blogspot hit counter

Wednesday, August 4, 2010

జ్యోతిష్యంలో సైన్సు...

సైన్సు: గ్రహాల ప్రభావం మనుషుల మీద తప్పక ఉంటుంది, అసలు జ్యోతిష్యం పెద్ద సైన్సు, కావాలంటే చూడు పౌర్ణమి రోజు పిచ్చి పెరుగుతుందని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు...

అసైన్సు: నిజమా?? ఏ డాక్టరు? జోతిష్యం వేరు సైన్సు వేరు, గ్రహాలు ఎక్కడ ఉన్నాయో(coordinates) అని చెప్పేది వేరు, గ్రహాలు ఏమి ప్రభావం చూపిస్తాయో వేరు, అన్నీ ఒకటే అని చెప్పటమే పెద్ద చతురు. అసలు మనం తర్కంతో వాదన ఎందుకు, మన లెఖ్ఖలు మనకుంటేను.

న్యూటన్ సిద్దాంతం ప్రకారం ఎదైనా రెండు వస్తువుల మధ్య వుండే ఆకర్షణ F = Gm1m2/ r2 N kg2 m-2 .

ఇప్పుడే పుట్టిన శిశువుని తీసుకుందా, శిశువు ౩కే.జీ. బరువు ఉంటే, ఆ శిశువు పై మన నవ గ్రహాలు చూపించే శక్తి ఎంతో చూద్దాం.

అంకెలలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, గ్రహాల మధ్య దూరం సమానంగా ఉండదు, నేను థియరీ ప్రకారం భూమికి అత్యంత దగ్గిరగా వచ్చినప్పటి దూరాన్ని ప్రామాణికంగా తీసుకున్నాను. ఇప్పుడు కుజ గ్రహాన్నే తిసుకుంటే అది పది లక్షల సంవత్సరాలకి ఒక్క సారి భూమికి అత్యంత దగ్గిరగా(55 లక్షల కిలోమీటర్లు ౨౦౦౩) వస్తుంది, కానీ నేను ఎప్పుడూ 55 లక్షల కిలోమీటర్లు దూరంలొనే ఉన్నట్టు తీసుకున్నాను, దీనివలన ఆ గ్రహ బలం ఎప్పుడూ అత్యంత ఎక్కువగా ఉంటుంది.


గ్రహం శిశువుపై ప్రభావం (న్యూటన్ లలో)

సూర్యుడు 0.011,78

చంద్ర 0.000,099,5

కుజ 0.000,000,042,47

బుధ 0.000,000,011,5

గురు 0.000,000,47

శుక్ర 0.000,000,674,9

శని 0.000,000,079,354,52

ఈ లెఖ్ఖన అత్యంత బలమైనది సూర్యుడు>చంద్ర> శుక్ర> గురు> శని> కుజ> బుధ.
మరి రాహు, కేతువులకి అసలు శక్తి లేదు, ఎందుకంటే వాటికి ద్రవ్యరాసి(మాస్) నున్నా కదా..

సరే పిల్లోడు పుట్టేటప్పుడు, అక్కడ తల్లి, ఇంకో ౩ సహాయకులు ఉన్నారు అనుకుందాం.. వారి సగటు బరువు 60 కేజి. ఐతే, వారి బలం శిశువుపై 0.000,000,048 (సగటు దూరమ్ ౩ అడుగులు అనుకుంటే), అంటే ఇది కుజ, బుధ గ్రహాల కన్నా ఎక్కువ.

అదే శిశువు పుట్టింది పెద్ద హాస్పిటల్‌ల్లో ఐతే, ఆ హాస్పిటల్, దానిలోని మనుషుల ప్రభావం చాలా ఎక్కువ, సరదాకి శిశువు పుట్టిన గది 15x15 అడుగులది ఐతే, దాని ప్రభావం 0.000,000,022 (వెయ్యి కేజిల బరువు ఉంటే) అంటే బుధ గ్రహం కన్నా శక్తివంతమైనది, అదే ఆ హాస్పిటల్, ఆ ఊరిలో ఉన్న చెట్లు, చేమలు, ఇల్లు, ఈగలు, దోమలు అన్నీ పరిగణించి చుస్తే (ఒక కి.మీ. దూరంలో ఉన్న సమస్తం పది లక్షల కే.జీ. ఉంటే) వాటి బలం 0.000,000,200 (దాదాపుగా), అంటే శని కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి..

ఇలా మనం అన్నీ ఒక్కోటిగా పరిగణలోకి తీసుకునే కొద్దీ వాటి ప్రభావం పెరుగుతుంది (భూమి ఆకర్షణ దాదాపు 10 కదా మరి).
అంటే ఎక్కడో వున్న గ్రహాల కన్నా మన చుట్టు ఉన్న పరిసరాల ప్రభావమే మన మీద ఎక్కువ ఉన్నప్పుడు, వీటిని పరిగణలోకి ఎందుకు తీసుకొనరు జాతకంలో?

మనిషి పెరిగే కొద్దీ గ్రహ ప్రభావం కుడా పెరుగుతుంది కదా మరి, అలాంటప్పుడు పుట్టినప్పటి గ్రహ ప్రభావమే ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు?

సరే స్థల ప్రభావం చుస్తే, భూ మధ్య రేఖ దగ్గిర భూమి వ్యాసం (డయామీటర్) 12756కి.మీ. ఐనా సూర్యుని ప్రభావం ఎక్కడో ఇరవయ్యో స్థానం లో మార్పు వస్తున్నది, (నా క్యాలుక్యులేటర్ ఆ పరిధిలో లేదు), మిగతా గ్రహాల సంగతి చెప్పక్కరలేదు. మరి ఐతే ఒకే సమయంలో పుట్టినవారు అందరూ ఒకే విధమైన ప్రభావాన్ని ఎదుర్కోంటారు కదా, మరి తేడాలేల??

సరే మరి ఈ ప్రభావం కాదు, రేడియేషన్ అనుకుందామనుకున్నా అది లెక్కేయ్యటానికి సూపర్ కంప్యుటర్ కావాలి. (సూర్యుని లెక్క ఇదివరకే ఇచ్చాను), ఐనా ఆ గ్రహాల కన్నా ఇంట్లో బల్బే ఎక్కువ రేడియేషన్ వదులుతుంది మన మీద..

భౌతిక ధర్మాలు అన్నీ అందరి మీదా సమానంగానే పనిచేస్తాయి, మరి అలాంటప్పుడు ఒకరికి రాహువు పదవి ఇస్తుంది, ఇంకోరికి రాహువే పెళ్ళి చెస్తాడు, మరి దానివెనుక ఏ భౌతిక సూత్రాలు ఉన్నాయి మరి?
ఒక గ్రహం కడుపుకి అధిపతి, ఇంకో గ్రహం గుండెకి అధిపతి, ఏ వైద్య శాస్త్ర ప్రమాణాల ప్రకారం?

వీటన్నిటికీ సమాధానం సైన్సులో ఐతే లేదు మరి, తర్కం లో ఉన్నదెమో, లేక నమ్మకంలో ఉన్నదెమో, కానీ జ్యోతిష్యం లో సైన్సు సున్నా..

కాబట్టి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, ఇలవేల్పులౌతారు.. అది మాని జాతకం అని కృషిని మరువకండి.

dhurabhimani గారి గోపాళం అండ్ కో ఎక్కాల పుస్తకం సౌజన్యంతో.

తర్కం ప్రయోగించి ఇచ్చే ప్రశ్నలకి జవాబులు నా నుంచి ఆశించకండి..ఎదైనా వెరే లెఖ్ఖలు ఉంటే మాత్రమే చెప్పండి, నేను తర్కబద్దంగా వాదించలేను..

మీకు ఇతర సాంకేతిక వివరాలు కావాలి అనుకుంటే నాకు ఒక ఉత్తరం పడెయ్యగలరు.

75 comments:

నేను said...

diameter = వ్యాసం

హరే కృష్ణ said...

చితక్కోట్టావ్!
keep posting

Anonymous said...

:) బాగుంది.
తర్కం లేకుండా సైన్సు ఎలా డెవలప్ అయ్యింది? కుతర్కం వద్దు అనాలి, అంటే 'మొబైల్ ఫోన్లు ఎఫెక్ట్ వుంటుంది కాబట్టి గ్రహప్రభావం వుంటుందీ , ' జ్యోతిష్యం నేర్చుకుని రా అర్థమవుతుందీ , ' రసాయన , భతిక శాస్త్రాలు వస్తేనే జ్యోతిష్యం అర్థమవుతుందీ ఇలాంటి మోకాలు-బోడిగుండు టైప్ స్టేట్మెంట్లన్న మాట.

Anonymous said...

:) బాగుంది.
తర్కం లేకుండా సైన్సు ఎలా డెవలప్ అయ్యింది? కుతర్కం వద్దు అనాలి, అంటే 'మొబైల్ ఫోన్లు ఎఫెక్ట్ వుంటుంది కాబట్టి గ్రహప్రభావం వుంటుందీ , ' జ్యోతిష్యం నేర్చుకుని రా అర్థమవుతుందీ , ' రసాయన , భతిక శాస్త్రాలు వస్తేనే జ్యోతిష్యం అర్థమవుతుందీ ఇలాంటి మోకాలు-బోడిగుండు టైప్ స్టేట్మెంట్లన్న మాట.

సైన్స్ కు తెలియనంత మాత్రాన లేదని కాదు, వుంటుందేమో అనే అనుకోవాలి.

తార said...

>> తర్కం లేకుండా సైన్సు ఎలా డెవలప్ అయ్యింది?

అవును కానీ మనం తర్కం నుంచి బయటకి ఎప్పుడో వచ్చేశాం.
చాలా సార్లు తర్కబద్దంగా లేవనెత్తిన ప్రశ్నలు contradiction తో అంతమయ్యాయి,Gottlob Frege తరువాత తర్కం కి వున్న విలువ తగ్గుతూ వస్తున్నది.
మీకు ఒక అనుమానం వస్తే, దానికి సాక్ష్యం కావాలి, ఎకనామిక్సో ఇంకొటో ఐతే statistical evidence సరిపోవచ్చు కానీ, గణితంలో, భౌతిక శాస్త్రాలలో తర్కం ఏ మాత్రం పనికి రాదు, దానికి ఒక ప్రూఫ్ కావాలి. ఎంతకీ కుక్కకి జాతకం చెప్పు, ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చెప్పు, ఇలా వాదించుకోవటం వలన ఎదీ తేలదు, తేలినా అది సరినదే అని నమ్మకమూ లేదు. కాబట్టి తర్కబద్ద వాదనకి ప్రస్తుతం నేను సుదూరం.

తరువాత, మీరు చెప్పింది మీకు బానే ఉండొచ్చు, ఇంకొకరికి అది మోకాలు-బోడిగుండు టైప్ అనిపించొచ్చు కదా?
పైన మీరు చెప్పిందే, ఎంత తప్పో అంకె ఉంటే కానీ తెలియదు, అంత చిన్న సెల్ ఫోన్ కే మనిషిని చంపే శక్తి ఉంటే, అంత పెద్ద గ్రహానికి లెదా అని అనుకోవ్చచ్చు.

కాబట్టి ఎదైనా సపోర్ట్ గా నాకు, ప్రువ్ ఐన మోడల్ చూపించాల్సిందే, లెదా కొత్తది కనిపెట్టి, అది ప్రువ్ చేసాక నాకు చెప్తే తెలుసుకుంటాను..

Anonymous said...

ఈ సృష్టి ఏదో ఓ శక్తి పర్యవసానమే. ఆ సృష్టి రహస్యాన్ని ఆకళి౦పుచేసుకోవడానికి, కనుక్కోవడానికి అనేక మార్గాలు.....అ౦దులో సైన్సుకూడా ఒకటి. సైన్సు పదార్థవాద ఆధార౦గా అనేక సూత్రాలను సమర్థ౦గా వివరి౦చి౦ది, కానీ సాధి౦చవలసి౦ది ఎ౦తో ఉ౦ది. జ్యోతిష్య౦లో అనేక అర్థ౦ కాని ప్రశ్నలున్నాయి, కానీ అ౦తటి శాస్త్ర౦ ఉత్తినే పుట్టదు కదా, ఏ మాత్ర౦ సైన్సు పరిఙ్ఞాన౦ లేదని మన౦ భావిస్తున్న కాల౦లో, ఆ మాత్ర౦ గ్రహ గమనాలను ఎలా ఆకళి౦పు చేసుకున్నారు? ఆలోచి౦చ౦డి.

తార said...

>>గ్రహ గమనాలను ఎలా ఆకళి౦పు చేసుకున్నారు?

దాన్లో మనం చుడాల్సింది గణితం మష్టారు, అలా అన్నిట్లో దేవుడ్నో,ఇంకొటో చూసి, వరాహ మిహిరుడు అనే గొప్ప శాస్త్రవేత్తని ఒక జ్యోసుడ్ని చేసేసాము..కానీ అప్పటి లెఖ్ఖలు ఇప్పటికీ ఉపయొగపడేవెమో (న్యూమరికల్ మెథడ్స్ లాగా)..
ఎదో శక్తి ఉంటే దానికి దైవత్వం ఆపాదించేసి, పూజింపటం వలన ఒనగూరే ప్రయోజనం??

తార said...

బద్రి గారు, ధన్యవాదాలు, మార్చాను.

హరి :-) ఎదో మీ అభిమానము..
మొదటి అజ్ఞాతగారు, రెండో అజ్ఞాతగారు మీ కామెంట్స్ కి, ధన్యవాదములు..

snkr గారు, కానీ అది తప్పు అని ప్రూవ్ అయ్యినా అలానే అనుకోవాలా?? పొద్దున ఒక గురువు గారు నాకు అదే చెప్పి మందలించారు :-(

శ్రీనివాస్ పప్పు said...

అంటే మీకు తెలీకపోయినంత మాత్రానా ఏవేవో అర్ధం కాని లెక్కలు చెప్పేస్తే నమ్మెయ్యాలా?అసలు మీ కేలిక్యులేటరే తప్పేమో?బేటరీలు కొత్తవేనా డిస్చార్జ్ అయిపోయినవా.వాటి కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఏమిటి?కేలిక్యులేటర్ చైనా లో చేసిందేమో?అది కమ్యూనిస్టులు చేసింది కాబట్టి మీకెలా కావలిస్తే అలా నంబరొచ్చిందేమో అనుకోవచ్చు కదా?మా కేలిక్యులేటర్ లో 100 నొక్కితే 200 వస్తుంది ఇది సాధ్యమయినప్పుడు జ్యోతిష్యం లో సైన్సు ఎందుకుండకూడదు.సైన్సు కనిపెట్టినవారికి జాతకాలు రాయించారా?న్యూటన్ ఐన్‌స్టీన్ కి జ్యోతిష్యం చెప్తుంటే తీసిన ఫొటోలు హిచ్‌కాక్ సినిమాల్లో మీరెప్పుడు చూడలేదా?అవన్ని చూడకుండా ఏదో తర్కం కుతర్కం వితర్కం అంటారేమిటి?
కావాలంటే మీ నక్షత్రం చెప్పండి మా సెగట్రీ చేత మీ రాశిఫలాలు చెప్పిస్తాను.అవి జరగవు అని మీరు నిరూపిస్తే ముక్కు గాడిచేత మీకు ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పిస్తా.

మరే ప్రతీ ఏడాదీ వచ్చే రంజాన్ గురించి(ఎప్పుడు మొదలయి ఎప్పుడు అంతమవుతుందని)ప్రతి పంచాంగం లోనూ ఎలా రాసేస్తున్నారు? కాని అసలు పాటించేవాళ్ళు ఆకాశంలోకి విమానంలో వెళ్ళి టెలెస్కోప్ లో చూసి అప్పుడు విజిలేసి జెండా ఊపితే ఉపవాసం మొదలెడతారుట.కాని అదే టైమింగ్ మన పంచాంగం లో ఎలా రాసేసారంటారు?ఈ ప్రశ్నకి జవాబు తెలిసీ చెప్పకపోతే అన్న కధలు ప్రతి రోజూ పడుకోబోయే ముందు చదవాలి మీకు పెళ్ళయేంతవరకూ ఇదే పనిష్‌మెంట్..హా

Anonymous said...

శ్రీనివాస్పప్పు గారు
కెవ్వ్ కెవ్వ్
ROFL

Anonymous said...

/తప్పు అని ప్రూవ్ అయ్యినా అలానే అనుకోవాలా?? /
ప్రూఫ్ అయ్యాక అంకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రూఫ్ తిరుగులేనిదిగాను, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రూవ్ చేసుకునేలా వుండాలి, అంతవరకూ శొధన తప్పదు. సైన్స్ ఇలాంటి సిద్ధాంతాల మీద అభివృద్ధి చెందిందింది కదా.
కమ్యూనిజాన్నే తీసుకోండి, మార్క్స్ ఏంగెల్సు ఏవో కలలు కని ఆ కలలు సాకారం అవుతాయనే భ్రమలో పుస్తకాలు రాశారు. కొన్ని దేశాలు ఆ తోక పట్టుకుని కొన్నేళ్ళు ఈదాయి తరువాత చేతులెత్తేసి ఫ్రీ మార్కెట్, కేపిటలిజం బాట పట్టాయి. మన వెధవలు అది రియలైజ్ అయ్యేటప్పటికి ఇంకో 50ఏళ్ళు పట్టొచ్చేమో, మామూలే .. జీవితకాలం లేటు (కొంపతీసి మీరు ముష్టి కమ్యునిస్ట్ కాదు కదా? :) )
======
@Srinivas Pappu
/అదే టైమింగ్ మన పంచాంగం లో ఎలా రాసేసారంటారు?/
అదేముంది ఇస్లామిక్ పంచాగంలో వున్నది మన కేలండర్లో రాస్తున్నారు. వరాహమిహరుడు పేరు చూసి ముస్లిం కాడని ఖచ్చితంగా చెప్పగలను.

తార said...

snkr గారు,
బాగా చెప్పారు, మరి జ్యోతిష్యం భౌతిక ధర్మాలకి విరుద్దంగా ఉన్నది, కాబట్టి అది తప్పు అని ప్రూవ్ ఐనట్టే కదా, ఇంక దాన్ని నమ్మటమేల?? నమ్మమనటమేల?

కమ్యూనిజానికి, జ్యోతిష్యానికి నాకు తెడా తెలియదు, మతి తప్పిన జంతిక వాదంలో ఎంత సైన్సు ఉన్నది? సిద్దాంతం అనటమే తప్ప, ఒక్క సారి కుడా దానికి ప్రూవ్ చూపించారా? ఐనా చైనా విధానం గొప్పదా, రష్యా గొప్పదా అని తన్నుకోవటం తప్ప, ఒక్కడు ఐనా ఒక మోడల్ కట్టి ఇదిగో దీని కోరిలషన్ కోఫిచియన్ట్, దానిది ఇంత అని చూసారా??
అసలు రచయితలు దేశ ఆర్ధిక విధానాన్ని నిర్దేశించటం ఏమిటి??

అమ్మో మరీ పెద్దది ఐపోయింది..

--ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రూవ్ చేసుకునేలా వుండాలి
నేను ఇంకోటి చెప్తాను, similar conditions లో behavior similar గా ఉంటుంది అని చూపించాలి. (under similar circumstances the result must repeat)

said...

ok my argument, in jyotish all planets will have Ucha and Neecha(powerful position and powerless position). for the case of Sun from Mar 21 to Apr 21st is Ucha and sep 21st to Oct 21st is Neecha. And our jyotish feels sun will be powerful and powerless in these times respectively. Even if you feel the climate in those period you will feel that. Jyotish is evolving science... some concepts might be old but they are not false...

Another issue, if somebody is having Ketu in good position he used to develop Clocks(Sand water.. old time clocks)... today ppl having Ketu in good position are doing Electronics( the whole electronics and computers is based on the Clock Cycle)...

తార said...

>>ఈ ప్రశ్నకి జవాబు తెలిసీ చెప్పకపోతే అన్న కధలు ప్రతి రోజూ పడుకోబోయే ముందు చదవాలి మీకు పెళ్ళయేంతవరకూ ఇదే పనిష్‌మెంట్..హా

హమ్మ, తెలియకపొతే చెప్పక్కరలెదు అన్నమాట, ఐతే నేను కొంచం ఊపిరి పీల్చుకోవచ్చు కాస్త..

>>కాని అసలు పాటించేవాళ్ళు ఆకాశంలోకి విమానంలో వెళ్ళి టెలెస్కోప్ లో చూసి అప్పుడు విజిలేసి జెండా ఊపితే ఉపవాసం మొదలెడతారుట

అసలు ఆకాశం నుంచి ఝెండా ఊపితే, ఈల వెస్తే భూమ్మీద ఎలా కనిపిస్తుందబ్బా??

అవును సుమా మా క్యాలిక్యులేటర్ కమ్యునిష్ట్ చేసినదే, అంటే దీనిలో విదేశీ హస్తం ఉన్నదన్నమాట...
మీ ౧౦౦ కి ౨౦౦ ది నాకు కాస్త జెరాక్స్ తీసి పంపిస్తారా నేను వాడుకోగలను..

Giri Dornala said...

సైన్సుకి సోర్సులేమైనా ఉన్నాయా?

తార said...

సైన్సుకు సోర్సా??

లేక అసైన్సుకి అడిగారా?? చిన్న లెఖ్ఖే, వివరాలు ఇచ్చాను, ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే వివరంగా అడగగలరు.

Giri Dornala said...

అసైన్సుకి కాదు, సైన్సుకే! ఎందుకంటే ఇది సైన్సు కబుర్లలో చూసినట్లు గుర్తు లేదు.

తార said...

అది సాధారణ సత్యం అండి, ఎవరైనా ముందు చెప్పేది, సాక్ష్యంగా చూపేదీ అదే, మీరు కింద లంకెలో చూడ గలరు, నేను ఎదో ఒక లంకె ఇస్తే అది వ్యక్తి విమర్శ అనుకునే ప్రమాదం ఉన్నది.

http://www.google.co.in/search?q=%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B2+%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%82+%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2+%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6+%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%95+%E0%B0%89%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF

తార said...

http://www.google.co.in/search?q=గ్రహాల+ప్రభావం+మనుషుల+మీద+తప్పక+ఉంటుంది

Giri Dornala said...

విచిత్రమేంటంటే మనిషికి అతి దగ్గరలో ఉండే భూగ్రహ ప్రభావం మనిషి మీద ఉండదు. మరి సైన్సు ప్రకారం భూమి గ్రహం కాదు కదా?

Giri Dornala said...

రేప్పొద్దున మనం చంద్రుని మీద ఇల్లు కట్టుకున్నామనుకోండి, అప్పుడు మన జాతకం పైన చంద్రుని ప్రభావం ఉండదు, కానీ భూమి ప్రభావం ఉంటుంది. మరి భూమి ప్రభావం మంచిగా ఉండొచ్చ, లేక చెడ్డగా ఉండొచ్చా? ఇది వరాహమిహిరుడు చెప్పలేదు, మరెలాగ?

Anonymous said...

does anybody told u that in jyothishyam, the effect of different planets on a newly born child is because of newton's laws of motion??

can u explain me how the formula u told can define all the forces acted on the child.

said...

నచికేత్ అన్నారు...

విచిత్రమేంటంటే మనిషికి అతి దగ్గరలో ఉండే భూగ్రహ ప్రభావం మనిషి మీద ఉండదు. మరి సైన్సు ప్రకారం భూమి గ్రహం కాదు కదా?
--- Dear Nachiket, Ascendant( Lagnam) is the position of Earth's East edge which is the Most important thing in any horoscope. And we check all other planets position with respect to this Ascendant(Lagnam). You better know/read before what you write. with half-knowledge you shouldn't write. Earth is most important thing in horo next, sun moon Jupiter Saturn...

తార said...

అది సరే శేషు గారు, మనం జ్యోతిష్యం లో ఉన్న భౌతిక ధర్మాల గురించి, తర్క బద్దంగా కాకుండా, భౌతిక శాస్త్ర బద్దంగా చర్చించుకుందాం..

మీరు నేను చెప్పినది తప్పు అని చూపించండి, ఏది, న్యూటన్ కి విరుద్దమైన సిద్దాంతం కనిపెట్టి, ఇప్పుడు ఉన్నది మొత్తం తప్పు అని చూపించగలిగితే అంతకన్నా భాగ్యమా??

said...

ok tara garu, i am not telling that Newton's law is wrong but your interpretation might be.

Do you believe that in Amavasya and pournami Tides in Sea will be high due to gravity effect of sun and Moon?
Can you create 1CM tide in sea or in a bucket of water with your gravity? without touching the water? in your calculations if you are closer to water you can do it better than sun and moon?

Anonymous said...

గ్రహాల ప్రభావం తెలుసుకోవాలి అంటే ఐన్స్టీన్ జెనరల్ రిలేటివిటి థియరీని ఉపయోగించగలరు.

Anonymous said...

//Do you believe that in Amavasya and pournami Tides in Sea will be high due to gravity effect of sun and Moon? //

Statistics says so. But the question here is - Is jyotishyam based on gravity? If not why believers often quote this?

//Can you create 1CM tide in sea or in a bucket of water with your gravity?//
Please read the post again. He already answered that. Now it is your turn to prove the basis for jyotishyam , if you claim it as science. If you can't don't call it as science and take help of physics, effect of mobile phones on body etc.

తార said...

snkr గారు,
F = Gm1m2/ r2 N kg2 m-2

దిన్లో m1, m2 mass of objects అని కుడా తెలుసుకోకుండా మట్లాడితే సమాధానం ఏమి ఇస్తాము అని ఊరుకున్నాను.
సముద్రం పై చంద్ర ప్రభావము మనిషికన్నా ఎక్కువ కారణం ద్రవ్యరాసి.

Force between the Moon and the oceans is 4.65 x 10^16 N ; Sun and the oceans is 8.37 x 10^18 N.

మళ్ళీ దినిలో gradient కట్టుకోవాలి. అదే ఫోర్స్ మనిషి మీద ఎంత ఉంటదో పైన ఉన్నది.

ముందే చెప్పాను, తర్కం కాదు అంకెలు ఇవ్వమని.

snkr గారు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కమ్యూనిష్టు ఐనా సైన్సు మాట్లాడతాడా? ఐనా నన్ను కమ్యూనిస్టా అని అడగటం తప్పా కాదా..

సముద్రాల పై చంద్ర, సూర్య ప్రభావం కొఱకు http://en.wikipedia.org/wiki/Tide

చూడండి శేషు గారు. (తరువాత gradient కట్టి చుస్తే మనిషిపై చంద్ర ప్రభావం నేను చెప్పిన దానిలో పదోవంతు కుడా వుండదు).

krishna said...

బాగుంది , బాగుంది:)
నేను చాలా రోజుల నుండి వర్క్ చేస్తున్నా, జ్యోతిష్యం మీద ఒక టపా రాద్ద్దామని, కానీ భౌతిక శాస్త్రం దృష్ట్యా మీరు చాలా రాసేసారు !
కానీ ఆర్యా! ఘనతి కి ఎక్కిన ఆచార్యులవారు ఇక్కడ సమాధానాలు ఇస్తే బాగుండునని తెగ అనుకుంటున్నాను, ఆయన దర్శన భాగ్యం మాకు ఇంత దుర్లభమా ?

Anonymous said...

శేషు గారి మంచి ప్రశ్న లేవనేత్తారు. మీ సమాధానం నాకు తృప్తి నివ్వలేదు. ప్రశ్నలడిగేవారే కరవైన ఈ తందాన తానల బ్లాగ్లోకంలో మీరిలా ఏదో ఈక్వేషన్ ఇచ్చాగా సాధించుకో అని చాక్పీస్ పడేయడం నాకు నచ్చలేదు. మీరేం జ్యోతిష్కులు కాదుగా, ప్రశ్నించిన వాళ్ళని తరిమికొట్టడానికి?
తర్కబద్ధంగా తేలికైన సమాధానం ఇవ్వగలరేమో, ఆలోచించండి.

తార said...

snkr గారు,

సూర్యుడు 0.011,78
చంద్ర 0.000,099,5
పైవి మనుషుల మీద ఉండే మ్యాక్సిమమ్
Force between the Moon and the oceans is 4.65 x 10^16 N ; Sun and the oceans is 8.37 x 10^18 N.

ఇది కుడా మ్యాక్సిమమ్ మే, కానీ అది రెండు గ్రహాలూ ఒకే యాక్సిస్ మీద ఉన్నప్పుడు, లేకపొతే వెక్టార్స్ కాంపోనెంట్స్ కట్టుకొని రిసల్ట్ చుసుకోవాలి, అదొక పెద్ద సబ్జెక్ట్ ఆషామాషి వ్యవహారం కాదు, అందుకే గ్రేడియంట్ కట్టుకోవాలి అని చెప్పాను తప్ప, కట్టుకో మని చెప్పలేదు.
అది తీసేస్తె, మాయ చెయ్యటం అవుతుంది, అందుకే అది రాసాను.

తార said...

తర్కం సైన్సు ఒక్కటే కాదని మనవి, కాబట్టి తర్కబద్ద సమాధానం నేను చెప్పలేను..

said...

సరే తార గారు, మెఱు ఏదో కాకి లెక్కలు వేసి గ్రహాల ప్రభావం కన్నా మనిషి ప్రభావం ఎక్కువ అంటారు. సరే నేను 700 కోట్ల మనిషుల ప్రభావం సముద్రం మీద ఎక్కువ ఉందా అంటాను... ఇప్పుడు నేను ఆ లెక్కలు వేయలేను. జ్యొతిస్యమ్ గ్ర్యావిటీ కన్నా ఇంకా చాలా కాస్‌మిక్ శక్తిలా వలన ఉంటుంది అని నేను అనుకుంటున్న.

తార said...

కాస్మిక్ శక్తి మరి ఇతర గ్రహాల నుంచి రాదుగా? అది ఇతర నక్షత్రాల దగ్గిర నుంచి వస్తుంది, అది ఐనా, మనిషి పుట్టినప్పుడే ఉంటుంది అని ఎలా చెప్తారు, ఎల్లవేళలా ఉంటుంది, మరి అలా చూసినా గ్రహప్రభావం తప్పు.

said...

i think you have Mars in 2nd house that's why you are arguing so much. ;-) Just a astrological guess.

తార said...

శేషు గారు,

మళ్ళీ తప్పు.

Anonymous said...

భూమ్మీద బకెట్లోని నిశ్చలంగా వున్న నీటిలో 1 సె.మీ. కాదు కదా ఒక్క మైక్రాన్ ఎత్తు అలనైనా గ్రావిటీతో సృష్టించలేమనుకుంటా. బకెట్ నీళ్ళలో 1 సె.మీ గ్రావిటీతో కలిగించగలిగితే అదే శక్తి సముద్రాల్లో కిలోమీటర్ల ఎత్తున అలలు సృష్టిస్తుందేమో. Here that ratio matters. అంత గ్రావిటీ కలిగించాలంటే భూమికన్నా పెద్ద గ్రహాన్ని ఒక మీటర్ దూరంలో నిలపాలేమో, మనం ఎక్కడ వుండాలి? :) ఈ వివరణ తర్కం కిందికి రాదంటారా?

Anonymous said...

జ్యోతిష్యం కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేయాల్సిన పద్దతి - ముందు జ్యోతిష్యం లో ఏ సూత్రం/సిద్దాంతం ఉపయోగించారు, అది ఎందుకు తప్పు అని లెక్క కట్టాలి. కేవలం న్యూటన్ సిద్దాంతం ఒక్కటే గ్రహాల విషయాలలో సరిపోదు. తేనతుట్టను కదిలించటానికి ఊరికే కదిలించము కదా...నేర్పుగా పొగపెట్టాలి, పరిగెత్తాలి. ఇదంతా పెద్ద తలనొప్పి అనుకుంటే, బ్లాగ్ లో రాయటం కష్టం అనుకుంటే, క్లియర్ గా ఒక పేపర్ రాయండి. అది సైన్సు పద్దతి.

said...

ok tara garu. what is life in science? If you have some reasoning about life and if you can create Life with Science then WE Stupid people from Jyotish community will believe that there is some Life and check the effects of Gravity on our Lives.

said...

First i thought SNKR is arguing against me, but slowly he is kicking Tara garu ;-)

తార said...

అజ్ఞాత గారు,

అంత అక్కర్లేదు, ఒక్క వైరుధ్యం చాలు కొన్ని వేల సంవత్సరాలు కట్టిన సౌధం కూల్చడానికి.

శేషు గారు, మరి జ్యోతిష్యంతో జీవాన్ని భూమిమీద పుట్టించారా?

said...

Taragaru, tarkam lo ki digutunnaru :-)

Anonymous said...

ఏమిటి మీరు చూపెట్టిన వైరుధ్యం? సగం థియరీ ప్రెసెంట్ చెస్తే ఎలా? బ్లాక్ హోల్ కి ఇంకొక హెవెన్లీ బాడీ కి మద్య వున్న ఆకర్షన సక్తి కి ఇదీ సూత్రాన్ని ఉపయోగిస్తారా?

తార said...

క్రిష్ణ బిలం వరకూ ఎందుకులేండి.

నేను చూపించిన వైరుధ్యం అది కాదు.

మనిషి పెరిగే కొద్దీ గ్రహ ప్రభావం కుడా పెరుగుతుంది కదా మరి, అలాంటప్పుడు పుట్టినప్పటి గ్రహ ప్రభావమే ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు?

Anonymous said...

Sheshu you are wrong, I am neutral. I don't mind to become jyotishya if I find some Prima facie evidence i.e basics. I may continue further on my own.
I don't like people who spread lies in the name of jyotishya with/without their knowledge.

For example I don't agree with your comment: "if you can create Life with Science then WE Stupid people from Jyotish community will believe that there is some Life" is meaningless. Tara is NOT asking you to 'believe Science'. He said Gravity of planets have negligible physcical effect on us. I am with him.

said...

today i kicked my boss. he fired me. them my wife scolded me so i kicked her. she kicked my kids, kids complained to my parents, my parents called me and scolded me..........

like that first action of your life will decide further actions... Its not 100% but you can change life if you know how to... Just check your left and right hands. For ladies left hand will be constant and right hand will be moving. it shows your life have changed... at birth both hands will have same print...

i am dragging palmistry too ;-)

said...

hi SNKR, i thing you are more interested in Tarkam rather than anything ;-)

తార said...

శేషు గారు, నేను పైనే చెప్పాను, నేను మూర్ఖ కమ్యూనిష్టుని కాదు అని, మీరు మీ మోడల్ ప్రువ్ చెయ్యండి భౌతిక ధర్మాల ప్రకారం, నా తప్పుని ఒప్పుకుంటాను, నేనూ జాతకాలు చెప్తాను.

Anonymous said...

>> మనిషి పెరిగే కొద్దీ గ్రహ ప్రభావం కుడా పెరుగుతుంది కదా మరి, అలాంటప్పుడు పుట్టినప్పటి గ్రహ ప్రభావమే ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు?
ఎందుకు తీసుకుంటారో జ్యోతిష్యం లో చెప్పలేదా? వారు చూపెట్టే కారణం ఏంటో..అయినా అందులో కేవలం గ్రహాలు మాత్రమే వుంటాయా? ఏమో మరి నాకు తెలియదు. అలాగె కచ్చితంగా ఇలానే జరుగుతుండి అని చెప్పరేమో కదా...

said...

well, i cant prove that jyotish is wrong or right. But i can see the predictions working so i believe...and i predict well i make my friends/clients believe...

Anonymous said...

It is Jyotishya people who claim it as Science and run-away when questioned in a scietific way. :)
You called it COSMIC energy, some other may say LASER or stem-cells or DNA. You pick-up fancy words and use it to glorify the ancient belief as 100% correct!

తార said...

అజ్ఞాతగారు,

ఒక్క ముక్క చెప్పరు, నేను ఎంతో కొంత పాండిత్యం జ్యోతిష్యంలో సంపాదించే అది తప్పు అని తెలుసుకున్నాను..

శేషుగారు, మంచిది, మిమ్మల్నిజ్యోతిష్యం నమ్మవద్దు అని నేను చెప్పటం లేదు, కానీ అది సైన్సు కాదు అని మాత్రమే మనవి చేసుకుంటున్నాను.

తార said...

snkr గారు,
వారు చెప్పేది ఒక్కటే భౌతిక, రసాయన, ... శాస్త్రాలు వస్తే తప్ప జ్యోతిష్యం అర్ధం కాదు......

కానీ నాకు వాటిలో ఎంతో కొంత పాండిత్యం ఉన్నది గా...

Anonymous said...

Tara, well done. You message is clear give them a way to run-away and look for their bad houses for malefic planets ruling East/South in Space. :)

Anonymous said...

>> నేను ఎంతో కొంత పాండిత్యం జ్యోతిష్యంలో సంపాదించే అది తప్పు అని తెలుసుకున్నాను..
మీకు కొంత ప్రవేశం వుందని తెలుస్తూనే వుంది. కాని నేర్పిన వారు ఎలాంటివారో...కుంభకోణం లోని జ్యోతిష్యులు (అందరు కాదు కొందరు) ప్రసిద్దులు. వారు కూడా కొంత వరకే భవిష్యత్తు గురించి చెప్పగలరు. ఆ విషయం స్వయానా వారే చెప్తారు. ఐతే అది సైన్సా మేథ్సా అనేది కచ్చితంగా నిర్ధారించటం వారికి అనవసరమేమో. కానీ ఎంతో కొంత మేథ్స్ లేకపోతే వారి జాతకం తప్పు అవుతుంది గా...ఎటొచ్చి బొటా బొటి జ్ఞానంతో చెప్పేవాళ్ళతొనే చిక్కు.

శ్రీనివాస్ said...

మాలిక లో వాఖ్యాల విభాగం లో ఒక పక్క అంతా ఆక్రమించారు ... ఇక చాలించండి కాసేపు :P

తార said...

సైన్సు కాదు, కానీ గ్రహాలు ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్పటం వరకూ కరక్టే చాలా వరకూ, అదో గొప్ప న్యూమరికల్ మెథడ్, కానీ దాన్ని ఇలా ముసుగేసెయ్యటం వలన, సైన్సు అభివృద్ది చాలావరకు కుంటుపడింది మన దేశంలో.
నేను చాలా పెద్ద వారి దగ్గిరే శిష్యరికం చేసాను.. చిన్నవారు కాదులేండి.

తార said...

snkr గారు :-)

శ్రీను గారు గలాగలాగే

మంచు said...

@తారా: కాస్త బుర్ర పెట్టి అలొచించే పొస్ట్ వెసావు ... ధన్యవాదాలు. కుంభకొణంలొనే కాదు ఎక్కడా ఎవరూ భవిష్యత్ ఖచ్చితంగా చెప్పలేరు..నా అభిప్రాయం అది... ఎదొ నొటికొచ్చింది చెప్పడం ... అదే సమయానికి ఎక్కడొ ఎదొ జరిగితే నేను చెప్పినట్టే జరిగింది అని వాళ్ళ జొస్యం ఆ ఈవెంట్స్ కి ఆపాదించడం మామూలే.. నేను వీటిని అస్సలు నమ్మను.

అయితే...

నేను మొన్నామద్య హిస్టరి చానల్ లొ నొస్టర్ డాం ప్రిడిక్షన్స్ గురించి ఒక ప్రొగ్రాం చూసాను. అతను ఉపయొగించిన పద్దతి (జుడిషీల్ అస్ట్రాలజి ) మనదేశ జొతిష్యులు ఉపయోగించింది ఇంచుమించు ఒకటేలా అనిపించింది. (మనిషి మీద గ్రహ ప్రభావం నాకు అస్సలు తెలీదు.. సొ అది వదిలెసి.. కేవలం ప్రకృతి వైపరిత్యాలు ప్రిడిక్ట్ చెయ్యడం గురించి చెబుతున్నా ). ఏ దేశం , ఏ కల్చర్ లొ వున్నా అస్ట్రాలజి అయినా ... అల్మొస్ట్ అన్నీ ఈ గ్రహాలు, నక్ష్యత్రాలు మధ్య ఫొర్స్ మీదే బేస్ చేసుకుని వున్నాయి. గ్రీకులు దగ్గరనుండి ఫ్రెంచ్, బారతీయుల వరకూ.. కొంతమంది అనుకుంటున్నట్టు ఇదేదొ కొంతమంది స్వార్ధపరులు తమ స్వార్ధంతొ వీక్ పర్సనాలిటిలను పట్టుకుని పబ్బం గడుపుకొవడానికి పుట్టించలేదు. మన జొతిష్యులు దీని బెసిస్ ఎందుకు చెప్పలేక పొతున్నారు అనడానికి నాకు తట్టినది ఇది..

ఉదాహరణకు ఎదయినా ఒక ప్రొడక్ట్ ఉత్పత్తి చెయ్యలంటే.. రెండు టీములు కావాలి. ఒకటి డిజైన్ టీం రెండొది మ్యానుఫ్యాక్చురింగ్ టీం. మ్యానుఫ్యాక్చురింగ్ పర్సన్ కి అది ఎలా డిజైన్ చేసారొ తెలీదు (తెలియ్యక్కర్లెదు.. తెలిస్తే మంచిది ) . ఇచ్చిన డిజైన్ ప్రకారం తయారుచేసుకు పొవడమే... అదే థియరి ఇక్కడ చూసుకుంటే... డిజైన్ చేసింది ఎవరొ పూర్వికులు. మ్యానుఫ్యాక్చురింగ్ చేసేది ఇప్పటి తరాల జొతిష్యులు. వారికి శాస్త్రం తెలుసు కానీ అది ఎలా డిజైన్ చెయ్యబడిందొ తెలీదు. దురదృస్టవశాత్తు ఆ డిజైన్ ఇప్పుడు ఎవరికీ తెలీదు. అందుకే ఒకరు గ్రావిటి అని , ఇంకొరు కాస్మిక్ అని ఎదొ చెబుతూ వుంటారు.

ఆ పూర్వికులు డిజైన్ చేసింది తప్పా , ఒప్పా అన్నది మనకి తెలీదు. అసలు ఆ డిజైన్ ఎలా ఏర్పడిందొ కూడా తెలీదు. అది తెలిస్తే దాంట్లొ కూడా సైన్సు చూపించవచ్చేమో. అస్ట్రాలజి గ్రహాల మధ్య వున్న ఫొర్స్ మీద అధారపడి వుంది అని చెబితే మనకి తెలుసున్న సైన్సు ప్రకారం అది తప్పు అని పైన నువ్వు చెప్పినట్టుగా చెప్పవహ్చు. కానీ అదే ఈ డిజైన్ కి మూలం అని మనకి తెలీదే...అది తెలిసె వరకూ ఈ ఆస్ట్రాలజి ని నమ్మలేము, అలా అని అంతా ట్రాష్ అని తీసి పారెయ్యలేము.

ఎన్నొ తరాలనుండి , ఇంచుమించు అన్ని ఖండాల్లొ, అన్ని నాగరికతలలొ , అన్ని సంస్కృతులలొ బాగమయిన ఆస్ట్రాలజి మొత్తం ట్రాష్ అయితే కాదు. ఇంకొవిషయం ఎమిటంటే ఇది డెవలప్ అయిన టైం కి సమాచార వ్యవస్త కూడా లేదు. అంటే అన్ని ప్రదేశాల్లొ సమాంతరంగా , స్వంతంగా, విడివిడిగా డెవెలప్ అయ్యిందే.. సొ మనకి తెలీదు.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .. అది తేలేవరకు జ్యొతిషం నమ్మొద్దు.. అలా అని అంతా ట్రాష్ అని తీసి పారేయొద్దు.

మంచు said...
This comment has been removed by the author.
భాస్కర రామిరెడ్డి said...

మీరు జ్యోతీష్య శాస్త్రాన్ని భవిష్య వాణి చెప్పే సైన్సు శాస్త్రంగా తీసుకుంటే ఇప్పుడు మనకున్న వాతావరణ పరిశోధనలన్నీ దానిక్రిందకే వస్తాయి. ఇవి దరిదాపు 99% నిజాలవుతున్నాయా లేదా? ఎలా సాధ్యపడింది? సంవత్సరాలుగా ఆ ప్రాంత, ప్రదేశ లక్షణాలను విశ్లేషించి సూత్రీకరించి చెప్పబట్టే కదా. అలాగే మనిషి భవిషత్తు చెప్పాలంటే తన గురించి, సాంఘిక పరిస్థితుల గురించి కూలంకుషంగా చదివిన తరువాత predict చేస్తే కచ్చితంగా నిజాలవుతాయి. కారణం మనం ఇంతవరకు లభ్యమైన డాటాని అనలైజ్ చేసి భవిష్యత్తు లెక్క కడుతున్నాము. ఇందులో పెరామీటర్స్ ప్రాంత ప్రాంతానికి మారినట్టు మనిషి మనిషికి మారుతుంటాయి.

కానీ వీటన్నింటికి అతీతంగా మనకు తెలియకుండా లేదా కనీసం ఊహించనైనా ఊహించలేని సంఘటనలను ఒక్క దైవ శాస్త్రం తప్పించి ఏదైనా సైన్స్ చెప్పగలదా? జరిగిన తరువాత ఇలా అయ్యి వుండవచ్చు లేదా అలా అయ్యి వుండవచ్చు అని విశ్లేషించుకోవడమే తప్పించి? కాబట్టి ఏ సంఘటనకైనా రెండే సమాధానాలు. అవుతుంది లేదా కాదు. జ్యోతీష్య శాస్త్రం లో అవుతుంది అని చెప్పినవి జరిగితే నిజమైనట్టు అంతే.

అయినా మనిషి మీద గ్రహాల ప్రభావమా లేక పరిశరాల ప్రభావమా తన భవిశ్యత్తును నిర్ణయించేది?

Anonymous said...

Manchu& BRR
thanks for sharings your views on the subject.

//అంటే అన్ని ప్రదేశాల్లొ సమాంతరంగా , స్వంతంగా, విడివిడిగా డెవెలప్ అయ్యిందే.. // @Manchu

Origin looks to be same with local flavours added later. Probability of naming 12 rasis with same names is near impossible.

@BRR
//మీరు జ్యోతీష్య శాస్త్రాన్ని భవిష్య వాణి చెప్పే సైన్సు శాస్త్రంగా తీసుకుంటే // Why should we take? You mean weather reports are being given based on everyday planetry positions?

// దైవ శాస్త్రం //
What is that? You mean fate/God's will?

భాస్కర రామిరెడ్డి said...

@snkr

>> Why should we take?

ఇంతకీ జ్యోతీష్య శాస్త్రానికి మీ నిర్వచనం ఏమిటి? దాన్ని బేస్ చేసుకుంటే ఆ తరువాత మిగిలినవి clear గా చర్చించడానికి అవకాసం వుంటుంది.

>> You mean weather reports are being given based on everyday planetry positions?

I meant it, partially yes, to be precise based on the characteristics of planets. in otherwords characteristics of planets depends on their position. characteristics like Temperature, Pressure, and for a min assume that suns light reaches earth after 16 minutes. what happens to earths weather?

// దైవ శాస్త్రం //
What is that? You mean fate/God's will?

What is fate? దైవశాస్త్రానికి నా నిర్వచనం తరతరాలుగా పరిశోధనలు చేస్తున్నా మనిషి ఊహకు అందనిది.

ఉదాహరణ "ఈ క్షణంలో గుండ్రాయిలా బ్రతికి వున్నవాడు మరు నిముషంలో అనుకోకుండా మృత్యువాత పడటం"

Anonymous said...

I don't know definition for jyotishyam and neither a believer nor a opposer as on today. You may give your definition and say something on the mechanism it is based on , if it is a science ( like physics to be precise) as claimed by modern jyotish pandits.

One professional advised me to learn chemistry, physics, mobile phones , biology, DNA etc as a prerequisite to learn Jyotishyam. Is that correct? How it is related to that .. there started my search

It is interesting to know that weather dept uses planetary info to report 5day weather in US. What for weather radars used? to precisely know planetary positions?

I got what you mean by ' daiva Saastram ', I agree.

said...

i agree with the concept of designers and manufacturers...

Once i told one guy that he will do good in Electronics/computer science. He asked me what if somebody have the same planets 100yrs back? so i read the books again and there its written that people of that category will be doing Clocks that's latest technology at that time.

so something missing in jyotish to upgrade/evolve the principles. Here we need some designers who will do some research and formulate new things...

మంచు said...

@ SNKR- I am not sure about using planetary info for predicting weather today. However, planetary info was used long back to predict weather and astrologists used to that job.

anyway, weather radars, meters, satellites ...they are used just measure different atmospheric parameters like temp, humidity, wind force and direction, pressure etc., at that instant. Once they gather all info , these values must be given as inputs to weather predicting algorithms which runs on very very powerful computers to predict weather . :-) I know that you are aware of all this...

I did a little goggling and i did not find any info on using planet positions in weather prediction algorithms . I knew only the moon gravity affects the tides.

తార said...

>>నేను మొన్నామద్య హిస్టరి చానల్ లొ నొస్టర్ డాం ప్రిడిక్షన్స్.

మంచు గారు, ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఏ దేశంలో ఐనా, అతని గుణగణాలను పెద్దవి చేసి చెప్పటం, అతని గొప్పతనం గురించి ప్రచారంలో ఉన్న కధలు నిజాలుగా చూపించటం మామూలే, అతని జ్యోతిష్యం నిజమైన దానికన్న తప్పు ఐనవి, అసలు సంబంధంలేనివి కుడా అతనికి ఆపాదించటం మామూలే. అతని ఎదో రాసాడు, దాన్ని పట్టుకొని పీకి, లాగి, ప్రతిపదార్ధం, నానార్ధాలు తీసి, ఇదిగో అతను చెప్పినట్టే జరిగింది అని జరిగిన తరువాత రెండిటికీ లంకే వేసెయ్యటం మామూలే. కేరళ వారు, అసలు జామెట్రి కనిపెట్టిందీ ఆది శంకరాచార్యులు అంటారు, భౌద్దులు అసలు ఇనుము నుంచి బంగారం తీయ్యటం ఆచార్య నాగార్జునుడికి ఎప్పుడో వచ్చు అని చెప్టారు, అసలు సాయి బాబాకి మహిమలు ఆపాదించలేదు కావలసినన్ని.

ఆ సదరు చానెల్ వారే కొత్తగా, చేతబడి ఉన్నది అని, దెయ్యాలు ఉన్నవి అని కొత్తకొత్తగా సైన్‌టిఫిక్‌గా నిరూపిస్తున్నారు, అవి అన్నీ నిజమనుకుంటే కష్టం.

>>డిజైన్ చేసింది ఎవరొ పూర్వికులు.

ఇది ప్రొడక్ట్ కాదు, ఒక సబ్జెక్ట్.

>>ఇంకొవిషయం ఎమిటంటే ఇది డెవలప్ అయిన టైం కి సమాచార వ్యవస్త కూడా లేదు. అంటే అన్ని ప్రదేశాల్లొ సమాంతరంగా , స్వంతంగా, విడివిడిగా డెవెలప్ అయ్యిందే..

ఇది చాలా తప్పు, ముందు మీరు దేనిగురించి మాట్లాడుతున్నారు? జ్యోతిష్యమా లేక పంచాంగమా? దేని గురించో ఐతే అప్పుడు నేను దాని చరిత్ర చెప్పగలను.

>>అలా అని అంతా ట్రాష్ అని తీసి పారేయొద్దు.
ట్రాష్ అవునో కాదో అని నేను అనటం లేదు, అది సైన్సు కాదు అని మాత్రమే చెప్పగలను.

ఇక ఇది డిజైన్ చేసినది అంటారా, దానికి ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఒక వంశం వారు, కొన్ని వేల, లక్షల మనుషుల జీవితాలని సంపాదించి ఇలా గ్రహ ప్రభావం ఊహించారు, దీనిపైన వివేకానందుడు చాలా చోట్ల ప్రస్తావించారు. ఈ గ్రహ ప్రభావం ఒట్టి ఊహ మాత్రమే. గ్రహ ప్రభావం వలన మనం పుట్టినప్పుడే ఎప్పుడు చస్తామో కుడా చెప్పగలగటం ఊహ మాత్రమే.

తార said...

భా.రా.రె మీరు ఇక్కడికి రావటం మొదటి సారి అనుకుంటను, అసైన్సుకి స్వాగతం.

>>మీరు జ్యోతీష్య శాస్త్రాన్ని భవిష్య వాణి చెప్పే సైన్సు శాస్త్రంగా తీసుకుంటే >>ఇప్పుడు మనకున్న వాతావరణ పరిశోధనలన్నీ దానిక్రిందకే వస్తాయి.

పరి"శోధన" అని అంటున్నారు, మళ్ళీ భవిష్య వాణి అంటున్నారు, మీరు చెప్పే లెఖ్ఖ ప్రకారం స్టాట్స్, ఎకనామిక్స్, అన్నీ జ్యోతీష్యం ఐపోతాయి మరి.



-- ఒక్క దైవ శాస్త్రం తప్పించి ఏదైనా సైన్స్ చెప్పగలదా?
దైవ శాస్త్రం మా, ఐతే సైన్సు మాత్రం కాదు కదా, నేను అదే చెప్తున్నాను, సైన్సు కాదు అని.

>>జరిగిన తరువాత ఇలా అయ్యి వుండవచ్చు లేదా అలా అయ్యి వుండవచ్చు అని విశ్లేషించుకోవడమే తప్పించి?

అవును జ్యోతిష్యం లో జరిగేది ఇదే.

>>అయినా మనిషి మీద గ్రహాల ప్రభావమా లేక పరిశరాల ప్రభావమా తన భవిశ్యత్తును నిర్ణయించేది?

ఎవరూ కాదు,తనే, అందుకే తన చేతిలోని జీవితాన్ని వెరేదెదో, లేక తను పుట్టేసరికే రాత రాయబడినది అని అనుకోవద్దు అనే చెప్తున్నాను.

తార said...

భా.రా.రె గారు

>>ఇంతకీ జ్యోతీష్య శాస్త్రానికి మీ నిర్వచనం ఏమిటి?
ఇది జ్యోస్యులు చెప్పాలి మేము ఎలా చెప్తాము? సైన్సు అంటే అదే కదా, నేను ఇప్పుడు టొఫో డెఫినిషన్ చెప్తాను, దాన్లొ తప్పులు ఉంటే అప్పుడు అవతలి వాడూ చెప్తాడు, తప్పులు చెప్పలేకపొయినా అది అందరూ ఒప్పుకోరు, నేను అది నిజమే అని ప్రూవ్ చెయ్యాలి అప్పటివరకూ అది నిజం అని అందరూ అంగీకరించరు.

>>తరతరాలుగా పరిశోధనలు చేస్తున్నా మనిషి ఊహకు అందనిది.

కావొచ్చు, కానీ, సైన్సులో దేవుడు ఉన్నాడు అని, ఫలానా దానికి కారణం దేవుడే అని ఒప్పుకోవటం అవదు.

>>సంవత్సరాలుగా ఆ ప్రాంత, ప్రదేశ లక్షణాలను విశ్లేషించి సూత్రీకరించి చెప్పబట్టే కదా

లేదు, ఇప్పుడు వాన పడుతుంది అని ఎప్పుడో చెప్పరుగా, ప్రస్తుత మేఘాల కదలిక బట్టి, ఇతరాత్ర ఇండికేటర్స్ ని గమనించి వచ్చే పది-ఇరవై గంటల్లో వాన పడే అవకాశం చెప్తారు, ఆ ఇండికేటర్స్ కాలానుగూణంగా మారుతుంతాయి. అంతే తప్ప, ఉగాది రోజు చక్రం వేసి, వానలు ఎంత పడతాయి, పంటలు ఎంత పండుతాయి అని ఒకే సారి వంద సంవత్సరాలకి రాసేసి పక్కన పడెయ్యరుగా.

>>One professional advised me to learn chemistry, physics, mobile phones , biology, DNA etc as a prerequisite to learn Jyotishyam.

ఐదు వేరు వేరు శాస్త్రాలు, ఒక్కో దానికీ ఆరు ఏళ్ళ చొప్పున ౩౦ ఏళ్ళు, అంటే జ్యోతిష్యం నేర్చుకోవాలి అంటే దాదాపు నలబై ఏళ్ళు పడుతుందా.
మాంచిది..మీకు చెప్పిన ఆ వ్యక్తిని నీళ్ళ సాంకేతిక నామం అడిగి ఉండాల్సింది.
అవును అసలు గణితం వదిలేసాడు, అయ్యో...

మంచు said...

ఉహు... హిస్టరీ చానల్ విషయాన్ని ప్రామాణికంగా తీసుకొమనడం లేదు. కేవలం నొస్టర్డాం కి మన భారతీయ జ్యొతిష్యులకి మధ్య సారూప్యత గురించి చెబుతున్నా.. అంటే 16 వ శతాబ్దం లొని ఒక ఫ్రెంచ్ వ్యక్తికి , మన జొతిష్యులకి నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం లేదు. అందుకు సమాంతరంగా, విడివిడి గా అంటున్నా...

ప్రొడక్ట్ , థీరీ... ఉదాహరణకు పైథాగరస్ సిద్దాంతం ఉపయొగించే సివిల్ ఇంజినీర్ కి దాని ప్రూఫ్ అక్కర్లేదు... కర్ణం 2 = భుజం1్2 + భుజం2్2 అని తెలిస్తే చాలు. అదే నేను అంటున్నా... ప్రస్తుతం జొతిష్యం అనేది ఒక లుకప్ టేబిల్ లాంటిది.. రూల్స్ అన్ని ఫ్రెం చెయ్యబడి వున్నాయి. ఇప్పటి జొతిష్యులు జనాల జన్మించినటైం బట్టి ఆ లుకప్ టేబిల్ చుసి ఒహొ ఇలా జరజొచ్చు అని చెబుతున్నారు. కానీ ఆ లుకప్ టేబిల్ కి బెసిస్ ఎంటి... అది ఇలా డెవలప్ చేసారు అన్నది మనకి తెలీకుండా ఎలా చెప్పగలం.

కొన్ని సైన్సు ని డిఫైన్ చెయ్యడమే కస్టం. ఒక ఫర్ములా ఉపయొగించి దాని రిజల్ట్ ఖచ్చితం గా వస్తుంది అని చెప్పగలిగితే అది సైన్సు. ఒక్కొసారి కొన్ని పరిస్తితులలొ అదే రిజల్ట్ రాకపొవచ్చు... అప్పుడు దానికి కొన్ని అమెండమెంట్స్ చేస్తాం. ఈ పరిస్తితులలొ ఇది పనిచెయ్యదనో.. లేక ఆ కండిషన్స్ కి ఈ ముల్టిప్లయింగ్ ఫాక్టర్ వాడలనొ చెప్తాం.. అప్పటి పూర్తీవుతుందా... మళ్ళి కొన్నాళ్ళకి ఇంకొకడు ఇంకొటి ప్రూవ్ చేస్తాడు..ఇప్పుడు సైన్సు ప్రకారం ఖచ్చితం అనుకున్నది రేపు కాకపొవచ్చు. అదే రీసేర్చ్ అప్పట్లొ జొతిష్యం మీద చేసివుంటే ఖచ్చితమయిన ఫలితాలు వచ్చెలా తీర్చి దిద్దెవారెమో. దురద్రుస్టవసాత్తు అది జరగలేదు.. జ్యొతిష్య శాస్త్రం మీద పరిశొధన పెద్దగా జరగలేదు.. లేకపొతే కొన్నాళ్ళకి అదే ఖగొళ శాస్త్రం గా మారి... విషయం అర్ధం అయ్యేకొద్ది జొతిష్య శాస్త్రం వేలీడ్ కాదు అని మానెసారెమో. గ్రావిటి, కాస్మిక్, రేడియషన్ ప్రభావాలు జ్యొతిష్యాని కారణాలు అవునో కాదొ అని డిస్కషన్ అనవసరం. అది వాళ్ళకే తెలీదు. అది టైం వేస్ట్ ...

నేను సమాంతరంగా అని చెప్పింది అస్ట్రాలజి గురించే.. పైన ఎవరొ చెప్పినట్టు కొన్ని లొకల్ హంగులు చేర్చినా బేసిక్ గా అందరూ గ్రహప్రభావాని విశ్వసించినవారే ... నేను ముందు కామెంట్లొ చెప్పినట్టు గ్రహప్రభావం మనిషి భవిష్యత్ మీద ఎలా వుంటుందొ నాకు అస్సలు తెలీదు.. అది అస్సలు నమ్మసఖ్యం కాదు.. అలాగె మనిషి ఫ్యూచర్ లొకి, పాస్ట్ లొకి వెళ్ళడం అన్నది కూడా ఒప్పుకొవడానికి మనస్సు ఒప్పుకోదు. సైన్సు ప్రకారం థేరిటికల్ గా కాంతి కన్న ఎక్కువ వేగం తొ ప్రయాణిస్తే వెళ్ళొచ్చు అని చెబుతున్నది .. కానీ అది మనం ఎందుకొ ప్రాక్టికల్ గా ఒప్పుకొలేం.. ఎన్నొ పారడాక్స్ లు గుర్తుకొస్తాయి. కానీ సాధ్యమే అని చెబుతాం.. దానికి జ్యొతిష్యానికి పొలిక కనిపిస్తుంది నాకు.

సైన్సు కి కరెక్ట్గా డెఫినిషన్ ఇవ్వగలిగితే మనం జ్యొతిష్యం లొ సైన్సు వుందొ లెదొ అలొచించవచ్చు...

మంచు said...

చిన్న క్లారిఫికెషన్ : జరుగుతున్న చర్చ
"ఇప్పుడు జ్యొతిష్యాన్ని నమ్మలా వద్దా " అని అయితే - వద్దు అనే చెబుతా.. ఎందుకంటే దానిగురించి నాకు తెలీదు .. ఐ విల్ నాట్ టేక్ రిస్క్ .
" అసలు ఇది అంతా బొగస్ " అంటే - కాకపొవచ్చు అని చెప్పడానికి నా ప్రయత్నం .
(ఎందుకంటే - SNKR లాంటి కొందరు తప్పించి బ్లాగుల్లొ మిగతా వాళ్ళంతా నిజమయిన ఇంటరెస్ట్ లేకుండా వెరే ఉద్దేస్యాలతొ వాదించే వారే ...వాళ్ళతొ వాదించడం నా టైం వెస్ట్ అని ఇన్నాళ్ళు ఈ టాపిక్ ని పట్టించుకొలేదు)

తార said...

>>ఒక ఫర్ములా ఉపయొగించి దాని రిజల్ట్ ఖచ్చితం గా వస్తుంది అని చెప్పగలిగితే అది సైన్సు. ఒక్కొసారి కొన్ని పరిస్తితులలొ అదే రిజల్ట్ రాకపొవచ్చు

కానీ అదే పరిస్థితి మళ్ళీ వస్తే, అదే రిజల్ట్ రావాలి.

>>అప్పటి పూర్తీవుతుందా... మళ్ళి కొన్నాళ్ళకి ఇంకొకడు ఇంకొటి ప్రూవ్ చేస్తాడు..

లేదు, ఇంకొకటి ప్రూవ్ చేసే దాకా వస్తే, ఇది నాకు అసహజం గా ఉన్నది, ఒక ఉదాహరణ ఇవ్వగలరా.

>>సైన్సు ప్రకారం థేరిటికల్ గా కాంతి కన్న ఎక్కువ వేగం తొ ప్రయాణిస్తే వెళ్ళొచ్చు అని చెబుతున్నది

ఏవరు ఇది చెప్పినది, హహహ, థీరీ ప్రకారం కుడా అవ్వదు, అసను శబ్దం అంతకాలం బతికి ఉండదు కదా..

>>అసలు ఇది అంతా బొగస్ " అంటే

పరస్పర వైరుధ్యాలు కోకొల్లల్లు.

మంచు గారు, మీరు చెప్పిన పట్టీ ఎప్పుడో బి.సి కాలంలో పుట్టలేదు, అది కొంగత్తగా గత ౨౦౦ ఏళ్ళ నుంచి పుట్టుకొచ్చినది, అసలు ఈ జ్యోతిష్యం అనేది ఇప్పుడు ఉన్న రూపంలోకి బ్రిటీష్ కాలంలో తయారు ఐనది, అసలు పూర్వం ఏ రూపంలో ఉన్నదో ఎవరికీ తెలియదు.

Anonymous said...

/దానిగురించి నాకు తెలీదు .. ఐ విల్ నాట్ టేక్ రిస్క్ .
" అసలు ఇది అంతా బొగస్ " అంటే - కాకపొవచ్చు అని చెప్పడానికి నా ప్రయత్నం ./
That's the safe approach till we understand that.

థాంక్స్ ఫ్రెండ్స్, నేను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని తెలిసి కొంత తృప్తిగా అనిపించింది. తార, మంచు, భాస్కర్ , శేషులు కూడా ఈ విషయం మీద కొద్దిగా ఎప్పుడో కుస్తీ పట్టివుంటారనే అనిపిస్తోంది, ముఖ్యంగా తార, మంచు :)
నేను ఆసక్తి ఈమధ్యనే తెలుగుయోగి బ్లాగ్ చూశాక కలిగింది. అంతవరకూ జ్యోతిష్యం అంటే 'ఏమో గుర్ర మెగురావచ్చు ' అనుకునేవాడిని :) కాని ఆ అశ్వబలం చాలదని అర్థమవుతోంది. బ్లాగర్ నాగమురళి అభిప్రాయాలు చూశాక కొంత అవగాహన వచ్చింది. సైన్స్ ముఖ్యంగా ఫిజిక్స్ నేపథ్యమున్న జ్యోతిష్కుల అభిప్రాయాలు కొద్దిగా క్లియర్ గా వుంటాయి, వాళ్ళు ఇష్టమొచ్చిన సైన్స్ పదాలు అలా వాడేయరు అనిపిస్తుంది.

వికటకవి కి చిర్రెత్తి ఆ ప్లాస్టర్ ని పట్టుకొచ్చి పిడికిలి తెరిపించక ముందే మనం ఈ టపా నుంచి టపా కట్టేద్దాం. అసలే క్రీస్టియన్ దయ్యాలంటే నాకు తెగ భయం. :P

said...

Hi Read the below link, which shows how to change your fate. Not about astrology.

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=48748&Categoryid=10&subcatid=33

Donnie said...

సైన్సుకు సోర్సా?? లేక అసైన్సుకి అడిగారా?? చిన్న లెఖ్ఖే, వివరాలు ఇచ్చాను, ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే వివరంగా అడగగలరు.