blogspot hit counter

Wednesday, November 10, 2010

ఏమిటో మరి

కొద్దిరోజుల క్రితం, నా చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చాడు, తన కూతురి ఓణీల పండక్కి పిలవడానికి, ఎప్పుడో పదో తరగతి ఫ్రెండ్ ఇరవై ఏళ్ళ తరువాత కలవడం, ఊళ్ళోనే ఉన్నావు రా అంటే వెళ్ళక తప్పింది కాదు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే సాయి బాబా భజన, పిల్లలు సాయి మహిమలు పాడుతున్నారు, బాగున్నది, ఓ మూల కుర్చున్నాను, భజనలో "కలరా తరిమేశావు", అన్న పదం మాత్రం బాగా నచ్చింది,తరువాత భజన ఐపోయింది, పిల్లలు అందరూ ఒక చోట చేరారు, వాళ్ళని పిలిచి Waldemar Haffkine తెలుసా అని అడిగాను, ఊహూ, ఆయన ఎవరో మరి., తరువాత ఈ భజన చేయిస్తున్న స్వామి కుడా నా ప్రక్కకే వచ్చి కుర్చున్నారు, సరే అదేదో ఆయన్నే అడిగేస్తే పోలా అని, కలరా షిర్డీలో ఎప్పుడు వచ్చింది, ఈ మహిమ సంగతి కాస్త వివరించమన్నాను, ఆయన ఈ ఉదంతం అంతా చెప్పాక, కావాలంటే చూసుకోండి దేశంలో కలరా వచ్చి లక్షలు లక్షలు చనిపోతున్న సమయంలో మరి షిర్డిలో రాలేదని ప్రభుత్వ రికార్డ్లు ఉన్నాయి అని చెప్పారు, అదేంటండి ఒక పక్కన షిర్డీ నుంచి కలరా తరిమేశాడు సాయి అంటున్నారు, మళ్ళీ అసలు కలరానే రాలేదు అంటున్నారు అని అడిగితే సమాధానం నిల్లు. కాస్త అటూ ఇటూగా వాల్దెమర్ కలరా వ్యాక్సిన్ కనిపెట్టింది అదే సమయంలో, అదీ మన దేశంలో, 1899-1923 మధ్య దేశం మొత్తం కలరాతో అల్లాడుతుంటే మరి ఈ సాయి భక్తులు, ఆ పిండిని తలా పిడికెడు తీసుకోని ఒక్కో ఊరిలో చల్లితే ఎన్ని ప్రాణాలు నిలబడేవి, మరి అదే సమయంలో యూరొప్లో కలరా రావడానికి అసలు కారణాలు తెలుసుకోని ఒక్కరు కుడా చనిపోకుండా జాగ్రత్త పడ్డారు కదా, మరి మనం చేసింది ఏమీ లేదు, కాకపొతే అది ఒక మనిషికి మహిమలు అద్దడానికి మాత్రం ఉపయోగించుకున్నాము చక్కగా, అసలు దేవుడు అంటే మహిమలు చూపిస్తేనే దేవుళ్ళా? మనకి నిజాలు వొద్దు మహిమలే కావాలా?

కనీసం జాన్ స్నో పేరో, వాల్దెమర్ పేరో ఒక్క సారి తల్చుకున్నా ఆ భజనలో ఆ పిల్లల్లో ఆసక్తి కలిగి ఒక్కడు ఐనా పెద్ద శాస్త్రవేత్త ఐతే దేశానికి ఎంత లాభం? భారత్ సూపర్ పవర్ అనుకోవడం తప్ప అసలు ఎన్ని పేటెంట్లు మనం సాధిస్తున్నాం ప్రతి సంవత్సరం, అది అమెరికా పొందే వాటిల్లో కనీసం 10 శాతం కుడా ఉన్నదా?

ఎంతకీ మనవేదాలు గొప్పవి, అవును గొప్పవే, కానీ మనం వాటిల్లో ఉన్న శాస్త్ర సంభంధమైనవి వదిలేసి, మాయలు, మహిమలు, మంత్రాలు, ఉఛ్ఛాటన క్రియలు, వీర విధ్యలు, పట్టుకోని ఏమి సాధించాం? బర్రేలని తోలుకోవడమా?

మనం సంఫాదించే ప్రతి రూపాయికి పావలా పైనే ఈ హక్కులు వినియోగించినందుకు చెల్లిస్తున్నాం..

అసలు ఆర్య భట్టుడు ఏమి చేశాడో చెప్తున్నామా మనం, మన పుస్తకాల్లో ఉంటున్నాయా? ఎవరో Serge Lang ఆయన పుస్తకంలో వివరంగా ఉన్నాయి తప్ప. టేలర్ సిరీస్ మనకి కొన్ని వందల యేల్ల క్రితమే తెలుసు అని ఎవరికి తెలుసు? కానీ మనం ఏమి చేశాం జ్యోతిష్యం అని పెట్టుకున్నాం, అసలు ఇప్పుడు ఎంతమంది గొప శాస్త్రవేత్తలు ఉన్నారు మనకి, ఏమైనా అంటే గుప్తుల కాలం పేర్లు చెప్తాం, అంతకు కొన్ని వందలమందిని మొన్నీ మధ్య పుట్టిన అమెరికా తయారు చేసింది.. మనకి మాత్రం వేదాలు చాలా గొప్పవి, దానిలో సర్వం ఉన్నాయి, ప్రపంచంలో ఎవడు ఏమి కనిపెట్టినా అది వేదాలలోదే వాళ్ళు కొట్టేసి కనిపెట్టేశారు, మన పూర్వీకులు అబ్బో వేల ఏల్ల క్రితం అవి అన్నీ చేశారు.

ఐన్‌స్టీన్ కనిపెట్టినవి అన్నీ మన వేడాలలో ఉన్నాయి అంట, అవే ఇంగ్లీషులోకి మార్చుకొని తన పేరు రాసుకున్నాడు అంటా, మరి ఐతే మన వేద పండితులు అదే పని ఇంకా ఎందుకు చేయలేకపొతున్నారో, ఐన్‌స్టీన్ ఎప్పుదు వేదాలు చదివాదో, ఎప్పుడు సంస్కృతం నేర్చుకున్నాడో., ఇది ఇంటర్లో మా లెఖ్ఖల మాష్టారు చెప్పారు, ఇప్పుడు నేను అదే రాస్తే నమ్మేవారు ఇంకా ఉన్నారు.

వేదాలు, అప్పటి మనుషుల ఆలోచనలు అనుకోని, వాటిల్లో తప్పులు ఉన్నాయి అని అనుకోము, వాటికి దైవత్వం ఆపాదించాల్సిందే తప్పదా? దాన్ని తప్పు అనకూడదా?

వ్యాధులు భూతాలవలన వస్తాయి అని నమ్మే కాలంలో మరి ప్రజలుకుడా బలులో, జాతరలో చేస్తే తగ్గుతాయి అని అనుకునేవారు, ఇప్పుడూ కుడా జాతర్లు, స్మశానంలో పూజలు చేద్దామా? హస్పిటల్లు మూయించేసి. ఏమిటో మరి..

20 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా మంచి వ్యాసం రాశారు. కొంతమందినయినా ఆలోచింపజేయగలుగుతుందని ఆశిద్దాం.

Indian Minerva said...

మీరన్నది నిజం. విజ్ఞానాన్ని దేవుళ్ళూ/దేవతలకిచ్చేసి ఆనక దాని validityనెవరైనా ప్రశ్నిస్తే కత్తులు దూస్తాం. ఇది అందరిలోనూ వున్నదే కాకపోతే మనలో ప్రస్తుతానికి అదితప్ప వేరేదేదీ లేదు. అందరూ ఏవో ఆవిష్కరణలు చేస్తుంటె మనం అవిచేయకపోతేపోయె... ఆచేసినవాడ్ని మన పురాతన గ్రంధాల నుండి కాపీ కొట్టాడంటాం.

ఓబుల్ రెడ్డి said...

ఇంత సైన్సు కాకపోయినా ఎంతోకొంత సైన్సు మన పూర్వీకులకు తెలుసు. కానీ వారు దాన్ని ఒక మంచి ఉద్దేశంతోనే గుప్తం చేశారు. ఉదాహరణకు - ఆకాశంలో ఎగిరే విమానాల తయారీ గురించి వ్రాస్తూ భోజమహారాజు (12వ శతాబ్దం) "ఈ విజ్ఞానం బహిరంగం కావడం ప్రజలకు ప్రమాదకరమనీ, అందువల్ల కొంతే తెలియజేస్తున్నా"ననీ అన్నాడు. ఈ సైన్సు మొదట్లో మంచి చేసినా తరువాతి శతాబ్దాలలో దుర్వినియోగానికే దారితీస్తుంది. ఇది ఎలా వచ్చిందో అలాగే చరిత్రగతిలో పోతుంది కూడా. ఈ విషయం మన పూర్వీకులకు తె;లుసు. అందుచేత మన ఋషులకు సైన్స్ తెలిసిసప్పటికీ దాన్ని ఆధునిక శాస్త్రవేత్తల్లా బహిరంగం చేయడానికి పూనుకోలేదు. మానవులు ఈ విజ్ఞానంతో అహంకరిస్తారని, దైవాన్ని ఎదిరించి అధోగతి పాలవుతారనీ వారు గ్రహించారు. దాని బదులు వారు సర్వజన సామరస్యాన్నీ, దైవభక్తినీ బోధించడానికే ఇష్టపడ్డారు.

Anonymous said...

బాగుంది. 'అన్నీ వేదాల్లోనే వున్నాయష ' అన్నది నేనూ ఒప్పుకోను. ఐతే వేదాలు అద్భుతమైన ప్రాచీన గ్రంధాలు అని నమ్ముతాను. వేల ఏళ్ళ క్రిందట అంతలా ఆలోచించగలిగిన మనుషులు వున్నారనే విషయమే గొప్ప ఆశ్చర్యం.
సాయిబాబా సున్నం పొడో, డి.డి.టి నో చల్లాడేమో అనుకున్నా, అనవసరంగా అడుక్కున్న పిండి నేల పాల్జేశుకున్నాడే పిచ్చిమారాజు! :)

శ్రీనివాస్ said...

SNKR నాకొకసారి మెయిల్ చెయ్యగలరా?

evergreenboss@gmail.com

Anonymous said...

@all,
Thanks for the comments..

-Tara

krishna said...

@ తార
>> ఎప్పుడో పదో తరగతి ఫ్రెండ్ ఇరవై ఏళ్ళ తరువాత కలవడం, >>
అంటే ముప్పయ్యి ఐదు ముప్పయ్యి ఆరు అన్న మాట ! ఇంకా పెళ్లి అయ్యిందా లేదా బాబాయి :P
పోస్టు బాగుంది, నా అభిప్రాయాలు కూడా అవే. పూర్తిగా అంగీకరిస్తాను.

Malakpet Rowdy said...

బాగుంది. 'అన్నీ వేదాల్లోనే వున్నాయష ' అన్నది నేనూ ఒప్పుకోను. ఐతే వేదాలు అద్భుతమైన ప్రాచీన గ్రంధాలు అని నమ్ముతాను. వేల ఏళ్ళ క్రిందట అంతలా ఆలోచించగలిగిన మనుషులు వున్నారనే విషయమే గొప్ప ఆశ్చర్యం.
___________________________________

Same thoughts here.


Tara, sure you can say something is wrong, but you need to prove it, especially with multiple interpretations around ech verse.

జేబి - JB said...

వాల్దెమర్ గురించీ నేనెప్పుడు వినలేదండి. తెలిపినందుకు కృతజ్ఞతలు.


కూడలిలో సంక్షిప్తంగా చదివి, మీరు అసైన్సువదిలేసి పిచ్చాపాటి మొదలుపెట్టారా అని ఆశ్చర్యపడ్డా. కానీ, ఇప్పుడు కొత్త విషయం తెలుసుకున్నా. భలే!

Anonymous said...

@WP గారు, అవును కానీ నేను ఒక్కరు ఐనా ఆలోచిస్తారు అని అనుకోవడం లేదండి.
@Minerva గారు అవును చాలా బాగా చెప్పారు.

@snkr ఆలోచన లేకపోతే మనిషేలేడండి.

@మలక్ నేను మీతో ఈ విషయంపై చర్చకి ఐనా, వాదనకి ఐనా దిగాలి అంటే మీరు నేను అడిగే కొన్ని ప్రశ్నలకి జవాబివ్వాలసి ఉంటుంది గ్రూప్ తీరీలో, యనాలసిస్లో, ఈ కండిషన్ మారదు :))

@జేబి, లేదండి, ఉత్తినే సరదాగా నుంచి ఇవి మొత్తం ఒకే టపా, కానీ విడగొట్టి, చిత్రవధ చేసి, ఇలా రాస్తున్నాను, మొదలుపెట్టగానే, పెద్దగా ఏమి ఉపయోగం ఉంటుంది అనే ఒక ఆలోచన రావడంతో ఎదో ఒకటి వ్రాసి వదిలేస్తున్నాను,

@రెడ్డిగారు, మీరు చెప్పింది నిజమే కావొచ్చు, కానీ అవి ఆలోచనలే కదా, వారు ప్రయోగాలు చేసి ఆ టెక్నాలెజీ సాదించినట్టు లేదుకదా.

@శ్రీనివాస్ ఏంటి snkr పాస్వార్డ్ కావాలా?

Anonymous said...

/SNKR నాకొకసారి మెయిల్ చెయ్యగలరా?/ /శ్రీనివాస్ ఏంటి snkr పాస్వార్డ్ కావాలా?/

ఒంగోల్ శ్రీను గారు నన్ను ఓ ఇ-కుమ్ముడు కుమ్మి ఒప్పించేలా వున్నారు. ;) మొదట తారను కుమ్మి ఒప్పించండి, తార ప్రకటన చూసాక నేను ఆలోచిస్తా. :)

Anonymous said...

/@రెడ్డిగారు, మీరు చెప్పింది నిజమే కావొచ్చు, కానీ అవి ఆలోచనలే కదా, వారు ప్రయోగాలు చేసి ఆ టెక్నాలెజీ సాదించినట్టు లేదుకదా./

ఐన్ స్టీన్, నీల్స్ భోర్ ప్రయోగాలు చేసి నిరూపించారా?! వాళ్ళవీ ఆలోచనలే కదా?! Science fiction writers Robert A. Heinlein, Isaac Asimov, and Arthur C. Clarke eraned respect & honours for their works, right?

Anonymous said...

@Krishna

>>ఇంకా పెళ్లి అయ్యిందా లేదా బాబాయి :P

Nope :))



>>ఐన్ స్టీన్, నీల్స్ భోర్ ప్రయోగాలు చేసి నిరూపించారా?!

--

You can't compare Theoretical Physics to Applied Physics.
Concluding that "we can develop a flying machine" doesn't qualify that he created a flying machine or he had technology to fly.

>>ప్రయోగాలు చేసి నిరూపించారా?!

So as Lebnitz, Ramanujam and other Mathematicians,mathematical physicists too, so do you mean we are living in Imaginary world?

Yet again, if you conclude that you can't create a flying machine, you can prove him wrong by developing a flying prototype.

With out fundamental support, concluding that we can fly or we can't fly both are one and the same, must be given equal weight, but

--

Taara.

Anonymous said...

http://sambargaadu.blogspot.com/2010/11/2010-6.html


tara ji..
sambargaadu edo chebutunnaru o chupu chudakudadu.

Anonymous said...

1) You started with an assumption "without fundamental support" - how could you conclude they had no fundamental support? Is it just because they haven't left behind a prototype for you to test?

2)/so do you mean we are living in Imaginary world?/
May be, why not? Imagination is the first-step of any development process. Failure/Success is ofcourse the end result of any development.
I would not brush aside Bhojaraju, if he really decided against such development. However, I doubt that story. That could have been created by some writers, in support of their claim.

Anonymous said...

**ఉచిత జ్యోతిష సలహా : కేవలం 2010 డెసెంబర్,6 వరకే **
రండి అమ్మలూ, రండి రండి బాబులూ ..
ఒక ప్రశ్న చెప్పించుకుంటే రెండో ప్రశ్నకు 20% రిబేట్, మూడో దానికి 30%
మంచి తరుణం మించిన దొరకదు. కాయ్ రాజా కాయ్. ఒక బకరాని పట్టిస్తే రెఫరల్ బోనస్ రెండు ప్రశ్నలు ఉచితం. ఆడాళ్ళకి 20% తగ్గింపు, దళితులకి 50% తగ్గింపు.
రండి అమ్మలూ, రండి రండి బాబులూ ..

శ్రీనివాస్ said...

/శ్రీనివాస్ ఏంటి snkr పాస్వార్డ్ కావాలా?/

_____________________________________

పాస్వార్డ్ నాకెందుకు బాబు . జనలా పాస్వర్డ్ లు అడుగుతూ తిరిగే వ్యక్తులు వేరే ఉన్నారు :))

Anonymous said...

>>Is it just because they haven't left behind a prototype for you to test?

Nope, some thing else, you can google and you will get enough material about that.

>>You started with an assumption "without fundamental support"

Its not an assumption, there are other things too, like its a popular concept in Kerala that Adisankaracharya introduced the real line, but the fact is, there are no irrational numbers or zero at that time, so, we can't say that, he is the one who created "Real" line or concept of infinity.
(Infinity on real line and Infinite both are not same, even they mean the same).

Like, European people claim that Davinci know about choppers, but its just imagination, because of similar factors.

>>Imagination is the first-step of any development process.

I am not here to discuss about Psychological side of Science, so, I am not going to comment any on this.

But, as far as a Mathematician considers, with out fundamental support (not logical support), he is not going to believe that one's Imagination is not true or true, so, if you want to make it valid you need to show some evidence or else I am not going to agree with out, but at the same time, I don't mean its wrong unless otherwise I can show you some contradictions about this.

So, imaginaztion might be first for inventions, but I couldn't say its first step for discoveries.

And whats my claim about these Bhojaraju or other things is availability of technology and development of mathematics at that point of time.

--

Taara.

Anonymous said...

@Anonymous said...

http://sambargaadu.blogspot.com/2010/11/2010-6.html

---

Ohh, sorry boss I can't send mails to Chittore from here, its lil. costly affair.

--

Taara

Anonymous said...

>>పాస్వార్డ్ నాకెందుకు బాబు . జనలా పాస్వర్డ్ లు అడుగుతూ తిరిగే వ్యక్తులు వేరే ఉన్నారు :)) >>

ఎవరు జ్యోతక్కా?