blogspot hit counter

Monday, December 20, 2010

దిష్టి తీయడం ఎలా?

ఈ మధ్య బొత్తిగా అసైన్సు వైపు వెళ్ళడం లేదు కదా, సరదాగా ఒక టపా, ఎక్కడో నేస్తంగారు నన్ను తల్చుకున్నారట అందుకే ఇది.
దిష్టి అంటే పరుల దృష్టి వలన వచ్చే దోషమట, అదేదో బాలయ్య సినిమాలో తొడగొట్టి రైలుని వెనక్కి పంపినట్టు, ఇది సాధ్యమేనా? ఎవరో చూడగానే పిల్లలకి ఆరోగ్యం చెడిపోతుందా? నరుడు దృష్టి తగిలితే... నల్లరాయి అయినా బద్దలైపోతుందట, నిజమేనా? సరే నిజమనే అనుకుందాం, అంత శక్తి ఉత్పత్తి చేయగలదా మన కన్ను? సరే మరింత Larger and Wider Platform కి పోదాము, చేతబడులు మనుషులని చంపగలవా? అలానే అవేవో క్రియలు కూడా?

అసైన్సు:: అసలు మనిషిని చంపడానికి ఎంత శక్తి కావాలి? ఇదేదో శక్తి కేంద్రాల సంగతి కాబట్టి మనం కుడా అదే తీసుకుంటే పోలా? లీతల్ డోస్ 9×102 J, మరి ఇంత శక్తి మన శరీరం తయారు చెయ్యగలదా?
సైన్సు :: శుబ్బరంగా, E / m = c2 = (299,792,458 m/s)2 = 89,875,517,873,681,764 J/kg (≈9.0 × 1016 joules per kilogram) ఒక గ్రాములో ఉన్న శక్తి హిరోషిమా మీద వేసిన బాంబు కన్నా ఎక్కువ అట, ఇంకేమి, కంటి చూపుతో చంపడం సాధ్యమే. ఇంతకంటే ప్రూఫ్‌లేమి కావాలి?

అసైన్సు:: సరేనయ్యా నేను మా ఊరిలో స్మశానంలో చేతబడి చేస్తానయ్యా, నా శత్రువు అడ్రస్సు, లేదా ఫలానా వ్యక్తిమీదకి ప్రయోగిస్తున్నాను అని ఆ శక్తికి చెప్పడం ఎలా?
సైన్సు ::  దానికి వెంట్రుకలో, గోళ్ళో కావాలి?

అసైన్సు:: ఐతే నువ్వు ఎవో మంత్రాలు చదివో, ఇంకేదో చేసో సృష్టించిన శక్తి, ఆ వెంట్రుకలో, గోళ్ళో పట్టుకోని వెళ్ళి, D.N.A టెస్ట్లు చేసుకొని ఆ మనిషిని పట్టుకుంటుందా?


సైన్సు ::  మనిషి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి చంపగలదు చేతబడి సరిగ్గా చేస్తే

అసైన్సు:: పవర్ఫుల్ స్నైఫర్ తుపాకీలే ఒక మనిషిని కచ్చితంగా చంపగలగాలి అంటే ఆ మనిషి 1కి.మీ. లోపే ఉండాలి, కానీ ఈ చేతబడి ఎవర్ని ఐనా, ఏ దేశాంలో దాక్కున్నా వెతికి మరీ చంపుతుంది అంట, ఐతే దానికి ఎంత శక్తి కావాలి? అధమం 1% రీకాయిల్ వేసుకున్నా, ఆ చేసినోడి బాడీ పార్ట్లు ఏ ముక్క ఎక్కడ పడిండో వెతుక్కోవడానికి నెల పైనే పడుతుందేమో. Law of conservation of Mass/ Energy ప్రకారం, అసలు ఆ మనిషి మిగిలి ఉంటాడా ఆవిరి ఐపోతాడా?

సైన్సు :: సరేనయ్య, ఎదో ఒకటి చేసి, చచ్చో బ్రతికో, లీతల్ డోస్ తయారు చేస్తాను, టార్గెట్ మనిషి అడ్రస్సు లాటిట్యూడు, లాంగిట్యూడు కూడా మాప్ మీద పెట్టి ఉన్నది, అప్పుడేమి చేస్తావు?
అసైన్సు:: రేడియేషన్, అదీ ఇంత శక్తిగలది అట్టా దేశం మీదకి వదిలితే ఎవదో ఒకడ్నే ఎట్టా చంపుద్ది, మధ్యలొ వచ్చిన ప్రతిదాన్నీ బూడిద చేసి కానీ వదలదే, సర్వ నాశనం తప్ప, ఒక్క మనిషినే ఎట్టా చంపుద్దయ్యా?


దిష్టి కుడా ఇంతే కదా మరి, అదీ సున్నితమైన కన్ను రాళ్ళని బద్దలు కొట్టే శక్తిని తయారు చేయగలదా? చేసే క్రమంలో కంటికి ఏ చిన్న అపాయం కుడా జరగదా? 1% వేడిని గ్రహించినా, కన్ను మాడి మసైపోతుంది.

సో, మీకు ఎవరిదో దిష్టి తగిలింది అనుకుంటే, ఎమ్మటే వాడి కళ్ళు మాడిపోయాయేమో చూడండి, అప్పుడు దిష్టి తీసుకోండి, పనిలో పనిగా ఆడ్ని పట్టుకోండి, వేల కోట్లు ఇచ్చి మరీ కొనుక్కు పోతారు ఆ మనిషిని, అలా ఎట్టా చేయగలిగాడో అని.

8 comments:

Sujata M said...

good. Enjoyed ur blog. Nice to see this stuff in Telugu.

Indian Minerva said...

Welcome back

రాజ్ కుమార్ said...

keka post...:)

Anonymous said...

సుజాతగారు, మొదటిసారి అనుకుంటాను కదా, మీరు ఇక్కడ కామెంటు పెట్టడం,
ధన్యవాదాలు.

Indian Minerva గారు, వేణూరాం

ధన్యవాదాలు.

నేస్తం said...

>>>> మీకు ఎవరిదో దిష్టి తగిలింది అనుకుంటే, ఎమ్మటే వాడి కళ్ళు మాడిపోయాయేమో చూడండి
మరి అప్పుడు నా బ్లాగ్ కి దిష్టి పెట్టేసారుగా మరి మీ కళ్ళు ఎలా ఉన్నాయో చెప్తెనే మీ పోస్ట్ నమ్ముతాను :)
baagaa raasaru :)

Anonymous said...

అదేంటి, ఎవరిదో దృష్టి తగిలే కదా అసైన్స్ బ్లాగ్ సంకలినులనుంచి మాయామయ్యింది? :)

Anonymous said...

I thought this blog is deleted.

Mauli said...

Taara,


ivvalE chusanu,meeru ee blog lo nannEdo adugutunnaaru, ardham kaaledu. can u pls be clear what it is.

http://krishnaveniteeram.blogspot.com/2011/07/blog-post_25.html