blogspot hit counter

Friday, July 2, 2010

ఈ బల్లులు తమ విషంతో మనుషులని చంపలేవు

సైన్సు:కొమోడో డ్రాగన్ అనబడే ఈ రకం బల్లులు ఇండోనేసియన్ దీవులలో కనిపిస్తాయి. వీటి నోటిలో విష గ్రంథులు ఉంటాయి. ఇవి ఒకసారి కరిస్తే మనిషి చనిపోతాడు.

మరి అసైన్సు: కొమొడొ డ్రాగన్ కరిచిన తరువాత కనపడే కొన్ని లక్షణాలని బట్టి, (వాపు, రక్తం గడ్డకట్టకపోవటం, తీవ్రమైన నొప్పి..) కొమొడొ డ్రాగన్లు తను వేటాడే జంతువుకి తెలివి పోగట్టగలిగేంత(చిన్న జంతువులకే) శక్తి గల విషం, కొద్ది మొత్తంలో కలిగి వుంటుంది అని ఒక ఊహ 2005 కొమొడొ డ్రాగన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న వారికి వచ్చింది. 2009లో ఒక కొమొడొ డ్రాగన్ నోటి నుంచి (క్రింది దవడల క్రింద) ఒక (రెండు ఉంటాయి అట) విషం తయారు చేసే గ్రంధిని వేరుచేశారు. కానీ పైన చెప్పిన లక్షణాలు కొమొడొ డ్రాగన్ లాలాజలంలో వున్న బ్యాక్టీరియా మూలంగా అని ఎక్కువమంది నమ్మే వాదన.

కాబట్టి, కొమొడొ డ్రాగన్ వేటాడేటప్పుడు విషప్రయోగం చేస్తుందో చెయ్యదో ప్రక్కన పెడితే వాటి విషానికి మనుషులని, మిగతా పెద్ద జంతువులని చంపేటంతటి శక్తి మాత్రం లేదు అని అందరూ అంగీకరించే విషయమే.
వాటి విషం వలన ఇవి ఒకసారి కరిస్తే మనిషి చనిపోతాడు అనేది అభూత కల్పనే, ఎదో నిద్ర మత్తులో వ్రాసినది.
ఇంక వాటి దాడిలో మరణించిన మనుషుల సంగతికి వస్తే, చాలా పదునుగా, సుమారు 1 ఇంచి పొడవు వుండే వాటి పళ్ళతో చెసే లోతైన గాయాల నుంచి రక్తస్రావం ఆగక, దానికి తోడు షాక్ వలన మాత్రమే సంభవించిన మరణాలు తప్ప విషం వలన కాదు.


సైన్సు సోర్సు:http://science.praveencommunications.firm.in/2010/06/blog-post_28.html

26 comments:

karthik said...

post ekkada mashtaaru?

karthik said...

>>ఇవి ఒకసారి కరిస్తే మనిషి చనిపోతాడు
ఎవరు చనిపోయేది, మనిషా డ్రాగనా?

తార said...

కొత్త ఎడిటర్ ఎదో అంటే సరే అని అది సెలెక్ట్ చేసాను, టపాలో ఎమీ పబ్లిష్ కావటం లేదు, అంత బగ్ పెట్టుకొని ఎల రిలీజ్ చేశాడో, పాత ఎడిటర్ పెట్టి పోస్ట్ చేసాను.
MS ఐపొతున్నది గూగుల్ మెల్లగా.

తార said...

మనిషిని కద, మార్తాండని కాదు కాబట్టి మనిషే పోతాడు

శ్రీనివాస్ said...

సాహిత్య అవకారం బ్లాగు ఎవరు పెడతారు?

karthik said...

ఇవి ఒకసారి కరిస్తే మనిషి చనిపోతాడు అనేది అభూత కల్పనే, ఎదో నిద్ర మత్తులో వ్రాసినది
kevvu kevvu

నాగప్రసాద్ said...

ఈ కొమొడోల మీద ఏదో కాలంలో నేను సినిమా చూసినట్లు గుర్తు. సినిమా పేరు కొమొడో అనుకుంటా. అదొక రకమైన హర్రర్ సినిమా అంటే ఎగేసుకొని వెళ్ళాను అప్పట్లో. :-)))

శ్రీనివాస్ పప్పు said...

నిద్రమత్తులో ఉన్న మనిషిని కరిస్తే అతను చనిపోతాడా?లేకపోతే అవి నిద్రమత్తులో ఉండి మనుషుల్ని కరిస్తే చనిపోతాడా?లేకపోతే అది కరుస్తుండగా చూసిన వాళ్ళు భయంతో చచ్చిపోతారా?ఇవతల వాళ్ళు భయపడ్డం చూసి కరిచిన మనిషి చచ్చిపోతాడా? హేవిటో అంతా కంఫ్యూజింగ్ గా ఉంది,కాస్త సోదాహరణంగా వివరిస్తారా తారా?

తార said...

@శ్రీనివాస్ గారు
కాగడా.
మీ కామెంట్ కి ధన్యవాదాలు, రాయుడ్ని అడిగాను అని చెప్పండి.
@కార్తీక్
నిజమే కదా
@ నాగా
ఆ, తరువాత.

తార said...

@పప్పు గారు
చాలా మంచి ప్రశ్న అడిగారు, కానీ మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే, లండన్ నుంచి ఎక్స్‌పర్ట్‌ని రప్పించాల్సిందే

ఆ.సౌమ్య said...

అయితే నిద్రమత్తులో కథలు రాసినట్టు, షాక్ లో మరణాలు సంభవిస్తాయన్నమాట

karthik said...

london nunchaa?
ఏ లండన్ నుంచీ బాబూ ??

శ్రీనివాస్ said...

@శ్రీనివాస్ గారు
కాగడా.
మీ కామెంట్ కి ధన్యవాదాలు, రాయుడ్ని అడిగాను అని చెప్పండి.
__________________________________________________

శ్రీనివాస్ ...కాగడా ఏంటి ? కాస్త వివరించగలరా

తార said...

శ్రీనివాస్ గారు
సాహిత్య అవకారం బ్లాగు ఎవరు పెడతారు?
అని మీరు అడిగిన దానికి కాగడా అని జవాబు ఇచ్చాను.
కాగడా ఐతే అన్నకి సరిజోడు దాన్లో అని అంతే
ఎదో హడావుడిలో సంక్షిప్తంగా సమాధానం చెప్పాను.

శ్రీనివాస్ said...

మొదటి కామెంటు నిద్రమత్తు లో ఉండి చూడడం వలన అర్ధం కాలేదు. ఇప్పుడు అర్ధం అయింది.

శరత్ కాలమ్ said...

ఇప్పుడు నేను ఆఫీసులో నిద్ర మత్తులో వున్నాను. అర్జెంటుగా ఎవరినయినా కరవాలి. నేను కరిస్తే వారు చనిపోతారా? వారు చనిపోతే నా మీద కేసవుతుందా? నిద్ర మత్తులో కరిచానంటే కేసు కొట్టేస్తారా? నాకివన్నీ అర్జంటుగా తెలియాలి.

తార said...

@శరత్ 'కాలమ్'
మీకు సమాధానం చెప్పాలి అన్నా లండన్ నుంచి ఎక్స్‌పర్ట్ రావల్సిందే, తప్పదు...
అసలే లండన్ వాళ్ళు, ఇలాంటి కేసెస్‌లో మాంచి అనుభవం గలవారు.

Anonymous said...

>అసలే లండన్ వాళ్ళు, ఇలాంటి కేసెస్‌లో మాంచి అనుభవం గలవారు
did you mean ఫారిన్ - పా రను వెళ్ళిన వాళ్ళు?

ఏక లింగం said...

హతవిధీ... అందరు కలిసి లండన్ పేరు మంటగలుపుతున్నారు కదా?

durabhimaani said...

డొకొమో డ్రాగన్లు మా ఇంటి వెనుక దిబ్బల్లో ఉంటాయి. వీటికి రెండు కోరలు ఉంటాయి. పొద్దున్నే లేస్తూనే నా పళ్ళ కంటే ముందు వాటి కోరలు తోముతాను. దీనివల్ల వాటి కోరలు కస్సుమని దిగుతాయి. బూర్జువా దేశలు ఉత్పత్తి చేస్తాయి కాబటి కోల్గేట్ వాడను. ఫ్యూడల్ భూస్వామ్య దేశం కాబట్టి వికో వజ్రదంతి వాడను. నేను చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్నపుడు చైనా వెళ్ళాను. అప్పుడు జేబీల నిండా ఎర్రమట్టి తెచ్చాను. వాటితోనే నేను, డొకొమోలు పళ్లుతోముతాము. డొకొమోలతొ భరద్వాజ, కార్తీక్ ఇతర గాంగులను కాటేయిస్తాను. బ్రాందీ తాగే సమైక్య గూండాలను కూడా. డొకొమో డ్రాగన్లకు తెలివితేటలు కూడా ఎక్కువ, వాటికి మతి తప్పిన జంతిక వాదం బాగా తెలుసు.

శరత్ కాలమ్ said...

మరీ లండన్ పరువు తియ్యకండయ్యా బాబులూ. ఏకలింగం మనస్సు మహా సున్నితం. ఆయన గారి మనో భావాలు గాయపడతాయి. నిరసనగా తన ఆత్మని హత్య చేసినా చేస్తారు!

ఏక లింగం said...

???

ఇదెక్కడి లొల్లి?

Praveen Sarma said...

ఈ సదరు నిద్రమత్తు కాన్సెప్ట్ నాదే, వాడుకున్నవారు అందరూ నాకు డబ్బులు కట్టాల్సిందే, నా ICICI, HDFC బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ తెలుసుగా.

శరత్ కాలమ్ said...

అలాగే. నా ఎక్కవుంట్ నంబరు కూడా తెలుసు కదా. నేను రూపాయల్లో పంపిస్తాను. అదే అంకెలో డాలర్లు వెనక్కి పంపించండి.

durabhimaani said...

మీకందరికి నిదరోవ్ మత్తెష్కోవ్ గురించి తెలీదు. నిద్ర మతులో ఉన్నపుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడు మిగతా అవయవాలన్నీ రెస్టు తీసుకుంటూ ఉంటాయి కాబట్టి. మెదడుకు కావల్సినంత కార్బన్ మోనాక్సైడ్ అందుతుంది, అలాగే సిట్రిక్ యాసిడ్ మరియు ట్రై గ్లూకో బొందాక్సైడ్లు, పాలీ అమైనో పిండాకూడ్స్. అందుకే నేను నిద్ర మత్తులోనే ఒకటికి రెంటికి మొదలుకుని అన్ని పనులు ప్లాన్ చేస్తాను. నేను మేల్కుని ఉన్నపుడు ఎవరైనా కామెంట్ చేస్తే వాటిని సేవ్ చేసి నిద్రమత్తులో పబ్లిష్ చేస్తా. అదేవిధంగా ఇతరభాషల టపాలు కూడా అప్పుడే రాస్తాను. తొడ సరిగ్గా కొట్టడం చేతకాని శరత్ నిద్రమత్తులో ఎవరినైనా కరుస్తా అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చోడినా. న్యూజిలాండ్లోని మావోరీ తెగల్లో ఇప్పటికీ తొడలు కొట్టే సంప్రదాయం ఉంది. లాటిన్ అమెరికా దేశాల్లో తొడలు గిల్లుకుంటారు. నేను చైనా వెళ్ళినపుడు మావో తోడ గిల్లాను. అప్పుడు వీధిలోని ఆడవాళ్ళు అందరూ నన్ను తిట్టారు.

Anonymous said...

పని పాటలు లేవు వెదవలకి, హన్నా !