blogspot hit counter

Thursday, August 19, 2010

ఈనాడు చైనా పత్రికా?


ఇది ఈరోజు ఈనాడు (ఆన్‌లైన్ ఎడిషన్ లో కనిపించిన)లో ప్రచురించిన పటం.

ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన "న్యాయ పోరాటంలో భారత్ విజయం" లో ఇచ్చిన భారతదేశ పటం చూడగానే ఒళ్ళు మండి పోయింది, ఈ విధంగా మన దేశ సరిహద్దును మార్చటం ఈనాడుకి కొత్తేమీ కాదు పూర్వం భూటాన్ గురించి ప్రచురించినప్పుడు ఈవిధంగానే కాశ్మీర్‌ని పాకిస్తాన్‌తో కలిపేశారు, తరువాత హాకీ ప్రప్రంచకప్ గొడప్పుడు, ఆ తరువతా పోయిన మార్చిలో, మళ్ళీ ఇప్పుడు...ఇప్పుడు కొత్తగా అరుణాచల్‌ప్రదేశ్ ని కుడా చైనా భారతదేశ పటాన్ని ఎలా ప్రచురిస్తుందో, అదే తీసుకొచ్చి వేశారు..
ఇదే విషయం పై సుప్రీం కోర్ట్ పూర్వం ఇలా వివాదాస్పదంగా భారతదేశ సరిహద్దుని ప్రచురించటం క్రిమినల్ చర్యే అని, పత్రికలు ఇలాంటి వాటికి పూనుకోవద్దను సూచిస్తూ ఇదివరకే తీర్పు ఇచ్చింది, కాబట్టి, ఈనాడు సుప్రీం కోర్ట్ ని కుడా ధిక్కరించింది..
ఇప్పటికి చాలా సార్లు ఈనాడుకి ఫోన్(ఈనాడూ సోమాజీగూడ కార్యాలయానికి) చేసి చెప్పినా తన ధోరణి మార్చుకోలేదు. కానీ ఈనాటి ఆ పటం మార్పు ఈనాడుకి పెద్ద శిక్ష పడేవిధంగా లేదు, కావున న్యాయపోరాటానికి ప్రస్తుతం పూనుకోవటం లేదు. పూర్వం క్రిమినల్ కేస్ పెట్టినా అది ఏమయ్యిందో పట్టించుకోలేని విధంగా సమస్యలు చుట్టుముట్టడం వలన ఈనాడును కోర్ట్‌కీడ్చలేకపోయాను. మాళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని పాక్‌లో భాగంగా చూపించే ధైర్యం చేస్తే మాత్రం నేను ఊరుకోను.

11 comments:

Anonymous said...

Send mails to :

General Feedback : feedback1@eenadu.net
Editorial : editor@eenadu.net

Anonymous said...

mailer system failed
its not working

వెంకట్ said...

well i called to eenadu office and spoke to one of the editor (i don't remember his name), he apologized n said it wont happen again.

Anonymous said...

వెంకట్ గారు ఎప్పుడు కాల్ చేశారు?
స్పందించినందుకు ధన్యవాదాలు.

అజ్ఞాత గారు, మెయిల్ చెస్తే జవాబు ఉండదండి, ఐనా మీరు చెప్పారని మళ్ళీ ఒకసారి పంపి చూస్తాను..

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈనాడు వారు వెంకట్ గార్కి, తార గార్కి క్షమార్పణలు చెబితే సరిపోతుందా? మరునాటి పేపర్లో సవరణ ప్రకటిస్తే సరిపోతుందా? ఘనత వహించిన ప్రభుత్వం గారు ఏంచేస్తున్నారు? వారికి బాధ్యత లేదా? వారిటువంటివి పట్టించుకోరా?

Anonymous said...

Venkat@: That is the typical answer they give. They don't care your call also

Anonymous said...

>>mailer system failed

నేను చేశానే, బానే ఉన్నది, మెయిల్ బౌన్స్ అవ్వలేదు మరి.
కామెంట్ కి ధన్యవాదాలు..

చివరి అజ్ఞాత గారు ధన్యవాదాలు, అవును ఈనాడు అనే కాదు, పాటకుల మనోభావాలు అర్ధం చేసుకునే/ చేసుకునే ప్రయత్నం చేసే పత్రికలు ఎన్ని ఉన్నాయి?

Anonymous said...

Bulusu Subrahmanyam గారు, మీ కామెంట్ కి ధన్యవాదాలు, మరియూ అసైన్సుకి స్వాగతం.

ఈనాడు చేసిన అవమానం మన చట్టానికి, దేశానికి, అందుకోసం అది మొదటి పేజీ మొత్తం క్షమాపణలు వ్రాయాలేమో, వ్రాసినా ఇది సరిదిద్దుకోలేని తప్పు.

ప్రభుత్వం నిద్ర పోతున్నది తెలిసిందే కదా, అలానే ఎదైనా కేస్ పెట్టినా అది మా మీద దాడి అని గొడవ చేస్తారు, పాలకులు నిద్రపోతున్నరుగా అని మనం మన కర్తవ్యాన్ని మానుకుంటామా?

Apparao said...

అసలు మోసగాడు గూగలులోడు
http://anvvapparao.blogspot.com/2010/01/google.html

kiran said...

అసలు పాకిస్తాన్ ఏర్పడటమే తప్పు... ఇంకా వదులుకునేది లేదు... మొత్తం మాదే అని లొల్లి చేస్తే సరి లేకపోతె.. స్లో పాయిసన్ లా దిక్కులేకుండా పోతారు కాష్మీరీలు ... ఇంకా పాకీలు కూడా .. మన్మోహన్ దుర్మోహన్ కావాల్సిందే .. కాటిన్యత ఉండాల్సిందే

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్