేగం కాంతి వేగం కన్నా రెండు రెట్లు ఎక్కువ అని రాసాడు, అన్న అభిమానులు అంతకన్నా వేగంతో పరిగెత్తగలరు, కాదంటే జ్యోతి గారిని అడగండి, విమోచనం చదివి అర సెకాండ్లో భూమి చుట్టూ గిర్రున తిరిగి వచ్చారు.

Praveen Sarma said...

ఈ పరుగు సిధ్ధాంతాన్ని యాకోవ్ పెరెల్మాన్ వ్రాసిన ఓ పుస్తకంలో చదివాను. మా అమ్మగారు 1970లలో ఆ పుస్తకం కొన్నారు. అవి 1970లలో వ్రాసినవి. అవి ఇప్పుడు ప్రింటింగ్ లో లేవు. కొత్త పుస్తకాలు ఏ పబ్లిషర్ దగ్గర దొరుకుతాయో చెప్పగలను. వాటిని స్కాన్ చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే 1970ల నాటి పుస్తకాలు మాత్రమే స్కాన్ చేస్తున్నాను.

తార said...

ప్రవీణ్ గారు 1942 చనిపోయిన యాకోవ్ పెరెల్మాన్ 1970లో పుస్తకం ఎలా రాసారు? వారి ఆత్మ ఎమైనా మీ ఇంట్లో కూర్చోని రాసిందా? కొనుకున్న తరువాత పుస్తకమే చదువుకుంటం కానీ మళ్ళీ స్కాన్ చేసి నెట్లో పెట్టి చదవటం యెందుకు?

Praveen Sarma said...

ఆత్మలు ఉంటాయని రంగనాయకమ్మ జానకీ విముక్తి నవలలో రాయలేదు.

durabhimaani said...

గ్రహణం రోజు ఆత్మలు కనబడతాయ్. ఇది గొక్కోవ్ నల్నల్లమాన్ 1790 లో పలకలో రాశడు. అది నేను చదివాను. నాన్ వెజ్ తింటే వెంటబడతాయని నను వెజ్ బిర్యానీ తింటాను. ఒరిస్సాలో ఉన్నపుడు 80 ఏళ్ళ ఆత్మను నేను ఇష్టపడ్డాను.

చంద్రమౌళి said...

అబ్బబ్బబ్బ.. కేకలు పెట్టించేస్తున్నారండీ కామెంట్లతో... సూపర్.. ఎవరికి వారే గ్రేట్.. ఐనా ప్రవీణ్ శర్మ ఇప్పటి పుస్తకాలు చదవరు లెండి.. ఆయనకి ఏభై సంవత్సరాల క్రితంలో పుస్తకాలే కరెక్టు..

నేను మళ్ళీ కామెంటు చెయ్యటానికి రీజన్ ఏంటంటే @సుధ (ప్రవీణ్ అభిమాని): గారికి నా కామెంట్‌ని వివరించాలని.. ఏమండీ సుధ గారూ.. కాంతి వేగంకన్నా వెళ్ళే వ్యోమ నౌకలు మీ ఇంట్లో తయారు చేస్తున్నారా అండీ ఒక వేళ చేస్తున్నట్లైతే ప్లీజ్ నాకొకటి ఇప్పించండి.. అస్సలు టైం సరిపోవట్లేదు.. దయ చేసి.. కావాలంటే మా ఇంటి ఓనర్ ఇల్లమ్మేసైనా డబ్బులు సమర్పించుకుంటాను...

అసలు విషయం ఏంటంటే నిజానికి ఒక వ్యోమ నౌకని మొదటి సెకెను పాటు కాంతి వేగంతో ప్రయాణింపచేసేందుకు.. భూమి మీద ఉన్న ఎనర్జీ కాదు కదా.. భూమి మొత్తం ఎనర్జీగా మారినా... అది జరిగే పని కాదు.. అఫ్ కోర్స్ ఇది పనీ పాటా లేని సైంటిస్టులు చెప్పిందనుకోండీ.. కాబట్టి దయ చేసి నాకొక స్పేష్ ఇప్పించండి ప్లీజ్...ప్లీజ్...