blogspot hit counter

Tuesday, December 7, 2010

అసలు ఎకనామిక్స్ అంటే ఏంటంటే

రోజూ మనం పేపర్లలో చూస్తునే ఉంటాం, లేదా రైతుల గురించి వచ్చిన వందలాది సినిమాల్లో వినే ఉంటాము " పెప్సీ తయారు చేసినోడు తన వస్తువు రేట్ నిర్ణయించుకున్నప్పుడు, ఒక రైతు తను పండించిన వస్తువు రేట్ ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నాడు?" వినగానే ఇది నిజమే అనిపిస్తుంది, కానీ నన్ను అడిగితే నా సమాధానం, ప్రతి వస్తు ఉత్పత్తిదారుడు తన వస్తువు రేట్ తానే కట్టుకోలేడు, అలానే, రైతు తన వస్తువు రేట్ తనే కట్టుకున్నే వ్యవస్థ తయారు చేసినా అది కొద్ది రోజులలకే ప్రస్తుత స్థితికే వస్తుంది.

ఇక్కడ నేను పెట్టుబడీ దారి తొత్తుని, అని అనుకుంటారేమో, నాకు తెలిసీ ఏ ఎకనామిస్ట్ తన స్వంత అభిప్రాయాలని రుద్దడానికి ప్రయత్నించడు, ఒక వ్యవస్థ తీరు చూసి అది ఎటు పోతున్నదో మాత్రమే చెప్తాడు, అంటే తప్ప పెట్టుబడీ దారి వ్యవస్థ, శ్రమ దోపిడీ అన్నవి నాకు తెలియవు, అవి ఇక్కడ అప్రస్తుతం, నాకంటూ ఒక అభిప్రాయం లేకుండా నేను నేర్చుకున్నది మాత్రమే ఇక్కడ చెప్తాను, అంతేందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని నాకు మెయిల్ పెడితే, నా జవాబు ఏది తక్కువ ఖర్చుతో ఐపోతుందో, ఏది సులభమో మాత్రమే చెప్తాను, అలానే ఎకనామిక్స్ కుడా, మీరు మార్గం ఎంచుకుంటే అది ఎటు పోతుందో చెప్తుంది తప్ప, అది నీతిగలదో, న్యాయమో, అన్యాయమో అన్నది అత్యంత ప్రాధాన్యత కలిగినది కాదు.

అలానే మన వారికి చాలా అపోహలు ఉంటాయి, ఎలా అంటే మధ్యవర్తులందరూ (రియల్ ఎస్టేట్ ఏజంట్లు, డీలర్స్, డ్రిస్టిబ్యూటర్స్) వీరు వస్తు ఉత్పత్తిలో పాలు పంచుకోరు, వీళ్ళది కేవలం దోపిడీయే అని. అలానే పెట్టుబడి పెట్టినోడు కోటాను కోట్ల లాభాలు సంపాదించి కార్మికుల శ్రమని దోచుకుంటున్నారు అనో రోజు వినేవి ఇవి అన్నీ, కానీ వీరే లేకపొతే ఆర్ధిక వ్యవస్థ చక్రాలు లేని రైలు బండి లాంటిది, ముందుకు వెళ్ళాలి అంటే వీరు కావల్సిందే.

ఇక మన సమాజంలో అనుకునేవి, ఎవరైనా తన ఆస్థి మొత్తం దానం చేసో, పేదలకి పంచాడు అనగానే, లేదా ఫ్యాక్టరీ లాభాన్ని కార్మికులకి పంచాడు అనగానే మనం అతన్ని అభినవ కర్ణుడే అనుకుంటాం, అలా ఊరికి ఒక్కరు ఉన్నా దేశం బాగుపడుతుంది అనుకుంటాను, కానీ దాన్ని ఎకనామిస్ట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఎప్పుడైతే ఇది ఒక లిమిట్ దాటుతుందో దీని వలన జరిగే లాభం (పేదరిక నిర్మూలన) ఏమో కానీ నష్టమే ఎక్కువ (పేదరికం తగ్గదు పెరుగుతుంది).

అలానే స్టాక్ మార్కెట్లు, అసలు ఇదొక మోసం అనుకునే వారే ఎక్కువ, అసలు దీని వలన పేద ప్రజలకి ఏమి లాభం అనని వారు ఎవరు? అలానే స్టాక్ మార్కెట్ పెరిగితే బంగారం రేట్ తగ్గుతుంది అనుకునే వారు తక్కువ కాదు, మనకి తెలిసింది ఈనాడు బిజినెస్ డెస్క్ అందించే వార్తలు, వాటి ప్రాతిపదికన మనం ప్రభుత్వ పాలెసీల గురించి చర్చిస్తుంటాం, మన తర్కానికి అందితే నిజం, లేకపోతే మోసం.

ఇక తర్కానికి వస్తే, ఒకప్పుడు "లాజిక్" అంటే సైన్సు అనే భావన ఉండేది, కానీ అది ఎలా తప్పు అయ్యిందో ఈమాట  పత్రికలో ఉన్నది చూడండి, మన తర్కం కాదు, కావలసినది ఫార్మల్ ప్రూఫ్,  దీని గురించి తదుపరి భాగాలలో వివరిస్తాను.

అలానే మనకి థీరీ అనగానే ఒక మాట అనేస్తాం, థీరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు అని, మరి అవి వేరు వేరు ఐతే అసలు థీరీ ఎందుకో నాకు ఎప్పటికీ అర్ధం కాదు, నా అనుభవంలో ఏదైనా ఎకనామిక్స్ టాపిక్ ఎత్తగానే, మొదట వినేది ఇదే మాట, "అసలు ఒక వస్తువు తయారు చేసినోడు, దాని ఐన ఖర్చుకి ఎంతో కొంత లాభం వేసుకొని అమ్ముతాడు తప్ప, మార్కెట్ రేట్‌కి ఎందుకు అమ్ముతాడు?, ఎదో మీరు థీరీ అంటారు తప్ప అది నిజంగా ఎక్కడా జరగదు, థీరీకి బయట జరిగే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, మీరు అన్నీ ఐడియల్ కేసెస్ మాత్రమే చుస్తారు, నిజ జీవితంలో ఎప్పుడూ అలా జరగదు"

దీని గురించి కుడా వివరణ తరువాతి భాగాల్లో ఇస్తాను, కానీ నేను కోరేది ఒక్కటే, మీకు అర్ధం కాకపొతేనో, మీ నమ్మకానికి వ్యతిరేకంగా ఉంటేనో ఎకనామిక్స్ మొత్తం పెట్టిబడీ దోపిడీదారుల తొత్తు అని అనేసి వెళ్ళిపోండి తప్ప అసలు డిమాండ్, సప్లై కాదు రేట్ నిర్ణయించవలసింది శ్రమ అని మొదలెట్టకండి ప్లీజ్, అలా కావాలి అంటే నాకు తెలిసిన జే.యన్.యు. పిల్లకాయల నెంబర్లు ఇస్తాను వారితో చెర్చించుకోండి (నాకు ఎవరు తెలియరనుకోండి అది వేరే విషయం).

ఇక గణితం - ఎకనామిక్స్, ఇక్కడో చచ్చు పుచ్చు చర్చ ఉన్నది గణితం వలన ఎకనామిక్స్ బ్రష్టుపట్టిపోతున్నది అని, ఇది చెప్పేవాళ్ళకి లెఖ్ఖలు రాక దాన్ని పట్టుకోని అనవసరం అంటారు, దీని గురించి వచ్చే భాగంలో చెప్తాను.

కానీ డైరెక్ట్ గా ఈ మేక్రోనో, మైక్రోనో కాకుండా అసలు ముందుగా ఫార్మల్ ప్రూఫ్, తరువాత కాస్త గణితం, మేక్రో ఆ తరువాత మెల్లగా మైక్రో ఎకనామిక్స్ చుద్దాం.

మొదట్లో కాస్త అర్ధం అవ్వొచ్చు కానీ ఇచ్చిన లెఖ్ఖలు చెయ్యకపొతే మాత్రం తరువాత తరువాత బుఱ్ఱకి ఎక్కదు కాబట్టి, నేర్చుకోవాలి అన్న కోరిక ఉంటే మాత్రం కాస్త లెఖ్ఖలు నేర్చుకోవాల్సిందే..



ముందు పాత టపాలు కొన్ని ఉన్నాయి, ఉత్తినే సరదాగా అవగొట్టాలి, అదీ దీనికోసం మొదలు పెట్టిందే, ఎదో ఒక చిన్న గొడవ వలన కాస్త గందరగోళంలో ఉన్నాను, టపా అస్తవ్యస్తంగా ఉంటే నాకో మెయిలో, కామెంటో కొట్టండి.

19 comments:

Indian Minerva said...

Waiting for the posts

krishna said...

wow....... good ! మరి లెక్కలు కూడా నేర్పియాలా అబ్బాయా :)
"అంటే తప్ప పెట్టుబడీ దారి వ్యవస్థ, శ్రమ దోపిడీ అన్నవి నాకు తెలియవు, అవి ఇక్కడ అప్రస్తుతం, నాకంటూ ఒక అభిప్రాయం లేకుండా నేను నేర్చుకున్నది మాత్రమే ఇక్కడ చెప్తాను, అంతేందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని నాకు మెయిల్ పెడితే, నా జవాబు ఏది తక్కువ ఖర్చుతో ఐపోతుందో, ఏది సులభమో మాత్రమే చెప్తాను, "అబ్బా ఛా ! నిజమే ? ఈ కమ్యూనిస్టు వ్యతిరేకత వెనక కధలు కాకరకాయల ప్రభావం వుంది అని అభిఙ్నవర్గాల భోగట్టా ! గుండెకాయ మీద ఒట్టేసుకుని చెప్పు !
అది సరె గాని పాత పోస్టులు ఏమయ్యాయి ?

కొత్త పాళీ said...

మొత్తానికి మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషం. శుభస్య శీఘ్రం.
కానివ్వండి మరి.

Anonymous said...

అబ్బాయ్, నేను కమ్యూనిష్ట్లే కాదు, జ్యోతిష్యానికి అదే విధంగా ప్రతిస్పందిస్తాను కాదా? ఈ చేతబడుల మీద ఒక టపా పెండింగ్లో ఉన్నదు తిరు ని అడిగాను వ్రాశిపెట్టమని.
సరే నువ్వన్నది ఎందుకు వొదలాలి అదీ కలుపుతా.

పాత టపాలు లేటెక్స్ మీద ప్రయోగాలు చేస్తూ దాచిపెట్టాను, అది ఇంకా పుర్తి కాలేదు, మొత్తం మార్చాలి లెఖ్ఖలు మొదలెట్టేలోపు అబ్బాయా..

Anonymous said...

బూడిద రాలడం మీద విరుచుకుపడరెందుకో?

ఎలక్ట్రాన్ said...

Thank you. తరువాత టపాలకోసం ఎదురుచూస్తుంటాము..

Anonymous said...

బాగుందండి.
/*, కానీ వీరే లేకపొతే ఆర్ధిక వ్యవస్థ చక్రాలు లేని రైలు బండి లాంటిది, ముందుకు వెళ్ళాలి అంటే వీరు కావల్సిందే.*/
చాలా బాగా చెప్పారు. మీ తదుపరి టపా కోసం ఎదురు చూస్తూ.
--బొప్పి

Anonymous said...

సత్యాన్వేషి,

సౌమ్య, శ్రీను వారిద్దరూ నన్ను ఉసిగొల్పారనుకుంటే సూపరు..
మరి నేను చిన్న పిల్లోడినా, సౌమ్యో, శ్రీనో నాకు 10రూ. ఇస్తాను వెళ్ళి వాడ్ని తిట్టు అనగానే తిట్టేయడానికి.

Anonymous said...

సత్యాన్వేషి,

అవేవీ కారణం కాదులేండి, ఆ టపా ఉద్దేశం నా ఉనికి ఇక్కడ ఉండదు అనే చెప్పడమే.

Anonymous said...

selective criticism does not always work.

రాజేష్ జి said...

$తార గారు
మీ రీసెంట్ టపా చదివి, మనసు చెదిరి... మీకోసం ఈ పాట...(టీటొటొయ్)

http://www.youtube.com/watch?v=6onOsBCkNyI

బ్లాగు బాబ్జీ said...

తారన్నా,
కారణాలు ఏమైనా గానీ చాలా బాధాకరం,
సరిగ్గా ఒక గంట క్రితం నీ ఫోన్‌ కాల్‌ పెట్టేసే కొన్ని సెకన్ల ముందు ఏ మాట చెప్పానో అదేమాట మళ్ళీ చెప్తున్నా .. "నువ్వేం చేసినా నా మద్దత్తు ఉంటుంది సుఖంగా బతుకు. నేను నీతో టచ్‌ లోనే ఉంటా ..

Anonymous said...

ఆర్థికశాస్త్రం మీద మీ అభిప్రాయాలు బాగున్నాయి. డబ్బు శాస్త్రం మీద మీ వ్యాసాలకోసం ఎదురుచూస్తాను. అదేమిటో గాని, డబ్బంటే పెద్దగా అత్యాశలేకున్నా, బోలెడంత అభిమానం మాత్రం వుంది. :)
ఈ సత్యాన్వేషి అంటే ఆంధ్రవ్యతిరేక ముదనష్టపు సోణెమ్మ భజనపరులైన తెరాస వర్గం వారేమో కదా? విచ్చిన్నకర శక్తులైనా అప్పుడప్పుడు మంచి సలహా ఇస్తారు, ఆచితూచి ఫాలో అవ్వోచ్చు. :))
ఎవరి మీదనో అలిగి మీ చొక్కా/బ్లాగు చింపేసుకోవడం .., ఏమంత మంచిపద్దతి కాదనుకుంటా .. :D

Anonymous said...

తార,
కార్నియా లేని కబోదులు మీ బ్లాగ్లో కామెంట్లు పెట్టకూడదా? కళ్ళులేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మరి మనకు తెలిసేదెట్ల? ఇదన్యాయం, కార్నియాకి మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

బూతులు, అభ్యంతరకరమైన చెత్త వాగుడు వుంటే తప్ప, విమర్శకులకు జడిసి వారి వ్యాఖ్యలను తొలగించడం నాకంత నచ్చలేదు. వినోదకరమైన కార్నియా, సత్యాన్వేషి వ్యాఖ్యలు తొలగించాల్సింది కాదు.

Anonymous said...

కార్నియా వ్యాఖ్య నేను ఏమీ తొలగించలేదు సార్,

సత్యన్వేషి వ్యాఖ్యలు తొలగించకపొతే అవి అలానే కొనసాగుతాయి, అవే కామెంట్లు (మా అన్నగారి మాటల్లో పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి అని)

అసలు అది మా అన్నగారి మరో రూపం అని నా అనుమానం, సో, అన్నగారికి మూడ్ వస్తే ఒంటి చేత్తో వంద కామెంట్లు రాసి పడేస్తారు, సోది గొడవ అని తీసేసాను.

Anonymous said...

హ్వా హ్వా..
అన్నగారంటే? మన శర్మగారు కాదు కదా! ఓ .. అర్థమయ్యింది, మహానుభావా మార్తాండతేజానేనా? వీరు వారు కారేమో అనుకుంటా.. ఈ ఏడుపు వేరేగా వుంది. :))
Cornia కామెంటు చూసినట్టు గుర్తు మరి.

SNKR

Anonymous said...

ఏమోనండి నాకు ఆ కమ్యూనిష్ట్ల ఏడుపంటేనే చిరాకు, వాళ్ళకి తెలిసింది రెండే రెండు చైనా, రష్యా, షా కి య వత్తు ఉన్నది కాబట్టి రష్యా గొప్పదని, నా కి ఏ వత్తూ లేదు కాబట్టి చైనానే గొప్పదని వాళ్ళల్లో వారే తన్నుకుంటుంటారు.