blogspot hit counter

Monday, September 27, 2010

ఏది సత్యం? ఏది సత్యాన్వే(వే)షం??

55 comments
నాకు ఈ మధ్యనే కొన్ని నిజాలు తెలిశాయి, ఒకటి తెలంగాణాలో మాత్రమే ఫ్లోరైడ్ భాదితులు ఉన్నారు అని, ఇంకోటి, ఆ ఫ్లోరైడ్ సమస్య తిరడానికి ఒక్క కృష్ణ నదీ జలాలే తాగాలి అని.
నేను తెలంగాణాకి అనుకూలమో, వ్యతిరేకమో పక్కన బెట్టి, అసలు ఫ్లోరైడ్ సమస్య గురించి చూద్దాం.

ఈ ఫ్లోరైడ్ సమస్య నల్గొండ ఒక్క జిల్లాలోనే లేదు, మెదక్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం ఇలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎనిమిది కోట్ల మందికి ఎక్కువగానో, మరి ఎక్కువగానో దీని భాదితులే. పటం చూడండి, ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు మన దేశంలో.



ఇంక రెండో విషయానికి వస్తే, మరి దీనికి విముక్తి?

1. మొదటిది సమతులాహారం, క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వలన, టీ, కాఫీలాంటివి పూర్తిగా మానేయడం ఇలా, ఆహారపూ అలవాట్లతోనే చాలా ధూష్ఫలితాలు నియంత్రించవచ్చు. కానీ,

2. పూర్తిగా నివారించాలి అంటే మాత్రం స్వచ్చమైన నీటిని త్రాగవలసిందే, స్వచ్చమైన నీటితోనే ఆహారం వండుకోవాలి.
సరే, మరి సమతులాహారం మీద నల్గొండలో ప్రజలకి ఎంత అవగాహన కలిగించారో అంటే ఉన్నకొద్ది మంచి ఆహారం తీసుకోవడం మాత్రం చాలా తగ్గిపోతున్నది అని వరల్డ్ బ్యాంక్ వారు పర్యటించినప్పుడు తేలింది.

దీన్ని వదిలేద్దాం, ప్రభుత్వం కన్నా ఎక్కువగా కొంత మంది వ్యక్తులు, సంఘాలు ఈ ఫ్లొరైడ్ సమస్య మీద ఎక్కువ కృషి చేస్తున్నాయి.

వారు ఎల్లారెడ్డిగూడలో (నల్గొండలోకెల్ల అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ నీటిలో కలిగిన గ్రామం) మొత్తం ఇరవై తొమ్మిది శాంపిల్లు సేకరించగా నాలుగు శాంపిల్లలో ఫ్లోరైడ్ శాతం తక్కువగా, సరియైన మోతాదులో ఉన్నది, అంటే ఆ ప్రదేశాల్లో, ఎక్కువ లోతుకీ బోర్లు వేసి నీటిని వాడుకోవచ్చు, కానీ ఆ దిశగా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నించిన ధాఖలాలు లేవు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు అనుకుంటా ఒక బోర్ త్రవ్వి, దానికి నీటి శుద్ది ఫ్లాంట్ అనుసంధానించి ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని అందించే ఏర్పాటు చేశారు, దాన్ని నడిపే భాధ్యత ఎవరూ తీసుకోకపోవడం వలన, దాన్ని నడుపుటకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన, అది కొద్దిరోజులకే మూతబడినది, మరి అక్కడి రాజకీయనాయకులు కూడా పోటీలమీద పోటీలు పడి ట్యాంకర్లలో నీళ్ళు సప్లై చేస్తున్నారు తప్ప,( సం|| మూడు లక్షలకి పైగా సొంత డబ్బు పెట్టుకోని మరీ, అసలు ఆ ఫ్లాంట్ నడపటానికి లక్ష కూడా అవదు) దాని బాగు చేయిద్దామనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎలక్షన్లప్పుడు కృష్ణ జలాలు రాప్పిస్తాం అనే వాగ్ధానాలకి కొదవేలేదు.

ఒక్క నల్గొండ జిల్లాలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సమస్య 164 గ్రామాలలో తీవ్రంగా ఉన్నది, భాదితులు 65 వేలకి దగ్గిరగా ఉన్నారు, అనధికారిక లెక్క ఐతే 885 గ్రామాలు, ఆరు లక్షలమంది పైనే. వీటన్నిటికి త్రాగునీరు కృష్ణ నడినుంచి ఇవ్వాలి అంటే, దాదాపు ఆరువేల కోట్లకి పైన ఖర్చు (ఇది పన్నెండు వేలకి పైనే అవుతుంది అంతా అయ్యేసరికి అని అంచనా) సంవత్సరానికి మూడువందల కోట్ల మెంటెయినెన్సు ఖర్చు. ( గ్రానైట్ రాయి నుంచి ఫ్లోరిన్ నీటిలో కరుగుతున్నది కావున, రాళ్ళకి, నేలకి తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇది ఫలితాలని ఇస్తుంది.)

మరి ఇది తప్ప ఇంకే మార్గమూ లేదా?

పోని అక్కడ ఉన్న నీటిని శుద్ది చేయలేమా? చేయొచ్చు, ఒకటి పెద్ద నీటి శుద్ది ప్లాంటు పెట్టి ప్రతి ఇంటికీ నీరు పంపడం ఈ ప్లాంట్లు ఒక్కోటి కట్టడానికి అయ్యే ఖర్చు పాతిక లక్షలు, అంటే 164 గ్రామలకి కలిపి అయ్యే ఖర్చు మహా ఐతే యాభై కోట్లు, లేదా అనధికార లెఖ్ఖలు తిసుకున్నా 885 గ్రామాలకీ అయ్యేది ఎంత? ఎంతలేదనుకున్నా అయ్యేది ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం దాని మెంటెయినెన్సుకి పదహారు కోట్లు (ఒక్కో ప్లాంట్ కి 1.5 లక్షలు). అంటే అధమం ఐదువేల కోట్ల మిగులు.

లేదా, ప్రతి ఇంటికీ ఇంట్లో పెట్టుకునే ఫ్లాంట్ ఇవ్వడం, ఇది కొంతకాలం బానే నడిచింది, కానీ దీనికి ఫిల్టర్లు వచ్చి 20-50 రు. అవుతాయి, ఇంట్లో పెట్టుకునే ఫ్లాంట్లు ఫ్రీగా ఇచ్చారు సరే, ఈ ఫిల్టర్లు కుడా ఉచితంగా ఇవ్వమని కొందరు, వాటిని కొనుక్కోలేక ఇంకొందరు మూలన పడేశారు.

ఈలోపున పాపం ఎవరో ఒకాయన భగవాన్ అంట (నిజంగానే భగవంతుడు) ఈయన కనిపెట్టిన విషయం వాననీరు ఎంత ఇంకితే అంత ఫ్లోరిడేషన్ తగ్గుతున్నది అని, దానికి ఆయన ప్రతిపాదించింది ఎంత ఎక్కువ వాన నీరు మనం భూమిలోకి పంపగలిగితే అంత తగ్గుతుంది సమస్య తీవ్రత అని. ఆయన సూచించిన కొన్ని పద్దతులు.

1.
నల్గొండలో సగటు వర్షపాతం 772 మి.మి. అంటే ఒక వంద గజాలలో పడే వాన నీటిని సేకరించినచో 64,000 లీటర్ల నీరు పైనే పోగవుతుంది( ౫క్ష౩౦అడుగులు బావిలోకి), అంటే 4 వున్న ఒక కుటుంబానికి రోజుకి మనిషికి సగటున 25-30 లీటర్ల నీరు వాడుకోవచ్చు. దినికి అయ్యే ఖర్చు దాదాపు 30,000 రూపాయలు. నల్గొండలో 60% ఇల్లు ఇందుకు అనుగూణంగా ఉన్నాయి.
మిగిలినవారికోసం గ్రామాల్లో సామూహిక బావులు కట్టించుట ప్రతిదానికీ అయ్యే ఖర్చు 2,00,000 రూపాయలు.
సొంత బావులకి సగం ఖర్చు, సామూహిక బావులకి పూర్తి ఖర్చు ప్రభుత్వం భరించినా, గ్రామం మొత్తానికీ అయ్యే ఖర్చు సగటున 48,00,000 అంటే 164 గ్రామాలకి కలిపి ఒక యాభై కోట్లతో పూర్తి చేయొ (కొన్ని గ్రామాలలో జానాభా పదుల సంఖ్యల్లోనే ఉన్నది కావున మొత్తం మీద పాతిక కోట్లకన్నా తక్కువకే ఐపోతుంది అని తేల్చారు).

అనధికారిక లెక్క ప్రాకారం ఐనా మొత్తం మీద అయ్యేది ఐదు వందల కోట్లే..

2.
మరి తీవ్ర కరవు, పశువుల మేతకి? దీనికి ఇంకో మార్గం వున్నది.
అవే గ్రామ చెరువులను సరిగ్గా ఉంచడం, పాతిక ఎకరాల చెరువు, పదిహేను అడుగుల లోతు కలిగితే దానిలో పట్టే నీరు 95,56,93,572 లీటర్లు, సగటు జనాభా 2,000 వేసుకుంటే అధమం రోజుకి 500 లీటర్ల నీరు లభ్యం అవుతుంది, పైగా దీని వలన భూగర్భ జలాలలో ఫ్లోరిన్ ఘాడత తగ్గుతుంది, పశువులకి కుడా సరైన నీరు దొరుకుతుంది కావున, ప్రజల ఆర్ధిక స్థితి కుడా మెరుగవుతుంది.

మరి దీనికి అయ్యే ఖర్చు ఎంత ఎక్కువలో ఎక్కువగా వేసుకున్నా 1600 కోట్లు, (885గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో కుడా ప్రస్తుతం ఒక్క చెరువు కుడా లేదు అనుకుంటే ప్రతి గ్రామంలో త్రవ్వించడానికి) మరి, ప్రతిగ్రామంలో ఉన్న చెరువులని బాగు చేసుకుని, ఆక్రమణలను తొలగించి బాగు చేసుకుంటే, క్రొద్దిగా ఒక 100 కోట్లకే ఐపోతుంది. (885 గ్రామాలకి కలిపి, 164 గ్రామాలకే ఐతే అసలు 20 కోట్లకే ఐపోతుంది)

మరి వీటిని వదిలేసి ప్రాజా ప్రతినిధులు, మేము ఇన్ని వేలా కోట్లు ఖర్చు పెట్టి కృష్ణ జాలాలు తెప్పిస్తాం అనో, తెలంగాణా వస్తేనే సాధ్యం అనో మభ్య పెట్టడం సత్యాన్వేషణా?

తెలంగాణా పోరాటం మొత్తం పదిహేను ఏళ్ళు అని లెక్కేసుకున్నా, యం.పి. నిధులు 30 కోట్లు, యం. య.ల్యే. నిధులు ఇంకొ (12*15) 180 కోట్లు, అంటే ఈ సమస్య పూర్తిగా నిర్మూలించడానికి ఐదు యేళ్ళ నిధులు చాలునేమో?
మరి ఐతే ప్రాజా ప్రతినిధులు ఏమి చేస్తున్నట్టు అక్కడ? కృష్ణా జలాల తరలింపు కన్నా సులువైన మార్గం ఉందని చెప్పిన నేను సమైఖ్యంధ్ర గూండాని ఎలా అయ్యాను? పాపం ఎవరో ఒకాయన ముప్పై యేళ్ళ నుంచి ఇదే ప్రయత్నం చేస్తున్నారు అంట, మరి ఆయన ప్రత్యమ్నాయ అవకాశాల మీద దృష్టి ఎందుకు కేంద్రీకరించలేదు?

చదువరి said...

ఒక బ్లాగరి చేసిన ఈ మాత్రపు పరిశోధన, పరిశీలనలో కొంతైనా.. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు ఎమ్పీలూ చేసి ఉంటే, బహుశా ఫ్లోరైడు సమస్య కొంతైనా తీరి ఉండేది. (అయితే, ఇప్పుడు ఆంద్రోళ్ళు అంద్రోళ్ళంటూ విషం చిమ్మే అవకాశం ఉండేది కాదనుకోండి.)
ఒక వాస్తవ సమస్యకు వాస్తవికమైన పరిష్కారం ఆలోచించకుండా, బాధ్యులైనవారు తమ బాధ్యతను పక్కవాడిమీదకు నెట్టేసి, తమ మెడల మీంచి కాడి పడేసారు. ఉద్యమంలో దీన్నీ, బాధితుల్నీ ఒక సమిధలా వాడుకున్నారు. అయినదానికీ కానిదానికీ అవతలోణ్ణి ఆడిపోసుకోకుండా తమకు చేతనైనంతలో శ్రమిస్తే సమస్యకు పరిష్కారం దొరికే ఉండేది. - ఈ టపా ద్వారా ఈ సంగతి స్పష్టంగా అర్థమౌతోంది.

పోతే, సమస్య ఎక్కడెక్కువుంది, ఎక్కడ లేదు, ఎంపీలాడ్స్ వాడాలా మరోటి వాడాలా - ఇలాంటివన్నీ సూపర్‍ఫిషియల్! బాధితులకు కావాల్సింది సత్వర పరిష్కారం -ఎలా ఇచ్చారన్నది కాదు. నాయకులకు ఉండాల్సింది చిత్తశుద్ధి -విత్తశుద్ధి కాదు.

--------

ఇప్పటివరకూ జలయజ్ఞం క్రింద కుదుర్చుకున్న ఒప్పందాలా విలువలో తెలంగాణా వాట 54% అంత, అంటే ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన 41050 కోట్లలో 22167 కోట్లు తెలంగాణాకే ఖర్చు పెట్టారంట, మరీ మాకు చుక్క త్రాగునీరు రాలేదు అది మొత్తం ఏమి చేసారు మీ సమైఖ్యంధ్ర గూండాలు అంతే, ఇదిగో ఇక్కడ ఇచ్చారు ఆ లెఖ్ఖలు, ఇంకా అనుమానాలు ఉంటే పొన్నాలని అడగాలి మరి, నన్ను కాదు.

Ref:
1.Bhagavan and Raghu .
2.Vaish and Vaish.
3.Partial Defluoridation of a Commnunity Water Supply By HS Horowitz.
4. Stats/Presentations provided by Nalgonda Collector to WB reps. on their visits.
5. Recollected info from people who visited Nalgonda as part of WB Team.
6.Utility of check dams in dilution of fluoride concentration in ground water Bhagavan SV
7.Prevalence of High Fluoride Concentration in Nellore (P.Jagan Mohan, SVL Narayana Rao, KRS Sambasiva rao)
8.www.irrigation.ap.gov.in

Saturday, September 11, 2010

రవిచంద్రకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

25 comments
అంతర్వాహిని ద్వారా మన అందరికీ సుపరిచుతులైన ఇనగంటి రవిచంద్ర శ్రీకాళహస్తీశ్వరుని సాక్షిగా నిన్న చి.ల.సౌ. నీలిమతో ఏడడుగులువేసి, వివాహ భంధంలో అడుగిడిన సంధర్భంగా అభినందనలు.



దంపతులు నిండు నూరేళ్ళు పవిత్రంగా, అన్యోన్యంగా, ఏ అరమరికలు లేకుండా కలిసిమెలిసి జీవించాలని, అష్టఐశ్వర్యాతో, సుఖ సంపదలతో, పిల్లాపాపలతో వారి ఇల్లు కళకళలాడాలని ఆశిస్తూ..




పెట్టిన రెండో రోజే ఘట్టిదెబ్బ తగిలినా,  ఇలాంటి దెబ్బలనే మెట్లుగా పేర్చుకుంటూ బ్ర.బ్ల.స. ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ..

Thursday, September 9, 2010

గ్రహాలపై భారం వేసి ముసుగుతన్ని పడుకుందాం

117 comments
అసలు పాకిస్తాన్లో వరదలు ఎందుకు వచ్చాయి? ఆ దేశ జనాభాలో దాదాపు ముప్పైశాతం మందికి తీరని ఆవేదనని నష్టాన్ని మిగిల్చిన వరదలు ఎలా వచ్చాయి, ఇది ఎదో గ్రహాల ప్రభావమా? ప్రకృతి శాపమా? మానవ తప్పిదాలు, స్వార్ధం ఎమీ లేవా?

ప్రస్తుత వరదలు, తమ తమ ఆస్థులు కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు పచ్చి స్వార్ధంతో, సామాన్య ప్రజలు కోట్ల మంది మరణించినా మాకేంటి నష్టం అనే స్వార్ధంతో చేసిన ఆక్రమణలు, నది దిగువ ప్రాంతాలలో ఉన్న తమ వేలాది ఎకరాల భూములు నీటమునగకుండా కొట్టిన గండ్లు కారణం, దీని గురించి మాట్లాడే ధైర్యం ఆ దేశంలో ఎవరికీ లేకపొవడానికి రెండు కారణాలు మొదటిది, ఆ గండ్లు కొట్టించినవారిలో సాక్ష్యత్తు దేశ ప్రధాని, అధ్యక్షులు, సైన్యంలో కీలకపదవుల్లో ఉన్నవారు కుడా ఉండటం.

దీనికన్నా ముఖ్యం మైనది, ఇది భారతదేశంలో రక్తపాతం సృష్టితున్న ముష్కరులకి వరదలు అనుకోని వరంగా మారడం, సహాయ కార్యక్రమాల పేరిట జమాత్-ఉద్-దవా (JuD) ప్రపంచ దేశాలలో కోటానుకుకోట్ల విరాళాలు సేకరిస్తున్నది, అవి అంతిమంగా ఎవరికి చేరతాయో తెలియంది కాదు, వరదలను ఒక అవకాశంగా తీసుకొని, తన సైన్యాన్ని, పాకిస్తాన్‌లో మూల మూలకు చొచ్చుకుపోయి ఉన్న తన నెట్వర్క్‌నీ ఉపయోగించుకొని, సహాయ కార్యక్రమాల పేరిట ఈ వరదలన్నీ భారతదేశం నిర్మిస్తున్న డ్యములవలనే అని ఒక అబద్ధాన్ని ప్రజలకి బుఱ్ఱలు తొలిచి మరీ పట్టించి, తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. ఇక మన మీద ఆత్మాహుతి దాడులు పెరగడమే తరువాతి, ఈ పరిణామాల వలన మన డ్యాములకి ఇప్పుడు అత్యంత ప్రమాదాం ఏర్పడుతున్నది. తమ తప్పులు ఎత్తని కారణంగా రాజకీయనాయకులు కూడా దీనిమీద ఏ చర్యలూ తీసుకోలేని పరిస్థితి (రేపు తమ పదవులకే ఎసరు పెడుతుందని తెలిసినా).

వరదల వలన, ఆ ముష్కరుల ప్రచారం వలన, మనం ఇప్పుడు పాకిస్తాన్లో దోషులుగా నిలబడ్డాం, ఇప్పుడు ప్రతి ఆత్మాహుతి దాడి వారికి ఆత్మరక్షణగా, మన సైన్యం చంపే ప్రతి ఉగ్రవాది వారికో ప్రత్యక్ష దైవంగా, ధర్మ రక్షకులుగా చిత్రీకరింపబడుతున్నారు..

ఇంత తీవ్ర పరిస్థితులని తమ జ్యోతిష్యం నిజం అని చెప్పుకోవడానికి, ప్రస్తుత పరిస్థితిని తమకి అనుకూలంగా, కేవలం గ్రహాల ప్రభావం వలన జరిగింది అని ప్రచారం చేసుకోవడం, ఆ ప్రచారాకిని అడ్డం వస్తున్నది అని నిజాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయడం.

ఆ ఉగ్రవాదులకు వీరికీ తేడా ఏమున్నదో మరి? నిజాన్ని దాచి చక్కగా దోచుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి హాయిగా వాడుకోవడం అత్యంత హీనం, దివాళాకోరుతనం.

ప్రతిదీ గ్రహాల మీదకో, నక్షత్రాలమీదకో నెట్టేసి నిజాన్ని తుంగలో తొక్కి పడుకుందాం ఏముంది, రేపు ఎవడో మనల్ని చంపో, ఏ ఆడకూతుర్నో మానభంగం చేసి, అది కేవలం గ్రహాల ప్రభావం అని తప్పించుకునే మార్గం కుడా మనమే కల్పిద్దాం..

రండి నా పోరాటంలో భాగం అవ్వండి, హత్యలు, మానభంగాలు కేవలం గ్రహాల ప్రభావమే, నిందితులని వదిలేసి గ్రహాలని నిందిస్తూ మనం ముసుగుతన్ని పడుకుందాం.

-------------------
అక్కడ తీసెవేసిన నా కామెంట్.

SNKR,

మీకు ఏమైన పిచ్చి పట్టిందా? మానవ తప్పిదాలను, ప్రకృతి ఘోరాలను గ్రహభలం మీద నెట్టేసి, అంతా దైవాధీనం అనుకునే స్థితికి దిగజారారా?
పాకిస్థాన్‌లో వరదలు యెందుకొచ్చాయా? నదీపరివాహ ప్రాంతాలని ఆక్రమించి, నది కరకట్టలను నాశనం చేసి ప్యాలెసులు కట్టుకోని, తరువాత తమ ఏస్టేట్లు మునిగిపోతే ఎలా, కోట్లాది ప్రజలు చస్తే తమకేంటి అని రాజకీయనాయకులు నదులకి గండ్లు కొట్టి సృష్టించిన వరదల్లో మీరు జ్యోతిష్యాన్ని వెతుకుతున్నారు? బాగున్నది, ఇదేదో ప్రతి అవినీతికి కుడా అన్వయించి, మర్డర్లు చేసినవాళ్ళని కుడా వదిలేద్దామా?

భూకంపం ఎక్కువగా వచ్చే ప్రమాధం ఉన్న న్యూజిల్యాండ్‌లో ఎప్పుడూ లేని భూకంపమ? ఏమి మాట్లాడుతున్నారు ఆ ముక్క చెప్పేముందు కనీసం సమాచారం సేకరించారా?

http://en.wikipedia.org/wiki/List_of_earthquakes_in_New_Zealand

ఇదిగో పైలంకె చూడండి, మేజర్ భూకంపాల లిస్ట్,
వాహ్, మానవ ప్రయత్నం మానేసి అన్నీ ఎదో గ్రహం మీదకి నెపం తోసేసి, మనం ముసుగుతన్ని పడుకుందాం.

-------------------

ఆలోచనా తరంగాలలో ఎదో గ్రహప్రభావం వలన పాకిస్తానులో వరదలు వచ్చాయి అని వారు చెప్పిన దానికి నిజం చెప్తూ వ్రాసిన నా కామెంట్ ని తీసేస్తే, తన మోసానికి నిజం అడ్డంకి అని నిజాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తే నిజం దాగుతుందా?

Wednesday, September 1, 2010

దిగజారుడుతనం ఎవరిది?

40 comments
పూరిపాక విరచిత అరికాల్లో ఆవగింజ టపాలో కొందర్కి చాలా హేయమైన వాఖ్యాలు కనపడ్డాయి. అది భారత దేశ రాజ్యాంగాన్ని, భారతదేశ గొప్ప గొప్ప నాయకుడ్ని పేరడి చేసి, చాలా అవమానించారు అని తెగ భాధ పడిపోతున్నారు.

--ఇంతలో సరసాల వర్మ నుంచి ఏదో వీడియో క్లిప్ వచ్చింది. ఓపెన్ చేసి చూసాను. ముందుగా కార్క్సూ, జీంగిల్స్ వీళ్ళ స్పీచులు, తర్వాత లంబోద్గారుల స్పీచులు వీటి తర్వాత "నీ దారి అడ్డదారి పోవోయి తీటసారి.. జయించు కోర్టు కేసు.. " --

ఇది వారికి తీవ్ర అభ్యంతరం కలిగించింది.., వారు ఒక నాయకుడ్ని, భారత రాజ్యాంగాన్ని అవమానించారు అని నిశ్చయించుకున్నారు. పోనీ అది ఆ రచయితని ఆ నాయకుడ్ని దృష్టిలో పెట్టుకొని వ్రాశాడో లేదో ప్రస్తుతానికి పక్కన పెడదాం. కానీ దీనిలో, ఆ టపాలో భారత రాజ్యాంగాన్ని తిడుతూ ఎదో అన్నట్టు నాకు కనపడలేదే? అంటే వాళ్ళ వాదనలో బలం రావడానికి వారే కల్పించుకున్నారా?
లేక ఆ నాయకుడ్ని ఏమైనా అన్నచో అది రాజ్యాంగానికి అన్వయించుకోవచ్చా?
అప్పుడు గాంధీని ఏమైనా అన్నచో అది యావద్భారతావనినే అవమానించినట్ట?
నెహ్రూని ఏమైనా అన్నచో అది పార్లమెంటుని అవమానించినట్టా?
జస్టిస్ బాలక్రిష్ణన్‌ని ఏమైనా అన్నచో అది న్యాయవ్యవస్థని అవమానించినట్టా?
కే.సి.ఆర్.ని ఏమైనా అన్నచో అది తెలంగాణా ప్రజలని అవమానించినట్టా?
కంచి శంకరాచార్యని ఏమైనా అన్నచో అది హిందూ జాతిని అవమానించినట్టా?

ఇంకా నాకు తెలియని విషయం ఏంటి అంటే అది అంబేడ్కర్ లేక రోసా లగ్జెంబర్గా? వేరెవరైనానా? వివరణ తీసుకునే ప్రయత్నం చేశారా? పోనీ తమకి నచ్చలేదు, లేక అపార్దాలకి తావిచ్చేవిధంగా ఉన్నది మార్చమని అడిగారా? లేదు, ఎక్కడ ఎవరి మీద బురద చల్లుదామా అని కాసుకుర్చుంటారు..ఎదో పేరు వాడుకోగానే, ఇంక అది తమ నాయకుడ్ని అవమానించినట్టే.., ఆటోమేటిక్ గా, భారతదేశ రాజ్యాంగాన్నో, ఆ నాయకుడి కులస్తులని అవమానించినట్టే..వీళ్ళకి బురద జల్లటానికి అవకాశం దొరికినట్టే.

దేశ రాజ్యాంగాన్నీ కూడా తమ రొచ్చులో నిర్లజ్జగా వాడుకోవడం బహుశా క్షణికావేశంలో జరిగి ఉండవచ్చని
ఆశిస్తున్నాను.కాని పక్షంలో వీళ్ళకు, ఇలా ఉన్నవీ లేనివీ కల్పించి ఆడుకోవడం అలవాటేలే అని ఊరుకోవాలా?

దేశ నాయకులూ, రాజ్యాంగమూ విమర్శలకు అతీతం కాదు. కానీ ఆ విమర్శలు విషయం మీద జరిగితే ఆహ్వానించవలసిందే. కానీ ఇదేంటి, వీళ్ళు చేసుకునే పనికిమాలిన పనుల కోసం, చెత్త గొడవల కోసం దేశ నాయకులనీ రాజ్యాంగాన్నీ వాడుకోవడం ఎంతవరకూ సబబు?

కే.సి.ఆర్.ని ఇది అనగానే, తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బ తీశారు అని, అంబేడ్కర్ ఈ తప్పు చేశాడు అంటే ఎక్కడ వీళ్ళు దళితులని అవమానించాడు అనో, ఇలా రాజ్యాంగాన్ని అవమానించాడు అనో గొడవేసుకుంటారు అనే భయంతో, వారికి నచ్చిన వారు ఏది చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందేనా?

నిజంగా పురిపాక అవమానించాడో లేదో నాకు తెలియదు కానీ, వీళ్ళు మాత్రం ఇలా తమ అవసరం కోసం వారి వారి పేర్లు, భారత రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజలని ఎవరో అవమానించినట్టు చూపించడానికి వీరు చక్కగా అవమానిస్తున్నారు.