blogspot hit counter

Sunday, July 18, 2010

ఓట్స్ కొన్ని నిజాలు

నేను ఎదో ఆయుర్వేదమే సరైన వైద్యం, AIDS ని మూలికలు కుడా తగ్గించగలవు అని నమ్మే రకం కాదు.
కానీ కొన్ని సహేతుకమైన కారణాల వలనే నేను భారతదేశంలో ఓట్స్ వాడుకకు వ్యతిరేకం.

ఓట్స్ వాడకం వలన మనకి లాభం కన్నా అన్ని విధాలా నష్టమే అని, పాఠకులను చైతన్య పరచటమే నా ఉద్దేశం తప్ప దీనిపై ఎవరి మీదా వ్యక్తిగత కక్ష లవలేశమంతైననూ లేదు అని మనవి చేసుకుంటున్నాను.
ఒకటే టపా అంతే మరీ పెద్దది ఐపోతుంది అని నాలుగు భాగాలుగా రాద్దామనుకుంటున్నాను.
1. ఓట్స్ కొన్ని అపోహలు
2. ఓట్స్ కన్నా పౌష్టికరమైన మనం రోజువారీ వాడే ఆహార పదార్ధాలు.
3. మన వ్యవసాయం - ఆర్ధిక, పర్యావరణ హాని - పాలకుల మొద్దు నిద్ర
4. ఓట్స్ సాగు -- పర్యావరణ, ఆర్ధిక అంశాలు, రైతులకి, వ్యవసాయానికి, పేదలకి, ఆహార పంటలకు కలిగే కీడు.

ఒక్క ఓట్స్ కే నేను వ్యతిరేకమా అంటే, కాదు, కానీ మిగతా వాణిజ్య పంటలు మన ఆహార భద్రతకు కలిగించే హాని తక్కువ, కానీ ఓట్స్ అలా కాదు, అందుకే నేను ఓట్స్ వ్యతిరేకిని. (భారత దేశంలోనే సుమా, అమెరికాలో కాదు, ఇండోనేషియాలో కాదు, రష్యాలో కుడా కాదు, ఒక్క మన దేశంలోనే).

మొదటి రెండు భాగాలలో ఏది ముందు రాయాలో తెలియటం లేదు, మరి మీ సలహా.

6 comments:

Anonymous said...

మీరు రాసిన ఆర్డర్ లోనే ఫాలో అయిపోండి .

Anonymous said...

go on with ur order..

చిలమకూరు విజయమోహన్ said...

మనప్రాంతంలో దొరికే జొన్నలు,రాగులు,కొర్రలను వదలివేసి విదేశాలనుంచి వచ్చిన ఓట్స్ ను promote చేస్తున్నారు పొరుగింటి పుల్లకూర రుచి చందంగా.

శ్రీనివాస్ పప్పు said...

అమ్మదీనమ్మాని,నిన్నే వందకి పైనున్నావు ఓట్స్ తింటే తగ్గుద్ది అంటే సరే అని మొదలెట్టబోయానయ్యా.

ఏది పనికొచ్చేదో అదే ముందు రాయబ్బాయి.దానికి ముందా ఎనకా అని తొంగిచూడ్డం దేనికి.

durabhimaani said...

ధనిక భూస్వామ్య బూర్జువా దేశాల్లో ఓట్స్ తింటారు, తాడిత పీడిత దేశాల్లో గోట్స్ తింటారు. ఓట్స్ను ఎడమ చేత్తో తింటారు. నాది ఎడమ చేతి వాటం. నిద్రమత్తులో కామెంట్లు ఎడమ చేత్తోనే పెడతాను. గోట్స్ మాత్రం కుడి చేత్తో తింటారు. నేను భువనేశ్వర్ వెళ్ళినపుడు కుడి చేత్తో ఓట్స్ తిని మోసపోయాను. అందుకే చైనా వెళ్లినపుడు ఎడమ చేత్తో సెకెండ్ హేండ్ గోట్స్ తిన్నాను. 100 ఓట్స్ కు 200 గోట్స్ వస్తాయి.

Anonymous said...

వంద రెండొందలు అయ్యే దాకా (కామెంట్స్) ఇంక వేరే పోస్ట్ వుండదా? ఓట్స్ కొన్ని నిజాలులో మూడు, నాలుగు పాయంట్లకి త్వరగా వచ్చేయాలని మనవి.