blogspot hit counter

Thursday, August 19, 2010

ఈనాడు చైనా పత్రికా?

11 comments

ఇది ఈరోజు ఈనాడు (ఆన్‌లైన్ ఎడిషన్ లో కనిపించిన)లో ప్రచురించిన పటం.

ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన "న్యాయ పోరాటంలో భారత్ విజయం" లో ఇచ్చిన భారతదేశ పటం చూడగానే ఒళ్ళు మండి పోయింది, ఈ విధంగా మన దేశ సరిహద్దును మార్చటం ఈనాడుకి కొత్తేమీ కాదు పూర్వం భూటాన్ గురించి ప్రచురించినప్పుడు ఈవిధంగానే కాశ్మీర్‌ని పాకిస్తాన్‌తో కలిపేశారు, తరువాత హాకీ ప్రప్రంచకప్ గొడప్పుడు, ఆ తరువతా పోయిన మార్చిలో, మళ్ళీ ఇప్పుడు...ఇప్పుడు కొత్తగా అరుణాచల్‌ప్రదేశ్ ని కుడా చైనా భారతదేశ పటాన్ని ఎలా ప్రచురిస్తుందో, అదే తీసుకొచ్చి వేశారు..
ఇదే విషయం పై సుప్రీం కోర్ట్ పూర్వం ఇలా వివాదాస్పదంగా భారతదేశ సరిహద్దుని ప్రచురించటం క్రిమినల్ చర్యే అని, పత్రికలు ఇలాంటి వాటికి పూనుకోవద్దను సూచిస్తూ ఇదివరకే తీర్పు ఇచ్చింది, కాబట్టి, ఈనాడు సుప్రీం కోర్ట్ ని కుడా ధిక్కరించింది..
ఇప్పటికి చాలా సార్లు ఈనాడుకి ఫోన్(ఈనాడూ సోమాజీగూడ కార్యాలయానికి) చేసి చెప్పినా తన ధోరణి మార్చుకోలేదు. కానీ ఈనాటి ఆ పటం మార్పు ఈనాడుకి పెద్ద శిక్ష పడేవిధంగా లేదు, కావున న్యాయపోరాటానికి ప్రస్తుతం పూనుకోవటం లేదు. పూర్వం క్రిమినల్ కేస్ పెట్టినా అది ఏమయ్యిందో పట్టించుకోలేని విధంగా సమస్యలు చుట్టుముట్టడం వలన ఈనాడును కోర్ట్‌కీడ్చలేకపోయాను. మాళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని పాక్‌లో భాగంగా చూపించే ధైర్యం చేస్తే మాత్రం నేను ఊరుకోను.

Wednesday, August 4, 2010

జ్యోతిష్యంలో సైన్సు...

75 comments
సైన్సు: గ్రహాల ప్రభావం మనుషుల మీద తప్పక ఉంటుంది, అసలు జ్యోతిష్యం పెద్ద సైన్సు, కావాలంటే చూడు పౌర్ణమి రోజు పిచ్చి పెరుగుతుందని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు...

అసైన్సు: నిజమా?? ఏ డాక్టరు? జోతిష్యం వేరు సైన్సు వేరు, గ్రహాలు ఎక్కడ ఉన్నాయో(coordinates) అని చెప్పేది వేరు, గ్రహాలు ఏమి ప్రభావం చూపిస్తాయో వేరు, అన్నీ ఒకటే అని చెప్పటమే పెద్ద చతురు. అసలు మనం తర్కంతో వాదన ఎందుకు, మన లెఖ్ఖలు మనకుంటేను.

న్యూటన్ సిద్దాంతం ప్రకారం ఎదైనా రెండు వస్తువుల మధ్య వుండే ఆకర్షణ F = Gm1m2/ r2 N kg2 m-2 .

ఇప్పుడే పుట్టిన శిశువుని తీసుకుందా, శిశువు ౩కే.జీ. బరువు ఉంటే, ఆ శిశువు పై మన నవ గ్రహాలు చూపించే శక్తి ఎంతో చూద్దాం.

అంకెలలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, గ్రహాల మధ్య దూరం సమానంగా ఉండదు, నేను థియరీ ప్రకారం భూమికి అత్యంత దగ్గిరగా వచ్చినప్పటి దూరాన్ని ప్రామాణికంగా తీసుకున్నాను. ఇప్పుడు కుజ గ్రహాన్నే తిసుకుంటే అది పది లక్షల సంవత్సరాలకి ఒక్క సారి భూమికి అత్యంత దగ్గిరగా(55 లక్షల కిలోమీటర్లు ౨౦౦౩) వస్తుంది, కానీ నేను ఎప్పుడూ 55 లక్షల కిలోమీటర్లు దూరంలొనే ఉన్నట్టు తీసుకున్నాను, దీనివలన ఆ గ్రహ బలం ఎప్పుడూ అత్యంత ఎక్కువగా ఉంటుంది.


గ్రహం శిశువుపై ప్రభావం (న్యూటన్ లలో)

సూర్యుడు 0.011,78

చంద్ర 0.000,099,5

కుజ 0.000,000,042,47

బుధ 0.000,000,011,5

గురు 0.000,000,47

శుక్ర 0.000,000,674,9

శని 0.000,000,079,354,52

ఈ లెఖ్ఖన అత్యంత బలమైనది సూర్యుడు>చంద్ర> శుక్ర> గురు> శని> కుజ> బుధ.
మరి రాహు, కేతువులకి అసలు శక్తి లేదు, ఎందుకంటే వాటికి ద్రవ్యరాసి(మాస్) నున్నా కదా..

సరే పిల్లోడు పుట్టేటప్పుడు, అక్కడ తల్లి, ఇంకో ౩ సహాయకులు ఉన్నారు అనుకుందాం.. వారి సగటు బరువు 60 కేజి. ఐతే, వారి బలం శిశువుపై 0.000,000,048 (సగటు దూరమ్ ౩ అడుగులు అనుకుంటే), అంటే ఇది కుజ, బుధ గ్రహాల కన్నా ఎక్కువ.

అదే శిశువు పుట్టింది పెద్ద హాస్పిటల్‌ల్లో ఐతే, ఆ హాస్పిటల్, దానిలోని మనుషుల ప్రభావం చాలా ఎక్కువ, సరదాకి శిశువు పుట్టిన గది 15x15 అడుగులది ఐతే, దాని ప్రభావం 0.000,000,022 (వెయ్యి కేజిల బరువు ఉంటే) అంటే బుధ గ్రహం కన్నా శక్తివంతమైనది, అదే ఆ హాస్పిటల్, ఆ ఊరిలో ఉన్న చెట్లు, చేమలు, ఇల్లు, ఈగలు, దోమలు అన్నీ పరిగణించి చుస్తే (ఒక కి.మీ. దూరంలో ఉన్న సమస్తం పది లక్షల కే.జీ. ఉంటే) వాటి బలం 0.000,000,200 (దాదాపుగా), అంటే శని కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి..

ఇలా మనం అన్నీ ఒక్కోటిగా పరిగణలోకి తీసుకునే కొద్దీ వాటి ప్రభావం పెరుగుతుంది (భూమి ఆకర్షణ దాదాపు 10 కదా మరి).
అంటే ఎక్కడో వున్న గ్రహాల కన్నా మన చుట్టు ఉన్న పరిసరాల ప్రభావమే మన మీద ఎక్కువ ఉన్నప్పుడు, వీటిని పరిగణలోకి ఎందుకు తీసుకొనరు జాతకంలో?

మనిషి పెరిగే కొద్దీ గ్రహ ప్రభావం కుడా పెరుగుతుంది కదా మరి, అలాంటప్పుడు పుట్టినప్పటి గ్రహ ప్రభావమే ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు?

సరే స్థల ప్రభావం చుస్తే, భూ మధ్య రేఖ దగ్గిర భూమి వ్యాసం (డయామీటర్) 12756కి.మీ. ఐనా సూర్యుని ప్రభావం ఎక్కడో ఇరవయ్యో స్థానం లో మార్పు వస్తున్నది, (నా క్యాలుక్యులేటర్ ఆ పరిధిలో లేదు), మిగతా గ్రహాల సంగతి చెప్పక్కరలేదు. మరి ఐతే ఒకే సమయంలో పుట్టినవారు అందరూ ఒకే విధమైన ప్రభావాన్ని ఎదుర్కోంటారు కదా, మరి తేడాలేల??

సరే మరి ఈ ప్రభావం కాదు, రేడియేషన్ అనుకుందామనుకున్నా అది లెక్కేయ్యటానికి సూపర్ కంప్యుటర్ కావాలి. (సూర్యుని లెక్క ఇదివరకే ఇచ్చాను), ఐనా ఆ గ్రహాల కన్నా ఇంట్లో బల్బే ఎక్కువ రేడియేషన్ వదులుతుంది మన మీద..

భౌతిక ధర్మాలు అన్నీ అందరి మీదా సమానంగానే పనిచేస్తాయి, మరి అలాంటప్పుడు ఒకరికి రాహువు పదవి ఇస్తుంది, ఇంకోరికి రాహువే పెళ్ళి చెస్తాడు, మరి దానివెనుక ఏ భౌతిక సూత్రాలు ఉన్నాయి మరి?
ఒక గ్రహం కడుపుకి అధిపతి, ఇంకో గ్రహం గుండెకి అధిపతి, ఏ వైద్య శాస్త్ర ప్రమాణాల ప్రకారం?

వీటన్నిటికీ సమాధానం సైన్సులో ఐతే లేదు మరి, తర్కం లో ఉన్నదెమో, లేక నమ్మకంలో ఉన్నదెమో, కానీ జ్యోతిష్యం లో సైన్సు సున్నా..

కాబట్టి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, ఇలవేల్పులౌతారు.. అది మాని జాతకం అని కృషిని మరువకండి.

dhurabhimani గారి గోపాళం అండ్ కో ఎక్కాల పుస్తకం సౌజన్యంతో.

తర్కం ప్రయోగించి ఇచ్చే ప్రశ్నలకి జవాబులు నా నుంచి ఆశించకండి..ఎదైనా వెరే లెఖ్ఖలు ఉంటే మాత్రమే చెప్పండి, నేను తర్కబద్దంగా వాదించలేను..

మీకు ఇతర సాంకేతిక వివరాలు కావాలి అనుకుంటే నాకు ఒక ఉత్తరం పడెయ్యగలరు.