blogspot hit counter

Wednesday, July 14, 2010

సౌర విద్యుత్

సైన్సు::1. సోలార్ పానెల్ లోని ఫొటోవోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలెక్ట్రాన్లుగా రూపాంతరణ చేస్తాయి.
2.ఆ వెలుతురుని ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఎలెక్ట్రాన్లుగా మార్చి తద్వారా విద్యుత్ శక్తిగా రూపాంతరణ చేస్తాయి.
అసైన్సు:: ఫొటోవోల్టాయిక్ సెల్ వొల్టేజ్ ని తయారు చేస్తుంది.రేడియేషన్ ఫొటోఎలెట్రిక్ ఎఫెక్ట్ కలిగి వున్న పదార్దాలని తాకినపుడు ఎలెక్ట్రాన్లు అణువుల ఆకర్షక శక్తి నుంచి బయట పాడతాయి. ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఫొటోఎలెట్రిక్ ఎఫెక్ట్ ద్వరా వచ్చిన ఎలక్ట్రాన్లనుంచి వొల్టేజ్ ని బిల్డ్ చేస్తుంది.

సైన్సు::రెండు అణువుల మధ్య రాపిడి జరిగినప్పుడు ఫొటోన్లు వ్యాకోచించి అవి వెలుతురుగా విడుదల అవుతాయి.
అసైన్సు::ప్రోటాన్, ఫోటాన్ రెండు వేరు వేరు ప్రోటాన్లు అణువుల్లో వుంటాయి, ఫోటాన్లు అంటే ఎదైనా విద్యుత్ అయిస్కాంత కిరణాల ప్రాధమిక యూనిట్( Basic), ఏది వెలువడుతుందో మరి అణువుల రాపిడ్లో..
వ్యాకోచించటం అంటే పరిమాణం పెరుగుట, తక్కువ శక్తి స్టేట్ నుంచి ఎక్కువ శక్తి స్టేట్కి వెళ్ళటం; రెండూ పూర్తిగా అసంభంధ విషయాలు.

సైన్సు::సూర్యునిలో హైడ్రోజెన్, ఆక్సీజెన్, హీలియం, నియాన్ లాంటి పదార్థాల అణువులు రాపిడి చెందడం వల్ల సూర్యుని నుంచి వెలుతురు ఎక్కువ వస్తుంది.
అసైన్సు::ఈ అణువులు రాపిడి ఎంటో నాకు తెలియదు మరి, సూర్యుడు, వెలుతురు అంటున్నారు కావున, న్యూక్లియర్ ఫ్యూజన్ అని అనుకుంటున్నాను. న్యూక్లియర్ ఫ్యూజన్ ని తెలుగులోకి అనువదించే అంత పరిజ్ఞానం లేక అలానే ఇస్తున్నాను.
Nuclear fusion is the process by which multiple atomic nuclei join together to form a single heavier nucleus.

సూర్యుని లాంటి చిన్న నక్షత్రాలలో జరిగేది ప్రోటాన్-ప్రోటాన్ చెయిన్ రియాక్షన్, అనగా రెండు హైడ్రోజన్ అణువులు కలిసి ఒక హీలియం అణువు ఏర్పడటమే ఎక్కువగా జరుగుతుంది, మరి ఈ రాపిడి ఎంటో భూత విద్య లాగా వున్నది.
ప్రోటాన్-ప్రోటాన్ చెయిన్ రియాక్షన్ గురించి, దానిలో శక్తి ఎంత వెలువడుతుంది, ఎలా వెలువడుతుంది అనే వివరాల కొఱకు ఇక్కడ చూడగలరు.

సైన్సు::ఎండగా ఉన్న రోజు సూర్యరశ్మి చదరపు మీటర్ భూభాగానికి 1000 వాట్ల విద్యుత్ శక్తిని ఇవ్వగలదు.
అసైన్సు::ఇది చాలా పెద్ద లెఖ్ఖ, ప్రస్తుతం వున్న మొనో, పాలీ క్రిస్టలైన్ సెల్ ఒకటి 1.5 వాట్ పవర్ ని ఉత్పత్తి చేయగలవు, కాబట్టి ఒక 30-40 సెల్స్ కలిపి ఒక మాడ్యూల్ గా తీసుకుంటే అది సుమారుగా 40-60 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలవు అదీ బాగా వెలుతురు ఉనట్టు ఐతేనే. ఒక్కో మాడ్యూల్ అటుఇటుగా అర చదరపు మీటరు ఉంటుంది. ఇది సైన్సు చెప్పిన దానిలో 8-12 శాతమే.
ఇంకో విదంగా చూస్తే, ఒక 1000 చదరపు అడుగుల స్థలం తీసుకుందాం, అనగా సుమారు 95 చదరపు మీటర్లు, మనకి సూర్య శక్తి లభ్యత 4-7 KWh/m2 అంటే 4*95 - 7*95 = 380 - 665KWH* == 1296674BTU - 2269179 BTU, ఇదే వేడిని విద్యుత్ శక్తిగా మర్చాలి అంతే 30 శాతం పైనే శక్తిని ఉపయోగించుకోలేము అనుకుంటే, గంటకి 265.8 KWh -465.2 KWh పైనే అంటే చదరపు మీటర్ కి వచ్చి 3-5 కిలో వాట్/గంటకి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు, అంటే ఒక గంటలొనే 3-5 యూనిట్ల విద్యుత్ శక్తి(957000000W - 1675000000W). ఇది సైన్సు చెప్పిన దానికన్నా (1000W) వేల రెట్లు ఎక్కువ. అదే అమెరికా లొ ఐతే, 1 యూనిట్లని మాత్రమే ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది (సగటు లభ్యత 1500KWh మాత్రమే కావున).

## దగ్గర్లో సున్నాలకి మార్చి (158880 ని 150,000గా) దాదాపుగా వేసినవే, కావున తప్పులు ఉంటాయి మన్నించగలరు.
**ఆంగ్లము వాడిన పదాలకి తెలుగులో సమాన పదాలు తెలిస్తే చెప్పండి, టపా మారుస్తాను, నేనూ నేర్చుకుంటాను.

సైన్సు సోర్సు:http://science.praveencommunications.firm.in/2010/06/solar-panels.html
అసైన్సు సోర్సులు:వికీ
*నా తప్పుని ఎత్తి చూపిన అజ్ఞాతగారికి ధన్యవాదములు. (అనవసరంగా 1000 పెట్టి హెచ్చ వేశాను)

27 comments:

Anonymous said...

అమెరికాలో చైనా టౌన్ వుంది. అందులో ఒక సందు చివర జీవచ్ఛవ బ్యాటరీల్నమ్మే సొలార్మావో ఫోటుంగ్ ఇలా రాసాడు.."ఒక మగ ఫోటాను, ఒక ఆడ ఫోటాను ఢీకొట్టుకొన్నప్పుడు ప్రళయం సంభవిస్తుంది. ఆ ఎర్రెర్రని విప్లవ ప్రళయంలోనుంచే రక్తరహిత సమాజం, ముక్కూడిన బూర్జువా పతనం పుట్టుకొస్తాయి."

ఈ ముక్కోపదేశానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చితీరాలని ఆంధ్రాలో రాఘవులు, చైనాలో చింగ్ పింగ్ డిమాండ్ చేస్తున్నారు. మీరూ డిమాండ్ చేస్తున్నారా? ఐతే "158880" ఈ నెంబర్ కు ఎస్ ఎం ఎస్ పంపించండి.

durabhimaani said...

సూర్యుడు సూర్యరశ్మినే ఇస్తాడు, చంద్రరశ్మిని ఇవ్వడు. ఈ విషయాన్ని సూర్యోవ్ రస్మోమన్ 1790లో రాసిన పుస్తకంలో చదివాను.

మీకు ర వత్తు రాయడం తెలీక ఫోటాన్, ప్రోటాన్ వేర్వేరు అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చోడినా? చైనాలోని చించుతుంచుపంచు యూనివర్సిటీ నుంచి పీజీ చేశాను.

నేను చిన్నపుడు సూర్యుని మీదకు వెళ్ళినపుడు హైడ్రోజన్, ఆక్సిజన్, తొక్కోజన్, తోలోజన్, బొందియం, పిండాకూడియం ఒకదాన్నొకటి గోక్కోవడం బరుక్కోవడం చూశాను. అప్పుడే వెలుతురు వస్తుంది. రాత్రి పూట అవి దుప్పటి కప్పుకుని పడుకుంటాయి కాబట్టి మనకు సూర్యుడు కనిపించడు.

మతి తప్పిన జంతిక వాదాన్ని నమిలి మింగిన నాకు చెయిన్ రియాక్షన్ గురించి తెలీదా? రెండు సైకిల్ చెయిన్లు కలిసి స్కూటర్ చెయిన్ గా మారతాయి. దీన్నే చెయిన్ రియాక్షన్ అంటారు. వీటిని నెను సమైక్య గూండాల చేతిలో చూశాను. మొదట పొద్దున్నే బ్రాందీ తాగి రానపుడు సైకిల్ చైన్లు కనబడ్డాయి. తర్వాత మధ్యాహ్నం బ్రాందీ తాగి వచ్చాక రియాక్షన్ జరిగి స్కూటర్ చైన్లు అయ్యాయి. ధనిక భూస్వామ్య బూర్జువా దేశాల్లో చెయిన్ రియాక్షన్ తక్కువ. అందుకే అక్కడ చల్లగా వుంటుంది. భూమద్య రేఖకు దగ్గాగా ఉన్న తాడిత పీడిత దేశాల్లో ఇది ఎక్కువ. ఆఫ్రికాలో స్కూటర్ చైన్లు మెడలో వేసుకుంటారు. మావో మొలతాడుగా చైన్ కట్టుకోవడం నేను చూశాను.

Anonymous said...

ఇంకో విదంగా చూస్తే, ఒక 1000 చదరపు అడుగుల స్థలం తీసుకుందాం, అనగా సుమారు 95 చదరపు మీటర్లు, మనకి సూర్య శక్తి లభ్యత 4-7 KWh/m2 అంటే 4*95 - 7*95 = 380,000 - 665,000KWH

----
పై లెక్కను వివరించగలరు. నా ప్రకారం:

4-7KWH/m2 = (4-7)*95 KWH/1000ft2 = (380-665) KWH/1000ft2 = (380-665)*3412 BTU /1000ft2 = (1296560-2268980) BTU/1000ft2

ఇలా ఐతే సైన్సు చెప్పిన లెక్క సరిపొతుందేమో చూడగలరు.

తార said...

అజ్ఞాత గారు నేను K (kWh) వున్నది కదా అని చివర మూడు సున్నాలు చేర్చాను, తప్పు నాదే, కానీ సైన్సు చెప్పింది 1000 వాట్స్ కదా, 1000 కిలో వాట్ హవర్స్ కాదు కదా. కాబట్టి రెండు లెఖ్ఖలు సరి పోలటం లేదు.

Anonymous said...

అంటే ఒక గంటలొనే 3-5 యూనిట్ల విద్యుత్ శక్తి(957000000W - 1675000000W). ఇది సైన్సు చెప్పిన దానికన్నా (1000W) వేల రెట్లు ఎక్కువ.

---

మొదటి పేరా పెద్దగా అర్థం కాలేదు...( "మనకి సూర్య శక్తి లభ్యత 4-7 KWh/m2" - సుర్య శక్తి 4-7 ఎలా వచ్చింది? )

ఆ తరువాత మీ లెక్కను చూస్తే 1000 తేడా కనిపించింది. ఆది మాత్రమె సరి చేసాను. ఆసలు సూర్య రస్మి ఎంతొస్తుందో, ఆ ఫోటొన్స్ గుద్దుకుని ఎంతిస్తాయో ఏంటో..

తార said...

--మనకి సూర్య శక్తి లభ్యత 4-7 KWh/m2.
ఇది శాస్త్రవేత్తలు లెఖ్ఖగట్టినది.

మొదటి పెరా నేను తెలుగులో సరిగ్గ వివరించలేక పోయాను. కానీ ఎలెక్ట్రాన్లు విడుదల అయ్యేది Photoelectric effect మూలంగా, Photoelectric effect, photovoltaic effect రెండూ వేరు అని చెప్పటమే నా ఉద్దేశం

Anonymous said...

మొదటి పెరా నేను తెలుగులో సరిగ్గ వివరించలేక పోయాను
--
లేదు ఆ పేరా కాదు. అదే పాయింట్ లొ పై పేరా..

(అసైన్సు::ఇది చాలా పెద్ద లెఖ్ఖ, ప్రస్తుతం వున్న మొనో, పాలీ క్రిస్టలైన్ సెల్ ఒకటి 1.5 వాట్ పవర్ ని ఉత్పత్తి చేయగలవు, కాబట్టి ఒక 30-40 సెల్స్ కలిపి ఒక మాడ్యూల్ గా తీసుకుంటే అది సుమారుగా 40-60 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలవు అదీ బాగా వెలుతురు ఉనట్టు ఐతేనే. ఒక్కో మాడ్యూల్ అటుఇటుగా అర చదరపు మీటరు ఉంటుంది. ఇది సైన్సు చెప్పిన దానిలో 8-12.)

తార said...

ఇది US Govt.(సదరు Dept.) ఇచ్చిన లెఖ్ఖ,
ఒక్కో సెల్ 1.5 పవర్ జెనరేట్ చేస్తాయి, 30-40 సెల్స్ ఇని సిరీస్, పేర్లల్‌గానో కలిపితే ఒక మాడ్యూల్ అవుతుంది అంట, ఒక్కో మాడ్యూల్ 1/2 చదరపు మీటర్ విస్తీర్ణం అట, ఒక్కో మాడ్యూల్ 40-60వ్ జెనరేట్ చేస్తుంది, DC ని AC కి మార్చేటప్పుడు 4-12 శాతం లాస్ వుంటుంది., అని రాసారు.

కమ్మి said...

కమ్యూనిస్టులు అసలు విద్యుత్ కే వ్యతిరేకమ్,చైనాలొ, రష్యాలో మత్రమే విద్యుత్ వాడాలి.

Nrahamthulla said...
This comment has been removed by the author.
Nrahamthulla said...

సోషలిజం+విద్యుచ్చక్తి=కమ్యూనిజం అన్నాడు లెనిన్

తార said...

Nrahamthulla గారు
అవును రష్యాకి, చైనాకి ఆ వెసులుబాటు వున్నది అని అజ్ఞాత చెప్పారు కదా, నేపాల్ చూడంది, కమ్యూనిస్టులు ఎన్ని విద్యుత్కేంద్రాలను ధ్వంసం చేసారో.
ఐనా మీకు ఇన్ని విషయాలు ఎలా గుర్తుంటాయండి? ఆ మెమరీ సీక్రెట్ ఎంటో చెప్పి పుణ్యం కట్టుకోండి.

---
Nrahamthulla చెప్పారు...
ఈ పోస్ట్‌ను బ్లాగు రచయిత తొలగించారు.
----
నేమీ తొలిగించలేదండి, బాబోయి ఈ బ్లాగర్ సాఫ్ట్వేర్ ఎవడు రాసాడో కానీ ఎన్ని బగ్సో

durabhimaani said...

భూమి నుంచి సూర్యునికి కొత్తగా రోడ్లు వేయడం వల్ల కాంతి 2 నిముషాలు తొందరగా చేరుకుంటోంది. అలాగే విశాలంగా సూర్య కిరణాలు పడుతున్నాయి. 100కి 200 వస్తోంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే 1790 లో సూర్యోవ్ రష్మొమన్ రాసిన పుస్తకం చదవాలి.
నేను చిన్నపుడు ఒరిస్సా వెళ్ళినపుడు అక్కడ రోడ్లు సరిగా లేవు కాబట్టి 9 గంటలైనా సూర్యుడు పుట్టేవాడు కాదు.

Anonymous said...

నేమీ తొలిగించలేదండి, బాబోయి ఈ బ్లాగర్ సాఫ్ట్వేర్ ఎవడు రాసాడో కానీ ఎన్ని బగ్సో \
-----
మీరు అనవసరం గా బ్లాగర్ సాఫ్ట్వేర్ ని తిడుతున్నారు ఇది టెంప్లేట్ బగ్. ఇంతకూ ముందు ఒక సోరకాయ్ , ఆ సోరకాయ్ తోక తెగ రెచ్చిపోయారు ఇది తెలియక .

తార said...

అజ్ఞాత గారు, అది టెంప్లెట్ తప్పు ఎలా అయ్యిందో వివరించగలరా?

Anonymous said...

@అజ్ఞాత , Wow, templates also can delete blogger comments..what an excellent conclusion.keep it up.

Anonymous said...

పిచ్చి అజ్ఞాత కామెంట్ రాసిన వాళ్ళు డిలీట్ చేస్తే అది బ్లాగు రచయిత డిలీట్ చేసారు అని చెబుతుంది అది విషయం . అంత రెచ్చిపోతున్నావ్ మనం కూడా అదే గ్రూపా .
తార గారు మీకు అర్ధమైంది అనుకుంటాను .

తార said...

కామెంట్ రచయిత అని కాకుండా బ్లాగ్ రచయిత అని వస్తున్నది, ఇది బ్లాగర్ వాడు తర్జుమా చేసేటప్పుడు చేసిన తప్పు అయ్యుండొచ్చు.
అదే కాకుండా ఇంకా వింత వింతగా ప్రవర్తిస్తున్నది, దాని వలన లేనిపోని తలనొప్పులు అందుకే బ్లాగర్ కోడ్ ని అన్నాను.

Anonymous said...

కామెంట్ రచయిత అని కాకుండా బ్లాగ్ రచయిత అని వస్తున్నది
-------------------------------------------
ఇది కొన్ని టెంప్లేట్లలోనే వస్తుంది సో అది టెంప్లేట్ ప్రోబెం బ్లాగర్ ఇస్తున్న మెసేజ్ సరిగా తర్జుమా చేయటం లేదు.
అదే కాకుండా ఇంకా వింత వింతగా ప్రవర్తిస్తున్నది
------------------------
ఐతే వాకే నండి.

Anonymous said...

@last అజ్ఞాత,అంటే టెంప్లేట్స్ భాషను తర్జమా కూడా చేయగలవా?

తార said...

తర్జుమా ఎవరి భాద్యత? బ్లాగర్ చేస్తుందా? టెంప్లెట్ డిజైనరా?
లాంగ్వేజ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ వుంటాయా?
ఉండక పొతే తర్జుమా తప్పు బ్లాగర్ దే కదా?

Anonymous said...

అది ఎవరి బాధ్యతో గాని తెలియనీకి మీ బ్లాగులో మీరే కామెంట్ పెట్టి మీరే డిలీట్ చేయండి అల్లాగే వేరే క్లాసిక్ టెంప్లేట్ ఉన్న బ్లాగులో కూడా ట్రై చేయండి తేడా చూడండి తరవాత తిట్లతో కుమ్ముదాం .

ranjani said...

బ్లాగు టెంప్లేటులో సవరణ అవసరమైతే - బ్లాగ్ గురువునో / గూగులు
తెలుగు బ్లాగర్ల గుంపునో సంప్రదించండి . పరిష్కారం కోసం చూడాలికానీ...

http://telugublogtutorial.blogspot.com/

http://groups.google.com/group/telugublog/?pli=1

http://superblogtutorials.blogspot.com/

http://mahigrafix.com/forums/

తార said...

ranjani గారు
చూడాలి కానీ.. తరువాత??

అజ్ఞాత గారు, అలా చూసాను, కానీ నాకు బ్లాగ్ రచయిత తొలిగించారు అనే వస్తున్నది, అలా రాని టెంప్లెట్ ఎదో చెప్తే దానికి మారుస్తాను.

Giri Dornala said...

సైన్సుకి సోర్సులేమైనా ఉన్నాయా?

తార said...

సైన్సుకి సోర్సు ఐతే ఇచ్చాను, అసైన్సుకి ఐతే అక్కరలేదు, అది మామూలు లెఖ్ఖే, మీర ఆ థీరీ చదువుకుంటే సరిపోతుంది..

Giri Dornala said...

నా పోస్టు ఈ టపాకి కాదు.పొరపాటున పడింది.