blogspot hit counter

Monday, December 20, 2010

దిష్టి తీయడం ఎలా?

9 comments
ఈ మధ్య బొత్తిగా అసైన్సు వైపు వెళ్ళడం లేదు కదా, సరదాగా ఒక టపా, ఎక్కడో నేస్తంగారు నన్ను తల్చుకున్నారట అందుకే ఇది.
దిష్టి అంటే పరుల దృష్టి వలన వచ్చే దోషమట, అదేదో బాలయ్య సినిమాలో తొడగొట్టి రైలుని వెనక్కి పంపినట్టు, ఇది సాధ్యమేనా? ఎవరో చూడగానే పిల్లలకి ఆరోగ్యం చెడిపోతుందా? నరుడు దృష్టి తగిలితే... నల్లరాయి అయినా బద్దలైపోతుందట, నిజమేనా? సరే నిజమనే అనుకుందాం, అంత శక్తి ఉత్పత్తి చేయగలదా మన కన్ను? సరే మరింత Larger and Wider Platform కి పోదాము, చేతబడులు మనుషులని చంపగలవా? అలానే అవేవో క్రియలు కూడా?

అసైన్సు:: అసలు మనిషిని చంపడానికి ఎంత శక్తి కావాలి? ఇదేదో శక్తి కేంద్రాల సంగతి కాబట్టి మనం కుడా అదే తీసుకుంటే పోలా? లీతల్ డోస్ 9×102 J, మరి ఇంత శక్తి మన శరీరం తయారు చెయ్యగలదా?
సైన్సు :: శుబ్బరంగా, E / m = c2 = (299,792,458 m/s)2 = 89,875,517,873,681,764 J/kg (≈9.0 × 1016 joules per kilogram) ఒక గ్రాములో ఉన్న శక్తి హిరోషిమా మీద వేసిన బాంబు కన్నా ఎక్కువ అట, ఇంకేమి, కంటి చూపుతో చంపడం సాధ్యమే. ఇంతకంటే ప్రూఫ్‌లేమి కావాలి?

అసైన్సు:: సరేనయ్యా నేను మా ఊరిలో స్మశానంలో చేతబడి చేస్తానయ్యా, నా శత్రువు అడ్రస్సు, లేదా ఫలానా వ్యక్తిమీదకి ప్రయోగిస్తున్నాను అని ఆ శక్తికి చెప్పడం ఎలా?
సైన్సు ::  దానికి వెంట్రుకలో, గోళ్ళో కావాలి?

అసైన్సు:: ఐతే నువ్వు ఎవో మంత్రాలు చదివో, ఇంకేదో చేసో సృష్టించిన శక్తి, ఆ వెంట్రుకలో, గోళ్ళో పట్టుకోని వెళ్ళి, D.N.A టెస్ట్లు చేసుకొని ఆ మనిషిని పట్టుకుంటుందా?


సైన్సు ::  మనిషి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి చంపగలదు చేతబడి సరిగ్గా చేస్తే

అసైన్సు:: పవర్ఫుల్ స్నైఫర్ తుపాకీలే ఒక మనిషిని కచ్చితంగా చంపగలగాలి అంటే ఆ మనిషి 1కి.మీ. లోపే ఉండాలి, కానీ ఈ చేతబడి ఎవర్ని ఐనా, ఏ దేశాంలో దాక్కున్నా వెతికి మరీ చంపుతుంది అంట, ఐతే దానికి ఎంత శక్తి కావాలి? అధమం 1% రీకాయిల్ వేసుకున్నా, ఆ చేసినోడి బాడీ పార్ట్లు ఏ ముక్క ఎక్కడ పడిండో వెతుక్కోవడానికి నెల పైనే పడుతుందేమో. Law of conservation of Mass/ Energy ప్రకారం, అసలు ఆ మనిషి మిగిలి ఉంటాడా ఆవిరి ఐపోతాడా?

సైన్సు :: సరేనయ్య, ఎదో ఒకటి చేసి, చచ్చో బ్రతికో, లీతల్ డోస్ తయారు చేస్తాను, టార్గెట్ మనిషి అడ్రస్సు లాటిట్యూడు, లాంగిట్యూడు కూడా మాప్ మీద పెట్టి ఉన్నది, అప్పుడేమి చేస్తావు?
అసైన్సు:: రేడియేషన్, అదీ ఇంత శక్తిగలది అట్టా దేశం మీదకి వదిలితే ఎవదో ఒకడ్నే ఎట్టా చంపుద్ది, మధ్యలొ వచ్చిన ప్రతిదాన్నీ బూడిద చేసి కానీ వదలదే, సర్వ నాశనం తప్ప, ఒక్క మనిషినే ఎట్టా చంపుద్దయ్యా?


దిష్టి కుడా ఇంతే కదా మరి, అదీ సున్నితమైన కన్ను రాళ్ళని బద్దలు కొట్టే శక్తిని తయారు చేయగలదా? చేసే క్రమంలో కంటికి ఏ చిన్న అపాయం కుడా జరగదా? 1% వేడిని గ్రహించినా, కన్ను మాడి మసైపోతుంది.

సో, మీకు ఎవరిదో దిష్టి తగిలింది అనుకుంటే, ఎమ్మటే వాడి కళ్ళు మాడిపోయాయేమో చూడండి, అప్పుడు దిష్టి తీసుకోండి, పనిలో పనిగా ఆడ్ని పట్టుకోండి, వేల కోట్లు ఇచ్చి మరీ కొనుక్కు పోతారు ఆ మనిషిని, అలా ఎట్టా చేయగలిగాడో అని.

Wednesday, December 8, 2010

ఫిజిక్స్ - మేథమేటిక్స్ - ఎకనామిక్స్ - 1

24 comments
కళ్ళతో చూసినవి అన్నీ నిజం కాదు, మనం గమనించినవి అన్నీ నిజం అవ్వవు. మనం గమనించినవే నిజం అనుకుంటుంటాం, కానీ ఫార్మల్ ప్రూఫ్ అవసరాన్ని తెలియజేయుటకు కొన్ని టపాలు చూద్దాం.

ముందుగా అబర్వేషనల్ బయాస్ గురించి చూద్దం, కొన్నాళ్ళ క్రితం అమెరికాలో (T ) బంతిని విసిరితే అది నేలని (L) చేరే మార్గం ఎలా ఉంటుంది క్రింది పటం చూపించి అడిగారు, ఎక్కువ మంది A,B,C,D లలో దేన్ని ఎక్కువ మంది చూపించారో ఊహించండి.


Tuesday, December 7, 2010

అసలు ఎకనామిక్స్ అంటే ఏంటంటే

19 comments
రోజూ మనం పేపర్లలో చూస్తునే ఉంటాం, లేదా రైతుల గురించి వచ్చిన వందలాది సినిమాల్లో వినే ఉంటాము " పెప్సీ తయారు చేసినోడు తన వస్తువు రేట్ నిర్ణయించుకున్నప్పుడు, ఒక రైతు తను పండించిన వస్తువు రేట్ ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నాడు?" వినగానే ఇది నిజమే అనిపిస్తుంది, కానీ నన్ను అడిగితే నా సమాధానం, ప్రతి వస్తు ఉత్పత్తిదారుడు తన వస్తువు రేట్ తానే కట్టుకోలేడు, అలానే, రైతు తన వస్తువు రేట్ తనే కట్టుకున్నే వ్యవస్థ తయారు చేసినా అది కొద్ది రోజులలకే ప్రస్తుత స్థితికే వస్తుంది.

ఇక్కడ నేను పెట్టుబడీ దారి తొత్తుని, అని అనుకుంటారేమో, నాకు తెలిసీ ఏ ఎకనామిస్ట్ తన స్వంత అభిప్రాయాలని రుద్దడానికి ప్రయత్నించడు, ఒక వ్యవస్థ తీరు చూసి అది ఎటు పోతున్నదో మాత్రమే చెప్తాడు, అంటే తప్ప పెట్టుబడీ దారి వ్యవస్థ, శ్రమ దోపిడీ అన్నవి నాకు తెలియవు, అవి ఇక్కడ అప్రస్తుతం, నాకంటూ ఒక అభిప్రాయం లేకుండా నేను నేర్చుకున్నది మాత్రమే ఇక్కడ చెప్తాను, అంతేందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని నాకు మెయిల్ పెడితే, నా జవాబు ఏది తక్కువ ఖర్చుతో ఐపోతుందో, ఏది సులభమో మాత్రమే చెప్తాను, అలానే ఎకనామిక్స్ కుడా, మీరు మార్గం ఎంచుకుంటే అది ఎటు పోతుందో చెప్తుంది తప్ప, అది నీతిగలదో, న్యాయమో, అన్యాయమో అన్నది అత్యంత ప్రాధాన్యత కలిగినది కాదు.

అలానే మన వారికి చాలా అపోహలు ఉంటాయి, ఎలా అంటే మధ్యవర్తులందరూ (రియల్ ఎస్టేట్ ఏజంట్లు, డీలర్స్, డ్రిస్టిబ్యూటర్స్) వీరు వస్తు ఉత్పత్తిలో పాలు పంచుకోరు, వీళ్ళది కేవలం దోపిడీయే అని. అలానే పెట్టుబడి పెట్టినోడు కోటాను కోట్ల లాభాలు సంపాదించి కార్మికుల శ్రమని దోచుకుంటున్నారు అనో రోజు వినేవి ఇవి అన్నీ, కానీ వీరే లేకపొతే ఆర్ధిక వ్యవస్థ చక్రాలు లేని రైలు బండి లాంటిది, ముందుకు వెళ్ళాలి అంటే వీరు కావల్సిందే.

ఇక మన సమాజంలో అనుకునేవి, ఎవరైనా తన ఆస్థి మొత్తం దానం చేసో, పేదలకి పంచాడు అనగానే, లేదా ఫ్యాక్టరీ లాభాన్ని కార్మికులకి పంచాడు అనగానే మనం అతన్ని అభినవ కర్ణుడే అనుకుంటాం, అలా ఊరికి ఒక్కరు ఉన్నా దేశం బాగుపడుతుంది అనుకుంటాను, కానీ దాన్ని ఎకనామిస్ట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఎప్పుడైతే ఇది ఒక లిమిట్ దాటుతుందో దీని వలన జరిగే లాభం (పేదరిక నిర్మూలన) ఏమో కానీ నష్టమే ఎక్కువ (పేదరికం తగ్గదు పెరుగుతుంది).

అలానే స్టాక్ మార్కెట్లు, అసలు ఇదొక మోసం అనుకునే వారే ఎక్కువ, అసలు దీని వలన పేద ప్రజలకి ఏమి లాభం అనని వారు ఎవరు? అలానే స్టాక్ మార్కెట్ పెరిగితే బంగారం రేట్ తగ్గుతుంది అనుకునే వారు తక్కువ కాదు, మనకి తెలిసింది ఈనాడు బిజినెస్ డెస్క్ అందించే వార్తలు, వాటి ప్రాతిపదికన మనం ప్రభుత్వ పాలెసీల గురించి చర్చిస్తుంటాం, మన తర్కానికి అందితే నిజం, లేకపోతే మోసం.

ఇక తర్కానికి వస్తే, ఒకప్పుడు "లాజిక్" అంటే సైన్సు అనే భావన ఉండేది, కానీ అది ఎలా తప్పు అయ్యిందో ఈమాట  పత్రికలో ఉన్నది చూడండి, మన తర్కం కాదు, కావలసినది ఫార్మల్ ప్రూఫ్,  దీని గురించి తదుపరి భాగాలలో వివరిస్తాను.

అలానే మనకి థీరీ అనగానే ఒక మాట అనేస్తాం, థీరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు అని, మరి అవి వేరు వేరు ఐతే అసలు థీరీ ఎందుకో నాకు ఎప్పటికీ అర్ధం కాదు, నా అనుభవంలో ఏదైనా ఎకనామిక్స్ టాపిక్ ఎత్తగానే, మొదట వినేది ఇదే మాట, "అసలు ఒక వస్తువు తయారు చేసినోడు, దాని ఐన ఖర్చుకి ఎంతో కొంత లాభం వేసుకొని అమ్ముతాడు తప్ప, మార్కెట్ రేట్‌కి ఎందుకు అమ్ముతాడు?, ఎదో మీరు థీరీ అంటారు తప్ప అది నిజంగా ఎక్కడా జరగదు, థీరీకి బయట జరిగే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, మీరు అన్నీ ఐడియల్ కేసెస్ మాత్రమే చుస్తారు, నిజ జీవితంలో ఎప్పుడూ అలా జరగదు"

దీని గురించి కుడా వివరణ తరువాతి భాగాల్లో ఇస్తాను, కానీ నేను కోరేది ఒక్కటే, మీకు అర్ధం కాకపొతేనో, మీ నమ్మకానికి వ్యతిరేకంగా ఉంటేనో ఎకనామిక్స్ మొత్తం పెట్టిబడీ దోపిడీదారుల తొత్తు అని అనేసి వెళ్ళిపోండి తప్ప అసలు డిమాండ్, సప్లై కాదు రేట్ నిర్ణయించవలసింది శ్రమ అని మొదలెట్టకండి ప్లీజ్, అలా కావాలి అంటే నాకు తెలిసిన జే.యన్.యు. పిల్లకాయల నెంబర్లు ఇస్తాను వారితో చెర్చించుకోండి (నాకు ఎవరు తెలియరనుకోండి అది వేరే విషయం).

ఇక గణితం - ఎకనామిక్స్, ఇక్కడో చచ్చు పుచ్చు చర్చ ఉన్నది గణితం వలన ఎకనామిక్స్ బ్రష్టుపట్టిపోతున్నది అని, ఇది చెప్పేవాళ్ళకి లెఖ్ఖలు రాక దాన్ని పట్టుకోని అనవసరం అంటారు, దీని గురించి వచ్చే భాగంలో చెప్తాను.

కానీ డైరెక్ట్ గా ఈ మేక్రోనో, మైక్రోనో కాకుండా అసలు ముందుగా ఫార్మల్ ప్రూఫ్, తరువాత కాస్త గణితం, మేక్రో ఆ తరువాత మెల్లగా మైక్రో ఎకనామిక్స్ చుద్దాం.

మొదట్లో కాస్త అర్ధం అవ్వొచ్చు కానీ ఇచ్చిన లెఖ్ఖలు చెయ్యకపొతే మాత్రం తరువాత తరువాత బుఱ్ఱకి ఎక్కదు కాబట్టి, నేర్చుకోవాలి అన్న కోరిక ఉంటే మాత్రం కాస్త లెఖ్ఖలు నేర్చుకోవాల్సిందే..ముందు పాత టపాలు కొన్ని ఉన్నాయి, ఉత్తినే సరదాగా అవగొట్టాలి, అదీ దీనికోసం మొదలు పెట్టిందే, ఎదో ఒక చిన్న గొడవ వలన కాస్త గందరగోళంలో ఉన్నాను, టపా అస్తవ్యస్తంగా ఉంటే నాకో మెయిలో, కామెంటో కొట్టండి.

Monday, December 6, 2010

రౌడీ, ఇకపై కేరళని అవమానిస్తే చేతులు ముడుచుకోని కుర్చోము ఏమనుకుంటున్నావో

6 comments
ఎవడండీ అసలు ఈ రౌడీ, కమ్యూనిష్ట్లపై తనకి ఎంత ద్వేషం ఉన్నా కేరళ ప్రగతిని తక్కువ చేసి చూపిస్తే మా కమ్యూనిష్టు సోదరులు ఎంత ఫీల్ అవుతారు, అందుకే నేను  దొరికిన క్రొద్ది సమయంలోనే మా కమ్యూనిష్ట్ల గొప్పతనాన్ని చాటదల్చుకున్నాను.

ఎనబైయ్యో దశకం, కమ్యూనిష్ట్ల పరిపాలనో కేరళ 20 శాతంకి పైగా నిరుద్యోగంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సమయం, ఎదో ఒకటి చెయ్యడం కన్నా, ఏదీ చెయ్యకపొతేనే ప్రజలు ఎదో ఒకటి చూసుకుంటారు అని మన ప్రియతమ కమ్యూనిష్ట్లు నిద్దరొతున్న సమయంలో, గల్ఫ్ వెలుగులు కేరళలో ఆశాకిరణాలయ్యి 2000 సంవత్సరం వచ్చే సరికి నిరుద్యోగం 9 శాతానికి పరిమితమయ్యింది..చూశారా ఏదీ చెయ్యకుండా నిద్దరోవడం వలన దేశానికి 40 లక్షల జనాభా తగ్గింది.

గల్ఫ్లో చిన్న తుఫాను వచ్చినా కేరళలో 20% కుటుంబాలకి కంటిమీద కునుకుండదు, మరి అదేగా వారికి తిండి పెడుతున్నది, తాము 10% అభివృద్ది సాధించాము అని చెప్పుకుంటున్న కేరళ లెఖ్ఖల్లో 27% ఆదాయం విదేశీ సొమ్మే, అదే లేకపొతే కేరళలో 40% మంది నిరుపేదలే.

గ్లోబలైజేషన్ని విమర్శిస్తూ గ్లోబలైజేషన్ మీద బ్రతుకుతున్న రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపించుకోవడం ---- (మాటలు లేవు).

ఇక వ్యవసాయ రంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, రోజు రోజుకీ పడిపోతున్న, అసలు ఉన్నాయో లేవో కుడా తెలియని వరి పొలాలని అడుగుదామా? 2.2% నెగెటివ్ గ్రోత్ మెయింటెయిన్ చేస్తున్న ప్రైమరీ సెక్టార్‌ని అడుగుదామా? 77% శాతం ప్రభుత్వ ఆదాయాన్ని "ప్రభుత్వోద్యోగ సంక్షేమానికి" కేటాయించి చిన్న కాలువ త్రవ్వడానికి కుడా విదేశీ ఋణం కోసం అర్రులు చాస్తూ దాదాపు 58 వేల కోట్ల విదేశీ ఋణం తీర్చలేక వడ్డీలు కట్టడానికీ డబ్బుల్లేక మళ్ళీ అప్పులు చేసి వడ్డీలు కడుతున్న రాష్ట్రాన్ని చూడు కమ్యూనిష్టు సిద్దాంతాలు ఎప్పుడో గాలికొదిలేసిన కేరళ ఆర్ధిక వ్యవస్థ నేర్పుతున్న పాఠం చూడు రౌడీ..


ఇక ప్రజా సంక్షేమానికి వస్తే మేము కేటాయంచినది 2000 కోట్లు ఐనా, 4 వేల కోట్లు ప్రపంచ బ్యాంకుకి వడ్డీ కడుతున్నాం అని మరిచిపోకు, అంత వడ్డీ ఎందుకు కడుతున్నామో తెలుసా మా 2.66 లక్షల ప్రభుత్వోద్యోగులకోసం 14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, మరి ఉన్న ఆ రెండు వేల కోట్ల నుంచే మేము ఏది కాజేయ్యాలన్నా, దానిలో ఆ విజయన్నో ఎవడో 300 వందల కోట్లు తినేశాడు, మరి మిగతా రాజకీయనాయకులు ఎలా బ్రతకాలి అధ్యక్షా?

రౌడీ,

గ్లోబలిజేషన్ ఫలాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే కాదు, కూలి పనిచేసుకునే వాడికి కుడా ఎలా ఇప్పించగలిగిందో చూడు మా కేరళ ప్రభుత్వం..

ఇదంతా కేవలం మా చేతగానితనం వలన జరిగింది అనుకుంటున్నావేమో, మేము ఇవన్నీ నిద్రపోయే ముందే, నిద్రమత్తులో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు.

3 కోట్ల ప్రజా సంక్షేమం అంటే మాకు  10 లక్షల ప్రభుత్వోద్యోగుల సంక్షేమం (విశ్రాంత/ప్రస్తుత) మాత్రమే.


అన్ని వ్యవస్థలూ తిరోగమిస్తున్నా, విదేశీ ఋణాన్ని ఆదాయంగా, గ్లోబలైజేషన్ డబ్బులని సొంత డబ్బులుగా భావిస్తూ, 10% అభివృద్దిని సాధిస్తున్న/చూపిస్తున్న మా కేరళ విధానాన్ని చూసి నేర్చుకో ఏమనుకుంటున్నావో..

---

ప్రజాసంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం కేటయించింది 2254 కోట్లు ప్రభుత్వ బడ్జెట్, దానిలో అసలు నిజంగా ఎంత కేటాయించారో, ఎంత ఖర్చు పెట్టారో దేవునికే ఎరుక, కానీ ప్రజలు సొంతగా విరాళాల రూపంలో ప్రజా సంక్షేమంకోసం దీనికి మూడు రెట్లు ఖర్చు పెట్టారని ఒక అంచనా.

The remittances account about 22 per cent of the NSDP. The importance of remittances to Kerala’s economy is evident from a few other comparisons. Remittances were 1.74 times the revenue receipts of the state, 7 times of the transfers to the state from the Central Government and 1.8 times the annual expenditure of the Kerala Government. Remittances were sufficient to wipe out 60 per cent of the Kerala state's debt. The remittances in 2003 were 15 times of the export earnings from cashew and 18 times of those from marine products.

అసలు విషయం మర్చిపోయాను ఈ ఆర్ధిక విదానం వలన అత్యధికంగా నష్టపోయింది కేరళ హిందువులు, కేరళలో ప్రజల ఆదాయం మతాలవారిగా చూస్తే హిందువుల జనాభా సగం ఉన్నా, క్రైస్తవుల, ముస్లీంల ఆదాయం (కలిపి) ఐదు రెట్లు ఎక్కువ, ఇదే మా మైనార్టీ సంక్షేమం. ( హిందువుల ఆదాయం 1 రూ. అనుకుంటే, క్రైస్తవుల ఆదాయం 1.5 రూ., ముస్లీముల ఆదాయం 3.5 రూ.).

ఈడ్చి కొడితే రెండువేల కోట్లు ఖర్చు పెట్టడం లేదు, ఇంక అవినీతి ఏముంటుంది నా బొంద, ఉన్నా అది మహా ఐతే ఓ 500 కోట్లు, అది మన రాజాగారి లక్షా డెబ్బై ఐదు వేలకోట్లలో ఏ మూలకి వస్తుంది?

మీకో నిజం చెప్పనా రౌడీ, గల్ఫ్ నుంచి మాకు వస్తున్న డబ్బులు 30 వేల కోట్లు పెరిగినా మా కేరళ రాష్ట్ర జి.డి.పి. 20 వేల కోట్లే పెరిగింది.. అంటే పైకి గ్రోత్ ఉన్నా, నిజం వెనక్కి వెల్తున్నామనే... కారణం క్రిములు..

ఇక రిఫరెన్సుల సంగతికి వస్తే, ఇండియా స్టాట్ చూసుకోవడమే..

Monday, November 15, 2010

0 comments
ఏదో చెప్తున్నాను అర్ధం పర్ధంలేకుండా, సరే ఆ గొడవ మొత్తం ఈ టపాలోనే ముగించేద్దామని మొదలుపేట్టాను చూద్దాం.

అసలు కూడిక అంటే మనం ఏమి చేస్తున్నాం, అసలు కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణింతాలు, అంగుళం, పిరమిడ్లు, యజ్ఞశాలలు, వాటికలు, వీటిమధ్య ఉన్న లంకెలు ఏమిటి అన్నది కుడా బానే ఉంటుంది కానీ పాపాయి వచ్చి ఎక్కడ తన మార్కు బెజవాడ రౌడీయిజం చూపిస్తాడేమో అని భయంగా ఉన్నది.

సర్లే సోది పక్కన పెడితే, అసలు ప్రశ్న "అ-బ్" = అ+(-బ్)

Wednesday, November 10, 2010

ఏమిటో మరి

20 comments
కొద్దిరోజుల క్రితం, నా చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చాడు, తన కూతురి ఓణీల పండక్కి పిలవడానికి, ఎప్పుడో పదో తరగతి ఫ్రెండ్ ఇరవై ఏళ్ళ తరువాత కలవడం, ఊళ్ళోనే ఉన్నావు రా అంటే వెళ్ళక తప్పింది కాదు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే సాయి బాబా భజన, పిల్లలు సాయి మహిమలు పాడుతున్నారు, బాగున్నది, ఓ మూల కుర్చున్నాను, భజనలో "కలరా తరిమేశావు", అన్న పదం మాత్రం బాగా నచ్చింది,తరువాత భజన ఐపోయింది, పిల్లలు అందరూ ఒక చోట చేరారు, వాళ్ళని పిలిచి Waldemar Haffkine తెలుసా అని అడిగాను, ఊహూ, ఆయన ఎవరో మరి., తరువాత ఈ భజన చేయిస్తున్న స్వామి కుడా నా ప్రక్కకే వచ్చి కుర్చున్నారు, సరే అదేదో ఆయన్నే అడిగేస్తే పోలా అని, కలరా షిర్డీలో ఎప్పుడు వచ్చింది, ఈ మహిమ సంగతి కాస్త వివరించమన్నాను, ఆయన ఈ ఉదంతం అంతా చెప్పాక, కావాలంటే చూసుకోండి దేశంలో కలరా వచ్చి లక్షలు లక్షలు చనిపోతున్న సమయంలో మరి షిర్డిలో రాలేదని ప్రభుత్వ రికార్డ్లు ఉన్నాయి అని చెప్పారు, అదేంటండి ఒక పక్కన షిర్డీ నుంచి కలరా తరిమేశాడు సాయి అంటున్నారు, మళ్ళీ అసలు కలరానే రాలేదు అంటున్నారు అని అడిగితే సమాధానం నిల్లు. కాస్త అటూ ఇటూగా వాల్దెమర్ కలరా వ్యాక్సిన్ కనిపెట్టింది అదే సమయంలో, అదీ మన దేశంలో, 1899-1923 మధ్య దేశం మొత్తం కలరాతో అల్లాడుతుంటే మరి ఈ సాయి భక్తులు, ఆ పిండిని తలా పిడికెడు తీసుకోని ఒక్కో ఊరిలో చల్లితే ఎన్ని ప్రాణాలు నిలబడేవి, మరి అదే సమయంలో యూరొప్లో కలరా రావడానికి అసలు కారణాలు తెలుసుకోని ఒక్కరు కుడా చనిపోకుండా జాగ్రత్త పడ్డారు కదా, మరి మనం చేసింది ఏమీ లేదు, కాకపొతే అది ఒక మనిషికి మహిమలు అద్దడానికి మాత్రం ఉపయోగించుకున్నాము చక్కగా, అసలు దేవుడు అంటే మహిమలు చూపిస్తేనే దేవుళ్ళా? మనకి నిజాలు వొద్దు మహిమలే కావాలా?

కనీసం జాన్ స్నో పేరో, వాల్దెమర్ పేరో ఒక్క సారి తల్చుకున్నా ఆ భజనలో ఆ పిల్లల్లో ఆసక్తి కలిగి ఒక్కడు ఐనా పెద్ద శాస్త్రవేత్త ఐతే దేశానికి ఎంత లాభం? భారత్ సూపర్ పవర్ అనుకోవడం తప్ప అసలు ఎన్ని పేటెంట్లు మనం సాధిస్తున్నాం ప్రతి సంవత్సరం, అది అమెరికా పొందే వాటిల్లో కనీసం 10 శాతం కుడా ఉన్నదా?

ఎంతకీ మనవేదాలు గొప్పవి, అవును గొప్పవే, కానీ మనం వాటిల్లో ఉన్న శాస్త్ర సంభంధమైనవి వదిలేసి, మాయలు, మహిమలు, మంత్రాలు, ఉఛ్ఛాటన క్రియలు, వీర విధ్యలు, పట్టుకోని ఏమి సాధించాం? బర్రేలని తోలుకోవడమా?

మనం సంఫాదించే ప్రతి రూపాయికి పావలా పైనే ఈ హక్కులు వినియోగించినందుకు చెల్లిస్తున్నాం..

అసలు ఆర్య భట్టుడు ఏమి చేశాడో చెప్తున్నామా మనం, మన పుస్తకాల్లో ఉంటున్నాయా? ఎవరో Serge Lang ఆయన పుస్తకంలో వివరంగా ఉన్నాయి తప్ప. టేలర్ సిరీస్ మనకి కొన్ని వందల యేల్ల క్రితమే తెలుసు అని ఎవరికి తెలుసు? కానీ మనం ఏమి చేశాం జ్యోతిష్యం అని పెట్టుకున్నాం, అసలు ఇప్పుడు ఎంతమంది గొప శాస్త్రవేత్తలు ఉన్నారు మనకి, ఏమైనా అంటే గుప్తుల కాలం పేర్లు చెప్తాం, అంతకు కొన్ని వందలమందిని మొన్నీ మధ్య పుట్టిన అమెరికా తయారు చేసింది.. మనకి మాత్రం వేదాలు చాలా గొప్పవి, దానిలో సర్వం ఉన్నాయి, ప్రపంచంలో ఎవడు ఏమి కనిపెట్టినా అది వేదాలలోదే వాళ్ళు కొట్టేసి కనిపెట్టేశారు, మన పూర్వీకులు అబ్బో వేల ఏల్ల క్రితం అవి అన్నీ చేశారు.

ఐన్‌స్టీన్ కనిపెట్టినవి అన్నీ మన వేడాలలో ఉన్నాయి అంట, అవే ఇంగ్లీషులోకి మార్చుకొని తన పేరు రాసుకున్నాడు అంటా, మరి ఐతే మన వేద పండితులు అదే పని ఇంకా ఎందుకు చేయలేకపొతున్నారో, ఐన్‌స్టీన్ ఎప్పుదు వేదాలు చదివాదో, ఎప్పుడు సంస్కృతం నేర్చుకున్నాడో., ఇది ఇంటర్లో మా లెఖ్ఖల మాష్టారు చెప్పారు, ఇప్పుడు నేను అదే రాస్తే నమ్మేవారు ఇంకా ఉన్నారు.

వేదాలు, అప్పటి మనుషుల ఆలోచనలు అనుకోని, వాటిల్లో తప్పులు ఉన్నాయి అని అనుకోము, వాటికి దైవత్వం ఆపాదించాల్సిందే తప్పదా? దాన్ని తప్పు అనకూడదా?

వ్యాధులు భూతాలవలన వస్తాయి అని నమ్మే కాలంలో మరి ప్రజలుకుడా బలులో, జాతరలో చేస్తే తగ్గుతాయి అని అనుకునేవారు, ఇప్పుడూ కుడా జాతర్లు, స్మశానంలో పూజలు చేద్దామా? హస్పిటల్లు మూయించేసి. ఏమిటో మరి..

Saturday, November 6, 2010

ఏమిటో ఈ మాయ

22 comments
పోయిన చలికాలం అనుకుంటా, ప్రపంచికంలో గొప్ప గొప్పోలొస్తున్నారని, ఏడనో దేశంలో పేద్ద పేద్ద కాలేజీల్లో ఎకనామిక్స్ డిగ్రీలు ఎలగబెడుతున్న పిల్లకాయల్ని తోలుకొచ్చారు, తోలుకొచ్చినోళ్ళు ఊరుకోకుండా ఓ గదిలో ఏసి వేసి, ఎవరో పెద్ద పిల్లకాయని పైన కూకో బెట్టి ఎకనామిక్స్లో మేథమేటిక్స్ అవసరమా అనవసరమా అని ఒక టాపిక్ ఇచ్చి కొట్టుకోమన్నారు.. బాగా ఇంగిలిపీసు వచ్చిన పిల్ల, సూపర్ మ్యాన్ టీషర్ట్ వేసుకొచ్చి, అసలు లెక్కలు ఎకనామిక్స్ బ్యూటీని సెడగొట్టేస్తున్నాయి, తలకమాసినోళ్ళు అందరూ కలిసి అనవసరంగా లెఖ్ఖలు ఐనదానికీ కానిదానికీ మాదుంప తెంచేస్తున్నారు, అసలు కీన్స్ దీన్నే
It is a great fault of symbolic pseudo-mathematical methods of formalising a system of economics analysis.

అని అన్నాడు, అసలు ఎకనోమెట్రిక్స్ మోడలింగ్ ఎంత బాగుంటుంది, అసలు దానిమీద పని చేసినందుకే చాలా మందికి నోబుల్ ప్రైజులు వచ్చాయి, లెఖ్ఖలు, నాశనం చేయడానికి తప్ప ఇంక దేనికీ పనికిరావు అని తేల్చింది.

పాపం పైన కుర్సీలో కుర్చున్నాయాన బాగా ఇంప్రెస్ అయ్యి ఏమి ఇవ్వాలో తెలియక, చేతి వాచీ తీసి ఇచ్చాడు, తన ఫేవరెట్ ఎకనామిస్ట్ జాన్ న్యాష్ అని సదరు శాల్తీ చెప్పి, అతనితో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇవ్వమని అర్ధించారు, సాధించారు..

స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్ సరిపోతుందా, ఇంకేమీ అక్కర్లేదా ఎకనామిక్స్లో.

అసలు మేథమేటిక్స్ అంటే ఏమిటి? మేథమేటిక్స్ అంటే ఒక భాష, అది వొద్దు, మాకు సైగలే బాగున్నాయి అంటే వాడ్ని పిచ్చోడే అనుకుంటాను నేను అని గిబ్బ్స్ అన్నాడు గుర్తులేదా అని పాల్ (కె.యె. పాల్ కాదులేండి) చెప్పాడు కదా, వీళ్ళు ఏమిటి మాట రాని మౌనమిది అనే పాట పాడుకుంటున్నారు?

మ్యాప్ లో నాకు ఇంచ్ బై ఇంచ్ దిటేయిల్స్ కావాలి అనేటోడ్ని ఏమంటాం (ఇంచ్ బై ఇంచ్ కావాలి అంటే వెళ్ళి చూడక మ్యాప్ ఎందుకో?)

మేథమేటికల్ మోడల్‌కి, మేథమేటిక్స్కి, ఎకనామిక్స్లో మేథమేటిక్స్కి, బిహెవియరల్ సైన్సెస్లో మేథమేటిక్స్ ఎంప్లాయబిలిటికీ తేడాలు తెలియకుండా మాట్లాడితే వాచీ ఇచ్చేస్తారా?

మరి ఎకనామిక్స్లో కాసెప్ట్స్ ఎలా డెవలప్ అయ్యాయి, ఎన్నో క్లిస్టమైన సమస్యలకి సులువైన పరిష్కారం చూపించే గేం థీరీ ఎందుకువాడుకుంటున్నారు? అదేంటో కీన్స్‌ని ఆ విషయంలో తప్పు అని ప్రువ్ చేసిన నాష్ తనకి ఇష్టం ఐన ఎకనామిస్ట్ ఏల అయ్యాడు?

అసలు ఎకనామెట్రిక్స్ అంటే, మేథమేటికల్లీ ట్రైండ్ స్టాటిస్టిక్స్ అనే పేరు కదా, ఎకనామెట్రిక్స్ కాన్సెప్ట్స్ పృవ్ఫ్స్ లీనియర్ ఆల్జీబ్రలో దొరుకుతాయెందుకో? Jan Tinbergen డైనమిక్ మోడల్ మేథమేటికల్ మోడల్ కాదా? అసలు మోడల్ అంటే ఏమిటి? పైన మేథమేటిక్స్ వలన వచ్చే అవలక్షణాలు ఈ మోడల్లో లేవా?

Understanding the nature and role of mathematical economics is not the same as understanding the connection between mathematics and economics.

Mathematical economics is the employment of mathematics in economics itself. Explaining or justifying mathematical economics often involves essentialist arguments concerning the true nature of economic objects, and the true nature of the economy, as well as arguments suggesting that employing mathematics is appropriate since the underlying “economy” is quantitative in nature. (Debreu on Mathematical economics)

ఇంకొకాయనెవరో ఇలా ఎందుకు సెప్పాడు.
The history of economics involves a history of not only the development of economic knowledge, but the development and changes in images of economic knowledge: what constitutes the economy, what constitutes a good explanation in economics, what constitutes serious empirical work in economics, what is a good model, etc?

ఇవి ఏమీ తెలియకుండా ఆయన పైన ఎలా కుర్సున్నాడు? ఎదేదో వాగేసిన పిల్లకి జాన్ నాష్‌తో ముఖాముఖీ అవకాశం ఎలా వచ్చింది?

ఏమిటో ఈ మాయ, ఓ చల్లని రాజ, ఓ వెన్నెలరాజ, ఏమిటో ఈ మాయ..
----

ఇది శ్రీలంకలో జరిగింది, అక్కడ ఉన్నవారు చెప్పిన దాన్ని బట్టి, నా ఆలోచనలు కలిపి రాసుకున్నాను, ఇంకొంచం వివరంగా రాద్దామనిపించినా ఇలా కానిచ్చేశాను. (ఇది జరిగింది 3-4 ఏళ్ళు క్రితం అనుకుంటాను.)
ఆ అమ్మాయికి నాష్ డిల్లీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా సమయం కేటాయించినా, ఆయన నోరు విప్పి మాట్లాడలేదట, ఈ అమ్మాయి చెప్పినవి కుడా విన్నాడో వినలేదో తెలియదు అని చెప్పింది, కానీ తాను అన్నీ వింటాను అవతలి వాడు ఎదో తెలిసీ తెలియకుండా మాట్లాడుతుంటే జవాబివ్వను అని నాష్ ఎదో ఇంటర్వ్యూలో చెప్పాడని ఎవరో అన్నారు..


If the important lesson from mathematics in the first third of the nineteenth century was
that economics needed to become a deductive science (as geometry was), in the late nineteenth
century the lesson from mathematics was that economics needed to model itself on rational
mechanics. Over the first two thirds of the twentieth century the lesson was that economics was
to become scientific by grounding its models and theories on a modest set of axioms concerning
pure economic agents’ preferences and choices. But beginning nearly at mid-century,
mathematics was re-imagining itself as a discipline that historically had developed by solving
real problems presented to it from other sciences. And in a similar fashion, and partially in
response to that changing image of mathematical knowledge, the notion of a serious economic
science, connected to data-based reasoning, was reshaping the idea of rigorous argumentation in
economics. Econometrics and applied microeconomics were to form the reconstructed core of
economic science much as work in algorithmics and applied mathematics were re-commanding
attention in the mathematics community. “At the Berlin International Congress of
Mathematicians in August 1998, the old opposition between the pure and the applied—still
widely shared in the community—has been formulated in quite different terms: ‘mathematicians
who build models versus those who prove theorems.’ [Mumford, 1998]. But the respect enjoyed
by the former is now definitely as high as that of the latter.” (Dalmedico, 2001, 249) So too in
economics, as the prestige accorded “good work” in applied economics now rivals that accorded
to work in pure theory.

http://econ.duke.edu/~erw/Preprints/Mathematics%20and%20Economics%20%28New%20Palgrave%29.pdf