blogspot hit counter

Monday, September 27, 2010

ఏది సత్యం? ఏది సత్యాన్వే(వే)షం??

నాకు ఈ మధ్యనే కొన్ని నిజాలు తెలిశాయి, ఒకటి తెలంగాణాలో మాత్రమే ఫ్లోరైడ్ భాదితులు ఉన్నారు అని, ఇంకోటి, ఆ ఫ్లోరైడ్ సమస్య తిరడానికి ఒక్క కృష్ణ నదీ జలాలే తాగాలి అని.
నేను తెలంగాణాకి అనుకూలమో, వ్యతిరేకమో పక్కన బెట్టి, అసలు ఫ్లోరైడ్ సమస్య గురించి చూద్దాం.

ఈ ఫ్లోరైడ్ సమస్య నల్గొండ ఒక్క జిల్లాలోనే లేదు, మెదక్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం ఇలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎనిమిది కోట్ల మందికి ఎక్కువగానో, మరి ఎక్కువగానో దీని భాదితులే. పటం చూడండి, ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు మన దేశంలో.



ఇంక రెండో విషయానికి వస్తే, మరి దీనికి విముక్తి?

1. మొదటిది సమతులాహారం, క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వలన, టీ, కాఫీలాంటివి పూర్తిగా మానేయడం ఇలా, ఆహారపూ అలవాట్లతోనే చాలా ధూష్ఫలితాలు నియంత్రించవచ్చు. కానీ,

2. పూర్తిగా నివారించాలి అంటే మాత్రం స్వచ్చమైన నీటిని త్రాగవలసిందే, స్వచ్చమైన నీటితోనే ఆహారం వండుకోవాలి.
సరే, మరి సమతులాహారం మీద నల్గొండలో ప్రజలకి ఎంత అవగాహన కలిగించారో అంటే ఉన్నకొద్ది మంచి ఆహారం తీసుకోవడం మాత్రం చాలా తగ్గిపోతున్నది అని వరల్డ్ బ్యాంక్ వారు పర్యటించినప్పుడు తేలింది.

దీన్ని వదిలేద్దాం, ప్రభుత్వం కన్నా ఎక్కువగా కొంత మంది వ్యక్తులు, సంఘాలు ఈ ఫ్లొరైడ్ సమస్య మీద ఎక్కువ కృషి చేస్తున్నాయి.

వారు ఎల్లారెడ్డిగూడలో (నల్గొండలోకెల్ల అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ నీటిలో కలిగిన గ్రామం) మొత్తం ఇరవై తొమ్మిది శాంపిల్లు సేకరించగా నాలుగు శాంపిల్లలో ఫ్లోరైడ్ శాతం తక్కువగా, సరియైన మోతాదులో ఉన్నది, అంటే ఆ ప్రదేశాల్లో, ఎక్కువ లోతుకీ బోర్లు వేసి నీటిని వాడుకోవచ్చు, కానీ ఆ దిశగా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నించిన ధాఖలాలు లేవు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు అనుకుంటా ఒక బోర్ త్రవ్వి, దానికి నీటి శుద్ది ఫ్లాంట్ అనుసంధానించి ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని అందించే ఏర్పాటు చేశారు, దాన్ని నడిపే భాధ్యత ఎవరూ తీసుకోకపోవడం వలన, దాన్ని నడుపుటకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన, అది కొద్దిరోజులకే మూతబడినది, మరి అక్కడి రాజకీయనాయకులు కూడా పోటీలమీద పోటీలు పడి ట్యాంకర్లలో నీళ్ళు సప్లై చేస్తున్నారు తప్ప,( సం|| మూడు లక్షలకి పైగా సొంత డబ్బు పెట్టుకోని మరీ, అసలు ఆ ఫ్లాంట్ నడపటానికి లక్ష కూడా అవదు) దాని బాగు చేయిద్దామనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎలక్షన్లప్పుడు కృష్ణ జలాలు రాప్పిస్తాం అనే వాగ్ధానాలకి కొదవేలేదు.

ఒక్క నల్గొండ జిల్లాలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సమస్య 164 గ్రామాలలో తీవ్రంగా ఉన్నది, భాదితులు 65 వేలకి దగ్గిరగా ఉన్నారు, అనధికారిక లెక్క ఐతే 885 గ్రామాలు, ఆరు లక్షలమంది పైనే. వీటన్నిటికి త్రాగునీరు కృష్ణ నడినుంచి ఇవ్వాలి అంటే, దాదాపు ఆరువేల కోట్లకి పైన ఖర్చు (ఇది పన్నెండు వేలకి పైనే అవుతుంది అంతా అయ్యేసరికి అని అంచనా) సంవత్సరానికి మూడువందల కోట్ల మెంటెయినెన్సు ఖర్చు. ( గ్రానైట్ రాయి నుంచి ఫ్లోరిన్ నీటిలో కరుగుతున్నది కావున, రాళ్ళకి, నేలకి తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇది ఫలితాలని ఇస్తుంది.)

మరి ఇది తప్ప ఇంకే మార్గమూ లేదా?

పోని అక్కడ ఉన్న నీటిని శుద్ది చేయలేమా? చేయొచ్చు, ఒకటి పెద్ద నీటి శుద్ది ప్లాంటు పెట్టి ప్రతి ఇంటికీ నీరు పంపడం ఈ ప్లాంట్లు ఒక్కోటి కట్టడానికి అయ్యే ఖర్చు పాతిక లక్షలు, అంటే 164 గ్రామలకి కలిపి అయ్యే ఖర్చు మహా ఐతే యాభై కోట్లు, లేదా అనధికార లెఖ్ఖలు తిసుకున్నా 885 గ్రామాలకీ అయ్యేది ఎంత? ఎంతలేదనుకున్నా అయ్యేది ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం దాని మెంటెయినెన్సుకి పదహారు కోట్లు (ఒక్కో ప్లాంట్ కి 1.5 లక్షలు). అంటే అధమం ఐదువేల కోట్ల మిగులు.

లేదా, ప్రతి ఇంటికీ ఇంట్లో పెట్టుకునే ఫ్లాంట్ ఇవ్వడం, ఇది కొంతకాలం బానే నడిచింది, కానీ దీనికి ఫిల్టర్లు వచ్చి 20-50 రు. అవుతాయి, ఇంట్లో పెట్టుకునే ఫ్లాంట్లు ఫ్రీగా ఇచ్చారు సరే, ఈ ఫిల్టర్లు కుడా ఉచితంగా ఇవ్వమని కొందరు, వాటిని కొనుక్కోలేక ఇంకొందరు మూలన పడేశారు.

ఈలోపున పాపం ఎవరో ఒకాయన భగవాన్ అంట (నిజంగానే భగవంతుడు) ఈయన కనిపెట్టిన విషయం వాననీరు ఎంత ఇంకితే అంత ఫ్లోరిడేషన్ తగ్గుతున్నది అని, దానికి ఆయన ప్రతిపాదించింది ఎంత ఎక్కువ వాన నీరు మనం భూమిలోకి పంపగలిగితే అంత తగ్గుతుంది సమస్య తీవ్రత అని. ఆయన సూచించిన కొన్ని పద్దతులు.

1.
నల్గొండలో సగటు వర్షపాతం 772 మి.మి. అంటే ఒక వంద గజాలలో పడే వాన నీటిని సేకరించినచో 64,000 లీటర్ల నీరు పైనే పోగవుతుంది( ౫క్ష౩౦అడుగులు బావిలోకి), అంటే 4 వున్న ఒక కుటుంబానికి రోజుకి మనిషికి సగటున 25-30 లీటర్ల నీరు వాడుకోవచ్చు. దినికి అయ్యే ఖర్చు దాదాపు 30,000 రూపాయలు. నల్గొండలో 60% ఇల్లు ఇందుకు అనుగూణంగా ఉన్నాయి.
మిగిలినవారికోసం గ్రామాల్లో సామూహిక బావులు కట్టించుట ప్రతిదానికీ అయ్యే ఖర్చు 2,00,000 రూపాయలు.
సొంత బావులకి సగం ఖర్చు, సామూహిక బావులకి పూర్తి ఖర్చు ప్రభుత్వం భరించినా, గ్రామం మొత్తానికీ అయ్యే ఖర్చు సగటున 48,00,000 అంటే 164 గ్రామాలకి కలిపి ఒక యాభై కోట్లతో పూర్తి చేయొ (కొన్ని గ్రామాలలో జానాభా పదుల సంఖ్యల్లోనే ఉన్నది కావున మొత్తం మీద పాతిక కోట్లకన్నా తక్కువకే ఐపోతుంది అని తేల్చారు).

అనధికారిక లెక్క ప్రాకారం ఐనా మొత్తం మీద అయ్యేది ఐదు వందల కోట్లే..

2.
మరి తీవ్ర కరవు, పశువుల మేతకి? దీనికి ఇంకో మార్గం వున్నది.
అవే గ్రామ చెరువులను సరిగ్గా ఉంచడం, పాతిక ఎకరాల చెరువు, పదిహేను అడుగుల లోతు కలిగితే దానిలో పట్టే నీరు 95,56,93,572 లీటర్లు, సగటు జనాభా 2,000 వేసుకుంటే అధమం రోజుకి 500 లీటర్ల నీరు లభ్యం అవుతుంది, పైగా దీని వలన భూగర్భ జలాలలో ఫ్లోరిన్ ఘాడత తగ్గుతుంది, పశువులకి కుడా సరైన నీరు దొరుకుతుంది కావున, ప్రజల ఆర్ధిక స్థితి కుడా మెరుగవుతుంది.

మరి దీనికి అయ్యే ఖర్చు ఎంత ఎక్కువలో ఎక్కువగా వేసుకున్నా 1600 కోట్లు, (885గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో కుడా ప్రస్తుతం ఒక్క చెరువు కుడా లేదు అనుకుంటే ప్రతి గ్రామంలో త్రవ్వించడానికి) మరి, ప్రతిగ్రామంలో ఉన్న చెరువులని బాగు చేసుకుని, ఆక్రమణలను తొలగించి బాగు చేసుకుంటే, క్రొద్దిగా ఒక 100 కోట్లకే ఐపోతుంది. (885 గ్రామాలకి కలిపి, 164 గ్రామాలకే ఐతే అసలు 20 కోట్లకే ఐపోతుంది)

మరి వీటిని వదిలేసి ప్రాజా ప్రతినిధులు, మేము ఇన్ని వేలా కోట్లు ఖర్చు పెట్టి కృష్ణ జాలాలు తెప్పిస్తాం అనో, తెలంగాణా వస్తేనే సాధ్యం అనో మభ్య పెట్టడం సత్యాన్వేషణా?

తెలంగాణా పోరాటం మొత్తం పదిహేను ఏళ్ళు అని లెక్కేసుకున్నా, యం.పి. నిధులు 30 కోట్లు, యం. య.ల్యే. నిధులు ఇంకొ (12*15) 180 కోట్లు, అంటే ఈ సమస్య పూర్తిగా నిర్మూలించడానికి ఐదు యేళ్ళ నిధులు చాలునేమో?
మరి ఐతే ప్రాజా ప్రతినిధులు ఏమి చేస్తున్నట్టు అక్కడ? కృష్ణా జలాల తరలింపు కన్నా సులువైన మార్గం ఉందని చెప్పిన నేను సమైఖ్యంధ్ర గూండాని ఎలా అయ్యాను? పాపం ఎవరో ఒకాయన ముప్పై యేళ్ళ నుంచి ఇదే ప్రయత్నం చేస్తున్నారు అంట, మరి ఆయన ప్రత్యమ్నాయ అవకాశాల మీద దృష్టి ఎందుకు కేంద్రీకరించలేదు?

చదువరి said...

ఒక బ్లాగరి చేసిన ఈ మాత్రపు పరిశోధన, పరిశీలనలో కొంతైనా.. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు ఎమ్పీలూ చేసి ఉంటే, బహుశా ఫ్లోరైడు సమస్య కొంతైనా తీరి ఉండేది. (అయితే, ఇప్పుడు ఆంద్రోళ్ళు అంద్రోళ్ళంటూ విషం చిమ్మే అవకాశం ఉండేది కాదనుకోండి.)
ఒక వాస్తవ సమస్యకు వాస్తవికమైన పరిష్కారం ఆలోచించకుండా, బాధ్యులైనవారు తమ బాధ్యతను పక్కవాడిమీదకు నెట్టేసి, తమ మెడల మీంచి కాడి పడేసారు. ఉద్యమంలో దీన్నీ, బాధితుల్నీ ఒక సమిధలా వాడుకున్నారు. అయినదానికీ కానిదానికీ అవతలోణ్ణి ఆడిపోసుకోకుండా తమకు చేతనైనంతలో శ్రమిస్తే సమస్యకు పరిష్కారం దొరికే ఉండేది. - ఈ టపా ద్వారా ఈ సంగతి స్పష్టంగా అర్థమౌతోంది.

పోతే, సమస్య ఎక్కడెక్కువుంది, ఎక్కడ లేదు, ఎంపీలాడ్స్ వాడాలా మరోటి వాడాలా - ఇలాంటివన్నీ సూపర్‍ఫిషియల్! బాధితులకు కావాల్సింది సత్వర పరిష్కారం -ఎలా ఇచ్చారన్నది కాదు. నాయకులకు ఉండాల్సింది చిత్తశుద్ధి -విత్తశుద్ధి కాదు.

--------

ఇప్పటివరకూ జలయజ్ఞం క్రింద కుదుర్చుకున్న ఒప్పందాలా విలువలో తెలంగాణా వాట 54% అంత, అంటే ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన 41050 కోట్లలో 22167 కోట్లు తెలంగాణాకే ఖర్చు పెట్టారంట, మరీ మాకు చుక్క త్రాగునీరు రాలేదు అది మొత్తం ఏమి చేసారు మీ సమైఖ్యంధ్ర గూండాలు అంతే, ఇదిగో ఇక్కడ ఇచ్చారు ఆ లెఖ్ఖలు, ఇంకా అనుమానాలు ఉంటే పొన్నాలని అడగాలి మరి, నన్ను కాదు.

Ref:
1.Bhagavan and Raghu .
2.Vaish and Vaish.
3.Partial Defluoridation of a Commnunity Water Supply By HS Horowitz.
4. Stats/Presentations provided by Nalgonda Collector to WB reps. on their visits.
5. Recollected info from people who visited Nalgonda as part of WB Team.
6.Utility of check dams in dilution of fluoride concentration in ground water Bhagavan SV
7.Prevalence of High Fluoride Concentration in Nellore (P.Jagan Mohan, SVL Narayana Rao, KRS Sambasiva rao)
8.www.irrigation.ap.gov.in

55 comments:

Anonymous said...

సమైఖ్యాంధ్ర గుండాలు పోసిన బ్రాందీ తాగి మత్తులో ఉన్నాను, కామెంట్లకి జవాబులు ఇవ్వడం కాస్త లేటు అవుతుంది మన్నించగలరు.

ఆ.సౌమ్య said...

ఇదంతా చదివి అర్థం చేసుకోవాలంటే ఫ్లోరైడ్ అంటే ఏమిటో తెలియాలిగా, అది చెప్పు ముందు....నాలాంటి అజ్ఞానుల కళ్ళు తెరిపించు

ass trojoyd said...

ఫ్లోరైడ్ బాధితులు ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పుట్టడానికి వాళ్ళ జాతకలోపమే.వారి కోసం గ్రహశాంతి చేయడానికి సిద్ధమే but on paid mode only

మనసు పలికే said...

తార గారూ.. చాలా బాగా రాశారు. నాకైతే మీ టపా చదువుతున్నంతసేపూ ఠాగూర్ లో చిరంజీవి కనిపించాడు కళ్ల ముందు.. (జోక్ గా అంటున్నా అనుకోకండి. నిజం గానే..) కాకపోతే ఇందులో నిజానిజాలు గురించి డిస్కస్ చేసేంత నాలెడ్జి నాకు లేదు..:( నేను నిజానికి మీ టపాలు అన్నీ చూశాను. కానీ కామెంట్ పెట్టక పోవడానికి కూడా ఇదే కారణం..
మీకు ఎన్ని విషయాలు తెలుసు అని నోరెళ్లబెట్టడం, అసలు కామెంట్ పెట్టడానికైనా నాకు నాలెడ్జి ఉందా అని వెనుదిరగడం..:((

సత్యాన్వేషి said...

1. మీరు పింక్ కలర్లో చూపించన ప్రాంతాలలో ఏఏ జిల్లాలలో మండలాలవారీగా, గ్రామాలవారీగా ఎంత ఫ్లోరైడ్ లెవెల్ ఉందో మీదగ్గర డాటా ఉందా? నల్లగొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఫ్లోరైడ్ డాటా ఇది:
http://www.nalgonda.org/fluorosis/flouridelevels.htm
ఎన్ని చోట్ల 4ppm కంటే కూడా ఎక్కువ ఉందో చూడండి.

2. నెలకు 1000 రూప్పాయల సంపాదన కూడా కనా కష్టంగా ఉండి, రెండు పూటలా తినడమే గగనమయి వలసలు పోతున్న కుటుంబాలు నల్గొండ జిల్లాలో కోకొల్లలు. మరి వారిని ఫిల్టర్లు మీరే కొనుక్కోవాలి అంటే ఎలా కొంటారు? కనీసం తాగు నీటిని కూడా సప్లై చెయ్యలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం?

3) త్రాగు నీటిని క్రిష్నా నుండి సప్లై చెయ్యడానికీ, మిగతా స్కీములకి కంపేర్ చేసే డాటా ఏదయినా మీ దగ్గర ఉందా?



4) ప్రతి దానికీ మీ ప్రాంత నాయకులకు చిత్తశుద్ది లేదు అనే కామన్ డైలాగు చెప్పే అప్పుడు "నేను తెలంగాణాకి అనుకూలమో, వ్యతిరేకమో పక్కన బెట్టి" అని మొదలు పెట్టాల్సింది కాదు. ఎందుకు తెలంగాణా సమస్యలు వచ్చే వరకు ఎంపీ ల్యాడ్సు, లేక ప్రజలే చెయ్యాల్సిన పనులు గుర్తొస్తాయి?

Anonymous said...

>>1. మీరు పింక్ కలర్లో చూపించన ప్రాంతాలలో ఏఏ జిల్లాలలో మండలాలవారీగా, గ్రామాలవారీగా ఎంత ఫ్లోరైడ్ లెవెల్ ఉందో మీదగ్గర డాటా ఉందా? నల్లగొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఫ్లోరైడ్ డాటా ఇది:
-----

ప్రభుత్వం దగ్గిర ఉన్నాయి, ఇంకా కావాలి అంటే జిల్లాలవారిగా వివరాలు రిఫరెన్సుల్లో ఇచ్చిన పేపర్లలో ఉన్నాయి. ఇంకా బొల్డు చోట్ల దొరుకుతాయి.

>>2.మరి వారిని ఫిల్టర్లు మీరే కొనుక్కోవాలి అంటే ఎలా కొంటారు?

ట్రిప్పుకి వెయ్యి పెట్టి ట్యాంకర్లు తిప్పడం బదులు అవి ఇంక తక్కువాకే ఇవ్వొచ్చు.

>>కనీసం తాగు నీటిని కూడా సప్లై చెయ్యలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం?

ప్రజలకి త్రాగునీటికి మునిసిపాలిటీ దగ్గిర ఉన్న నిధులు ఏమైనపోయాయి? ఎప్పుయడైన కనుక్కునే ప్రయత్నం చేశారా? ప్రతిదీ రోశయ్య తాత వచ్చి ఇవ్వాలా? మరి స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు ఎందుకో?

3.మిగతా స్కీములకి కంపేర్ చేసే డాటా ఏదయినా మీ దగ్గర ఉందా?

ఎలా చెయ్యాలో, రిఫరెన్సుల్లుల్లో ఉంటాయి, ఎంత ఖర్చు లెక్కవేసుకోవచ్చు మీకు మీరే, కాస్త నెట్లో వెతుకున్న దొరుకుతాయి.

>>ఎందుకు తెలంగాణా సమస్యలు వచ్చే వరకు ఎంపీ ల్యాడ్సు, లేక ప్రజలే చెయ్యాల్సిన పనులు గుర్తొస్తాయి?
--

తప్పైపోయింది, క్షమించాలి..(ఖర్చు పెట్టకుండా మింగిన ఎంపీ ల్యాడ్సు అనొచ్చా?)

Anonymous said...

>>ప్రతి దానికీ మీ ప్రాంత నాయకులకు చిత్తశుద్ది లేదు అనే కామన్ డైలాగు

నేను ఏ ప్రాంత నాయకులకు చిత్తశుద్ది లేదు అనే అంటున్నాను, ఇక్కడ చర్చ ఎవరికి చిత్తశుద్ధి వున్నది లేదు అని కాదు, ఫ్లోరైడ్ సమస్యకి పరిష్కారం, కృష్ణ జలాల తరలింపు కన్నా ఇంక సులభం, తక్కువ ఖర్చు, ఇంకా ఎఫెక్టిఫ్ పద్దతులు ఉన్నాయి అని చెప్పడమే, అలా కాదు కృష్ణ జలాల తరలింపు ఒక్కటే అంటే, ప్రూవ్ చెయ్యండి నేనేమీ పారిపోవడం లేదే.

jeevani said...

great baga chepparu

Anonymous said...

ఫ్లోరైడ్ ప్రాంతాలను ఫ్లోరైడ్ సీమగొండ అనే రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తన్నా.. అద్యచ్చా. మినరల్వాటర్ సప్లైచేయని పెబుత్వం వో పెబుత్వమా? సాతంత్రం రాకముందు నుంచి ఉద్దమాలు సేస్తండం. ఫ్లోరైడ్ ప్రాంతాల్ని మీ ఆంధ్ర, తెలగాన పెభుత్వం దోచుకుంటోంది, మీరు దొంగలు, ....
ప్రత్యేకరాష్ట్రం ఇవ్వకుంటే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తిరగనియ్యం. వీసాలు తీసుకు రావాలె. డెసెంబర్ లోగ ఇయ్యకుంటే దంచుడే దంచుడు. ఇంకా ఇయ్యకుంటే జనవరి నుంచి అలయ్-భలయ్, ఇంకా ఇయ్యకుంటే నీ బాంచన్ కాల్మొక్తం 42% ఇనా ఇయ్యున్రి, సారూ..

జై ఫ్లోరైడ్ తల్లి!

cornea :-) said...

@ మనసు పలికె

>>తార గారూ.. చాలా బాగా రాశారు.
>> కాకపోతే ఇందులో నిజానిజాలు గురించి డిస్కస్ చేసేంత నాలెడ్జి నాకు లేదు..:(


మరి నాలెడ్జి లేనప్పుడు బాగా రాశారని ఎలా చెప్తున్నారు?

****
@ తార
>> యం.పి. నిధులు 30 కోట్లు, యం. య.ల్యే. నిధులు ఇంకొ (12*15) 180 కోట్లు,

ఈ లెక్కేంటో తేలలేదు. సంవత్సరానికి సుమారు 2కోట్లు ఎం.పి నిధులు. 30 (2*15)కోట్లు అంటే ఒక్క నల్గొండ జిల్లాకేనా? ఐనా నాకు తెలియక అడుగుతున్నా, అన్ని ఫ్లోరైడ్ సమస్యకే ఎలా కర్చుపెడతారు? ఇంక వేరే ఏ సమస్యలకు వెచ్చించ్చక్కర్లేదా?

>> >>ఎందుకు తెలంగాణా సమస్యలు వచ్చే వరకు ఎంపీ ల్యాడ్సు, లేక ప్రజలే చెయ్యాల్సిన పనులు గుర్తొస్తాయి?
--

>> తప్పైపోయింది, క్షమించాలి..(ఖర్చు పెట్టకుండా మింగిన ఎంపీ ల్యాడ్సు అనొచ్చా?)


అనకూడదు. తెలంగాణ ఎం.పీలందరిని కలిపితే -> 17 లోక్ సభ ఎం.పీలు + 6 రాజ్య సభ ఎం.పీలు = 23*2 = 46కోట్లు ఒక్క సంవత్సరానికే వస్తుంది. ఐతే నాయకులకి ఎలా ఖర్చుపెట్టాలో తెలియక వెనక్కి పంపిచేస్తున్నారు.

http://mplads.nic.in/14lshtml/lsstat01.htm

పైన లింకులో చూస్తే తెలుస్తుంది, కేవలం ఆంధ్ర నాయకులే -ve (ఇచ్చిన దానికన్నా ఎక్కువ) లో ఖర్చుపెట్టారు.

సత్యాన్వేషి said...

>>ప్రభుత్వం దగ్గిర ఉన్నాయి, ఇంకా కావాలి అంటే జిల్లాలవారిగా వివరాలు రిఫరెన్సుల్లో ఇచ్చిన పేపర్లలో ఉన్నాయి. ఇంకా బొల్డు చోట్ల దొరుకుతాయి.

నేనెక్కడా నల్గొండలో మాత్రమే ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పలేదు. నల్గొండ ఒక్క చోటే లేదు, ఇంకా అనేక చోట్ల ఉందని చెప్పి నల్గొండ సమస్యను పలచన చేసే ప్రయత్నంతో ఒక మ్యాపును చూపించింది మీరే. మరి మీ మ్యాపు సమస్య ఎక్కడ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడం లేదు.

>>ట్రిప్పుకి వెయ్యి పెట్టి ట్యాంకర్లు తిప్పడం బదులు అవి ఇంక తక్కువాకే ఇవ్వొచ్చు

కానీ మనిషికి ఫ్లోరైడ్ సమస్య కంటే ఈ రోజు పూటగడవడం ముఖ్యం కాబట్టి ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు. కడుపు కాలితే జనం ఫిల్టర్లు అమ్ముకుంటారు. అలాగే ట్రాక్టర్ కూడా సోల్యూషన్ కాదు. సమస్యకు అరకొర తాత్కాలిక పరిష్కారాలకంటే శాశ్వతంగా పరిష్కరించాలంటే క్రిస్ణా జలాలే ఉత్తమ పరిష్కారం.

>>ఎప్పుయడైన కనుక్కునే ప్రయత్నం చేశారా?
కనుక్కున్నాము. ఆ నిధులు సరిపోవడంలేదు. దీనిపై స్టేట్ హై కోర్టు తీర్పు ఇక్కడ చూడొచ్చు:
http://www.nalgonda.org/fluorosis/world%20bank.htm
వరల్డ్ బ్యాంకు రిపోర్టు:
http://www.nalgonda.org/fluorosis/world%20bank.htm

Anonymous said...

>> యం.పి. నిధులు 30 కోట్లు, యం. య.ల్యే. నిధులు ఇంకొ (12*15) 180 కోట్లు

నల్గొండలో 12 MLA ఉన్నారు తల కోటి నిధులు ఉంటాయి కధ.

Anonymous said...

>>కానీ మనిషికి ఫ్లోరైడ్ సమస్య కంటే ఈ రోజు పూటగడవడం ముఖ్యం కాబట్టి ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు.

బాబు గారు, తమరు చెప్పిది దేనిగురించి? అక్కడి శాసనసభ్యుడు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో నీళ్ళు తోలే బదులు ఇంకా చాలా తక్కువకి అయిపోయే ఫిల్టర్లు కొనివ్వడం ఎలా ప్రాక్టికల్ కాదో మాకు వివరించగలరు.

>>కనుక్కున్నాము. ఆ నిధులు సరిపోవడంలేదు. దీనిపై స్టేట్ హై కోర్టు తీర్పు ఇక్కడ చూడొచ్చు:

నాయన, దానిలో నిధులు సరిపోవడం లేదు అని ఎక్కడ ఉన్నదో కాస్త చెప్పగలరా...

ఉన్న నిధులే సరిపోతాయి అని నేను లెక్క వేసి చూపించను, అవి సరిపోవు అని మీరు ఒక చిన్న ఉదాహరణ ఇవ్వలేదు, లేదా నేను చెప్పిన పద్దతులు పనికిమాలినవి అని చూపించనూలేదు, ఏకంగా కృష్ణ జలాల తరలింపు తప్ప వేరే ఏది పనిచేయదు అని తేల్చారు, మంచిది, శర్మ గారు జ్యోతిస్యం చెప్పినట్టు నాకు చెప్పకండి, నాకు ఆధారాలు చూపించి మాట్లాడండి.

Wit Real said...

http://www.nalgonda.org/

is this an official/govt site? or propaganda site?

Anonymous said...

తెలంగాణ వాళ్ళమాయకుణ్ణి చేసి ఊదా హైలైటర్ తో బొమ్మ పెట్టి మోసం చేసిన్రు అని మురికికుంట్ల ముక్కుటేశ్వర్ రావు రిలే నిరాహారదీచ్చ

చదువరి said...

"ఎందుకు తెలంగాణా సమస్యలు వచ్చే వరకు ఎంపీ ల్యాడ్సు, లేక ప్రజలే చెయ్యాల్సిన పనులు గుర్తొస్తాయి?" - గొప్ప ప్రశ్న వేసారు! తెలంగాణ సమస్యలు అనగానే "ఆంద్రోళ్ళ" దురన్యాయం ఎందుకు గుర్తొస్తుందో చెప్పండి.. ఇదీ అందుకే!

ఒక బ్లాగరి చేసిన ఈ మాత్రపు పరిశోధన, పరిశీలనలో కొంతైనా.. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు ఎమ్పీలూ చేసి ఉంటే, బహుశా ఫ్లోరైడు సమస్య కొంతైనా తీరి ఉండేది. (అయితే, ఇప్పుడు ఆంద్రోళ్ళు అంద్రోళ్ళంటూ విషం చిమ్మే అవకాశం ఉండేది కాదనుకోండి.)

తార: చక్కటి పరిశోధన చేసారు.

Anonymous said...

>>నల్గొండ సమస్యను పలచన చేసే ప్రయత్నంతో ఒక మ్యాపును చూపించింది మీరే.

సమస్యని పలచన చేశానా, ఏది ఒక్క లైను చూపించండి సమస్యని తక్కువ చేసింది?
అవతలి వాళ్ళమీద సాక్ష్యాలు లేకుండా అనడానికి రెడీగా ఉంటారు, పేరుకి మాత్రం హేతువాదులు.

>>సమస్యకు అరకొర తాత్కాలిక పరిష్కారాలకంటే శాశ్వతంగా పరిష్కరించాలంటే క్రిస్ణా జలాలే ఉత్తమ పరిష్కారం.

చెరువులు త్రవ్వడం అరకొర పరిష్కారామా? ఎడిచినట్టు ఉన్నది.
ఏది కృష్ణ జలాల తరలింపుకి కరెంటు ఖర్చు ఎంత అవుతుందో చెప్పు బాబు, మరి అవసరం ఐనా ఆరు వేల కోట్లు ఎక్కడినుంచి తెస్తారు? ప్రజల డబ్బేగా, మరి ఎవరిమీద వేస్తారు ట్యాక్సులు? ఉప్పు ప్పప్పు, సబ్బు ప్రతిదాని మీద వెయ్యాలి, మరి ఈ విధంగా అవి సగటు మనిషికి కొట్టవు?

>>మరి మీ మ్యాపు సమస్య ఎక్కడ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడం లేదు.

తమరికి క్రింద ఇచ్చిన రెఫరెన్సులు సరిపోవా?

యునిసెఫ్ తయారు చేసిన డేటా మొత్తం నెట్లో దొరుకుతుంది అది తెచ్చి నాది తప్పు అని ప్రూవ్ చెయ్యండి సార్, మీరు ఏమి ఇవ్వరు, తీర్పులు మాత్రం ఇచ్చేస్తారు, మేము మాత్రం మీకు వచ్చిన ప్రతి అనుమానం సాక్ష్యాలు తెచ్చి తీర్చాలి.

cornea :-) said...

@ తార

>>>> యం.పి. నిధులు 30 కోట్లు, యం. య.ల్యే. నిధులు ఇంకొ (12*15) 180 కోట్లు

>> నల్గొండలో 12 MLA ఉన్నారు తల కోటి నిధులు ఉంటాయి కధ

నేను అడిగింది మీరు నల్గొండకు మాత్రమే లెక్కలు వేస్తున్నారా అని. (తెలంగాణ మొత్తానికి కాకుండా)


>> వీటన్నిటికి త్రాగునీరు కృష్ణ నడినుంచి ఇవ్వాలి అంటే, దాదాపు ఆరువేల కోట్లకి పైన ఖర్చు (ఇది పన్నెండు వేలకి పైనే అవుతుంది అంతా అయ్యేసరికి అని అంచనా)
>> అంటే ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన 41050 కోట్లలో 22167 కోట్లు తెలంగాణాకే ఖర్చు పెట్టారంట,
జలయఘ్నం ద్వారా 22167కోట్లు ఖర్చుపెట్టినప్పుడు, 12000కోట్లు ఒక లెక్కా? ఆ లెక్కన చూస్తే డబ్బు కాకుండా ఇంకేదైనా సమస్య ఉండి తీరాలి. అంత డబ్బు ఖర్చుపెట్టినా అసలు కృష్ణా నీళ్ళు వస్తాయా? సమస్య పరిష్కారం అవుతుందా?

లేదా ఆంధ్రా వాళ్ళే (నాయకులు) డబ్బుని ఖర్చుపెట్టనివ్వడంలేదేమో...

సత్యాన్వేషి said...

@taara


>>నాకు ఈ మధ్యనే కొన్ని నిజాలు తెలిశాయి, ఒకటి తెలంగాణాలో మాత్రమే ఫ్లోరైడ్ భాదితులు ఉన్నారు అని, ఇంకోటి, ఆ ఫ్లోరైడ్ సమస్య తిరడానికి ఒక్క కృష్ణ నదీ జలాలే తాగాలి అని.
నేను తెలంగాణాకి అనుకూలమో, వ్యతిరేకమో పక్కన బెట్టి, అసలు ఫ్లోరైడ్ సమస్య గురించి చూద్దాం.

ఈ ఫ్లోరైడ్ సమస్య నల్గొండ ఒక్క జిల్లాలోనే లేదు, మెదక్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం ఇలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎనిమిది కోట్ల మందికి ఎక్కువగానో, మరి ఎక్కువగానో దీని భాదితులే. పటం చూడండి, ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు మన దేశంలో.>>


ఇవి మీ రాతలు. నల్గొండలో మాత్రమే కాదు, ఎనిమిది కోట్లమందికి ఉన్న సమస్య అని చెప్పడం నల్గొండ సమస్యని పలుచన చెయ్యడం కాక మరేమిటి? అందుకు మీరిచ్చింది accepted level కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న అన్ని ప్రాంతాల మ్యాపు, అందులో ఎక్కడ ఎంత తీవ్రత ఉందో ఎందుకు చెప్పరు?

Anonymous said...

>>ఇవి మీ రాతలు. నల్గొండలో మాత్రమే కాదు, ఎనిమిది కోట్లమందికి ఉన్న సమస్య అని చెప్పడం నల్గొండ సమస్యని పలుచన చెయ్యడం కాక మరేమిటి?

మంచిది, మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా కానివ్వండి మాష్టారు, చెప్పనుగా, కె.సి.ఆర్. అనగానే, అది తెలంగాణా ఆత్మాభిమాన సమస్య అయ్యి కూర్చుంటుంది.

ఇక నా మాటలకి అర్ధం, ఫ్లోరైడ్ సమస్య, చిన్నది కాదు, చాలా పెద్దది, ఒక్క నల్గొండకి మాత్రమే పరిమితం కాలేదు అని.

సమస్య, దాని నివారించే మార్గాల మీద మాత్రమే చర్చ, ఇలా మీరు మార్తాండ లాగా వాదించుకోవడానికి కాదు, ఇలా అడ్డదిడ్డం గా మాట్లాడి సమస్యనుంచి చర్చనీ ప్రక్కదారి పట్టింకొద్దని మనవి.

Anonymous said...

>>అందులో ఎక్కడ ఎంత తీవ్రత ఉందో ఎందుకు చెప్పరు?

రిఫరెన్సులో ఉన్నది, చూసుకోగలరు. ఆయా వ్యక్తుల మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు కూడా దొరుకుతాయి ఆ పేపర్లతో బాటు.

Anonymous said...

http://books.google.com/books?id=FN8mifeULHcC&pg=PA195&lpg=PA195&dq=andhra+pradesh+fluoride+concentration+in+telangana&source=bl&ots=-Ftjah0vJN&sig=vtrbXRufFXtSXyxo2ZBj7TdXT_M&hl=te&ei=y5igTISCHsLB4gaen8nEDg&sa=X&oi=book_result&ct=result&resnum=10&ved=0CDcQ6AEwCQ#v=onepage&q=andhra%20pradesh%20fluoride%20concentration%20in%20telangana&f=false

నాయనా సత్యాన్వేషి అనంతపురం లో కూడా సమస్య వుందయ్యా. ఇప్పుడు అనంతపురం కంటే మాదే ఎక్కువ, మా మీదే ట్రాజెడి సినిమా రావాలి, మాకే సింపతి వుండాలి అనకు బాబు.

Anonymous said...

అజ్ఞాతగారు వారు చెప్తున్నది పటంలో ఇచ్చినది తప్పు అంట, ఎందుకంటే ఆ పటంలో కొద్దిగా ఎక్కువ వున్న చూపిస్తుంది అంట, మరి ఎక్యూట్ అంటే అర్ధం ఏమిటో?

సొ, మనం ఇచ్చే డేటాలో 4 కన్నా తక్కువ వున్నవే ఉన్నాయి అని వారి ఉద్దేశ్యం, దానివలన నల్గొండ సమస్య తీవ్రత తక్కువ అయిపోతున్నది అంటున్నారు, సరే మరి మా డేటా తప్పు అని చూపించండి అంటే ఆహా అది చెయ్యరు, రిఫరెన్సులు కూడా ఇచ్చాను కదా, మరి ఇంకేమి కావాలి?

..nagarjuna.. said...

apart from appreciating the solutions presented herein...i've few doubts...

1) 1.
నల్గొండలో సగటు వర్షపాతం 772 మి.మి. అంటే ఒక వంద గజాలలో<<

Its actually 685mm...what ever, ఇచ్చిన సొల్యూషన్ వాన నీటిని సేకరించి వాడుట. బాగుంది. తారగారు...మా ఇళ్లు హైదరాబదులో, మా ఏరియాలో ఒకాయన తన ఇంట్లోనే వాననీటితో ఇలాంటి పనే గత ఐదేళ్లుగా చేస్తున్నాడు. వర్షాలు మామూలుగా పడినా ఆయనకు ఒక సంవత్సరం వరకు గవర్నమెంటు సరఫరాచేసే మంచినీళ్లతోనో, ట్యాంకర్ల అవసరమో రాదంట...ఒక్కసారి హైదరాబాదులో మొత్తం (దెబ్బకి మంచినీటి సమస్య, వర్షాలొచ్చినపుడు వరదల బాధ రెండు తీరిపోతాయి. విజయవంతం అయితే మొత్తం రాష్టానికి విస్తరించవచ్చు ) ఇలాంటి పద్దతినే implement చేయలని చూడమనండి. ఎంతమంది చేస్తారో చూద్దాం. ఎంతమందో ఎందుకు ఐదేళ్ళుగా చేస్తున్నా నేను చెప్పిన ఆయన ఇంటిపక్కవాళ్లు కూడా ఫాలో అవడంలేదు. ఇంత తెలిసీ సిటీలోనే వీలుకానిది గ్రామాల్లో వీలౌతుందా, పైగా పోలాలకు నీరు అందించాల్సిన చెరువు కాకుండా మంచినీటికోసం ఇంకో చెరువు తవ్వుకోవాలి...i question the spirit of people to implement it and not the method....

2)
నీరు ఇంకడం గురించి. నాకు తెలిసి (నేను చూసినంతవరకు + మానాన్నగారు చెప్పినంతవరకు ) నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్‌తో పాటు పరిశ్రమలు చెరువులు, నదులలో వదిలే వ్యర్ద రసాయనాల వల్ల కూడా ఇబ్బంది పడుతుంది. చాలా వరకు భూభాగం రాతితో ఉండడం వల్ల ఇంకడం సంగతి దేవుడెరుగు...అలా కలుషితమైన నీటినే తాగుతున్నారు. ఆ ఇంకడం ఏదో జరిగే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది.

3) ఇక్కడ ఇచ్చినవాటిలో నాకు ’బాగున్నది’ అని అనిపించింది ఆ ఫిల్టర్ల పద్దతి. ఈ విషయం పైన పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

Anonymous said...

>>Its actually 685mm...what ever,

నేను సేకరించింది నల్గొండ జిల్లా వెబ్సైటు నుంచి, అదే అఫిషియల్ కదా?

>>చాలా వరకు భూభాగం రాతితో ఉండడం వల్ల ఇంకడం సంగతి దేవుడెరుగు...

నాగ్, భగవాన్ గారు ఇవి అన్నీ పరిశీలించే చెప్పారు, చెరువులకి నీరు ఇంకకపోయిన సమస్య ఉండదనుకుంటాను.. చెరువులని కాపాడుకోవడం, మరియు, ఎవరికి వారుగా వాన నీటిని దాచుకోవడం, లేక కలిసి సామూహికంగా దాచుకోవడం ముఖ్యం.

ఇంకో విషయం, ఆ రాతినేల వలనే ఫ్లోరోసిస్ సమస్య, అందుకనే వాన నీటిని దాచుకోవడం గురించి, కెనల్స్ ద్వారా తరలించిన ఇదే సమస్య ఉంటుంది కావున, పైపు లైన్లు వేయడం లేకుంటే తరలించే జలాలు కూడా కలుషితం అయిపోతాయి.

>>ఇక్కడ ఇచ్చినవాటిలో నాకు ’బాగున్నది’ అని అనిపించింది ఆ ఫిల్టర్ల పద్దతి.

ఇది అన్నిటికన్నా అమలు కష్టమైన పద్దతి, తప్పని సారి పరిస్తితుల్లో మాత్రమే దీని వాడకాన్ని ప్రోత్సహించాలి, కానీ సమస్య తీవ్ర రూపం దాల్చకుండా ఆపాలి అంటే ప్రస్తుతం ఇది ఒక మెరుగైన పద్దతి తప్ప ఇదే ఎప్పటికీ అంటే అదొక తలనొప్పి, ఆ ఫిల్టర్లను ఎప్పుడు ఫ్రీగా ఇస్తుండాలి, తరువాత ఆ ఫ్లాంట్లను బాగు చేయడం, పాడైపోయిన వాటి స్థానే క్రొత్తవి ఇవ్వడం, ఇలా రన్నింగ్ ఖర్చు ఎక్కువ.

Anonymous said...

>> అజ్ఞాతగారు వారు చెప్తున్నది పటంలో ఇచ్చినది తప్పు అంట, ఎందుకంటే ఆ పటంలో కొద్దిగా ఎక్కువ వున్న చూపిస్తుంది అంట, మరి ఎక్యూట్ అంటే అర్ధం ఏమిటో?



నల్గొండకు ఒక ఎర్ర చుక్క ఎట్టేయండి సార్. సూపర్ ఎండమిక్ అని ఒక లెజెండ్ రాసి పడేయండి. అదేగా ఆయన అడుగుతుంది.

ఐనా ఈ మాటకామాటే చెప్పుకోవాలి...సత్యాన్వేషిగారి బుర్ర కత్తి. ఇలా మాప్ లో చూపెట్టి క్లియర్గా చెప్తున్నారనే ఆలోచించా గాని, ఆయనలా...నల్గొండ సమస్యని తెలివిగా పల్చన చేస్తున్నారేమో అని కించిత్ కూడా తట్టలేదు..ఉట్టి మట్టి బుర్ర (నాది).

Anonymous said...

>>ఇంత తెలిసీ సిటీలోనే వీలుకానిది గ్రామాల్లో వీలౌతుందా, పైగా పోలాలకు నీరు అందించాల్సిన చెరువు కాకుండా మంచినీటికోసం ఇంకో చెరువు తవ్వుకోవాలి...i question the spirit of people to implement it and not the method....

--------

ఇది గమనించలేదు మొదట, త్రవ్వడం వరకు ప్రభుత్వ ఖర్చే, ప్రజలు శ్రమదానం చేస్తే చాలు.
ఇంక స్పిరిట్ అంటే, అది జనాల్లో నాటాల్సింది ప్రజా ప్రతినిధులు, ప్రజలే, ఇది ఒక్క నల్గొండ సమస్యే కాదు ఇంకో యాభై యెళ్ళల్లో మన రాష్ట్రంలో ఇదే సమస్య ఇంతే తీవ్రంగా పదకొండు జిల్లాలలకి వస్తుంది అని ఒక ఎస్టిమేషన్, కారణం, భూగర్భ జలాలని ఎడ పెడా వాడేయడం, చెరువుల విస్తీర్ణం క్షీణించడం. అప్పుడు ప్రతిజిల్లాలోను, ప్రతి గ్రామంలోను ఇవే వాడాలి.

ఇంక పైన నేను చెప్పినవి, కర్నాటకలో బానే జరుగుతున్నాయి అని విన్నాను, అదే కాకుండా ఆఫ్రికాలో పెద్ద యెత్తున జరుగుతున్నది అంట, అన్నిటికి మూలం మన నల్గొండలో చేసిన రీసెర్చ్, చివరకి ఆయనే నల్గొండ వదిలి అనంతపూర్ వెళ్ళిపోయారు. నల్గొండకి మాత్రం ఎంత మేలు జరిగిందో తెలియదు మరి, ఆ ఫలాలని ప్రపంచం మొత్తం అందిపుచ్చుకుంటున్నది.

Anonymous said...

@nag

http://nalgonda.ap.nic.in/climate_rainfall.htm

RAINFALL

The average rainfall in the district is 772 mm. 71% of the annual rainfall is received by the district during south west monsoon (i.e. June to September). September is the rainiest month. During summer and retreating monsoon season some amount of rainfall is received in the form of thunder showers. The variation in the annual rainfall in the district from year to year is large. On an average there are 46 rainy days. (i.e days with rainfall of over 2.5mm or more).

Anonymous said...

>>నల్గొండ సమస్యని పలుచన చెయ్యడం కాక మరేమిటి?
గట్లను, నువ్ ఇగేమాత్రం తగ్గద్దు. ఆంద్రోల్ల మాటల్ వింటే తెలబానోడెట్లైతర్? మేం మురగబెట్టి చిక్కగా చేస్తుంటే పలుచన చేస్తారా? ఆంద్రోళ్ళు మా ఫ్లోరైడ్ దోస్తున్రు.

Anonymous said...

చాలా వరకు భూభాగం రాతితో ఉండడం వల్ల ఇంకడం సంగతి దేవుడెరుగు...అలా కలుషితమైన నీటినే తాగుతున్నారు. ఆ ఇంకడం ఏదో జరిగే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది.

Who said this?
http://dolr.nic.in/Wasteland.htm

See stats sir,

Area wise Nalgonda comes after Chittore, Cuddapah, and Anatapur

percentage wise 15 dists. got more rocky lands than Nalgonda.

Please think before commenting.

Anonymous said...

మీ ఆర్టికల్ ఇప్పుడె చూసాను. వాన నీటి తో ఫ్లోరైడ్ శాతం తగ్గిందంటే డైల్యూషన్ ఎఫెక్ట్ అనే అనుకొంటాను. చెరువులు గురించి మీరు వ్రాసిన దానికి సంబందించిన పోలిక ఉన్న వ్యాసం ఎక్కడొ చదివాను. గుర్తు లేదు. కొన్ని ఏళ్ళ క్రితం. చెరువులు అంటే వర్షాధారితం. బహుశా Limited use. ఆ ఆర్టికల్ లో storm water drains, links to tanks (చెరువులు కి ఇది సరైన పదమేనా) కి సంబంధించిన ఖర్చు కూడా ఉందనుకుంటాను. మళ్ళీ వీటికి మైంటెనెన్స్, మనుషులు వగైరా ఖర్చులు కూడా చూపించేరని గుర్తు. ఇవి కాస్ట్ వైజ్ పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు. A thought provoking article. Needs a detailed study for further action. Let us see how many of our so called leaders will notice this article and take appropriate action..

Anonymous said...

----పై రెండు కామెంట్లు నాకు మెయిల్లో వచ్చినవి...

బాలు said...

తారగార చక్కటి పరిశోధన, విశ్లేషణ. తెలంగాణ, సీమాంధ్ర... irrespective of region నేతలందరూ దొంగలే.
సమస్యని పరిష్కరించేస్తే రేప్పొద్దున దేనిమీద గొడవ చేస్తారు?
అందుకే సమస్యల్ని మురగబెడతారు. పెడుతున్నారు.

Anitha said...

ఆఫ్ టాపిక్

@ తార
అదేంటో మీరు ఇచ్చిన మాప్ లో సిక్కిం ఏదో, భూటాన్ ఏదో తెలియట్లేదు. అసలు భూటాన్ ఎందుకు రావాలంటారు? :-)

..nagarjuna.. said...

@తారగారు: వర్షపాతం గురించి ,sorry my mistake, http://irrigation.cgg.gov.in/dp/NalgondaDistrictProfile.jsp లో 2003 figure చూసి అన్నాను. దాని పై ఉన్న సాధారణ వర్షపాతం చుడలేదు. sorry again.

మరొకటి...వాననీటిని నిల్వచేయడానికి (year long) భూమిలో ఉన్న రాతి తగలొద్దు అంటే ఒక కుటుంబం ఎన్ని బావులు (గొయ్యి అవుతుందపుడు) తవ్వాలి?

@తారగారికి ఈ-మెయిలు చేసినవారు: అయ్యా...నాకు మీరు ఇచ్చిన లింకు ఉన్న సైటులో updated pdf dorikindi
http://dolr.nic.in/wasteland_atlas.htm

అందులో ఇచ్చిన information లో కొద్దిగా క్లారిటి కావాలి.

మీరన్నది
>>percentage wise 15 dists. got more rocky lands


మీరు చూసింది total % of wastelands i.e., including all sorts of wastes.


కాని కేవలం రాతి నేలలే ఒక్కోజిల్లాలొ ఎంత శాతం ఉన్నాయో చూడండి
ఉదా: హైదరాబాదులో 0% రాతినేలలు ఉన్నాయట..,మరి ఈ విషయం మా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాళ్లకు చెబితే చాలా సంతోషిస్తారేమో....!! అదే విధంగా చాలా జిల్లాల్లో 0% induatrial wastelands అంట..అదేంటొ అర్ధం కాలేదు.

ఈ(లింకులో ఇచ్చినట్టు) లెక్కన నల్గొండ కన్నా ఎక్కువ రారి నేలలు ఉన్న జిల్లాలు 5, 4 జిల్లాలు సీమనుండి.

పోతే నా అనుమానం, ప్రశ్న.....ఏంటంటే ఈ లెక్కలు సాగు చేయగలిగే భూమిలో wastelands ఎంత ఉన్నాయో అనా లేక జిల్లాల మొత్తం మీద ఎంత ఉందో అనా....అంటే దేన్నిబట్టి wastelands ను wastelands అన్నాడు?
ఎందుకడుగుతున్నానంటే ఇక్కడ నేను తారగారికి చెప్పినది జిల్లా మొత్తంలో ఎక్కువ భాగం రాతినేలలు ఉంటాయని, సాగుభూమిలో అని ఎక్కడా అనలేదు. It'll be helpful if you could clarify....

Anitha said...

సత్యాన్వేషి:
>> 1. మీరు పింక్ కలర్లో చూపించన ప్రాంతాలలో ఏఏ జిల్లాలలో మండలాలవారీగా, గ్రామాలవారీగా ఎంత ఫ్లోరైడ్ లెవెల్ ఉందో మీదగ్గర డాటా ఉందా?
---

నా మాప్ గోల ఇంకా అవ్వలేదు. అక్కడ పింక్ కలర్లో ఏమి వుంది? నాకు లావెండర్ కలర్లో కనిపిస్తుందేంటి? నాకు రంగులు తెలియవా? లేక దాన్నే గులాబి రంగు అంటారా? లేక నాకు కలర్ బ్లైండ్నెస్స్ వచ్చిందా..? లేక నల్గొండను ఏ రంగులో వేసినా గులాబి రంగనే అనాలా? దయచేసి ఎవరో ఒకరు ఈ గులాబి రంగు సందేహం తీర్చగలరు.

Anonymous said...

@మరొకటి...వాననీటిని నిల్వచేయడానికి (year long) భూమిలో ఉన్న రాతి తగలొద్దు అంటే ఒక కుటుంబం ఎన్ని బావులు (గొయ్యి అవుతుందపుడు) తవ్వాలి?

----

For 100 yards of catchment area, a Concrete well of 5x30 which occupies 9 sq. yards, which you can distribute depending on your choice, if so strict restrictions about contact with rocks, you can use normal well.

Strict restrictions very rare but I assumed worst case.

Anitha said...

ఏమిటి ఈ రాజకీయం? సమాధానమే కరువైందా? మీ వాలకం చూస్తుంటే నల్గొండలో అందరు పరుగు పారా తీసుకెళ్ళి బావులు తవ్వేందుకు సిద్దమవుతున్నారేమొ అని అనుమానంగా వుంది. ఏది ఏమైనా నా ప్రశ్నను తొక్కివేయడానికి జరిగిన అవమానంగా భావించి ఈ బ్లాగ్ నుంచి నేను పర్మనెంట్ గా వాక్ ఔట్ చేస్తున్నా. ఇక్కడ ఏమి జరిగినా...ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని నాకు సంబంధం లేదు.

Anonymous said...

@ass గారు, మీ స్టాక్ మార్కెట్ జ్యోతిష్యం చూశాక ఎవరు ధైర్యం చేస్తారులెండి.

@జై ఫ్లోరైడ్ తల్లి! గారు, అంతేనంటారా?
మరి మా జిల్లాలో వీసా ఆఫీసు ఎప్పుడు తెరుస్తారు? ఫీజ్ ఎంత?

@cornea :-) గారు, ఏదో లేండి చిన్న పిల్ల.

Anonymous said...

cornea :-) గారు,

>>అంత డబ్బు ఖర్చుపెట్టినా అసలు కృష్ణా నీళ్ళు వస్తాయా? సమస్య పరిష్కారం అవుతుందా?

అది ఆ దేవుడికే తెలియాలి, వానాకాలం మాత్రం సాధ్యం అవుతుంది, మరి ఎండాకాలం దైవాధీనం.

>>నేను అడిగింది మీరు నల్గొండకు మాత్రమే లెక్కలు వేస్తున్నారా అని.

అవునండి, ఒక్క నల్గొండ మాత్రమే, మొత్తం తెలంగాణా అంటే మరి పెద్దది అయిపోతుందిలెంది.


@మురికికుంట్ల ముక్కుటేశ్వర్ రావు రిలే నిరాహారదీచ్చ.

సర్లెండి నేను నా వంతుగా, ట్రిప్టన్ బిస్కెట్లు పంపిస్తాను.

Anonymous said...

@Wit Real said...
is this an official/govt site? or propaganda site?

ఏదో ఒకటిలెండి, ఏదైనా దానిలో ఆ సమస్య గురించి తప్ప ఇతర రాజకీయాలు పట్టించుకునట్టు లేదు కదా, నమ్మదగినదే అవ్వోచు.

Anonymous said...

@చదువరిగారు,బాలుగారు

>>చక్కటి పరిశోధన చేసారు.

పరిశోధన నాది కాదండి, నేను భగవాన్ గారి రీసెర్చ్ వాడుకున్నాను, ఇదే ఆయన అక్కడ అందరికి చెప్పి చెప్పి విసుగుపుట్టి వదిలేశారు.

మీ వ్యాఖ్యతో టపాని అప్డేట్ చేస్తున్నాను.
మీ వ్యాఖ్యాకి ధన్యవాదాలు.

@బాలు గారు
>>తెలంగాణ, సీమాంధ్ర... irrespective of region నేతలందరూ దొంగలే.

అవునండి నిజమే. అందరూ దొంగలే.

Anonymous said...

@jeevani గారు మీ వ్యాఖ్యాకి ధన్యవాదాలు.

@మనసు పలికే,

>>ఠాగూర్ లో చిరంజీవి కనిపించాడు కళ్ల ముందు..

మీరు క్రెడిట్ మొత్తం రీసెర్చ్ చేసినవారికి ఇవ్వాళ్ళిఅండి, నేను వారు చెప్పినవి తిరిగి చెప్తున్నాను అంటే, నేను చేసింది ఏమీ లేదు, ఇది కేవలం సమాచారం తప్ప నేను కనిపెట్టినది ఏది కాదు కదా.

>>మీకు ఎన్ని విషయాలు తెలుసు అని నోరెళ్లబెట్టడం, అసలు కామెంట్ పెట్టడానికైనా నాకు నాలెడ్జి ఉందా అని వెనుదిరగడం

అయ్యో, గూగుల్ మహిమా అండి మొత్తం, నాది ఏమున్నది, క్రింద ఇచ్చిన రిఫరెన్స్ చూడండి మీరు తెలుసుకోవచ్చు, పెద్ద విధ్యేమి కాదు కధా..

@అ.సౌ.గారు రేపు వ్రాయగలను.
మీ వ్యాఖ్యాకి ధన్యవాదాలు.

Anonymous said...

@Anitha గారు,

>>అసలు భూటాన్ ఎందుకు రావాలంటారు? :-)

అది సమైఖ్యాంధ్ర గూండాలు గీసినది కదా, మా అన్న చెప్పిన్నట్టు ఎప్పుడు బ్రాందీ తాగి ఉంటాము కధా ఆ మత్తులో అలా అయిపోయింది.

>>ఏ రంగులో వేసినా గులాబి రంగనే అనాలా?

మరి, ఏదైనా గులాబీ రంగే ఏదైనా కె.సి.ఆర్. వాళ్ళ కుటుంబానిదే.

>>మీ వాలకం చూస్తుంటే నల్గొండలో అందరు పరుగు పారా

లేదండి, నేను నా జాతకం చూపించుకోవడానికి వెళ్ళాను రేపటినుంచి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడదామని.. మీరు ఇలా కోపగించుకుంటే ఎలా చెప్పండి, ఇప్పటికే నన్ను నాలుగైదు బ్లాగుల్లో వేలేశారు.

Anitha said...

>> నేను నా జాతకం చూపించుకోవడానికి వెళ్ళాను రేపటినుంచి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడదామని..

నిజంగానా! నేను కూడా రేపే Gazprom లో మిగిలిన 4.222 శాతం వాటా కొందామనుకుంటున్నా. కాని అదేంటో వికిపేడియాలో షేరు వాటా లెక్కలు సరిగ్గా ఇచ్చారు, అఫీషియల్ సైట్ లోనేమో ఖాళీ లేదు పొమ్మంటున్నారు. అంతా మోసం. దీని మీద ముందుకి వెళ్ళి ఆ రష్యా వాళ్ళ సంగతి తేల్చాలో అని తెగ ఆలోచించేస్తున్నా...

Anonymous said...

/ఇప్పటికే నన్ను నాలుగైదు బ్లాగుల్లో వేలేశారు./
:)) congrats! that's why I am with you.

Anonymous said...

నాకూ పింక్ కలర్ కనిపించలేదు, వూదా రంగులో కనిపించింది. కాని అలా అంటే తెలంగాణాలో తిరగనివ్వం అంటారని పింకు రంగే అనుకున్నా. :)

నల్గొండ ఫ్లోరైడ్ పలుచన ఎందుకు? ఫ్లోరైడ్ టూత్పేస్ట్ కుటీరపరిశ్రమగా చేసుకుంటే ఫ్లోరైడ్లేని వాళ్ళకు నల్గొండ టూత్పేస్ట్ అని బ్రాండ్ తో సప్లై చేసుకోవచ్చు, డార్జిలింగ్ టీ లాగా. మరి ఏడుపెందుకో!

Anitha said...

@తార
>>అసలు భూటాన్ ఎందుకు రావాలంటారు? :-)

అది సమైఖ్యాంధ్ర గూండాలు గీసినది కదా, మా అన్న చెప్పిన్నట్టు ఎప్పుడు బ్రాందీ తాగి ఉంటాము కధా ఆ మత్తులో అలా అయిపోయింది.

---------

అవునా అలా ఐపోతుందా ...ఏదొ పెళ్ళికి వచ్చిన వాళ్ళని పేరు పేరున 'కాఫీలు తాగారా? టిఫినీలు చేసారా?' అని పలకరించట్టు, వ్యాఖ్యించిన అందరిని పలకరించడం కాదండి. మాటర్ ఉండాలి.

ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చని నేను సత్యాన్వేషి గారికి ఉప్పందించాననుకోండి మీకు మత్తు అంతా దిగిపోతుంది. లేదు మనలో మనం కాంప్రమైజ్ అవుదామంటే, లచ్చలు లచ్చలు పెట్టి మీరు కొనబోతున్న ఆ షేర్లు అవి మరి మా పేరు మీద...

సత్యాన్వేషి said...

మీరు చెప్పినట్లు ప్రతి ఊరిలో డిఫ్లోరడైజేషన్ ప్లాంట్లు పెట్టుకుంటే 500కోట్లతో పూర్తయితే మరీ మంచిది. అయితే ఒక రిసెర్చ్ పేపర్‌ను నెట్లో చూపించి గ్రామ పంచాయతి వారిని మీ సూచనలన్నీ పాటించమంటే ఎలా చేస్తారు? మునిసిపాలిటీ వారి వద్ద ఆ మాత్రపు డబ్బు లేదా, ఎంపీ ల్యాడ్సు రావటం లేదా అని చెప్పారు. గ్రామాల్లో ఉండేవి మునిసిపాలిటీలు కాదు, గ్రామ పంచాయితీలు. వారి దగ్గర ఉండే నిధులు అతి తక్కువ.హైకోర్టు ఈ ప్రాంతపు ఫ్లోరైడ్ సమస్యను ప్రయారిటీ తీసుకుని చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని అదేశించి పదేల్లు అవుతుంది. మరి అందుకు ఒక ప్రాజెక్టును రూపొందించి కావలసిన సాంకేతిక సమాచారాన్ని అందచేసి చర్యలు తీసుకోవలసిన భాధ్యత లేదంటారా? దానికి ఎంపీ ల్యాడ్సూ, గ్రామ పంచాయతి నిధులు తప్ప వేరే ఏమీ అక్కరలేదా?

మీరు మీ టపాలో మొదలు పెట్టినట్లు ఫ్లోరైడ్ సమస్య నివారణకి క్రిష్ణా జలాలు మాత్రమే కావాలి, ఒక్క తెలంగాణాలో మాత్రంఏ ఫ్లోరైడ్ సమస్య ఉందని ఎక్కడా చెప్పలేదే?

చదువరి said...

ఒక వాస్తవ సమస్యకు వాస్తవికమైన పరిష్కారం ఆలోచించకుండా, బాధ్యులైనవారు తమ బాధ్యతను పక్కవాడిమీదకు నెట్టేసి, తమ మెడల మీంచి కాడి పడేసారు. ఉద్యమంలో దీన్నీ, బాధితుల్నీ ఒక సమిధలా వాడుకున్నారు. అయినదానికీ కానిదానికీ అవతలోణ్ణి ఆడిపోసుకోకుండా తమకు చేతనైనంతలో శ్రమిస్తే సమస్యకు పరిష్కారం దొరికే ఉండేది. - ఈ టపా ద్వారా ఈ సంగతి స్పష్టంగా అర్థమౌతోంది.

పోతే, సమస్య ఎక్కడెక్కువుంది, ఎక్కడ లేదు, ఎంపీలాడ్స్ వాడాలా మరోటి వాడాలా - ఇలాంటివన్నీ సూపర్‍ఫిషియల్! బాధితులకు కావాల్సింది సత్వర పరిష్కారం -ఎలా ఇచ్చారన్నది కాదు. నాయకులకు ఉండాల్సింది చిత్తశుద్ధి -విత్తశుద్ధి కాదు.

Anonymous said...

>>గ్రామాల్లో ఉండేవి మునిసిపాలిటీలు కాదు, గ్రామ పంచాయితీలు. వారి దగ్గర ఉండే నిధులు

ప్రతి గ్రామ పంచాయితీకి దాదాపు యాభై లక్షల నిధులు ఉంటాయి ప్రతి సంవత్సరం, ఇక్కడ ప్లాంటు నిర్వాహణ ఖర్చు లక్షన్నర, మీరు ప్రతి ఊరికి లో లిఫ్ట్ పెట్టి, దాన్ని ప్రతి ఇంటికి ఫ్రీగా పంపాలి అంటే కరెంటు ఖర్చు ఇంక ఎక్కువ అవుతుంది.. మరి అప్పుడు నిధులు ఎలా తెస్తారు?

>>ఈ ప్రాంతపు ఫ్లోరైడ్ సమస్యను ప్రయారిటీ తీసుకుని చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని అదేశించి పదేల్లు అవుతుంది

మరి కృష్ణ జలాలు రావాలి అంటే ఇంకో పదేళ్ళు పడుతుంది, ఈలోపు మరి ప్రత్యామ్నాయ పద్దతులు ఐనా చూడాలిగా అప్పటి వరకు, మరి అది ఈ మాత్రం చేశారు? అంటే ప్రజల ప్రాణాలు అంటే ఎంత లేఖ్ఖో తెలుస్తూనే వున్నది. తెలంగాణా తెస్తే ఒక్కరోజులో సమస్యని పరిష్కరిస్తాం అని బిరాలు పలుకుతున్నారు, మరి అప్పటి వరకు?

>>మరి అందుకు ఒక ప్రాజెక్టును రూపొందించి కావలసిన సాంకేతిక సమాచారాన్ని అందచేసి చర్యలు తీసుకోవలసిన భాధ్యత లేదంటారా?

ప్రభుత్వం అంటే మీకు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కనిపిస్తాడు ఎందుకో, మరి మీరు వోట్లు వేసి ఎందుకు ఎన్నుకున్నారు? మరి వల్ల భాధ్యత కేవలం తెలంగాణా తేవడమేనా, మిగతా పనులు అన్నీ రొశయ్య తాతా వచ్చి చేయాలా? మరి మీ ప్రజా ప్రతినిధులు కనీసం పోరాటం అన్నా చేయాలిగా, అది చేయడం లేదుగా..

>>అయితే ఒక రిసెర్చ్ పేపర్‌ను నెట్లో చూపించి గ్రామ పంచాయతి వారిని మీ సూచనలన్నీ పాటించమంటే ఎలా చేస్తారు?

నెట్లో ఒక పేపర్ చూపించానా? మరి ఆయన కంప్యూటర్ల మీద పరిశోధన చేశారా? నల్గొండ యామ్.పి. కి ఎంత తిరిగాడో , దానికి వంద రేట్లు నల్గొండలో ప్రతి గ్రామం తిరిగి, ప్రతి ప్రజాప్రతినిధికి అన్నీ చెప్పి, చూపించి, విసిగి అనంతపురం వెళ్ళిపోయారు..


తమరు గాల్లో రాళ్ళు వేయకుండా, కాస్త వాస్తవ పరిష్కారం చెప్పండి, మేము తెలుసుకుంటాం, ఒక్క ఆరోపణ ఐనా కనీస బేస్ తో చేశారా?

Anonymous said...

@అనిత గారు
ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చని నేను సత్యాన్వేషి గారికి ఉప్పందించాననుకోండి మీకు మత్తు అంతా దిగిపోతుంది. లేదు మనలో మనం కాంప్రమైజ్ అవుదామంటే, లచ్చలు లచ్చలు పెట్టి మీరు కొనబోతున్న ఆ షేర్లు అవి మరి మా పేరు మీద...
---------

నా దగ్గిర అన్నీ లచ్చలు ఎక్కడివి అండి, ఏదో కొరియా నుంచి స్మగ్లింగ్ చేసే ప్లాన్ వున్నది, అది పని చేస్తే కంపెనీలే కొని బినామిగా మీ పేరుమీదే పెడతాలెండి.

Anonymous said...

@Bulusu Subrahmanyam గారు

సుబ్రహ్మణ్యం గారు, మీ మెయిల్ని మీ అనుమతి లేకుండ ప్రాచురించినందుకు క్షమించగలరు.

మీరు చెప్తున్నా పేపర్ భగవాన్, రఘు గార్లదా? వారే దీని మీద పెద్ద యెత్తున రీసెర్చ్ చేశారు.
అవునండి, ఒక్క చెరువు కట్టి కూర్చునేడానికన్న దాన్ని నింపడం అవసరం, దానికి తప్పనిసరిగా storm water drains, links to tanks కావాలి.అప్పుడు భూగర్భ జలాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎంత పెద్ద చెరువు ఐనా ఒక్క పెద్ద వానకే నిండుతాయి, లేనిచో, ఈ కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదు ఐనా చెరువు ఫుల్ కెపాసిటీతో నిండటము కష్టం


Needs a detailed study for further action.


లేదండి, దీని మీద ఇప్పటికే చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది, కానీ అసలు సమస్యని సాల్వ్ చేద్దాం అని చూసేవాడు లేక, జనాలు అనంతపూర్, కర్ణాటక, విదేశాలకి తరలిపోయారు, ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో పనులు కుంటుపడ్డాయి అంట
ఇంక మన పని మాత్రం మిగిలింది.
ఇది లీడర్ల తప్ప కాదండి, ప్రజలదే, చెరువు పూడ్చుకున్నది, ఆ పనికిమాలిన వాళ్ళకి వొట్లూ వేసింది, తరువాత వాళ్ళని ప్రశ్నించనిది ప్రజాలే కదా, ప్రజలు ఒక్క వారం గట్టిగా ఉధ్యమిస్తే ఎప్పుడో ఈ సమస్య తీరిపోయేది కదా, కానీ ప్రజలు పనులు చేయకుండా, తమ ఖర్తవ్యం మానుకొని ఫ్రీగా వచ్చేదానికి ఆశపడితే నాయకులు ఇలానే చేస్తారు.

-------

మీ ఆర్టికల్ ఇప్పుడె చూసాను. వాన నీటి తో ఫ్లోరైడ్ శాతం తగ్గిందంటే డైల్యూషన్ ఎఫెక్ట్ అనే అనుకొంటాను............

ఇది బులుసు సుబ్రహ్మణ్యం గారి కామెంట్.

భాస్కర రామిరెడ్డి said...

Very good post taara, though I do not have enough information to participate in the discussion, I truly enjoyed it from the beginning.

Anonymous said...

భా.రా.రే.గారు,

బోలెడు థ్యాంకూలు