blogspot hit counter

Saturday, October 23, 2010

విగ్రహం నుండి వీభూది రావడం సాధ్యమేనా?

43 comments
లా ఆఫ్ కంజర్వేషన్ ఆఫ్ మాస్ మనకి తెలిసిందే, దాని ప్రకారం.
The mass of an isolated system cannot be changed as a result of processes acting inside the system.

కాబట్టి, వీభూది వస్తే అక్కడ ఉన్న ఏదైనా వస్తువు రూపాంతరం చెంది ఉండాలి. (Hard Substance to powder)




వీభూది కుడా ఎక్కువగానే ఉన్నది కొద్ది మొత్తంగా లేదు.

విగ్రహం, ఫొటోలు మాత్రమే దగ్గిర్లో కనిపిస్తున్నాయి (పెట్టిన ఫొటోలలో కనిపించిన విధంగా).
ఫొటో దూరంగా ఉన్నది, అదీ పాలథీన్ కవర్ కనిపిస్తున్నది, కాబట్టి, దాన్ని పరిగణలోకి తీసుకోలేము.

ఇక విగ్రహం లోపల ఉన్న పధార్ధమా అనుకోవడానికి వీభూది రాశి మధ్యలో విగ్రహం ఉండాలి అప్పుడు, వీభూది రాశి ఉన్నదాన్ని బట్టి వీభూది విగ్రహం నుండి వచ్చే అవకాశం లేదు. అందులోనూ అంత వీభూది విగ్రహం నుండి వస్తే, పైన చెప్పుకున్న ఫిజిక్సు సిద్ధాంతం బట్టి, విగ్రహం సిధిలమై ఉండాలి, కానీ విగ్రహాం అలా లేదు కావున, అసైన్సు ప్రకారం, వీభూది విగ్రహం నుండి వచ్చింది అనుకోవడం అపొహ మాత్రమే.

ఇంక మరి అక్కడకి ఎలా వచ్చింది అన్న ప్రశ్నలకి జవాబులు ఆ ఫొటోలను చూసి చెప్పలేను, కావున ఇతర కారణాలను గురించి ఫొటోలను చూసి చెప్పడం కష్టం.

శ్రీనుగారి టపా చాలా లేటుగా చదివాను,(అది వ్రాసినప్పుడు నేను బ్లాగుల్లోనే లేను) అందుకే కొద్దిగా లేటుగా స్పందన.

Thursday, October 21, 2010

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ

1 comments
తిరూని ఒక టపా పెట్టమని అడిగాను పొద్దున, చూస్తే లేదు, క్రింద మలక్ కామెంట్ కనపడింది, ఇది రాద్దామా వద్దా అన్న మీమాంస వీడి రాస్తున్నాను.

నా క్లాస్‌మేట్ ఒకతను ఎప్పుడు చుసినా గుళ్ళు, పట్టుకోని తిరుగుతుండే వాడు, నేను రోజు బస్సు దిగి కాలేజీకి వచ్చే దారిలో ఒక మాదిరి గుడి ఉన్నది ( ఏ దేవుడిదో ,నేను లోపలకి కుడా చూసిన గుర్తులేదు), ఎక్కువగా ఆ గుడి నుంచి బయటకి వస్తుండే వాడు, ఎవరో మహా భక్తుడు అనుకునేవాడ్ని, తరువాత పేరు డేవిడ్ అని తెలిసాక, అదేంటి మీ బెంగాళ్ళో (ఆ రాష్టం వాడు అని ఎలా తెలుసు అని అడగక్కర్లేదు అనుకుంటా:-) ), రివర్స్ కన్వర్షనా అంటే చెప్పుకొచ్చాడు.

ఈ అబ్బాయి పుట్టుకతో హిందువు అంట, తను పుట్టాక, ఊపిరితిత్తులకి ఏదో పెద్ద ఇంఫెక్షన్ వచ్చింది అని, ఈ మిషనరీస్ హాస్పిటల్లో చేర్చారు అంట, కోలుకోవడానికి రెండు నెలలు పైనే పట్టింది అట, గండం గడిచాక, ఇంటికి తిరిగి వచ్చాక ఒక రోజు, ఆ మిషనరీస్ ప్రతినిధి ఇంటికి వచ్చాడు అంట, బిల్లు కట్టమని, లేదా మతం ఐనా మారమని, ఆ బిల్లు కట్టాలి అంటే ఉన్న రెండెకరాలు అమ్మాలి, ఇక గత్యంతరం లేక మతం మారారు, ఈ అబ్బాయికి డేవిడ్ అని పేరు వచ్చింది.

అలాని తనకి మిషనరీస్ అంటే కోపం లేదు ఎందుకంటే, తనకి ప్రాణం పోశారు, హాస్పిటల్లో కుడా తనని చాలా బాగా చూసుకున్నారు అని తన తండ్రి చెప్తుండే వారు అట, తను రెండు మతాలనీ సమానంగా చూస్తాను అని కుడా చెప్పాడు.

ఇది రాశాను అని నన్ను కరుడుగట్టిన హిందుత్వవాది క్రింద జమ కట్టకండి, నాకు తెలిసింది చెప్పాను.

రేపు తిరూ శంకర్ గారి ప్రశ్నకి సమాధానం అసైన్సు పరంగా ఇస్తాడు.

తెలుగు యోగిగారు అలా పారిపోతున్నారేమిటి సారు?

14 comments
జ్యోతిష్యం సూపర్ సైన్సు, లెట్స్ గో బ్యాక్ టూ వేదాస్ అని గట్టిగా నమ్మే మీరు నా సవాలుకి ఇంకా స్పందించలేదు మరి, భయపడ్డారా? దేని వెనుక దాక్కోవాలో తెలియక రామ క్రిష్ణ మిషన్ పుస్తకాలు తిరగేస్తున్నారా?
నిన్ననే సాయి బాబా లోపాలు కుడా ఆయన భక్తులు వాటినే లీలలుగా మార్చి భ్రమ పడతారు, కధలు కధలు కాకుండా నిజాలు నిజాలు చెప్పాలి అని మీరేగా అన్నారు..

మరి సూపర్ సైన్సు ఐతే ఈ చిన్న పరీక్షకే మీరు నిలబడకపొతే ఎట్టా సారు?

సాయిబాబా అదేదో పిండి చల్లి కలరా మహమ్మారిని ప్రాలద్రోలారు అదేదో క్రియ అన్నారే, అట్టనే అదేదో కూసింత లోక కళ్యాణానికి వాడండి అంటే మీరు ఉలకరు పలకరేమి స్వామి? అంటే అది కేవలం మీరు మీ స్వార్దానికే వాడుకుంటారా? మీ పేరుకే వాడుకుంటారా?

ఇవి అన్నీ మీ బోటి జ్ఞానులకి చిటికెలో పనులు కదా, మరి చేసి చూపించి లోక కళ్యాణం సేయరా?

పోనీ కనీసం జ్యోతిష్య విజ్ఞానం ఐనా, ఆ మహత్తు కొద్దిగా మాకు రుచి చూపించండి మహా ప్రభో..

మీరే విన్నవించారుగా, జ్యోతిష్యం స్తాటిస్టిక్స్ అని అది ఎలా డిసైడ్ చేసారు, సర్లేండి ఎలాగోల డిసైడ్ చేసారు, మరి నేను అడిగింది కేవలం 100 ప్రిడిక్షన్స్ మాత్రమే కదా, స్తాటిస్టికల్గా ఐతే ఒక పదివేలో, లక్షో అధమం ఐదు - వేలు ఐనా అడుగుతారు, నేను కేవలం వంద మాత్రమే అడిగాను.

మరి స్పందిస్తారా, లేక ఎదో ఒక కధ చెప్పి దాక్కుంటారా? అదే మీ మాటల్లోనే నిజం చెప్పే ధైర్యం లేక ఎదుటివానిపై దాడి చేస్తారా?

Wednesday, October 20, 2010

తెలుగు యోగిగారు మీకోసం

46 comments
భలే తెలివిగా మీరు వేదాలని చూపించి మీ స్వఛ్ఛత నిరూపించుకుందామనుకుంటున్నారా? మా పోరాటం మీరు చెప్తున్న అబద్దాల పైనే, మీరు చెప్పగానే మేము నమ్మకుండా ప్రశ్నలు అడిగామని ఇప్పుడు వేదాలను అడ్డం పెట్టుకోని మాపై బురద జల్లుడు కాదు...

సరే మీరు చెప్పేవి నిజాలో కాదో బ్లాగు ముఖంగా తేల్చుకుందాం.

ఈ మీమాటలు గుర్తున్నాయా?
Calculative part of Astrology uses Mathematics and Astronomy.
Predictive part uses Logic and Statistics.


1. ఒక వంద ప్రిడిక్షన్స్ అవుననో- కాదనో లేక ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అనో వ్రాయండి.
2. సరే దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నది కదా, ఏది ఆ క్రియల్లో ఏదైన ఒకటి వాడి ఏ రాజకీయ నాయకుడ్నో, లేక ఒక తీవ్రవాదినో, లేక ఒక పెద్ద క్రిమినల్నో మార్చి అతని కుట్రలన్నీ భయటపెట్టి వేలాది అమాయక ప్రజలని కాపాడండి.

పై రెండిట్లో ఏ ఒక్కటైనా సరే..

సవాలును స్వీకరించగలరా?

Friday, October 8, 2010

కామన్వెల్త్ ఆటలు - కొన్ని జ్యోతిష్య అంశాలు

56 comments
అనుకున్నట్టుగానే కామన్వెల్త్ గేమ్స్ ఫలితాలు సగం వచ్చాయి. అన్ని దేశాలనీ సంతృప్తి పరచాలనే ఊహతో పతకాల వాటాలు పంచి తనపై పడ్డ మచ్చని కప్పిపుచ్చుకుందామని మనదేశం ప్రయత్నించింది. ఈ ఫలితాలపై రకరకాల గ్రహాలు, నక్షత్రాల ప్రభావాన్ని ఒక టపా రాసి మరీ నా మనసులోనే దాచుకున్నాను! ఇప్పుడు మీ సౌలభ్యం కోసం దాన్ని ఈ టపాలోనే సంధర్భానుసారంగా ఇచ్చాను.

అభిమానులపై ఈ ఫలితాలవల్ల ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతో అందరికీ వాటాలు పంచి భారత క్రీడాకారులని అసంతృప్తికి గురిచేసింది కమిటీ. అసలు కల్మాడీ అంత కష్టపడి రచించిన వ్యూహాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడమెందుకన్న ప్రశ్నకి జవాబు లేదు :(
(ఆ వ్యూహం నాదంటే నాదని పిల్లకాకులు గోల చేసే సూచనలు గోచరించుచున్నవి)

కనుక దీని వెనక పతకాలొక్కటే కాకుండా పొరుగు క్రీడాకారుల ప్రాణాల యొక్క రక్షణ బాధ్యత కూడా కనిపిస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వం యొక్క గోడ మీది పిల్లి వాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం నడుస్తుందన్న విషయాన్ని కూడా నేను క్లియర్‌గా అనుకున్నాను.

ఇప్పుడెన్ని అంశాలు సరిపోయాయో చూద్దాం.

>>చక్కని గ్రహణ సమయంలో క్రీడలు మొదలయ్యాయి. ద్వాదశాంశలో మిష్టర్ రవిగార్కి త్రయోదశ చతుర్దశ రాశుల్లో రాహుకేతువులు నీల్‌కమల్ చెయిర్స్ వేసుకుని మరీ కూర్చున్నారు. దీనివలన అయా క్రీడలని చక్కగా నిర్వహించడానికి అష్టకష్టాలూ పడి అడ్డమైన దారులూ తొక్కాలని తెలియకనే తెలుస్తున్నది.

నిజమే! నా అనన్యసామాన్య ప్రతిభకో మచ్చుతునక ఈ విషయం అని మీకు కూడా తెలియకనే తెలియట్లా? భారత కీర్తి దిగ్దిగంతాలకీ వ్యాపింపచేయడానికి కల్మాడీ యెన్నెన్ని అడ్డ దారులు తొక్కలేదు? యెన్ని అష్టకష్టాలు పడ్డాడు పాపం! మరి ఆ అపర చాణుక్యుడిని సాంబార్లో ఈగలా తీసేయలేదూ?

>>ఇంకా సెక్యూరిటీ పరంగా విశ్వప్రయత్నం అవసరం అని తెలుస్తోంది.

పైకి చూస్తే ఎంత తేలిగ్గా కనపడినా యెంత లోతైన, ఇరుకైన భావం గోచరిస్తోందో కదా? కానీ దీన్ని అర్థం చేస్కోలేని కొందరు (3 idiots) ఇది సాధారణమే కదా అని వదరుతున్నారు. నేను చెప్పేదొక్కటే: అలా అనడం సరికాదు, బేసీ కాదు. త్వరలోనే మీకు దీని పరిణామాలు కనిపించడం జరుగుతుంది. ఇంతకంటే పూర్తిగా భవిష్యత్తుని 3D లో చూపిస్తే నేనెక్కడుంటానో నాకే తెలీదు.

>>రవి (రవిగారు కాదు, సన్) అధికారులకూ, నాయకులకూ, గర్వానికీ, ప్రతిష్టకూ సూచకుడు. ఆయనకే ఈ సమయానికి గ్రహణం పట్టింది.

ఈ జోస్యం సరిగానే జరిగింది. మరి రవిలాంటి కీర్తిప్రతిష్టలున్న కల్మాడీ చతికిలబడినట్లా కాదా? పైగా ప్రీప్లాన్‌డ్ గా ఉన్నాగానీ పతకాల వాటాలో మనమెందుకు వెనకబడ్డామన్నదానికి సంతృప్తికరమైన సమాధానం లేదు.

ఇక్కడ మరికొన్ని జ్యోతిష్యపరమైన విషయాలు గమనించాలి.

>>వెయిట్ లిఫ్టింగ్ సమయానికి బుధుడు బంగారంలా మెరిసిపోతున్నందున మన బరంపురం రవి కుమార్ డోపింగ్ లేకుండా స్వర్ణ పతకం సాధించాడు.

>>గురుడి వెంట రాహు కేతువులు గన్ తో వెంటపడడం వల్ల గగన్ నారంగ్ స్వర్ణంతో మెరిసాడు.

>>కుజ గురుల మధ్యనున్న ఆస్టరాయిడ్ల శుభదృష్టి వలన రవాణా వ్యవస్థ మెరుగుపడింది.

ఈ రకంగా చూస్తే మా మనోవీధిలో మెరిసిన మెరుపులు చాలా వరకూ సరిగానే మెరిసినట్టు తెలుస్తోంది.

గమనికలు:
  1. ఫోటోషాప్ ట్రయల్ పీరియడ్ ముగిసిన కారణంగా రాశిచక్రాలు గీయుట సాధ్యపడలేదు.
  2. అసలు నీ జాతకం చూసుకోముందు అని దుండగులు కొందరు అడుగుతున్నారు. మీరు గుంటూరొస్తే మీకు నా ఫ్లైయింగ్ కిక్ రుచిచూపిస్తాను. మళ్ళీ మీకా అనుమానాలు జీవితం లో రావు.
  3. పై విశ్లేషణ సంఖ్యా శాస్త్రం తో కూడా చేశాను (నా సొంతమే! సాక్షి తోడు). భలే చమత్కారపూరితంగా వచ్చిందది. వీలు చూసుకుని దానికి టపా కడతాను.

Friday, October 1, 2010

ఒకే కాంతి ఒకే శాంతి

14 comments
ప్రతి ఆలయం పక్కనా ఒక మసీదు ఉండే పద్దతి ఎప్పటికీ మంచిది కాదు. ఇది భవిష్యత్తులో గొడవలకు కారణం అవుతుంది అని ఎన్నోచోట్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి.