blogspot hit counter

Wednesday, October 20, 2010

తెలుగు యోగిగారు మీకోసం

భలే తెలివిగా మీరు వేదాలని చూపించి మీ స్వఛ్ఛత నిరూపించుకుందామనుకుంటున్నారా? మా పోరాటం మీరు చెప్తున్న అబద్దాల పైనే, మీరు చెప్పగానే మేము నమ్మకుండా ప్రశ్నలు అడిగామని ఇప్పుడు వేదాలను అడ్డం పెట్టుకోని మాపై బురద జల్లుడు కాదు...

సరే మీరు చెప్పేవి నిజాలో కాదో బ్లాగు ముఖంగా తేల్చుకుందాం.

ఈ మీమాటలు గుర్తున్నాయా?
Calculative part of Astrology uses Mathematics and Astronomy.
Predictive part uses Logic and Statistics.


1. ఒక వంద ప్రిడిక్షన్స్ అవుననో- కాదనో లేక ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అనో వ్రాయండి.
2. సరే దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నది కదా, ఏది ఆ క్రియల్లో ఏదైన ఒకటి వాడి ఏ రాజకీయ నాయకుడ్నో, లేక ఒక తీవ్రవాదినో, లేక ఒక పెద్ద క్రిమినల్నో మార్చి అతని కుట్రలన్నీ భయటపెట్టి వేలాది అమాయక ప్రజలని కాపాడండి.

పై రెండిట్లో ఏ ఒక్కటైనా సరే..

సవాలును స్వీకరించగలరా?

46 comments:

శ్రీరామ్ said...

తారా,

ఆత్మ జ్ఞానం అనేది మీరు ఏకరవు పెట్టిన "అవినీతి", "కుట్రలు" ,"పెద్ద నేరగాళ్ళు/రాజకీయ నాయకులు " కి సంబంధించిన విషయం కాదు . మొదట, ఈ చిన్న తేడా గమనించండి. మీరు చెప్పన వాటి కోసం రాజ్యాంగం భద్దమైన చాలా విభాగాలు, ప్రభుత్వం ద్వారా పని చేస్తున్నాయి . కాదంటారా ? ఇప్పుడు మీ "ప్రశ్న " కోసం మరలా ఒక్కసారి ప్రయత్నించండి.

Anonymous said...

Not up to your standard, no logic behind your question
You started challenging like Malak :)

Please revise the question, i want to see a real attack from you

Anonymous said...

ఆత్మజ్నానం ఎన్లైట్మెంట్ అని తెయో చెప్పారా!!?
ప్రార్ధనలు మొక్కులు పూజలని అవహేలన చేశారు వశీకణ మోహన మారణ క్రియలు తెలియని హిందువులని ఎద్దేవాచేశారు అని నేననుకున్నాను.
మేం మొక్కులు మొక్కుకుంటాం, ప్రార్థనలు చేస్తాం గుళ్ళో మొక్కుబడులు తీర్చుకుంటాం. కృతజ్నతతో మేం తీర్చుకునే మొక్కుబడులు ఇంకోపదిమంది ఆకలిని తీరుస్తాయి ఐతే ఆయన అన్నట్టు మేం కుహనా స్వార్థ హిందువులమైతే.
మోహన వశీకరణ మారణ తంత్ర విధ్యలు నేరిచె వారిలో ఏ స్వార్ధంలేదా? ఏం కోరకుండా ఎందుకు ఈ విధ్యలు సంఘంలో ప్రదర్శించాలని చూస్తున్నారు?
కేవలం ఎన్లైట్మెంట్ మాత్రమే(అదీ స్వార్ధమేననుకొండి :)) వీరి లక్ష్యమైతే ఏ అడవికో పోయి ఆ విధ్యలు ఉపాసించవచ్చుగా, ప్రదర్శనలూ అందరి సమ్మతీ సపోర్ట్లూ ఎందుకు? ఆవేశాలూ అసహ్యాలూ ఎందుకు? వారు చేసినట్టు చేయని హిందులపై దుమ్మెత్తిపోయటమెందుకు?
ఏదో ఎవరి చేతనైనంత ప్రార్థన వారు చేసుకుంటారు వేదాలూ తంత్రాలూ ఉపసించని వారంతా హిందువులే కాదంటాడే!

Alapati Ramesh Babu said...

హమ్మ! మన ప్రజలు అందరు వారి వారి భావ స్వాతంత్రం ముసుగు లొ ప్రక్కవారి పై విచక్షణ మరచి యెంచక్కగా దెశ విదెశాలు చుట్టిన
అద్భుతమయిన కుతర్క ప్రావిణ్యం తొ నాలుకలు పొడవు చెసి ,గొంతుపెంచి ,పాటుపడి భాష లొని యతి ప్రాసలు ,వెటకారలు అన్ని గురుతు తెచ్హుకొని ఒక విషయాన్ని సరళం గా తెలుపుతున్న వారి నుంచి సమాధి చెసారు .జ్యొతిష్యం సైన్స్ అని భారత ప్రభుత్వం వారు ఈమధ్య సుప్రీం కొర్ట్ కు ఇచ్చిన ఆఫిడవిట్ మరిచార .అనెక పాశ్చాత్య యాత్రికులు , మెధావులు దర్శించిన వేద మున్నగు సాహిత్యం అంతా వీరికి ఒక నవ్వులాట .వీరి అందరు ............. యెమనాలొ .బాబులు మీకు ఇస్ట్టం లెకపొతె వదిలెయండి అంతె కాని మాకు ఆవసరం ఆయిన విషయాన్ని ఆడ్డుకునె హక్కు మీకు లెదు .బూతులు ,అంతకన్న ఘోరమయన వ్యాఖ్యానాలు యెమిటి ఇది ? అప్రస్త్తుతమయనా శరత్ గారు తాను నమ్మిన విషయాన్ని తెలుపుతుంటె మరి ఈ గొంతులన్ని యెక్కడవున్నవి ఆవి శ్రుంగార విషయాలనా? మరి కుటుంబ విలువలు అని వ్యతిరెకించలెదు కాని ఈనాడు వీరికి ఆడ్డుకునె హక్కు వుందా ?పెద్ద పెద్ద చదువులు చదివి ఇంత ఙ్ఞానం సంపాదించి వీరు రకరకలయిన పెర్లతొ బ్లాగ్ లు పెట్టి బజారు వ్యాఖ్యలుకన్న ఘోరం గా ,బజారు నీటీ పంపు దగ్గర కొట్టుకున్నట్లు ఒకరి పై ఒకరు వ్యాఖ్యలు చెసుకునె వీరు ......... . థాంక్స్ బాబులు థాంక్స్ .

Anonymous said...

@ రమేష్

లేస్తే కుంగ్ఫూ , కరతెలతో మక్కెలు ఇరగాతన్తాను అని నాలిక పొడుగు చేసుకుని ఇంతింత గొంతుతో విరుచుకు పడే నీ యోగి కి కాస్త గడ్డి పెట్టాక ఇక్కడికి రావాల్సింది కదూ. ముందు ఆ పని చేసి తర్వాత ఎదుటివారి మీద పడు. ఫో!

శ్రీరామ్ said...

ఆత్మ జ్ఞానం వల్ల దైవ సన్నిధానానికి చేరువ అవుతాము అని ఒప్పు కుంటున్నారు కదా ! మంచిది..
మరి ఆ దారిలో నడవటానికి మొదటి మెట్టు దగ్గరే ఆగిపోదామ ?

గుడికి వెళ్ళి "నీకు కొబ్బరి కాయ కొట్టాను ..నాకు ఫలానా కోరిక తీర్చు" అని బేరం పెట్టడం ఏ రకమైన పూజ/మొక్కు?

పూజలు, వ్రతాలు ఆచరణీయాలే కానీ, అవే సర్వస్వం కాదు.

మొదటి మెట్టు దగ్గర ఆగిపోయి , లేని పోనీ అపోహలతో ఎందుకు అర్ధం లేని వేద ధూషణ ?

శ్రీనివాస్ said...

భక్తకన్నప్ప ఎన్ని మేట్లేక్కాడో మరి

Anonymous said...

శ్రీరాం వేదాలు తెలియని దళితులను మీరు అవమానిస్తునారు.
:p

తెగులు యోగి said...

మా బావ పెరకటానికి స్వేచ్చ కావాలి, అంతే మేము ఒప్పుకోం

శ్రీరామ్ said...

భక్త కన్నప్ప లాగా స్వార్ధ రహిత "మూఢ భక్తి" ని ప్రదర్శించగలామా?

కన్ను పెరికి ఇవ్వనక్కరలేదు ...కనీసం ఒక పూట ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా దైవ ధ్యానంలో వుండగలామా?

Anonymous said...

సరేండీ బాబూ మీరు ఎన్న మెట్లెక్కారు గొప్పాళ్ళే ఒప్పుకుంటాం.
మీలా ఎన్నో మెట్లెక్కినవాళ్ళే మాలాంటి అతి సామాన్య మెట్లెక్కలేని వాళ్ళకోసం పూజలు వ్రతాలు దీక్షలూ ఉపదేసించారు. పుట్టుకతో మీయంత తెలివిలేని సాధార మనుసులపై జాలి పడి వారి కోసం బాధపడి కొన్ని తేలిక మార్గాలు చెప్పి వుండవచ్చు.

Anonymous said...

స్వార్థ రహిత :)) అంటే ఏమిటి?

ఎన్లైట్ మెంటూ స్వార్ధమేగా :)

Anonymous said...

శ్రీరాం గారు అసైన్సుకి స్వాగతం.

శ్రీరాం గారు మీరు భక్తిని ఎలా కొలుస్తున్నారు?
భక్త కన్నప్పలాంటి భక్తి ఎవరికీ లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు?

ఇక్కడ చర్చ సైన్సు పరంగా, కొన్ని నమ్మకాల మీద ఆధారపడి, సైన్సుకి వ్యతిరేకంగా ఉన్నవి కుడా నిజం ఐతే మరి నిరూపించండి, జ్యోతిష్యం సైన్సు అని వారు వందల సార్లు చెప్పారు, నేను కేవలం ప్రూఫులు ఇవ్వమని అడుగుతున్నాను.

ప్రూఫులు ఇవ్వకుండా కధలు చెప్పి పారిపోతారు అని వారే అన్నారు, కాబట్టి కధలు కాకుండా ప్రూఫులు ఇస్తే తరువాత మిగతా విషయాలపై చర్చిద్దాం.

Anonymous said...

గుడికెళ్ళే వారందరిదీ స్వార్థమేనని మీరు ఎలా నిర్ణయించుకున్నారు?:)) వాళ్ళలో కన్నప్పలూ, ఇంట్లో పూజ చేసుకునేవాళ్ళలో కుమ్మర దాసులూ ఉండరని మీరెలా నిర్ణయించారు శ్రీరాం గారు :))

Anonymous said...

అజ్ఞాతలు దయచేసి ఏదో ఒక పేరు ఐనా వాడండి.

శ్రీరామ్ said...

దైవాన్ని శరణాగతి వేడుకున్నప్పుడు అందులో "స్వార్ధం" ఎక్కడ వుంటుంది?

ప్రతి పనీ "తేలిక" పద్దతిలో చేయలేము.
ఓక పద్దతి వుంటుంది అని అనుకున్నప్పుడు, అది తెలుసుకొని ప్రయత్నించడం , కనీసం ధర్మం.

చెప్పే వారిని చెప్పనీయక , మనం స్వతహాగా తెలుసుకోవడానికి ప్రయత్నించక ...అనవసరపు మీమాంస లో కాలం వృధా చేసుకోవడంలో ఏమి లాభం ?

Anonymous said...

మా బావ పెరకటానికి స్వేచ్చ కావాలి, అంతే మేము ఒప్పుకోం

October 20, 2010 8:59 PM
Blogger శ్రీరామ్ said...

భక్త కన్నప్ప లాగా స్వార్ధ రహిత "మూఢ భక్తి" ని ప్రదర్శించగలామా?

కన్ను పెరికి ఇవ్వనక్కరలేదు ...కనీసం ఒక పూట ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా దైవ ధ్యానంలో వుండగలామా?

<<<<
ఉహూ ఉండలేం.
వేదాలూ తంత్రాలూ నేరిస్తే ఉండగలమేమో :(

శ్రీరామ్ said...

తార గారు,
మీ స్పందనకు ధన్యవాదాలు .

మీరు చెప్పే దాన్ని బట్టి 'ఒక వేళ దేవుడు కనిపిస్తే "మొదట నీ మహిమ నిరూపించుకో", తరవాత నా వరం సంగతి అన్నట్టు వున్నది.

మీరు అడగదలుచుకున్న విషయాన్ని దయచేసి మరింత "స్పష్టం" గా రాయండి.

తిరు said...

శ్రీరామ్ గారూ,
రామజన్మభూమి తీర్పు గురించి, కామన్వెల్త్ గేమ్స్ గురించీ గురువుగారు జ్యోతిష్యం ద్వారా ఇచ్చిన భవిష్యవాణి ఎంత తప్పులతడకో మీకు తెలీంది కాదు. పైగా దానికాయన సమర్ధనొకటి. దాని గురించే తార మొదటి ప్రశ్న. ఇకపోతే రెండో ప్రశ్నలో అంత అనుచితమేంటంటారు? మళ్ళీ ప్రయత్నించాల్సిన అగత్యమేంటో బోధపడట్లేదు :(

తాంత్రిక గురువుగారు థీరీలతో ఆగకుండా ప్రాక్టికల్స్ లోకి దూకితే ప్రభుత్వం కన్నా మెరుగైన ప్రజోపయోగ్యం సాధ్యపడుతుంది కదా, ఏమంటారు?

పై ప్రశ్నలకీ ఆత్మజ్ఞానానికీ సంబంధమేంటి సర్?

Anonymous said...

శ్రీరాం గారు,
మనం వేదాలపై చర్చని కాసేపు ప్రక్కన పెడదాం,

నేను యోగిగారిని అడిగినవి మాత్రమే వారిని కధలు చెప్పకుండా స్పందించిన తరువాత చూద్దాం.
జ్యోతిష్యం గురించి ఐతే ఇంకో టపాలో వివరణ ఉన్నది, అది చూడగలరు,

తిరు said...

శ్రీరామ్ గారూ,
పై ప్రశ్నల్లో ఏ స్పష్టత లోపించిందో తెలియపర్చగలరు.

దయచేసి ఒకటి స్పష్టీకరించండి. గురువుగారు దేవుడా? కాదనుకుంటానండి.

(ఐనా, దేవుడిని ఐడెంటిటీ కార్డ్ చూపించమని ఎలా అడగ్గలమండీ?)

శ్రీరామ్ said...

తిరు గారు,

మీ స్పందనకు ధ్యాంక్స్.

ఇప్పుడు 12 అయ్యింది రేపు పొద్దున్నే మీకు సమాధానం ఇస్తాను.

శుభ రాత్రి.

తిరు said...

శ్రీరామ్ గారూ,

తొందరేం లేదు, తీరిగ్గానే ఆలోచించుకోండి.

శుభరాత్రి సర్.

Anonymous said...

శ్రీరాం సార్ వెళ్ళకండి మీరు చెప్పింది నా మొద్దుబుర్రకి పూర్తిగా అర్ధం అయ్యేలా ఇంకాసేపు మాట్లాడుకుందాం.
కన్నప్పది స్వార్ధరహిత భక్తి అని ఒప్పుకున్నారు. ఇంకేం స్వార్ధ రహిత భక్తితో ఏది చేసినా భగవంతుడు సంతోషిస్తాడుగా. ఆ కష్ట క్లిష్ట తంత్రాలెందుకుసార్. భక్తితో ఓపాట చాలదూ :) ఓ కీర్తన చాలుగా :) కుమ్మరదాసులా మట్టి పువ్వులు చాలుగా :)
చూశారా మీరే ఒప్పుకున్నారు ఇక్కడ సమస్య తేలిక మార్గమా కష్ట క్లిష్ట్ తంత్ర మంత్ర మార్గమా కాదని. భక్తి చాలునని.
ఇంకోటి... పూజచేసేవారంతా స్వార్ధ కుహనా హిందువులు కాదనీ తంత్రం నేర్చినంత మాత్రాన నిస్వార్ధ నిష్టా హిందువు కాదేమో ....:)

Anonymous said...

chetta na..............

Anonymous said...

పిండి చల్లడం ద్వారా కలరాను నిలువరించగలా? లేదా? అసైన్సు పరంగా మీ సూటి అభిప్రాయాలేమి?

అసలైన అసైన్సుయోగులు/స్వాములు అని నమ్మి, మిమ్మల్నే అడుగుతున్నా. అపార్థం చేసుకోకండి. ;) :)

Anonymous said...

ఏమి పిండి గారు?

మీరు ఇట్టా పిండి డిటేయిల్స్ కెమికల్ ఎనాలిసిస్ (ఇదేదో ఇంటర్లో చేసినట్టు గుర్తు) అది చేసి చెప్పండి..
అది కాకుండా సాయిబాబా చల్లిన పిండి సంగతి చెప్తున్నారా? ఐతే నీతోనే ఆగేన సంగీతం బిళహరి నీతోనే ఆగేన సంగీతం అని పాడుకుంటున్నా ప్రొద్దుననుంచి..

మీ ప్రశ్నకి సమాధానం అవసరమా? మంత్రించి పిండి జల్లితే అంటు రోగాలు పోతాయా ...
బిళహరీ అని పిలువకుంటే - స్వరవిలాసం మార్చుకుంటే ఆరిపోదు గానజ్యోతి, నీతోనే ఆగేన సంగీతం బిళహరి నీతోనే ఆగేన సంగీతం అని పాడుకుంటున్నా ప్రొద్దుననుంచి..

ఏమీ లేదు ప్రొద్దున్నే లోకల్ ట్యాలెంట్ పుస్తకం చదివానులేండి...

Anonymous said...

:) That Pindi is just food grade Agmark wheat aata.

Any A-scientific answer?

You may upload your song, I don't mind to listen. :)

Anonymous said...

With great (re)search :) I got this data:
Starch 67-70%, Protein 12-14%, Total dietary fibre 10-13%, Fat 3%, Ash 2% by wt.

Now kindly clarify my doubts in your dedicated A-Science blog.

Anonymous said...

ఎవరండీ మీరు, కలరా వచ్చి జనాలు చస్తుంటే బియ్యప్పిండి, గోధుమపిండి చల్లుతానంటారే, దాన్ని ఇంకా పెంచాలని కంకణం కట్టుకున్నారా?

Anonymous said...

Why Saibaba wanted to spread cholera and kill more people?

Anonymous said...

I dont know, we'll discuss these issues later, not now.

Please stick to the topic.

Anonymous said...

అది కాకుండా సాయిబాబా చల్లిన పిండి సంగతి చెప్తున్నారా?
--
My question was on your above comment.

తిరు said...

ఆర్యా,
తార డౌట్ మాత్రమే అది.
ఈ టపా దేనిగురించి ఉద్దేశించిందో దానిపైనే కామెంట్స్ పెడితే ఉత్తమమేమో?

Anonymous said...

శ్రీరాం గారు, ఓ (షర్మ గారి దృష్టిలో కుహనా)హిందూగా నేను చదివిన విన్న వాటిల్లో భగవంతుడు భక్తసులభుడు.
గజరాజు పిలుపుతో సర్వం వదిలి ఉన్నఫలంగా వచ్చేవాడు.ఎంగిలిపండ్లను మెచ్చేవాడు. భక్తితో సమర్పించిన గరికయైనా చాలుననేవాడు............
ప్రేమ వున్నచోట భగవంతుడు వుంటాడు శ్రీరాంగారు మీగురువుగారిలో అంత ద్వేషం ఎందుకు పుట్టింది? ప్రేమించమనండి అందరినీ అంతటినీ. తనకు వచ్చిన విధ్యలు రానివారిని కూడా ప్రేమించమని చెప్పండి. ద్వేషం ఉన్న మనసులో భగవంతుడు మాయమవుతాడని చెప్పండి.

Anonymous said...

శ్రీరాం గారు, ఆయనకే చెప్పుమని మీరు అనవచ్చు.
మీకు ఉన్న ఓపిక ఆయనకి లేదు ప్రశ్నలడిగిన అందరినీ బూతులు తిడతన్నాడండి బాబూ :)
మీరు చెప్పాలనుకున్నది చక్కగా ప్రశాంతంగా చెప్పారు అందుకే మీకు శ్రమ ఇవ్వక తప్పడంలేదు :)

Anonymous said...

మంత్రించి పిండి జల్లితే అంటు రోగాలు పోతాయా ...
బిళహరీ అని పిలువకుంటే - స్వరవిలాసం మార్చుకుంటే ఆరిపోదు గానజ్యోతి, నీతోనే ఆగేన సంగీతం బిళహరి నీతోనే ఆగేన సంగీతం అని పాడుకుంటున్నా ప్రొద్దుననుంచి..
---------
బిళహరి రాగాము, బియ్యప్పిండి, కలరా, అసైన్స్ మధ్య సంబంధం ఏమై వుంటుంది? బిళహరి రాగాలాపనతో కలరా నయం చేయవచ్చా?

Anonymous said...

naaku telisinantha varaku sreeram dhanyajeevi . sharma gaaru kusamskaari. eeroju athagadu vaadina bhaashaa yaak. Ongolu seen , sharmani tittadam lo tappem ledu.

Anonymous said...

తిరు ఆర్యా

బ్లాగరుకు వచ్చిన సందేహాలు కూడా పోస్టుకు సంబందించినవే వస్తాయి అనే సందేహం తోనే అడుగుతున్నాము.

Anonymous said...

శర్మ మీ స్థాయి ఒక్కో మెట్టు దిగుతున్నాడు, అది పతనం. మీరు ఆనందించాల్సిన విషయం.

Anonymous said...

శర్మ మీ స్థాయి ఒక్కో మెట్టు దిగజారుతున్నారు, అది మీరు ఆనందించాల్సిన విషయం.

Anonymous said...

పుట్టిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు వివరాలతో జెర్మనీ లో ఉన్న మనిషి ఒంటి మీద పుట్టు మచ్చలుఎక్కడున్నాయో ఆ మనిషి ముఖం చూడకుండా చెప్పగలిగే శాస్త్రం సైన్సు కాకుండా ఎలా పోతుంది? నమ్మ లేకపోతున్నారా? ఇది నిజం గా జరిగింది.

Anonymous said...

అదేంటో నాకు అర్ధం కాని విషయం ఆయన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళేమో మాకు భయపడి అజ్ఞాతంగా రాస్తున్నారు అంట, ఆయనకి వ్యతిరేకంగా రాస్తున్నవారు మాత్రం మేమేనట, పందులమట ఇది కుడా ఆత్మజ్ఞాని గారి తంత్ర విధ్యలో ఒక భాగమా.

నా ఇమేజి సత్యం అని చెప్పుకునే మనిషి ఇలా అసత్య ఆరోపణలు ఎలా చేయగలరు? ఓంగోలు శ్రీను బ్లాగులో స్పామింగ్ చేసినది ఎవరో మాకు తెలియదా, మరి వారు వారి శిష్యులే అని తెలియదు పాపం, చివరకి తన శిష్యులనే పందులని తిట్టుకున్నారు.

అజ్ఞాతగారు కధలు వద్దమ్మా, నిరూపించమంటే పారిపోయి దాక్కోని నేను అది చెప్పాను, ఇందిరాగాంధి పోయాకా, తరువాతి రోజు పేపర్లో చూసి నేను మొన్నే చెప్పాను జర్మనీలో ఎవరికో ఇలా జరుగుద్ది అని అనడం కాదు, నిజం ఐతే సవాలుకి అంగీకరించమనండి మరి.

If anyone tries to Spam here I am going to publish his IPs

Anonymous said...

Publish all IPs including yours. Who cares? :))

Anonymous said...

శర్మ గారికి మల్టీ స్పారింగ్ అంటే ఇష్టం అట.

ఇక్కడ మల్టీ స్పారింగ్ చేస్తుంది వాస్తవానికి ఒంగోల్ శీను . ఒకపక్క బ్లాగువీక్షణం తొ మరోపక్క శర్మ గారితొ. కాదంటారా ?

Anonymous said...

తార,
మీ సమాధానానికి థాంక్సు. మీరు సైన్సు విషయాల్లో మీ రాజీలేని ధోరణి నచ్చింది. పైన కొందరి అజ్ఞాతల ప్రశ్నలు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేవిగా వున్నట్టనిపిస్తున్నాయి. అలాంటి సమయాల్లో 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ' అనుకోవడమే, తప్పదు. :D