blogspot hit counter

Friday, July 9, 2010

బ్యాక్టీరియా - పచ్చి మాంసం

సైన్సు చెప్తున్నదేమనగా
1.వేటాడిన జంతువు యొక్క పచ్చి మాంసాన్ని తినడం సురక్షితం కాదు.
2.జంతువుల మాంసంలో బాక్టీరియా ఉంటుంది. నేల మీద పాకే కుందేలు లాంటి జంతువులలో అది ఎక్కువ ఉంటుంది.
3.బాక్టీరియా 40 నుంచి 140 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వరకు బతకగలదు లేదా పెరగగలదు.
4.బాక్టీరియా కణాలలో కంటే సముద్రపు నీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అసమతలాన్ని సరిచేసుకోవడానికి బాక్టీరియా కణాలు ఓస్మోసిస్ ద్వారా నీరుని విడుదల చేస్తాయి.
5.40 ఫారెన్హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో బాక్టీరియా పెరగడం కష్టం.
6.సషిమి అనే రకం చేపలని చలిలో ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజింగ్ లో ఆ చేపలలో మిగిలి ఉన్న బాక్టీరియా చనిపోతుంది.

అసైన్సు చెబుతున్నదేమనగా
వేటాడిన మాంసం, వేటాడకుండా మాంసం అని కాకుండా పచ్చి,ఉడకపెట్టిన - బ్యాక్టీరియా యొక్క సంభంధం చుద్దాం.
పైన చెప్పిన సదరు సైన్సు పాయింట్స్ పురాణకాలంలో రష్యాలొనో, చైనాలొనో వ్రాసినవి కావు, (http://adventure.howstuffworks.com/survival/wilderness/eating-raw-meat.htm) ఇక్కడి నుంచి కాపీ కొట్టినవి, ఆంగ్లము అర్ధం చేసుకోవటంలో వచ్చిన తిప్పలు.

బ్యాక్టీరియా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కుడా మనుగడ సాగించగలదు, అత్యంత ఘాఢ ఉప్పు క్షేత్రాలలో, 235* వేడిలో, అణుధార్మిక పధార్ధాలలో, భూమి క్రస్ట్‌లోపల, అలానే సమస్థ చెట్టు, చేమ, పక్షి,జంతుజాలంలో కుడా, బ్యాక్టీరియా అనగానే భయపడవలసిన అవసరం లేదు, మనకి హాని చెసే బ్యాక్టీరియానే కాదు మన మనుగడకి ఎంతో అవసరం ఐన బ్యాక్టీరియా కుడా వున్నాయి. వచ్చిన తిప్పలు హాని కారక బ్యాక్టీరియాతొనే.
సాధారణంగా 41- 135*F ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పునరుత్పత్తికి(పునరుత్పత్తి, పెరుగుట ఒక్కటి కాదు, పునరుత్పత్తికి ముందు బ్యాక్టీరియా తమ పరిమాణాన్ని పెంచుంకుంటాయి) ఎంతో అనువైనది, ఇటువంటి ఉష్ణోగ్రతలో తగిన పోషకాలు దొరికినచో బ్యాక్టీరియా 9.8 ని.లలో కుడా తమ సంఖ్యని రెట్టింపు చేసుకోగలదు, ప్రాధమికంగా ఎంత తక్కువ మొత్తంలో బ్యాక్టీరియా వున్నా, ఆ ఉష్ణోగ్రతలో ఆహారాన్ని నిల్వ ఉంచటం వలన అతి కొద్ది సమయంలొనే బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని తీసుకున్న వ్యక్తికి హాని కలిగించే స్తాయికి తమ సంఖ్యని పెంచుకోగలదు.
అలాని 150*F కి ఆహారాన్ని వేడి చేసినచో, ఆ ఆహారం బ్యాక్టీరియారహితం ఐపొతుందా? లేదు, 140*F పైన వేడి బ్యాక్టీరియాని చంపుతుంది, కానీ సమూలంగా నాశనం చేయలేదు. బ్యాక్టీరియా సంఖ్యని లాగ్ లో కొలుస్తారు, ( 10 లక్షలు = 6 లాగ్ లు), వేడి చేయటానికి ముందు 8 లాగ్ ల బ్యాక్టీరియా ఆహారంలో వున్నది అనుకుందాం (10,00,00,000 = 8లాగ్) మనం వేడి చేశాక 4లాగ్ లు మాత్రమే మిగిలి వున్నది అనుకోండి (10,000) అది ఒక మనిషికి హాని కలిగించ గలిగే స్థాయే, పొనీ దీన్నే ఒక 2 గ. సాధారణ గది ఉష్ణోగ్రతలో నిల్వ చేశామనుకోండి, ఉదాహరణకి ఇ.కొలీ బ్యాక్టీరియాని తీసుకుంటే, అది 20ని. తమ సంఖ్యని రెట్టింపు చేసుకోగలదు, అనగ, 130ని. 4 లాగ్ నుంచి 6 లాగ్ లకు తమ సంఖ్యని పెంచుకోగలదు, 6 లాగ్ అంటే, ఇది ఎవరికైనా హాని కలిగించగలిగే స్థాయి.
కావున, వేడి చేసి తినటం వలన మనకి బ్యాక్టీరియా వలన హాని లేదు అన్నది ఆంగ్లము రానివారు సృష్టించిన పుకారు మాత్రమే.
అలానే 40*F కన్న తక్కువ ఉష్ణోగ్రతలో ఆహారం నిల్వ ఉంచటం వలన బ్యాక్టీరియా నాశనమైపోదు, పునరుత్పత్తి ఆగిపోదు బ్యాక్టీరియా పునరుత్పత్తి వేగం మాత్రమే తగ్గుతుంది. పైన చెప్పిన ఉదాహరణ లో, ఆహారాన్ని 40*F కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచితే 130ని. బదులు 260-350ని. పట్టొచ్చు, అంతే తప్ప, సంవత్సరాలు పట్టదు.
సషిమి చేపలను ఫ్రీజ్ చేయటం దానిలో వున్న బ్యాక్టీరియాని చంపటానికి కాదు, రింగ్ వార్మ్ లాంటి ప్యాతోజెన్స్ ని చంపటానికి, ఫ్రీజ్ చేసినంత మాత్రాన బ్యాక్టీరియా చచ్చిపోదు.
అలానే, సీల్ (సముద్రపు కుక్క)ని చంపకముందే దానిలో హానికారక బ్యాక్టీరియా వున్నచో?), వెటాడాకే బ్యాక్టీరియా దానిలోకి వస్తుంది అనుకోవటం భ్రమ, బ్యాక్టీరియా క్యారియార్స్‌కి ఎటువంటి హాని చేయదు, కాని ఆ మాంసం తిన్నాక, ఎంతసేపటిలో తిన్నా ఆ మనిషికి చెటే.
పాకుడు వలన, దేకుడు వలన శరీరంలో బ్యాక్టీరియా సంఖ్య పెరగదు, ధాన్యానికన్నా, గడ్డినే ఆహారంగా తీసునే జంతువులలో ఇ.కొలి బ్యాక్టీరియా సంఖ్య చాలా తక్కువగా వుంటుంది, అంతే తప్ప పాకే కుందేలులో (మరి నేను ఐతే ఎక్కడా చూడలేదు, కొత్త సామెతెమో తాను చూసిన కుందేలు పాకుతుంది అని) గెంతే కుందేలు కన్నా బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ అని చెబుట, పర గ్రహ బెర్నోలీ సూత్రమెమో.(ఇంగిలిపీసు అర్ధం కాలెదెమోలే)
మర్చిపోయాను, బయట ఉప్పగా వున్నది అని, నీరు విడుదల చేసి బ్యాక్టీరియా ఆత్మహత్య చేసుకోదు, ఓస్మాటిక్ ప్రెజర్ వలన నీరు దానంతట అదే బయటకి (అనగా ఉప్పు సాంద్రత ఎక్కువగా వున్న చోటుకి) వెళ్ళిపోతుంది, అంతే తప్ప బ్యాక్టీరియా పర్మిషన్ తీసుకొని ఎమీ వెళ్ళదు.

10 మార్కుల ప్రశ్న.
చలిలో ఫ్రీజ్ చేయుటకు, ఎండలో ఫ్రీజ్ చేయుటకు 10 తేడాలు కామెంటండి.
14 మార్కుల ప్రశ్న
a)పాకుట= దేకుట, మరియు, పాకుట ∝ శరీరంలో బ్యాక్టీరియా పరిమాణం --7 మా
b)పాకుట ( పా) = K*శరీరంలో బ్యాక్టీరియా పరిమాణం శ. [ పా = K*శ)
K = ప్ర.నా ప్రపోర్షనాలిటి కాన్స్‌టెంట్ --7 మా

సైన్సు సోర్సు: http://science.praveencommunications.firm.in/2010/07/blog-post_9804.html
అసైన్సు సోర్సులు కామెంట్లలో

15 comments:

తార said...

అసైన్సు సోర్సులు:
http://www.divediscover.whoi.edu/hottopics/bacteria.html
http://en.wikipedia.org/wiki/Cooking#Boiling
http://en.wikipedia.org/wiki/E._coli
http://chowhound.chow.com/topics/282689
http://en.wikipedia.org/wiki/Sterilization_%28microbiology%29
http://en.wikipedia.org/wiki/Sashimi
http://www.answerbag.com/q_view/409252
http://en.wikipedia.org/wiki/Bacteria#Growth_and_reproduction
http://en.wikipedia.org/wiki/Raw_animal_food_diets

హరే కృష్ణ said...

:D :D

శ్రీనివాస్ పప్పు said...

"10 మార్కుల ప్రశ్న.
చలిలో ఫ్రీజ్ చేయుటకు, ఎండలో ఫ్రీజ్ చేయుటకు 10 తేడాలు కామెంటండి".
1ఆ)చలిలో ఫ్రీజ్ చేస్తే చల్లగా ఉండును,ఎండలో ఫ్రీజ్ చెస్తే ఎండగా ఉండును.
2ఆ)చలిగా ఉన్నప్పుడు ఫ్రిజ్ కూడా చల్లబడును,ఎండగా ఉన్నప్పుడు ఫ్రిజ్ కొంచం ఎక్కువ వేడిగా ఉండును.
3ఆ)చలిలో ఫ్రీజ్ చేయుటకు సీతాకాలములోనే వాడుదురు,ఎండగా ఫ్రీజ్ చేయుటకు ఎండాకాలములోనె ఫ్రీజ్ చేయుదురు.
4ఆ)చలిలో ఫ్రీజ్ చేసినప్పుడు టెంపరేచర్ తక్కువ వుండును,అదే ఎండలో ఎక్కువ ఉండును.
5ఆ)చలికాలములో కరంటు తక్కువ కాలును,ఎండాకాలములో కూడా తక్కువే కాలును(పవర్ కట్ కాబట్టి)
6ఆ)చలికాలములో గమ్మున గడ్డ కట్టును,ఎండాకాలములో గడ్డ కరుగును.
7ఆ)చలిలో ఫ్రీజ్ చేయుటకు నీరు తక్కువ అవసరము,ఎండలో ఎక్కువ అవసరము.
8ఆ)చలిలో గమ్మున చల్లబడును,ఎండలో కొంచం ఎక్కువ సమయం అవసరము.
9)చలిలో తేమ ఎక్కువగా ఉండును,ఎండలో తేమ ఆరిపోవును.
10ఆ)చలిలో దుప్పటి అవసరము ఉంటుంది.ఎండలో ఉహు....

Anonymous said...

"1.వేటాడిన జంతువు యొక్క పచ్చి మాంసాన్ని తినడం సురక్షితం కాదు" అని నా గదిలో మావోలిన్ పటం వెనకన నక్కి వుండే బల్లికి మొన్ననే చెప్పాను. అది "చ్చొచ్చొచ్" అని వెకిలి నవ్వు నవ్వింది. ఈరోజు దాని తోక్ తెగి విలావిలా కొట్టుకొమ్టోమ్ది.

"2.జంతువుల మాంసంలో బాక్టీరియా ఉంటుంది. నేల మీద పాకే కుందేలు లాంటి జంతువులలో అది ఎక్కువ ఉంటుంది." అని నేను నా డొకోమొ డ్రాగన్లకి పోయిన్నెల చెప్పాను. అవి వినలేదు. ఇప్పుడు కోరల మధ్య ఇరుక్కున్న బ్యాక్టీరియాల్ని చీపురుపులల్తో కుట్టుకూంటూనేవున్నాయి. భారద్వాజా, కార్తీక్ లు సేఫ్ జోన్లో ఉన్నారు.

ఈరోజు పొద్దున్నుండీ సులేమాన్ బొందోవ్స్కీ రాసిన "డిఫరెన్షియల్ సైకో అనాలిసిస్ ఆఫ్ బుందేల్ ఖండ్ కుందేల్ బొందల్స్" అన్న పుస్తకాన్ని చదూవుతున్నాను. అందులో ఏముందో అర్థమై చచ్చాక నిస్సిగ్గుగా కాపీ చేయ్యాలని ప్లాన్ చేసుకొన్నాను.

karthik said...

5ఆ)చలికాలములో కరంటు తక్కువ కాలును,ఎండాకాలములో కూడా తక్కువే కాలును(పవర్ కట్ కాబట్టి)
kevvu kevvu

durabhimaani said...

వేటాడిన జంతువు యొక్క పచ్చి మాంసాన్ని తినడం సురక్షితం కాదు. అందులో బాక్టీరియా వైరస్ ఉంటాయి. దీనివల్ల మాంసం కుళ్లుతుంది. ఇది తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే చైనాలో మాంసాన్ని వదిలి పెట్టి బాక్టీరియా వైరస్లను తింటారు.ఈ విషయం పచ్ పచ్ మాంసేవ్ 1790లో రాసిన పుస్తకంలో ఉంది. మన దేశంలోనూ తినాలంటె అందుకు విప్లవం రావాలి.

నీరు కోల్పోవడం వల్ల బాక్టీరియా చనిపోతుంది. గాయపడిన బాక్టీరియాను పెట్టుబడిదారీ వర్గాల వారి సహకారంతో నడుస్తున్న 108 లు బతికిస్తున్నాయి. చైనాలో అలా చేయడం లేదు. అందువల్ల బాక్టీరియ వైరస్లు నయా వలసవాదులుకు తొత్తులు. వీటిని సమూలంగా నాశనం చేయాలంటే ప్రతి పౌరుడికి ఒక ఎకె 47 ఇవ్వాలి. hiv లాంటి వాటిని అరికట్టడానికి రాకెట్ లాంచర్లు సప్లై చేయాలి.

మన శరీరంలో బ్యాక్టీరియా వైరస్లు దూరాయని అనుమానం వస్తే 140 ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలో మనం మంటలో దూకేయాలి. అప్పుడు అవన్నీ చచ్చిపోతాయి. లేదంటే ఐసు గడ్డలు మింగాలి. ఒరిస్సలో ఉన్నపుడు నేను వారానికోసారి మంచుముక్కల మీద గోచీతో పడుకునే వాణ్ణి అందుకే ఈ రోజు నా బాడీ సిల్విస్టర్ స్టాలోన్ బాడీలా ఉంటుంది.

మంచు said...

అయ్యా .. అసైన్సు గారు..
ఈ మద్య ఒకానొక బ్లాగులొ "జీవచ్చవం లా పడివున్న బాటరీలని" చార్జ్ చెయ్యడం ఏలా అన్నదాని మీద ఒక పొస్ట్ వేసారు. అదే మక్కీకి మక్కి నేను ప్రయత్నెస్తే మంచి బాటరీ కూడా చెడిపొయింది. సదరు బ్లాగు యజమాని దాని పనితనం మీద, వటివల్ల వచ్చే సైడ్ అఫ్ఫెక్ట్ల మీదా ఎటువంటి డిస్క్లైమర్ పెట్టలేదు... నాకు తెలిసి వాటిమీద ఆ సదరు వ్యక్తికి వీసమెత్తు జ్ఞానం కూడా లేదు. ఎదొ ఇంటర్నెట్ లొ దొరికినవి ఎత్తుకొచ్చి, వాటి ప్రమాణికత చూడకుండా, తర్జుమా చేసి ప్రజలమీదకి వదులుతున్నాడు.

నా ప్రశ్న ఎమిటంటే.. ఇప్పుడు నా బాటరీ పొయింది.. రేపు ఆ బాటరీలాంటివెవొ పెలితె... మా లాంటి బాధితులు కొర్టులొ కేసు వెయొచ్చా... సాధ్యాసధ్యాలు చెప్పగలరు.

తార said...

మంచు పల్లకి గారు మీరు పర్లేదు, ఎవరో చైనాలో మియావో అట, ఉడకపెడితే బ్యాక్టీరియా పొతుంది అని చిక్కోలం చిన్నోడు చెబితే ఫ్రీగా వస్తున్నది కదా అని వారం క్రితం మాంసం వేడి చేసుకొని తిన్నాడు, తరువాత అతన్ని 335F కి వేడి చేశారు అనుకోండి, ఇప్పుడు అతని కొడుకులు కేస్ వేస్తాం అంటే నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను ఎంగిలిపీసులో చదువుకున్నది, తెలుగులోకి తర్జుమా చేసి, మళ్ళీ దాన్ని చినీ బాషలోకి తర్జుమా చేసి చెప్పటం వలన వచ్చింది, కాబట్టి తప్పు తన తెలుగు మాష్టర్ ది అతన్ని జైల్లో పెట్టినమన్నాడు అట.
ఇప్పుడు మీరు కేస్ వేస్తే నేను నిద్రలో ఆవీడియో చూశాను నాకేమీ అర్ధం కాలేదు, అంటాడు మరి.

ధురభిమాని గారు, మీరు ఇంక ఆ డొకొమో డ్రాగన్లకు అన్నం పెడుతున్నారా?
లేక నూడుల్సేనా? చైనా నుంచి తెచ్చిన ఎర్ర మట్టి మరి చిక్కోలం పంపారా? అక్కడ ఆ మట్టీ దొరక్క, కొందరు కొన్ని యుగాలుగా మొహం కడుక్కోవటంలేదట

మంచు said...

లేదండి.. ఈ విషయం నేను సీరియస్ గా తీసుకొదలిచాను... నిద్రమత్తులొ రాస్తే కింద ఒక డిస్క్లైమెర్ పెట్టుకుని ఎడవాలి... ఎమయినా నాకు జరిగిన నస్టానికి పరిహారం కావాలి... నేను పొలీసు కేసు పెడతాను (అట్రాసిటి కేసు లాంటిదేదొ).. ఈ శ్రీకాకుళం చిన్నొడికి మా సొమ్మంటే వెళాకొళం గా వుందా...

durabhimaani said...

డొకొమొల ముఖ్య అహారం పనికిరాకుండా వాడి పడేసిన డొకోమో సిం కార్డులు. వాటితో పాటు నూడుల్స్. ఎర్రమట్టి చిక్కోలం పంపాను. పులి మొహం కడగనట్లు సమ సమాజం వచ్చే వరకు అన్న అలాంటివి మానేశాడు.

మంచు పల్లకి గారు బ్యాటరీలు చెడిపోయాయని చెబితే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడినా. చైనాలోని ఆచితూచి యూనివర్సిటీ నుంచి నేను పట్టా పొందాను. ఆయన పేరులోనే అసలు సమస్య ఉంది. మంచు అని పేరు పెట్టుకున్నాక వేడి రీచార్జ్ లాంటి వాటికి ఆస్కారం లేదు. ఈ విషయన్ని వేడోవ్ మంచ్ మన్ 1790లో రాసిన పుస్తకంలో చదివాను. అదీకాక ఆయన విదేశాల్లో ఉంటారేమో సామ్రాజ్యవాద దేశాల్లో బ్యాటరీలు రీచార్జ్ కావు.

మంచు పల్లకి అని పేరు పెట్టుకుని రీచార్జ్ చేయడమే కాకుండా కేసు వేస్తాం అనడం హాస్యాస్పదం. ఇందులో నేను ఓడితే నా కంప్యూటర్ సెంటర్ రాసిస్తా మీరు ఓడితే ఏమి రాయిస్తారు? నాకు మతి తప్పిన జంతిక వాదం తెలుసు. అడ్వాన్స్ గా 100 కు 200 ఇమ్మన్నా నేను రెడీ.

cornea :-) said...

ఏవిటో...అంతా ఆ ప్రభువు మాయ లా వుంది. సైన్సు అసైన్సులలో ఏది తక్కువ అర్థమైందో తేల్చుకోలేకపొతున్నా...ముఖ్యంగా సైన్సులో నేల మీద కుందేలు పాకుతుందనే విషయం జీర్ణాతీతంగా వుండగా, అసైన్సులో లెక్కలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. (ఆసలే మేము లెక్కల్లో బీదోళ్ళమని కొంత మంది మాకు తేల్చి చెప్పటం జరిగింది)

తార said...

హతోస్మి, Cornea:-)గారు మీరు ఎదోగట్టు నుంచి ఇటు జారలేదు కదా?

మంచు పల్లకి గారు నాకు మీ కేస్‌లొ బగ్ కనిపిస్తున్నది మీరు జీవచ్చవం లా పడివున్న బాటరీలని కాకుండా జీవచ్చవం ఐపోయిన బాటరీలని చార్జ్ చేయ ప్రయత్నించరేమో?

ధురభిమాని గారు, మీ మా సంఘంలో చేర మీ ధురభిమానుల ఆకాంక్ష.

cornea :-) said...

> హతోస్మి, Cornea:-)గారు మీరు ఎదోగట్టు నుంచి ఇటు జారలేదు కదా?
గట్టు వెనక నుండి వచ్చాము - ఎనీ ప్రోబ్లెం? [:P]

తార said...

అహా ఎమీ లేదు, మీరు అటునుంచి ఇటు వస్తే, మీ మొదటి కామెంట్ నా గుంచే ఐతే, నా పేరే పెట్టి చెప్తె ఇంకా సంతోషించే వాడ్ని అని చెప్దామని. మీరు మా బ్లాగ్‌కు విచ్చేసినందుకు, నాకు అక్షింతలు పెట్టినందుకు ధన్యవాదాలు

బంతి said...

వైరస్ కి మాంసానికి అనగా ముక్యంగా వెటాడిన మాంసానికి గల సంభంద బాందవ్యాలు వివరిస్తారా ??